నాకు నచ్చిన కధ,"టెలిగ్రామ్ " శిష్ ట్లా ఉమామహేశ్వర రావు రచన - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కధ,"టెలిగ్రామ్ " శిష్ ట్లా ఉమామహేశ్వర రావు రచన

Share This
నాకు నచ్చిన కధ,"టెలిగ్రామ్ " శిష్ ట్లా ఉమామహేశ్వర రావు రచన
అంబడిపూడి శ్యామసుందర రావు

గ్రామీణులైన సిపాయిల జీవనవిధానాన్ని ఇతివృత్తముగా తీసుకొని వారి నోటి నుండి వచ్చిన మాటలను తడార కుండా కధలలో చొప్పించిన రచయిత శ్రీ శిష్ ట్లా ఉమామహేశ్వరరావుగారు, కాబట్టి వాళ్ళ మాటలు మొరటువి, జోకులు నేలబారువి, చేష్టలు కొంటేవి. కదలగురించి తెలుసుకోబోయే ముందు ముఖ్యముగా ప్రస్తుత తెలుగు పాఠకులకు అంతగా పరిచయములేని ఉమామహేశ్వరరావు గురించి ముందు తెలుసుకుంటే ఆ కథలలోని సారాన్ని, విషయాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.

ఈయన బ్రతికింది కొద్దికాలమే (1909-1953).పుట్టింది గుంటూరు జిల్లా మంచాళ గ్రామములో సనాతన బ్రాహ్మణ వైదిక కుటుంబములో. ఆందువల్లే తన్నుతాను "అగ్రహారపు బడితే" గా చెప్పుకున్నాడు. కవితా రంగములో ఈయనది రౌడీ వేషము.

స్థిరమైన ఉద్యోగము ,క్రమమైన జీవితము లేకుండా ఎత్తుడి సంసారిగా బ్రతికిన అనార్కిస్టు - సుడోమిస్టు . "అతి నవీనుల్లో కడు ప్రాచీనుడు "అని శ్రీరంగము నారాయణబాబు గారి చేత, "వచన కవిత్వము ఆదిమ దశ కవి" గా శ్రీశ్రీ చేత పొగిడించుకొని తను మాత్రము ఎవరికీ పూర్తిగా అర్ధము కాకుండా నిష్క్రమించిన తోలి తెలుగు వచన కవన రచయిత ఉమామహేశ్వరరావు గారు .శిష్ ట్లా మేధావుల దృష్టిలో జీనియస్ గాని వారన్నట్లు "ఎర్రటిక్ జీనియస్ "అంటే ఎన్నో దారులు తొక్కాడు ,మరెన్నో పోకడలు పోయినాడు ఏ ఒక్కటి స్థిరము లేకపోవటమే అయన విశేషము. ఆంగ్ల సామెత " a rolling stone gathers no mass" ఈయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. ఏకాగ్రత ఒక్కటే శిష్ట్లా లోపము. ఎందుకంటే సాహిత్యము లో కథలు,గేయాలు ,నాటికలు బాలల సాహిత్యము,వ్యాసాలు మొదలైనవి అన్ని ప్రక్రియలో చేయి పెట్టాడు, ప్రతి ప్రక్రియలో విభిన్నముగా కనిపిస్తాడు.

మూడు ముక్కల్లో చెప్పలాంటే శిష్ ట్లా ఏ సాహితి ప్రక్రియలోనయినా స్వతంత్ర ప్రతిభావంతుడు . శ్రీశ్రీకి సహచరుడే గాక కొన్ని ముఖ్యాంశాల్లో మార్గదర్శకుడు ,ఉత్తేజకర్త కూడా సిపాయి కథలు తెలుగు సాహిత్యానికి ఒక నూతన అలంకారము అని భారతి పత్రికలో శ్రీ రంగము నారాయణ బాబు గారు ప్రశంసించారు . వస్తువులోను,కధనములోను,ఈ సిపాయి కథలు నవ్య మార్గానికి చెందినవై ఆంధ్ర కథానికా సాహిత్య విచార సందర్భాన మంచి స్థానము గడించి పెట్టేవిగా ఉన్నాయని శ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యులు, శ్రీ పిల్లలమఱ్ఱి వెంకట హనుమంతరావు గారు ఉమ్మడిగా వ్యాఖ్యానించారు.

.ఏదేశానికైనా యుద్ధము వస్తే ఆ యుద్ధము నుంచి సాహిత్యము లో కొన్ని నూతన మార్గాలు రావటము యుద్దానికి ఉండే ఒక ప్రత్యేకత ఆ విధముగా వచ్చినవే ఈ సిపాయి కథలు. మన దేశము ప్రత్యక్షంగా ప్రపంచ యుద్దానికి సంబంధము లేకపోయిన బ్రిటిష్ పాలకుల పుణ్యామా అని మన సిపాయిలు బ్రిటిష్ వారి తరుఫున పోరాడవలసి వచ్చింది. తెలుగువాడు ప్రధానముగా "ఇంటి పట్టు మనిషి "అని పేరున్న రోజుల్లో ఆ ది నిజము కాదు అని ఈ కథలు నిరూపిస్తాయి. రెండవ ప్రపంచయుద్ధము వల్ల ఏర్పడ్డ ఆర్ధిక మాంద్యము వల్ల బ్రతుకుల నడ్డి విరిగినమధ్యతరగతి విద్యావంతులు సైతము ఉదర పోషణార్ధము సైన్యములో నానా నౌకరీలకు ఎగబడవలసి వచ్చింది అటువంటి వేలాది మందిలో శిష్ ట్లా కూడా ఒకడు.
ఆవిధముగా సైన్యములో చేరిన తెలుగు వాళ్లు నేపాల్, చైనా,బర్మా, చివరకు
ప్రాన్స్, మధ్య ప్రాచ్యము వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడి మట్టిలో కలిసిపోయారు ప్రాన్స్ దేశపు బయళ్లన్నీ మన సైనికుల ఎముకలతో తెలుపెక్కాయని శ్రీమతి సరోజినీ నాయుడు గారు ఒక గీతములో వర్ణించారు. ఏ యుద్దములోనైనా ఎక్కువగా చనిపోయేది సాదా సిపాయిలే అందుకనే వాళ్ళను "ఫిరంగుల దాణా" అని అంటారు.భారతీయ సైనికులు దాడులను తిప్పికొట్టే సన్నాహాలలో భాగముగా శిబిరాలను ఏర్పరచుకొని కాలక్షేపము చేసే సమయములో సిపాయిల మధ్య జరిగిన సంభాషణలు వాళ్ళు వేసుకొనే ముతక జోకులే ఈ కధలకు మూలము.
శిష్ ట్లా ఈ కథల్లో ప్రధానముగా వర్ణించిన ప్రాంతము ఇండో-బర్మా సరిహద్దు .ఈ కథలలో "క్యాప్టె న్ తులసి" తప్ప మిగిలిన సిపాయి కథలన్నీ నాటు భాషలో రాయబడ్డాయి. ఈ రకము భాష రాయడము కష్టము చదివి అర్ధము చేసుకోవటం కూడా బహు కష్టమే. ఈ కథలలో పాత్రల పేర్లు కూడా తమాషాగా ఉంటాయి.గురకానందము,మూడు మొగాల నరసి గాడు,పెద బొండాము గాడు నక్కాయి గాడు ,గూబ గోపాయిగాడు ,గన్నరు గురుమూర్తి,గుంయి గుంయి గురివి మొదలైన తమాషా పేర్లు.
సిపాయి కథల్లో మచ్చుకు ఒక కథ గురించి మీకు చెపుతాను ఆ కథ పేరు,"టెలిగ్రామ్" సైన్యములో పనిచేసే సిపాయిని ఇంటికి రప్పించుకోవటానికి పల్లెలో ఉండే భార్య ప్లానే ఈ టెలిగ్రామ్ సహజముగా పాతరోజుల్లో టెలిగ్రామ్ అంటే ఎదో ఒక దుర్వార్త తీసుకువస్తుంది అన్న నమ్మకము ప్రజలలో ఉండేది ఏదైన కబురు త్వరగా చేరవేయటానికి టెలిగ్రామ్ ఒక సాధనము . "ఒరేయ్ నీకో టెలిగ్రామ్ వచ్చిందిరా వెంకాయ్ ",అని సహచరుడు పెదబొండాము చెప్పి అంతటితో ఆగకుండా దబ్బున చుట్టముపోయింటాడు వాడి ఆస్తి నీకొచ్చిందేమో చూడు అని కూడా అంటాడు నిజంగా తనకేనా అన్న అనుమానము వెంకాయ్ లో కలుగుతుంది అప్పుడు టెలిగ్రామ్ విప్పందే అందులో ఏముందో ఎలా తెలుస్తుంది అని స్నేహితుడి మీద విసుక్కుంటారు. స్నేహితులందరు టెలిగ్రాము లోని విషయము మీద అతృతతో ఉంటారు.
వెంకాయ్ తాను ఉరినుంచి వచ్చేటప్పుడు బ్రాకెట్ ఆటలో రెండు రూపాయలు పెట్టాను రూపాయికి ఎనభై చొప్పున రెండు రూపాయలకు నూట అరవై వచ్చిఉంటుందని ఆశ పడుతూ టెలిగ్రామ్ విప్పటానికి సంకోచిస్తూ తన స్నేహితుడు పెద బొండాము ను విప్పమని విప్పి అందులో సంగతి చెప్పేదాకా తానూ కళ్ళు తెరవమని చెపుతాడు. టెలిగ్రామ్ చదివిన పెద బొండాం,"చాలా వత్తున్నదిరా" అని నవ్వటం మొదలు పెడతాడు నవ్వటము చూసిన మిగిలిన స్నేహితులకు అందులో ఏముంది అన్న ఆసక్తి పెరిగి అందరు ఆ టెలిగ్రామ్ తీసుకొని చదివి అందరు వెంకాయ్ మీద జోకులు ఇస్తూ చివరికి విషయము చెపుతారు విషయము ఏమిటి అంటే ఆ టెలిగ్రామ్ వెంకాయ్ భార్య దగ్గరనుంచి వచ్చింది అనుకున్నట్లుగా ప్రయిజ్ సొమ్ము ఏమి రాకపోయినా భార్య దగ్గరనుండి వచ్చిన కబురు వెంకాయ్ కి ఆనందము కలిగించింది.
ఇంతకీ ఆ టెలిగ్రామ్ లో ఏమున్నది అంటే "కవల పిల్లలు కలగబోతున్నారు వెంటనే రావాల్సింది",ఆని ఉంది స్నేహితులంతా ఒక రాయికి రెండు పిట్టలు భారసాలకు మేముకూడా రావాలా అన్న జోకులతో వెంకాయ్ ని ప్రశంసించారు.
ఇప్పుడు వెంకాయ్ కి సమస్య వాళ్ళ మేజర్ ను కలిసి సెలవు సంపాదించటము స్నేహితులు, "నీవు కంపెనీ ఆఫీసుకు వెళ్లు మేము నీ కిట్ బ్యాగు సర్ది ఉంచుతాము",అని వెంకాయిని కంపెనీ మేజర్ దగ్గరకు పంపుతారు మేజర్దగ్గరకువెళ్లి బూట్లు టక్కున కొట్టి, సెల్యూట్ టక్కున పెట్టి అటెన్షన్ లోనిలబడతాడు రమ్ము తాగుతున్న మేజర్ విషయము అడుగుతాడు వెంకాయ్ టెలిగ్రామ్ బల్ల మీద పెట్టి వారము సెలవు అడుగుతాడు విషయము తెలుసుకున్న మేజర్ వెంకాయ్ ని మెచ్చుకొని కాగితము మీద ఎదో లెక్కలు వేసి ఒక పిల్లాడికైతే వారము ఇద్దరు కాబట్టి రెండు వారాలని వెంకాయ్ కి రెండు వారాల సెలవు మంజూరు చేస్తాడు.

"బామ్మడు మేజర్ అయితే మిలిటరీలో గూడా ఛాత్రం వత్తుంది" అని

మనసులో మేజర్ ను మెచ్చుకొని ఒక వారము సెలవు అడిగితె రెండు వారాలు సెలవు వచ్చినందు సంతోషించి స్నేహితులువీడ్కోలు చెప్పగా వెంకాయ్ రైలు ఎక్కుతాడు రైలెక్కి విశ్రాన్తిగా కూర్చున్న వెంకాయ్ మనస్సులో ఆలోచన మొదలైంది.
"నిజానికి సంవత్సరము కిందగందా నేనింటికి వెళ్ళింది ? కవల లోత్తుండారని
నిన్న గందా లచ్చి టెలిగ్రామ్ ఇచ్చింది ? ఈ కడుపుకు కారణము?" ఇంకేముంది ఈ అనుమానంతో కాళ్ళు వణికాయి గుండె ఆగినంత పని అయింది రైలు దిగి నేరుగా ఇంటికి వెళ్లి తటాలున తలుపు తీసాడు భార్య లచ్చి కుక్కి మంచము మీద పడుకొని చేతులో ఫోటో ఎదో చూస్తుంది మొగుడ్ని చుసిన ఆనందముతో వచ్చి కావలించుకోబోయింది "ఏందీ యవ్వారం అంతా? " అని కోపముగా అడిగాడు "ఆ టెలిగ్రామ్ మాటా నువ్వడిగేది "అని నవ్వి "కవలల్లేరు,గివలల్లేరు అట్టా నేను టెలిగ్రామ్ ఇస్తేనే గందా నీకు సెలవిచ్చేది ",అన్నది . లచ్చి చేతులోని తాను డ్రెస్సులో ఉండగా తీయించుకున్న ఫోటో చూసిన వెంకాయ్ కి కోపము నీరుగారి భార్యను కావలించుకుంటాడు ఆవిధముగా భార్య ఇచ్చిన టెలిగ్రామ్ వల్ల (విషయము అబద్ధము అయినప్పటికీ) రెండు వారల సెలవు మీద ఇంటికి వచ్చి భార్యతో కాలము గడిపే అవకాశము వెంకాయ్ కి వచ్చింది అవండి మిలిటరీ వాళ్ళు అందునా సిపాయిల బ్రతుకులు.
***



No comments:

Post a Comment

Pages