అడవి తల్లి బిడ్డ - అచ్చంగా తెలుగు

అడవి తల్లి బిడ్డ

Share This
అడవి తల్లి బిడ్డ ....
సుజాత తిమ్మన.

అడవి తల్లి కన్నబిడ్డైన వెదురు ..
ఆకాశాన్ని అందుకోవాలనుకొని..
ఆశల నిచ్చెనలా ఏపుగా పెరుగుతుంది .
తన కాండాన్ని మనకి అందించి..తాను  
అమ్మని మరువలేదని వొరుగు తుంది ...


పుట్టిన పసికందును పెట్టటానికి చాటగా ..
చనిపోయిన కట్టెను కట్టటానికి పాడెగా..
వధువును కూర్చో పెట్టటానికి బుట్టగా...
రూపాలు మార్చుకుంటూ ఉంటుంది వెదురు.

మనిషి చేతిలో  మైనంవలె ఒదిగి పోతూ..

నాటి త్రేతాయుగంలో సీతారాములకు
;నీడనిచ్చే పర్ణశాల  వేసుకోడానికే కాదు..
ద్వాపరంలో కృష్ణయ్య చేతికలంకారమైన వెదురు 
కన్నయ్య పెదవుల ముద్దాడుతూ...
మధురస్వరాల సరాగాల డోలలూగించింది .


హైటెక్ యుగంలోను...
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా..
ఈ ఫాషన్ ప్రపంచంలోనూ... 
"నాకు దీటులేరెవ్వరు.." అన్నట్టు...
కుర్చీలు..మేజాబల్లలు..
అందమైన చేతి సంచులు..
రకరకాల గృహ అలంకరణలో ఇమిడిపోయే వస్తువులతో
ఆనందం పంచుతూ వెదురు ఎప్పటికి మనదైనది...!!

*************** 

1 comment:

Pages