అద్దంలో నేను - అచ్చంగా తెలుగు
అద్దంలో నేను
దువ్వూరి శ్రీకృష్ణ 

అబ్బబ్బ ఆ సిగరెట్లు తాగుతూ గదిలో పడుండే కన్నా కాసేపు అరుగుమీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళను  చూడొచ్చు కదా..ఒక్క క్షణంలో భోజనం తయారుచేసి పిలుస్తాను సరేనా? అరుస్తోంది వంటింట్లోంచి భార్య అరుంధతి..

అలాగే ‘అరు’ అంటూ పడక కు తీసుకొని వీధి అరుగుమీదకొచ్చాను. నేను అరుంధతిని ‘అరు’ అని ముద్దుగ పిలుస్తాను.

70 సంవత్సరాల సుదీర్ఘ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకుల మద్య చివరకు ‘నేను’ ‘అరు’ మిగిలాము.

ఇంతలో ....7 ఏళ్ళ బాలుడు ఆడుతు విసిరిన బంతి నా నుదుటికి తగిలి నా కళ్ళజోడు కింద పడిపోయింది...ఆ పిల్లవాడి తల్లి అది చూసి 'అయ్యొ పెద్దవారు మీకేమి దెబ్బ తగలలేదు కద అంటు ‘ఒరెయ్ వెధవ రోద్దుమీద ఆటలొద్దంటే వినవు ఇంట్లొకి నడు’ అంటు కసురుకుంటుంటే ‘ఒద్దమ్మ బాబుని కొట్టద్దు నాకేమి కాలేదు’ అంటూనే పడిపోయిన కళ్ళజోడు తిరిగి తీసుంటుంటే మదిలో నా బాల్యం కళ్ళముందు కదలాడింది.

బాల్యం

"ఒరే ఒరే వర్షంలో తడవకుర” అమ్మమాటలు లెక్కచేయకుండనే ఆడుతున్న నాకు అప్పుడు జారిపడి తగిలిన దెబ్బ తలుచుకొని ఎడమ చేత్తొ గుండెని రాసుకుంటు కుడి చెత్తో నుదురు మీద ఆనాటి దెబ్బ తగిలిన చోట వ్రేళ్ళతో తడుముతుంటే కొద్దిగ నెప్పి అనిపించి చూస్తే నా వ్రేళ్ళకు కొద్దిగ రక్తం మరకలు చూసి ఆశ్చర్యపోయి కళ్ళజోడు మసగ్గా కనిపిస్తోందేమిటబ్బా అనుకుని తేరిపార చూస్తే ఒక అద్దం కొద్దిగ పగిలి ఉంది 

ఈ విషయం తెలిస్తే నామీద ‘అరు’ అరుస్తుంది అనుకుంటుంటే నా యవ్వనంలో జరిగిన మరొక ఘటన కళ్ళముందు కొచ్చింది.


యవ్వనం

"అరు కి నాకు పెళ్ళి నిశ్చయమైన వేళ అరు అడుగుతోందిలా "ఏమండి నన్ను ఎప్పుడు ఇలాగే ప్రేమగ చూస్తారా?" ఆమె అమాయక ప్రశ్నకి బిగ్గరగ నవ్వి "లేదు అరు ఇంతకన్న బాగ చూస్త అనగానే" మొదట అర్థం కాక తర్వాత నాతో పాటు తనూ నవ్వుతూ "చూద్దాం ఎవరు ఎవరిని బాగ చూస్తారో" అండంతో "అరు ప్రేమ పెరగాలంటే ప్రశ్నలు తగ్గించాలిరా" అన్న నా మాటలు నాకే ఒకనాడు కొత్తగ వినిపించాయు.

నడివయసు

అది నాకు నడి నడివయస్సనుకుంటా ఒక రోజు మద్యాన్నం ఆఫీసులో ఉండగా అరు ఫోన్ కాల్ తో మండుటెండలో ఉరుకులు పరుగులమీద ఇంటికొచ్చాను. 

అందరూ ఏదో ఆత్రంగ ఉన్నారు. నాకు మనస్సులో కంగారు ఏదో కీడు జరగలేదు కద అనుకుంటూ,లోపలికి అడుగుపెట్టా ...అమ్మ మంచం మీద ఉంది డాక్టర్ ప్రక్కనే ...డాక్టర్ నాకేసి చూసి ‘మరేమి పర్వాలేదయ్యా కాని కొద్దిగ అమ్మను జాగ్రత్తగ చూసుకొండి’ అని మందులు రాసి నా చేతికిచ్చాడు.

అసలేమిజరిగింది అరు? అంటూ కోపంగ అరుస్తున్న నన్ను చూసి అమ్మ ‘దాన్ని ఏమీ అనకురా’ ‘నేనే కరివేపాకు లేదంటే అలా వీదిచివరన కొట్టుకెళ్ళి వస్తుంటే కాలు బెనికి కింద పడ్డా అంటున్న అమ్మతో, "నీకు ఎన్నిసార్లు చెప్పాను అమ్మ ఇల్లు వదిలి బయటకు వెళ్ళద్దని”? అరు నీకు తెలిదా అమ్మని ఒంటరిగ బయటికి పంపకూడదని" "దాని తప్పేమి లేదురా అది ఒద్దు అనే చెప్పింది కాని నేనే వెళ్ళా"

ఇంకా నా ఆవేశం చల్లారక "ఎందుకు నా మాటలు వినరు?" అంటూ తల పట్టుకుని సోఫాలో  తలపట్టుకుని కూర్చున్న నా దగ్గరగ మంచినీళ్ళ గ్లాసుతో అరు వచ్చి "కాస్త మంచినీరు తాగండి ... ప్రేమ పెరగాలంటే ప్రశ్నలు తగ్గించాలి  కద?" అమాయకంగ అడుగుతు నా తప్పులేదు అన్నట్టు పెట్టిన అరు చూపులు గుర్తుకోచ్చిన నా మనస్సుకు నా వేలుకి ఏదో చురుక్కుమండంతో చూస్తే కాలిపొయిన సిగరెట్టు "వెంటనే అది విసిరేసి" దూరంగ చూస్తుంటే వీధిలో ఒక వృద్దుడు చేతి కర్ర సాయంతో అతి కస్టం మీద అడుగులో అడుగు వేసుకుంటు ఇటే వస్తున్నాడు..

వృద్దాప్యం 

వీధిలో ఒక వృద్దుడు తూలిపోతు వెడుతుంటే ఇంకొకాయన భుజాన్ని ఇచ్చి తోడుగా నడిపిస్తుంటే నా జ్ఞాపకాలు నా వృద్దాప్యపు తొలినాళ్ళలోకి సుడిగుండాలై చుట్టుముట్టాయి.

ఇలాగే ఒకనాడు వీది అరుగుమీద కూర్చొన్న నాకు “ఏరా గోపాలం పెదరాయుడులా వీధి అరుగుమీద కూర్చొని ఏమి చూస్తున్నావురా” అన్న మాటలు చెవిలో గిర్రున తిరుగుతూంటే పగిలిన కళ్ళ అద్దాలనుంచి పాత జ్ఞాపకాలు పరికించి చూస్తే "ఒరేయ్ విశ్వనాధం నువ్వా? అంతలా వడిలిపోయావేమిరా? దా అంటూ లేచి అరుగుమెట్టులు దిగి ప్రేమతో వాడి చెయ్యి పట్టుకుని వాడు వారిస్తున్న వినకుండ నా పడక్కుర్చీలో వాడిని కూర్చోపెట్టి “ఇదిగొ కాస్త మంచినీరు తీసుకో అంటు పక్కనే ఉన్న రాగిచెంబందిచాను”.

ఏరా గోపాలం నువ్వు ఏమి మారలేదుర..అదే రూపం అదే తేజస్సు...నెత్తిమీద వెంట్రుకలు ఒక్కటే లేవు విగ్గు పెడితే వరుడు అంటే నమ్మని వారుండరురా అంటున్న వాడి మాటలకి అడ్డుపడుతూ.."ఒరేయ్ నా రూపం గురుంచి సరే కాని నీ పాప అదే మన దీప జీవితం ఎలా ఉందిరా? ముందర అది చెప్పు ..

అనే లోపులోనే వాడి కంట్లోంచి నీరు వల వల కారుతూ  "గోపాలం మనం మోసపోయామురా 17 సంవత్సరాలు వాడుకుని ఆ దరిద్రుడు మన దీపాన్ని అన్యాయంగా ఆర్పేసాడుర" అని వెక్కి వెక్కి ఏడుస్తున్న స్నేహితుడి మాటలతో  దిగ్బ్రాంతుడినైన నేను నా భుజం ఓదార్పుగ అనించి " జీరబోయిన స్వరంతో ఒరేయ్ ఏమి మాట్లాడుతున్నవురా  నాకు ఈ విషయం ఇప్పటివరకు తెలియదు..ఎందుకు చెప్పలేదు" అనే లోపులోనే వాడు  “ప్రముఖ న్యాయవాది కొడుకు విదేశీ ఉద్యోగమైన మంచి లక్షణాలున్నయనుకొని మోసపోయామురా”

అని మళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఒదారుస్తూ "భాదపడకురా ఇంత ఘోరం వింటానని నేనెప్పుడు అనుకోలేదు సుమా" "దీప నాకు కూడ కూతురేర తెలుసుగా మాకు ఇన్నాళ్ళూ పిల్లలు లేరని ఎప్పుడూ భాద పడలేదు దీప ఉండగా కాని ఈ క్షణం" నాకూ కన్నీళ్ళు ఆగలేదు 

“ఓంకారాన్ని ఎంతో భక్తితో విదేశీయులు వంటబట్టించుకుంటుంటే మనవాళ్ళు విదేశీ వికారాలను అలవర్చుకుంటున్నారు”

“నిజమైన ప్రముఖుల జీవితాలన్ని పూర్తిగా నిరాడంబరమే, ప్రముఖులనబడే ఈనాటి జీవితాలన్ని ఆడంబరమే”

వాళ్ళని ఊరికే ఒదలకూడదు అంటూ ఆవేశంతో ఊగిపోతున్న నన్ను పట్టుకుని, వాడు కొంత తేరుకొని నాభుజం గట్టిగా ఒత్తుతూ...

"ఒరేయ్ వృద్ద్దాప్యం లో ఉన్నామురా  "నీకు నేను నాకు నువ్వు తప్ప వేరెవ్వరు లేని వారం '...ఈ శోకం తీరనిది కాని ఏమి చేయలేని అశక్తులం" 

ఇంతలో అరు వచ్చి "అన్నగారు ఎప్పుడు వచ్చారు ?" ఏమండి అన్నయ్యగారు వచ్చినట్టు చెప్పలేదే? అంటుండగ "వాడు ఈ విషయాలేమి చెప్పద్దు  అన్నట్టుగ చేతులు జోడిస్తుంటే" తల ఊపి "నేనే రమ్మన్నానే నాలుగు రోజులు సరదాగ నాతో గడపడానికని "ఎన్నాళ్ళు కూతురు కూతురు అంటు ఆ పల్లెటూరులో మగ్గుతావ్ అని రమ్మన్నాను".

అవును కదూ "అన్నయ్యగారు మన దీప ఎలా ఉందీ" అని ప్రశించే అరు మాటలకి అడ్డుపడుతూ " అన్ని తీరిగ్గా మాటాడుకోవచ్చే ముందర వాడికి చెంబుడు నీళ్ళు ఇవ్వు కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తాడు అసలే భోజనం వేళాయే" అంటూ ఉబికివస్తున్న వాడి కంటిలోని నీరుని అరు కంట కనబడకుండ నాభుజం మీది కండువా వాడి భుజం మీద కప్పుతూ "వాడి చెవిలో కన్నీళ్ళు తుడుచుకోరా" అరు అసలే తట్టుకోలేదు ఈ విషయం తెలిస్తే అంటున్న నా మాటలకు వాడు తూలిపడబోతుంటే  వాడి భుజం మీద చేయి వేసి గుండెలకు హత్తుకుంటూ

"నేను అరు నీకు ఉన్నామురా మేమున్నాము" అంటున్న నాకేసి తేరిపార జూసి "గోపాలం ఇదేర నేను కోరుకున్నది ఇంత గుండె బద్దలయ్యే విషాదం జరిగాక కూడ నేనెందుకు బతికున్నాన అని అర్థం కాలేదు" ఇప్పుడు నిన్ను చూసాకా అంటూ ఆశాంతం జారిపోతున్న వాడి దేహం ఒడిసిపట్టుకునే లోపులోనే "ఈ దీపం కూడ ఆ దీప దగ్గరకు చేరుకుందని గ్రహించి "కన్నీట పర్యంతమైన నా హ్రుదయం వృద్దాప్య వయసులో గుండెకోతలు పగవాడికి కూడ ఉండరాదని ప్రార్ధిస్తూ...గుండెని రాయిని చేసుకొని ఆ నిర్జీవ దేహాన్ని తదుపరి కార్యక్రమానికై ఉపక్రమించాను”....

ఏమండీ ఆ తాగిన సిగరెట్టులు చాలు చేతులు కాళ్ళు కడుక్కొని భోజనానికి రండి అంటున్న అరు మాటలికి ఈ ప్రపంచం లోకి వచ్చి " ఏమి ఆట ఆడుతున్నావయ్యా శివయ్యా నాలుగు స్థితులు పెట్టావు బాల్యం, యవ్వనం, నడి వయస్సు మరియు వృద్దాప్యం అలాగే నాలుగు రుతువులు పెట్టావు చివరాఖరకు నలుగురు మనుషులు మోసుకుపోయేల జీవితాన్ని లిఖించావు...నవ్వే వారిని ఏడిపిస్తావు, ఏడిపించే వారిని నవ్విస్తావు...మాయగాడివయ్య పెడ్డ మోసగాడివయ్య అని చిల్లపిల్ల వాడిలా నాలో నేనే మాటాడుకుంటు కళ్ళవెంట కారే కన్నీళ్ళను తుడుచుకుంటూ దొడ్డివెంపు కాళ్ళుకడుక్కుందుకు వెనుదిరిగాను.... 


1 comment:

  1. "నిజమైన ప్రముఖుల జీవితాలన్నీ నిరాడంబరమే.! ప్రముఖులనబడే ఈనాటి జీవితాలన్నీ ఆడంబరమే.!" అనే వాక్యం ఎంత నిజమో, "ప్రేమ పెరగాలంటే ప్రశ్నలు తగ్గాలి" అన్న వాక్యం కూడా అంతే నిజం.!
    మొదటి వాక్యం చాలామందికి అర్ధం కాకపోయినా, రెండవ వాక్యం మాత్రం అందరూ అలవరుచుకోవాలి.!
    మంచి వాక్యాల్ని కథ ద్వారా తెలియజేసినందుకు రచయితకు ధన్యవాదములు.!

    ReplyDelete

Pages