నాకు నచ్చిన ఉన్నవ వెంకట్రామయ్య గారి కధ "రెండు శవాలు" - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన ఉన్నవ వెంకట్రామయ్య గారి కధ "రెండు శవాలు"

Share This
నాకు నచ్చిన ఉన్నవ వెంకట్రామయ్య గారి కధ "రెండు శవాలు"
అంబడిపూడి శ్యామసుందర రావు.      

గోలకొండ పత్రిక కధలు పేరిట విడుదల అయినా సంకలనములోని యాభై  రెండు కధలలో, ప్రస్తుతము 1934లో గోలకొండ పత్రికలో ప్రచురించబడ్డ ఉన్నవ వెంకట్రామయ్య గారి కధ "రెండు శవాలు" గురించి తెలుసు కుందాము.. ఈ కధ ఆనాటి తెలంగాణ సమాజములో భూస్వాముల అరాచకాలు పేదల కష్టాలను  కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తుంది భాష కూడా పూర్తిగా తెలంగాణ యాసలో ఉంటుంది 
ఒక దొర పట్నము పోవటానికి బండి(కచ్చడం) కట్టమని పనివాడితో చెపుతాడు కానీ ఆ టైములో దొర గారి ఎడ్లు పొలానికి నీళ్లు తోడటానికి(మోట కు) వెళ్ళినాయి  ఆ విషయాన్ని దొరగారికి చెపుతాడు పనివాడు "యెల్లపొనికి చెప్పు ,పొలానికి పోయి యేడనన్నారెండెడ్లు పట్టుకు రమ్మని "అని దొరగారు అంటాడు.యెల్లపోడు పొలము పొయ్యి మోట మీద ఉన్న రాజి రెడ్డి యెడ్లను యిప్పుతాడు ఎక్కడ ఇన్ని నీళ్లు లేవు శ్రావణ మాసము కరువొచ్చింది బావులు ఎండిపోతున్నాయి జరజర వూరబెట్టి వరిపొలాలకు మోటలు కొడుతున్నారు అటువంటి టైములో ఎడ్లు విప్పదీసుకుపోతే పొలము ఎండిపోతుంది వద్దు అని రాజిరెడ్డి బ్రతిమాలుతాడు పొలము ఎండిపోతే ఏమవుతుంది దొరగారుపట్నానికి జల్ది పోవాలంట అని ఎడ్లను విప్పదీసుకుపోతాడు యెల్లపోడు దొరగారి  సొంత ఎడ్లు తన పొలములో చేనుకి నీళ్లు పెడుతున్నాయి బక్క రైతు రాజిరెడ్డి కి ఆ అవకాశము లేకుండా అతని ఎడ్లని తానూ పట్నము వెళ్ళటానికి బండి కోసము తెప్పించాడు దొరగారు అది ఆనాటి భూస్వామి పెత్తందారీవ్యవస్థకుకి ఉదాహరణ 
ఎడ్లను తీసుకొచ్చి దొరగారి బండికి కట్టి బండి లో గడ్డి పరచి పరుపు వేసి దొరగారి ట్రంకు పెట్టెను దుప్పటిలో చుట్టి వీపుకు కట్టుకొని కందిలి చేత బట్టుకొని యెడ్ల ముందు నిలబడ్డాడు మంగలెంకడు వెంకట రావు దొరగారు లాగు,షేర్వానీ తొడుక్కొని బూట్లు తొడిగి అద్దము ముందు మీసాలు సరిచేసుకొని  చేతి కర్ర బుచ్చుకొని బండిలో కూర్చుని బూట్లను మంగలోని చేతికిచ్చి రాముడికి తానూ వచ్చేదాకా ఇంట్లోనే ఉండమని చెప్పి బయలుదేరాడు. మంగలెంకడు వీపున పెట్టె,ఒకచేతిలో కందిలి, మరోచేత్తో బూట్లు పుచ్చుకొని బండి ముందు పరుగెత్తుతుంటే రెండుగంటల్లో పన్నెండు మైళ్ళదూరాన ఉన్న నల్లగొండచేరారు బండిని వెనక్కి పంపి సర్కారీ బస్సులో పట్నము పోయినాడు దొరగారు పట్నములో ఏడు రోజులదాకా ఉండవలసి వచ్చింది. 
ఇక్కడ ఊళ్ళో మృగశిరలో పడ్డ కొద్దిపాటి వానలకు పునాస పైర్లు వేశారు చెరువుల్లోకి బావుల్లోకి పెద్దగా నీళ్లు రాలేదు.పనులకు నీళ్లులేవు,గడ్డిలేదు,  మోటకు(బావి)కుండెడు వంతున పోచమ్మకు వరదపాశము పోయించారు.బాపనాయనతో విరాటపర్వం చదివించి శివుడికి వెయ్యి బిందెలతో ఏకాదశ రుద్రము చేయించి బ్రాహ్మణ సమారాధన మొదలుపెట్టి బ్రామ్మలకు తలా రూపాయి సంభావన ఇచ్చి భోజనాలుమొదలు పెట్టగానే ఫెళ ఫెళ మెరిసి వాన మొదలై మూడు రోజులు ఒకటే వాన చెరువులు కుంటలు నిండినాయి కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి సూర్య నమస్కారాలు చేసేవాళ్లకు సూర్యుడు కనిపించక మూడు రోజుల నుంచి ఒక పొద్దు భోజనాలు.  రైతులు వానలు తగ్గటానికి మళ్ళా భీష్మ పర్వము చదివించాలేమో అని అనుకున్నారు.
దొరగారి ఇంటి దగ్గర పనివాడు రాముడు ముతరాచు     వయస్సుపదేండ్లు,వాడి తల్లి యెంకి రాముడి చిన్నప్పుడే తండ్రిపోయినా కూలినాలి చేసుకుంటూ పిల్లవాడిని సాకి దొరగారిదగ్గర జీతానికి ఉంచింది. జీతము క్రింద రాముడికి అడ్డెడు గట్టి గింజలు, అడ్డెడు పొట్టు గింజలు కలిపి నెలకు కుంచెడు ఇస్తారు.వాననైన వరదైన రాముడు చేసే పని తప్పుదు. తెల్లవారుజామున లేచి పనిలో ప్రవేశిస్తేజాన్ని రకాల పనులు చేస్తూ వురెంబడిబావిలో మంచినీళ్లు తెచ్చి ఇంటికిపోయి అంబలి తాగొచ్చి రెండు జాముల దాకా పశువులను మేపి ఇంటికొచ్చి బర్రెలకు కుడితి పోసి,సందె వేళ కందిళ్ళలో(దీపాలలో)చమురు పోసి ముట్టించి పక్కలు వేసి చిల్లర పనులన్నీ పూర్తిచేసేటప్పటికీ రాత్రి జాము పొద్దవుతుంది.అప్పుడు దొరసానిని,"దొరసాని ఇంటికిపొయ్యేదా?యీడనే పండేదా?"అని అడుగుతాడు,"యీడ ఎందుకు తిండి దండగ బువ్వెవరూ వండ్రిండు  ఇంటికే పొదువుగానిలే, చిన్నదొరకు సర్ధి (జలుబు) చేసినట్లుంది యెంకట శెట్టి ఇంటికి పోయి నేను చెప్పినానని చెప్పి ఒక పైసా సొంఠి తీసుకురా",అని వెలమ నీటుతో దొరసాని ఆర్డర్ వేసింది. 
దొరసాని కొడుకు పన్నెండ్లవాడు వాడిని అతి గారాబముగా పెంచుతుంది. ఈ వాన ముసురు ఉన్నన్నాళ్ళు మంచము దిగనివ్వకుండా ఉలెన్ డ్రెస్ చలి టోపి సాలువా కప్పి పడుకోబెట్టింది రెండు తుమ్ములు తుమ్మెసరికి వానలో చీకట్లో రాముడిని వెళ్లి శొంఠి తెమ్మంది. పదేండ్ల రాముడు ఆ వానలో చీకట్లో పోవటానికి భయము వేసినా పోను అంటే దొరసాని కొడుతుందన్నభయముతో యెంకట శెట్టి ఇంటికి వెళ్లి తలుపు తడితే తలుపు తీయకుండానే శెట్టి ఎవరు ఏమికావాలి అని తెలుసుకొని పైసా బేరానికి లేచి తలుపుతీయతము దండగ అని భావించి దొరసాని పంపిందన్న వినకుండా లేదు పొమ్మన్నాడు దొరసాని దగ్గరకు వచ్చి శెట్టి లేదని చెప్పాడని చెప్పగానే దొరసాని రాముడి చెంప మీద చట్టాలున్నా కొట్టింది. ఇంతలో చిన్న దొర లేచి మంచినీళ్లే అని అడిగితె ,"రాముడు తెస్తాడులే నీవు లేవకు,"అనిదొరసానితనము చూపించింది ఇంట్లో నీళ్లు లేవంటే బావికిపోయి చెంబుతో తీసుకురా అని హుకుం జారీ చేసింది దొరసాని .చెంబుతో తెస్తే చాలుతాయో చాలవో అని బిందె పట్టుకుపోయి బిందెతో నీళ్లు తెచ్చాడు రాముడు."యింత కావరమా భడవా?చెవులు వినరావా?చెంబుతో తెమ్మంటే బిందెతో తెస్తావా?రేపు తేకుండా తప్పించుకుందామనేనా "అని ఒక్కటి చెంపమీదిచ్చి బిందెడు నీళ్లను పారబోసి బావికి పోయి చెంబుతో నీళ్లు పట్టుకురమ్మని హుంకరించింది పాపము రాముడు ఏడుస్తూ బావికి పోయినాడు చీకట్లో వంటరిగా బావిలోకి దిగేసరికి కష్టాలన్నీ గుర్తుకొచ్చి ఛీ ఏమి బతుకు జానెడు పొట్టకు ఇన్ని తిప్పలా బతికితే పిడికెడు మెతుకులు,ఛస్తే మూరెడు నేల, అయ్య చచ్చి ఆకాశాన సుఖముగా ఉన్నాడు తానుకూడా అయ్య దగ్గిరికే పొతే మంచిది అనిపించింది రాముడికికాని వాడికి ఇంటి దగ్గర తల్లి గుర్తుకొచ్చింది తానూ బావిలో దూకి చనిపోతే తన తల్లికి దిక్కెవరు అన్న ఆలోచన దొరసాని తిట్లు గుర్తుకువచ్చి చావటానికి కూడా స్వాతంత్రము లేదు అని భావించి చెంబుతో నీళ్లు ముంచుకొని ఇంటికిచేరాడు అప్పటికే దొరసాని ఇంతసేపు ఎక్కడ చచ్చాడని అని తిడుతోంది.నీళ్ల చెంబు  అక్కడ పెట్టి ఆ చీకట్లోనే ఇంటికి ఉరికాడు దారిలో కాలి క్రిందుగా జర్రున ఏందో పాకినట్టయింది ఇంటికి వెళ్లి చేతికి తేలు కుట్టినట్లుంది చలిచలిగా ఉంది అని తల్లితో చెప్పుకొని ఏడ్చాడు తల్లి బిడ్డను కావిలించుకొని తానూ ఏడ్చింది. మళ్లి సర్దుకొని ఇంటిముందు ఉన్నతుప్పాకు,నల్ల ఉమ్మెత్తా కు నలిపిచేతికి కట్టుకట్టి బువ్వతిని పడుకొమంది కానీ రాముడు బువ్వ వద్దని గొంగడి బొంత కప్పుకొని పడుకున్నాడు 
తెల్లారినాక  పెద్ద దొర ఇంటికి వచ్చి ఎక్కడి పనులు అక్కడే ఉండటము చూసి రాముడేడి అని అడుగుతాడు ,దోరసాని "రాత్రి ఈడనే పడుకోమన్నాఎంతచెప్పినా వినకుండా ఇంటికి పోయిండు"అనిదొరసాని భర్తతో చెబుతుంది దొరగారు యల్లపొడిని పిలిచి రాముడింటికి రాముడ్నితోలుకు రమ్మన్నాడు యల్లడు పోయి తలుపు తట్టిన, ఎంతసేపు పిలిచినా జవాబు లేకపోయే సరికిఇంటి కప్పు మీది తాటాకు తీసి ఇంట్లోకి తొంగి చూశాడు నేలమీద రాముడి శవము, దూలాని తాడుకు వేలాడుతు యెంకి శవము. ఈ కబురు పరుగున వచ్చి దొరగారి అందించాడు. రాత్రిదాకా ఎవరికీ తెలియకుండా కట్టుదిట్టముచేసి అర్ధరాత్రి బేగారోన్ని(వెట్టివాడ్ని) వెంట బెట్టి కెళ్ళి ఉరెంబడి పాడుబొందలో రెండు శవాలను పూడ్పించాడు దొరగారు వెంకటరావు.పోలీసులకు కూడా ఆచూకీ దొరకకుండా. మర్నాడు గొల్లవాండ్ల మంద నుండి రెండు యాట పోతులు,కోమట్ల వద్ద వసూలు చేసిన ఒక డబ్బా నెయ్యి నల్లగొండ పోలీసులకు చేరింది  ఇది కంచికి చేరిన రెండు శవాల కధ 
 ***                                          

No comments:

Post a Comment

Pages