కవిత - అచ్చంగా తెలుగు
కవిత
 భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

అక్షరమై మెరిసి, అక్షయమై కురిసి,
వాక్యమై విరిసి,మనుగడై మురిసి
హటాత్తుగా ఆవిర్భవిస్తుంది కవిత.
రమ్యంగా అడుగిడి, మౌనంతో కలబడి, 
భావంతో ముడిపడి, హృదయంతో జతపడి,
ఆశ్చర్యాన్ని ఆవిష్కరిస్తుంది కవిత. 
ఊహల్లో పిలిచి,ఊపిరిగా నిలిచి,
విచిత్రంగా వలచి,చెంతనే నిలిచి, 
మనసుతో మమేకమౌతుంది కవిత.
ఆవేశంతో పుట్టి,ఆలోచనతో పెరిగి,
ఆనందంలో కరిగి,అధ్బుతంతో కలిసి,
కాయితంపై ఒరుగుతుంది కవిత.
అదృశ్యంగా నిలిచి,అంతలోనే తెలిసి,
ఆదరమై పిలిచి,ఆదర్శమై కులికి, 
ప్రత్యక్షమౌతుంది కవిత.
ఆనందంలో ఐక్యమై,అనుబంధంతో సఖ్యమై,
ఆవేదనలో ముఖ్యమై,ఆలోకనతో లౌఖ్యమై
ప్రేమతో పరుగున వస్తుంది కవిత.
 ***

No comments:

Post a Comment

Pages