రక్త దాన శిబిరం - అచ్చంగా తెలుగు

రక్త దాన శిబిరం

Share This

రక్తదాన శిబిరం
ఓరుగంటి సుబ్రహ్మణ్యం 

తెలుగు సాహిత్య సమితి చెంబూర్ (ముంబాయి) దెవైన్ ఇండీన్ యూత్ సంస్థ సయుక్తంగా ఆదివారం (18.2.2018) నాడు అణుషక్తినగరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మహారాష్త్ర ఆరొగ్యశాఖ మంత్రి డా. దీపక్ సావంత్  ఈ శిబిరాన్ని ప్రారంభించారు . "మీరు దానం చేసిన రక్తపుబొట్టు - కొసరూపిరితో కొట్టుమిట్టాడుతున్న జీవికి ప్రాణం పెట్టు" అంటూ యువతకి  ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని సామాజిక సేవకు నడుంకట్టమని పిలుపునిచ్చారు  తెలుగు సాహిత్య సమితి అధ్యక్షులు నతరాజ్ గారు ఈ శిబిరాన్ని గత దశాబ్దంగా కొనసాగిస్తున్నమని చెప్పారు.  అలాగే దెవైన్ ఇండీన్ యూత్ సంస్థ ప్రతినిధి "అచ్చంగాతెలుగు"తో మాత్లాడుతూ ఒక్క రక్తదాన శిబిరాలేకాకుండా ఇతర వైద్య శిబిరాలను  దేశంలో పలు చోట్ల నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పరు. ఈ శిబిరానికి సుమారు 300 మంది దాతలు విచ్చేసారు.  సమితి కార్యదర్శి డా.  నారాయణరావు వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది.

No comments:

Post a Comment

Pages