కవిత శీర్షిక 

"రాచరికపు రోజులు"
వాసం నాగ రాజు

చేవ చచ్చేదాకా అతనే పాలకుడు!
చస్తే వంశోద్ధారకుడు !
వేదాలు నాలుగే
అతని మాట ఐదో వేదం!
తప్పొప్పులు అతని నోటికి
గులాములు!

కొందరు సరస్వతీ పుత్రులు
కొందరు లక్ష్మి పుత్రులు
కొందరు న్యాయదేవతలు
మరిందరు బలానికి ప్రతిరూపాలు!
పక్కవాడు బలహీనుడైతే జులుం
బలవంతుడైతే గులాం!

అతడు
పయోముఖ విశకుంభమా
గోముఖవ్యాగ్రమా
పరమాత్ముడా
పరమకృూరుడా
జనం జయజయధ్వానం చేయాల్సిందే
నేలమీద అడుగుపడకుండా
వీపుమీద మోయాల్సిందే!
ఇది రాచరికపు రోజుల్లోనే
కాదండోయ్
ఈ రోజుల్లో కూడా!
***

1 comments:

  1. నా కవితను ప్రచురణకి స్విీకరించి నన్ను ప్రొత్సహిస్తున్న సంపాదకులకు ధన్యవాదాలు

    ReplyDelete

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top