తలనొప్పి - అచ్చంగా తెలుగు
తలనొప్పి
తురగా శివరామవెంకటేశ్వర్లు 

చలం ఆరోజ ఆఫీసు నుంచి నాలగుగంటలకే ఇంటికొచ్చేసాడు. భార్యరాధ తలుపు తీయుగానే హాలులోని దివాన్ కాట్ మీద పడుకుండిపోయాడు. రాధ కంగారుపడి, "ఏమండీ!అలా ఉన్నారే ? పైగా తొందరగా ఇంటికొచ్చేసారు. ఏమైందండీ?" అని అడిగింది.
"ఏంలేదు రాధా! ఆఫీసు పనిమీద ఈ వేళ పొద్దున్నుంచి ఎండలో తిరిగాను. అందుకని తలనొప్పి వచ్చి పర్మిషను పెట్టి ఇంటికొచ్చేసాను"అని చెపుతూ తలనొక్కుకుంటూ  పడుకున్నాడు.
"అయ్యో!అలాగటండీ. వేడిగా కాఫీ ఇస్తాను. ఉండండి!"అంటూ వంటింట్లోకెళ్ళింది రాధ.
వేడి కాఫీ గ్లాసుతోపాటు అమృతాంజనం సీసాకూడా చేత్తో పట్టుకుని చలాన్ని లేపి, కాఫీ ఇచ్చి తలకి అమృతాంజనం రాయడం మొదలెట్టింది. కాఫీ తాగేకా పాపుగంటసేపు రాధ అమృతాంజనం రాయడంతో చలానికి
 తలనొప్పి తగ్గిపోయి హాయిగా ఉంది. తనకు చేసిన సేవకిగాను భార్య రాధని మనస్సులో మెచ్చుకుంటూ రాధని దగ్గరగా పిలిచి, బుగ్గలు గిల్లుతూ "నా రత్నానివి నువ్యు ! నా మాణిక్యానివినువ్వు!” అన్నాడు.

అంతే!రాధఒక్కసారిగా కోపంగా లేచి చలం జట్టుపట్టుకుని,"ఎవరు మీ రత్నం? ఎవరు మీ ఆమాణిక్యం? వాళ్ళతో ఎన్నాళ్ళ నుంచి మీకు ఎపైరునడుస్తోంది? అయినా  నేనేమి లోటుచేసానండీ! మీకు? నాకెందుకు అన్యాయం చేసున్నారండీ. చెప్పండీ ! చెప్పండీ!" అని ఘొల్లుమనడంతో చలానికి మతిపోయి మళ్ళీ తలనొప్పి ప్రారంభమయ్యింది.
***



No comments:

Post a Comment

Pages