లక్షణంగా అక్షర తోరణం 
'మహా' కవుల సమ్మేళనం 


ప్రముఖ చలనచిత్ర దర్శకులు వజ్రనాభ నటరాజ మహర్షి స్వాగత పలుకులతో ఆదివారం ఉదయం గం. 10 నుంచి సాయంత్రంవరకు నవి ముంబయి వాషిలో తెలుగు కళా సమితి వేదికగా మహారాష్ట్ర తెలుగు కవుల సమూహం ఆధర్యంలో "అక్షర తోరణం" పేరుతో నిర్వహించిన కవి సమ్మేళణం ఘనంగా 
జర్గింది.  మహారాష్ట్రలో పలుప్రాంతాలనుంచి  సుమారు అరవైమంది  ఔత్సాహిక   కవులు/కవయిత్రులు   ఈ సమ్మేళణంలో పాల్గొని తమ కవితలను వినిపించారు.  ప్రముఖ వైద్యులు,  సాహితీవేత్త  డా. తాడి నరహరి 
కీలకోపన్యాసం చేసారు. వివిధ రచయితలు/రచయిత్రులు రాసిన 'జీవితం'  "గాయపడ్డ సంతకం" "అసిధారా" "విముక్తి"  పుస్తకాల ముఖ చిత్రాలను ఆవిష్కరంచారు. ఈ కార్యక్రమంలో వినిపంచిన  కవితలను క్రోడీకరంచి  ఓ ప్రతేక సంచికగా వెలువరించనున్నట్లు  నిర్వహకులు వెళ్ళడించారు. ఈ సభలో  పాలుగొన్న కవులకు జ్ఞాపిక, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సంగవేని రవీంద్ర గాలి మురళిధర్ నేత్రుత్వం వహించారు.
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top