మాతృభాష మాధుర్యం - అచ్చంగా తెలుగు

మాతృభాష మాధుర్యం

Share This
మాతృభాష మాధుర్యం .
ఆదూరి.హైమావతి


"ఏరా మనవడా! ఈరోజు న్యూస్ పేపర్లో విశేషాలేంటిరా!" అని అడుగుతున్న తాత గారి తో పదోతరగతి చదివే పరంధాం  " ఏమున్నాయ్ !తాతగారూ ! ఈరోజు న్యూస్  పేపర్లో అన్నీ చావు వార్తలే" అన్నాడు విసుగ్గా.
"అలాగా పాపం మృత్యువు సమీపిస్తే ఎవ్వరూ తప్పించుకోలేరుకదా!"
"అదేంటి తాతగారూ!అలా అంటారు? వీటిలో అన్నీ రోడ్డుప్రమాదాలు, నీళ్లలో పడి చావడం వంటివే.! పాతికేళ్ల యువకులూ , పదేళ్ల చిన్నపిల్లలూ ఇంకా చాలా మంది పాపం.."
"నిజమేరా! పరంధామా!ఎవ్వరైన గానీ వారికి నిర్ణయించబడ్డ సమయం తర్వాత ఒక్క క్షణమైనా ఉండలేరు."
"సరేకానీ తాతగారూ  ! నాదో అనుమానం , చెప్పనా !"
"చెప్పు బాబూ ! నాకు తెలిసినదైతే తీరుస్తాను."
" ఏంలేదు తాతగారూ !ఎవరో ఒకాయన చనిపోతే స్వర్గస్తులయ్యారు ' అనీ, రోడ్డు ప్రమాదంలో చనిపోతే ' మృత్యు ‘వాత పడ్దారనీ, ఇంకెవరో చనిపోతే ' కాలధర్మం' చెందారనీ, హాస్పెటల్లో తుది శ్వాస విడిచారనీ-- మంత్రులంతా సంతాప ప్రక టించారనీ -- ఇలా అంటారే  ,అందరూ చనిపోవడమేగా తాతగారూ ! ఇలా రక రకాల పదాలు ఎందుకు ఉపయో గిస్తున్నారు?" అంటూ తన అనుమానం వెలి బుచ్చాడు పరంధాం.
" పరంధామా! నీవన్నట్లు ‘మరణం’ అనేది అందరికీ ఒక్కటే .ఐతే కొందరి మర ణానికి అంతా సంతాపం చూపు తారు. వారి ‘పరలోకగమనం’తో సినీపరిశ్రమ ఒక మహాత్ముడ్ని కోల్పోయిం దంటారు.ఒక గొప్ప రచయిత ‘అస్త మిస్తే’ సాహితీ లోకా ని కి తీరని లోటనీ ,ఆయన  ‘నిర్యాణ ము’ అందరికీ శరాఘాతం వంటిదనీ అంటారు. ఎవ రైనా దుర్మార్గుడు మరణిస్తే , ‘చచ్చూరు’ కున్నాడంటారు. పుణ్యాత్ము డు ‘అస్తమించా’రంటారు. ఆ ధర్మ మూ ర్తి ‘దేహత్యాగం’ చేశా రనీ,దేశానికి ఎంతో కాలం సేవలందించిన ఆమహనీయుడు ‘కాలధర్మం ‘చెందారనీ, ఆయ న వీడు కోలు అందరికీ బాధ కలిగించిందనీ,నిద్రలోనే ‘దీర్గ నిద్ర’లోకి వెళ్ళిపోయా రనీ, ఆయన ఆవ్యాధితోనే ‘శరీరపతనం ‘అయ్యారనీ, ‘అంతరించారనీ ‘ ‘,ఆతల్లి’ నిర్వాణము’ అంద రినీ బాధించిందనీ, స్వర్గలోక గమనుల య్యారనీ  ఇలా అనేక విధాలైన పదాలు ఉపయో గిస్తుం టారు. "
" భలే ఉంది తాతగారూ ! ఒక్క పదానికి ఇన్ని మారు పేర్లా!"
"ఔను మనవడా! వీటినే పర్యాయపదాలంటారు. మన కమ్మ నైన  అమ్మ భాషలో  ఒక్కో స్వభావం లేదా వారివారి గొప్పదనమో, లేక స్థాయిని బట్టో చనిపోడం అనే పదానికి ఇలా పర్యాయపదాలు వాడుతుంటాం. ఆపదాలను బట్టే వారి సంస్కా రం , గొప్పదనం  తెలు స్తుంటుంది."
"అలాగా తాతగారూ!ఆంగ్లంలో డెత్. కిక్డ్ ది బకెట్ ,పాస్డ్ అవే, రీచ్ద్ హెవెన్ , లాస్ట్ బ్రీద్ అంటారుకదా ! తాతగారూ!"
  "ఔను , అన్ని భాషాల్లోనూ ఒకపదానికి అనేక పర్యాయపదాలుంటాయి. ఆంగ్లంలో సిననిమ్స్ అంటారు .   ఐతే మన మాతృభాష  మనకు గొప్ప.    మన మాతృ భాషలో చెప్పానుగా వారి సంస్కారాన్నీ, మంచిత నా న్నీ బట్టి పదాలు వాడు తారు.ఇంకా అంతము, అంత్యము, అవసా ధము, శరీరపతనము, అంతగ మన ము, ఆఖరు ,  ఊర్ధ్వగతి, కీర్తిశేషము, దేహయాత్ర ,పర లోక గమనము, పెద్ద నిద్దుర, పరిసమాప్తి,మరణము,మహా నిద్ర, మృతి, మృత్యువు, యశ శ్శేషము, స్వర్గతి, స్వర్గగమనము, కడ,  ముక్తాయింపు, సంసిద్ధి, సమాధి, సమాప్తి, స్వర్గ లోక యాత్ర. ఇలాంటిపదాలుకూడా వాడుతారు. అంతేకాదు - ఆమృతదేహాన్ని, శవమనీ, పీనుగు అనీ,కళేబరమనీ, పార్ధివదేహమనీ,ఇలా వారి స్థాయిని బట్టి పదాలు ఉపయోగిస్తారు.
"భలేతాతగారూ ! అన్నట్లు మరచేపోయాను ,ఈరోజు మాతెలుగు మాస్టారు ఏదైన ఒక పదా నికి పదేసి పర్యా యపదాలు రాసుకురమ్మనారు.మన మాతృభాష మాధుర్యం మీకు పర్యా య పదాలు తెల్సు కుంటేనే తెలు స్తుందని .నాకు ఈ న్యూస్ సందర్భంలో చాలాపదాలే  దొరి కా యి. ఉండండి నోట్ బుక్, పెన్ తెచ్చుకుంటా ను.వ్రాసుకోను."అంటూ  లోపలికి  తుర్రు మన్న మనవడ్ని నవూతూ చూసారు తాతగారు.                                              
  *******  

1 comment:

  1. మాతృభాష మాధుర్యం మధురంగా ఉంది

    ReplyDelete

Pages