ఈ దారి మనసైనది -9 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది -9 
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, ఆమె స్నేహితులు ...)
దీక్షిత, ఇంకా కొంత మంది పెళ్లి కాని అమ్మాయిలు షవర్క్రింద నిలబడి భక్తి పారవశ్యంతో తడుస్తూ "జంపన్న వాగులో యింతహాయివుందా సమ్మక్క - రోజూ మనల్ని రానిస్తుందా" అని మనసులో అనుకంటూ కలిసి, మెలిసి సరిగంగ స్నానాలుచేస్తుంటే చూడటానికి మనోహరంగా పవిత్రంగా వుంది.
ఆ స్నాన ఘట్టాలను తిలకిస్తున్న మేఘాలు-భూమి, ఆకాశం కలిసే చోటు నుండి తాము కూడా స్నానానికి దిగుతున్నట్లు బారులు తీరి కదులుతున్నాయి.
ఆ షవర్ల క్రింద ఆడ, మగా తారతమ్యం లేకుండా తడుస్తున్నారు. కొత్తవాళ్లు రావటంతో షవర్లక్రింది ఎక్కువ సేపు నిలబడేంత టైం లేక వెంట, వెంటనే కదులుతున్నారు.
జంపన్న వాగు అంచున నిలబడి వున్న అనురాగ్ కి పట్టులంగా, ఓణిలో షవర్ క్రింద తడుస్తూ, కళ్లు గట్టిగా మూసుకొని రెండు చేతుల్ని ఎదకి దగ్గరగా ఆనించుకున్న దీక్షితను చూస్తుంటే "ఈ హాయిని మళ్లీ , మళ్లీ ప్రసాదించు తల్లీ ! అనికోరుకుంటున్నట్లుగా వుంది.
కాబోయే డాక్టర్ దీక్షితలోఇంత భక్తి వుందా? అని ఆశ్చర్య పోయాడు. దీక్షితను చూడటం అతనికి కొత్తేమీ కాకపోయినా ఈ రోజెందుకో కొత్తగా కన్పిస్తోంది. మనుసును దోచేలా కన్పిస్తోంది హృదయాన్ని కొల్లగొట్టేలా అన్పిస్తోంది. అంతరంగంలో కల్లోలం సృష్టించి ఎప్పడూ కలగని స్పందన కలిగేలా చేస్తోంది.
అంతేకాదు. ఈ రోజు దీక్షితలో....
అప్పడెప్పడో తాను చదివిన కాళిదాసు శకుంతల లాలిత్యం...ముక్కుతిమ్మన వర్ణించిన సత్యభామ ఠీవి .... అల్లసానివారి వరూధిని సౌందర్యం.... కన్పిస్తోంది. చూస్తుండగానే....
అతనిలో హృదయ స్పందన పెరిగి, మధుర భావనతో ఒక్క క్షణం అతని కనురెప్పలు ఆలోచనగా వాలడం గమనించింది మన్విత, అంత తన్మయత్వంతో అనురాగ్ ఏమిచూస్తున్నాడోనని అటు వెపుచూసిందిమన్విత, అక్కడ దీక్షిత కన్పించింది. ఆమెను అలా చూస్తుంటే మన్వితకే మతిపోతుంటే ... అనురాగ్ అలా ఫీలవ్వటంలోవింతేమీలేకపోయినా. ఒక అమ్మాయిని చూసి అనురాగ్ అలా ఫీలవ్వటంఇంతకముందెప్పడుమన్విత చూడలేదు. ఇదే తొలిసారి. అతని చూపుల్లోని అ మార్పు మన్వితనువిబ్రాంతికిగురిచెయ్యటమే కాకుండా లోలోన కలవరపెట్టింది. అతనలా ఫీలవ్వటం ఆమెకు నచ్చలేదు.
'అనురాగ్ మీ డాడీ పిలుస్తున్నారు' అంటూ కావాలనే అనురాగ్ ని డిస్ట్రబ్ చేసింది.
అక్కడ వాళ్ల డాడీ లేకపోయినా మన్విత ఎందుకలా అన్నదో అర్థం కాక అక్కడ నుండి కదిలాడు అనురాగ్.
దీక్షిత పక్కన వున్న ఆమె తల్లి, తండ్రి, అన్నయ్యఅమె చుట్టూ  కోట గోడల్లా అన్పిస్తున్నారు. మమకారపు వర్షంలో అమెనుతడిపేస్తున్నారు.
తడిసిన దీక్షిత పొడవైన జట్టును ఆరబెడ్లున్నట్టుచేతో పైకి పట్టుకొని ...
"పద దీక్షా ! "తల్లి దగ్గరికివెళ్లి మొక్కులు తీర్చుకొని వద్దాంఅంటూ ఆప్యాయంగా, మృదువుగాఅంటున్న దీక్షిత తల్లి పై మన్విత దృష్టి ఆసక్తిగా నిలిచింది.
తమ పిల్లలలో ఆనందాన్ని చూడగలవాళ్లే నిజమైన సౌఖ్యవంతులు. ఉత్సాహకరమైన ఆలోచనలతో నిండిన వాళ్లే నిజమైన ఆనందాన్ని పొందగలరని వాళ్లను చూస్తుంటేనేఅర్థమవుతుంది.
వెంటనే తన తల్లి గుర్తోచ్చిందిమన్వితకి.
అదేతన తల్లి అయితే తను అలా తడిసిన బట్టల్లో వుంటేవూరుకునేదా? అదో పెద్దనేరంలా భావించి - ఎదిగిన పిల్లవని, ఆడపిల్లవని క్షణక్షణం గుర్తు చేస్తూ తనలో వుండే సరదా ఫీలింగ్స్నన్నిటినిచంపేసేది. ఆడపిల్లగా ఎందుకుపుట్టానుఅని సిగ్గుతో చచ్చి పోయేలా చేసేది. అయిన తను చంపుకున్న సరదాలు ఒకటా, రెండా, ఎన్నో..ఎన్నెన్నో...గట్టిగా నవ్వొద్దంటే నవ్వటం మరచిపోయింది. పెద్దగా మాట్లాడవద్దంటే మాట్లాడటం మానేసింది. అయిన దానికి, కాని దానికి, బయట తిరగకూడదంటే బయట కెళ్లటం మానేసింది. ఎలా పడితే అలా వుండకూడదంటే ఎలా వుండకూడదో నేర్చుకుంది.
అడుగడుగున ఇలా ఆంక్షలు పెట్టటం నచ్చకపోయినా తల్లి మనస్సు నొప్పించటం యిష్టంలేక మౌనంగా వూరుకుంది.
ఇప్పడు దీక్షతను చూస్తుంటే తనకి కూడా తడవాలని వున్నా తల్లికి తెలుస్తుందన్న భయంతో తడవలేక పోయింది.
...అంతా గద్దెల దగ్గరికి చేరుకున్నారు.
‘మొక్కులు అందుకో సమ్మక్క తల్లి’అంటూ శుక్రవారం ముత్తయిదువులకి మంగళకరం కావటంతో ఆ తలలులిద్దరికీవారి గద్దెల దగ్గర పూజలు జరిపి పసుపు, కుంకుమ, వాయినాలు, బంగారం (బెల్లం) భక్తి ప్రపత్తులతో సమర్పించారు.
బంగారం గుట్టలుగా వున్నా ఈగలు, చీమలు చేరకపోవటం అక్కడి విశేషం.
'ఆ వనదేవతల వన ప్రవేశం రోజు.... మహిమగల ఈ దేవతలకి మనసారా వీడ్కోలు చెప్పి . భక్తులు ఇంటి ముఖం పట్టడంతో ఆ మహాజాతర ముగిసిపోయింది.
****
రోజులు గడుస్తున్నాయి.
జూలైలో ఫైనల్ ఎగ్హామ్స్ జరుగుతున్నట్లు గా యూనివర్శిటీ నుండి నోటిఫికేషన్ వచ్చింది. నిద్ర సరిగ్గా పోకుండా,ఎగ్హామ్స్ అంటే టెన్షన్ పెట్టుకొని, అప్పడప్పుడు కంగారు పడి, మొత్తానికి కష్టపడి అంటాప్రిపరేషన్లో పడ్డారు.
ఆగస్ట్ వరకు ఎగ్హామ్స్అయిపోయాయి.
రిజల్స్ కోసం వెయిటింగ్ .
అంతా ఎవరి ఊర్లకి వాళ్ళ వెళ్లి పోయారు.
*****
సెప్టెంబర్ నెలాఖరులో రిజల్స్ వచ్చాయి.
ఫస్ట్రియల్లో ... అనురాగ్, దీక్షిత, మన్విత ఫస్ట్ క్లాసులోపాసయ్యారు.
సెకండియర్ స్టార్ట్ ....
హేపీ ....హేపీ....హేపీ...
ప్రతి క్షణం గడిచిన క్షణంతో పోటి పడాలని కొత్త దనాలను చిందిస్తూ పరుగులు పెడ్తోంది.
క్లాసులు అయిపోవటంతో బయటకు రాగానే ఫ్రెండ్ కన్పిస్తే మాట్లాడి ఆ ఫ్రెండ్ వెళ్ళాక లైబ్రరీ వైపు దారి తీసింది మన్విత,
ఆ లైబ్రరీలోకి అడుగు పెట్టగానే పెట్టగానే ఎదురుగా వున్న సరస్వతి విగ్రహ పీఠానికి క్రిందిభాగాన...
‘అసతోమసద్గమయ, తమసోమా జ్యోతిర్గమయమృత్యోర్మా అమృతం గమయ’ అనే వాక్యాలు స్పష్టంగా కన్పిస్తూ-మమ్మల్ని చదివి వెళ్ల మంటున్నట్లుగాఅందరివైపుచూస్తుంటాయి.
వాటిని దాటుకొని చక, చక లోపల కెల్లిందిమన్విత, అక్కడ అనురాగ్, దీక్షిత క్లాస్ బుక్స్ రెఫర్ చేసుకుంటూ కూర్చుని వున్నారు. ఆమె చూపులు ఒక్క క్షణం వాళ్ల పై నిలిచి ఆగి పోయాయి.
వాళ్లు మన్వితను గమనించకుండా వాళ్లపాటికివాళుసైలెంట్గా చదువుకుంటూ కూర్చుని వున్నారు.

No comments:

Post a Comment

Pages