గాంధి పుట్టిన దేశమా ఇది? - అచ్చంగా తెలుగు

గాంధి పుట్టిన దేశమా ఇది?

Share This
గాంధి పుట్టిన దేశమా ఇది?
-పోడూరి శ్రీనివాసరావు


గాంధి పుట్టినదేశమా ఇది?
నెహ్రు కోరిన సంఘమా ఇది?
          ఇది ఆనాటి పాట ........
మోది పుట్టినదేశమా ఇది !
జైట్లి కోరిన సంఘమా ఇది !!
          ఇది నేటి మాట.....

సశ్యశ్యామల దేశం పోయి
వరద భీభత్సాలతో.....
ఉధృత జలప్రళయాలతో
అతలాకుతల దేశం మనది!

          పెద్దనోట్ల రద్దుతో
జో.యస్.టి. దెబ్బతో
దిక్కుతోచక అల్లాడుతున్న
ఆర్ధిక వ్యవస్థ మనది!
పంచశీల బోధించిన మనమే–
అణ్వాస్ట్రాలపటిమనూ చూపాము –
మహానుభావుడు అబ్దుల్ కలాం స్పూర్తితో ...

          పతివ్రతలు నడయాడిన మనదేశంలో
పంచ చర్త్రుకలూ ఉన్నారు....
దేవవేశ్యలు నర్తించిన ఈ ధర్మభూమిలో
దేవదాసీలూఅందెకట్టి నర్తించారు.

పురాణకాలంలో సైతం
టెస్ట్ ట్యూబ్ బేబీలు ఊపిరి పోసుకున్నారు.
ఫ్యామిలీ ప్లానింగ్ పాటించనందునే
వందమందితోకౌరవకుటుంబం
మెగా ఫ్యామిలీగా చరిత్ర కెక్కింది.

          సర్వమత సౌభ్రాతృత్వమే మన మతమని
భిన్నత్వంలో ఏకత్వమే మన నినాదమని
చాటిచెప్పి... గొంతుకపూడిపోయేలా నినదించిన మనం
మన పవిత్ర మానససరోవరాన్ని
చైనీయులకు దానమిచ్చాము
బలిచక్రవర్తి –వామనునికిమూడడుగులుదానమిచ్చినట్లుగా!

మన సహనశీలత ఎంత గొప్పదంటే
దాయాదులు కాలుదువ్వినా
చైనీయులు భూ ఆక్రమణలు జరిపినా
మనం నోరు మెదపం....
ఎందుకంటే ‘అహింసా పరమోధర్మః
అని నినదించిన మహాత్ముడు – గౌతమబుద్ధుడు
అహింసతో స్వాతంత్యం సముపార్జించిన – మహాత్మాగాంధి.

మనకు ఆదర్శపురుషులు– ఆరాధ్యదైవాలు.
          అధునాతన క్షిపణులు  మన అమ్ముల
పొదిలో చోటుచేసుకుంటున్నాయి.
అతిశక్తివంతమైన జలాంతర్గాములను,
యుద్ధవిమానాలను సేకరిస్తున్నాము.

మా బలమెంత అని.... ఎంతో ...అని
ప్రదర్శిస్తున్నాము.
కానీ...మనం మౌనం వీడము
ఎందుకంటే.... మనం శాతికాముకులం.
సహనశీలులం ... మిన్నువిరిగి మన మీద
పడ్డా ... శత్రువులు ఎదురు దాడికి దిగినా....
దొంగదెబ్బ తీసినా....
మన ముఖం మీద చిరునవ్వు చేరగనే చెరగదు.

అది హిందుత్వంలోనిమహోన్నత్వం...
భారతీయత లోని గొప్పతనం...
          దేశాన్ని కాశాయవర్ణంగా మారుస్తున్నారని
ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా...
ప్రగతికి అవరోధాలు కల్పిస్తున్నా...
మౌనమే మన సమాధానం.
ఎందుకంటే మనకిప్పుడు
చేతల ప్రధానమంత్రి దొరికాడు.

అంతర్గత కుమ్ములాటల కాంగ్రెస్ లో
వంశపారంపర్యంగా నేతల నందించిన
నెహ్రూ కుటుంబపాలనలో ఇప్పటికే
డెబ్భై సంవత్సరాల ‘స్వాతత్ర్యం అనుభవించాము!
          స్విస్ బ్యాంకు ఖాతాలు స్తంభించాయి.

నల్లడబ్బు చలామణి కొంతవరకు
తన కార్యకలాపాలకు విశ్రాంతి నిచ్చింది.
అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందంటే...
అది ఎన్నినాళ్ళ పోరాట ఫలితం.
వేకువ సూర్యుడు కాషాయ వర్ణం...
అస్తమించే సూర్యుడు కాషాయవర్ణం...
ఆత్మా బలిదానానికి, సేవా ధర్మానికి
గుర్తు – కాషాయ వర్ణం ....
          ఏదైనా సత్కార్యం తల పెట్టినపుడు
          అవరోదాలుంటాయి–ఆటంకాలుంటాయి
          సమర్ధనాయకత్వంలో– బాసటగా
          సారూప్యమనస్కులంటే–తోడుగా
మనమంతా ఒక్కటిగా ఉంటే
మన భారతావని విశ్వానికే తలమానికం గాదా!

అప్పుడు నాటిగేయాన్ని మళ్లా
తిరగ వ్రాస్తారు ....
“మోది పుట్టినదేశమా ఇది
జైట్లి కోరిన సంఘమా ఇది “ అంటూ.......


***

1 comment:

Pages