పునరుజ్జీవితుడు - అచ్చంగా తెలుగు

పునరుజ్జీవితుడు

Share This
పునరుజ్జీవితుడు
వై.ఎస్.ఆర్.లక్ష్మి

"కన్నా కాలేజీకి టైము అయ్యింది వెళ్ళవా?"అంది విజయ ఆఫీసుకు వెళ్ళబోతూ. "ఇదుగో వెళుతున్నానమ్మా!సాయంకాలం వివేక్ బర్త్ డే పార్టీ ఉన్నది ఏ డ్రస్సు వేసుకోవలా అని చూస్తున్నాను."అన్నాడు కార్తీక్. "పోనీ నే తీసివ్వనా"అంది మురిపెంగా. "పో అమ్మా!మా టేష్టులు నీకేమి తెలుస్తాయి?నే చూసుకుంటాలే" అన్నాడు కార్తీక్. "సరే అయితే నేను వెళుతున్నాను.డోర్ లాక్ చేసి కీ తీసికెళ్ళు.నా కీ నేను తీసుకెళుతున్నాను.డాడీ లేట్ గా వస్తారు.అప్పటికి నేను వచ్చేస్తాలే" అని విజయ గబగబా వెళ్ళిపోయింది. భాస్కర్,విజయ దంపతులకు పెళ్ళైన 6,7సంవత్సరాల వరకు సంతానం కలగలేదు.వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడినా ప్రయోజనం లేకపోవడం తో చివరకు ఐ వి ఎఫ్ పద్దతిలో కార్తీక్ ను పొందారు.అప్పటి వరకు విజయ ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించింది.తనకు ఎప్పటికైనా "అమ్మా" అని పిలిపించుకునే అదృష్టం ఉందో లేదో అని.ఎన్నో ఎదురు చూపుల తరువాత కలిగిన కొడుకు అవడం తో కార్తీక్ ను ఎంతో గారాబంగా చూసేవరు.అతడు కూడా వాళ్ళ కలల్నీ ఆశల్ని వమ్ము చేయకుండా ఇంటర్ వరకు బుద్దిగానే చదివాడు నిజానికి అతనికి వేరే ప్రపంచం తో పరిచయం అయ్యే అవకాశమే లేదు.టెంత్ వరకు ఒక ప్రైవేటు స్కూలు లో చదివాడు.ఉదయం 8 నుంచి సాయంకాలం 6 వరకు ఉండేది.అతడు ఇంటికి వచేసరికి తల్లి ఆఫీసు నుంచి వచ్చేసేది.ఆమె తో స్కూలు విశేషాలు చెబుతూ స్నానం,వేడివేడి భోజనం చేసి కాసేపు చదువుకొని నిద్రపోయేవాడు.ఇంటర్ ఒక కార్పొరేట్ కాలేజీలో చదివాడు.అప్పుడు ఇక దేనికీ సమయం ఉండేది కాదు.ఇక ఆదివారాలు సినిమాకో షికారుకో తల్లిదండ్రులతో కలిసి వెళ్ళేవాడు.వారికీ ఇల్లు అఫీసు తప్ప వేరే ప్రపంచం లేకపోవడంతో ముగ్గురూ ఒకటే లోకం గా సంతోషంగా ఉండేవారు. ఎంసెట్ అయ్యాక కొడుకు తమ కళ్ళ ముందే ఉండాలని ఉన్న ఊళ్ళోనే ఇంజినీరింగు లో చేర్చారు.కొత్త కాలేజీ,కొత్త వాతావరణం,కొత్త స్నేహాలు,కొత్త ఆకర్షణలు.మొదటి సంవత్సరం బెరుకు బెరుగ్గా ఉన్నా రెండో ఏడు వచ్చేసరికి కొత్త స్నేహితులు ఏర్పడ్డారు.గంటలు గంటలు కబుర్లు పొరుగూరు నుంచి ఇక్కడకు వచ్చి రూముల్లో ఉండి చదువుకుంటున్న వారి రూములకు వెళ్ళి కాలక్షేపం చేయడం అలవాటుగా మరింది.మంచి కంటే చెడు తొందరగా ఆకర్షిస్తుంది కదా!ఇప్పటి వరకు తల్లిదండ్రులతో అరమరికలు లేకుండా చెప్పుకునే కబుర్ల స్థానం లో నర్మగర్భమైన మాటలు చోటు చేసుకున్నాయి.కొడుకులో వస్తున్న మార్పును తల్లి మనసు పసిగట్టినా దృతరాష్ట్రుని పుత్రవాత్సల్యం లాంటి గుడ్డి ప్రేమ ఆ ఆలోచనల్ని ముందుకు వెళ్ళనీయలేదు.మూడో సవత్సరం లోకి వచేసరికి చదువు తిరోగమనం అలవాట్లు పురోగమనం సాధించాయి.లేట్ నైట్ పార్టీలు డ్రింక్ చేసే వరకు ఎదిగాడు. ఇంజనీరింగు నాలుగో సంవత్సరం లోకి అడుగిడితూనే ఆఏటి బర్త్ డే గిఫ్ట్ గా బైక్ కొనిచ్చుకున్నాడు.బయటకు వెళ్ళిన ప్రతిసారి అనేక జాగ్రత్తలు చెప్పేది విజయ. ఆరోజు డిసెంబర్ 1వ తారీఖు.ప్రతి సంవత్సరం ముగ్గురూ గుడికి వెళ్ళడం అలవాటు.ఆ సంవత్సరం కార్తీక్ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాననడం తో ఎదుగుతున్న కొడుకు ఇష్టాలను గౌరవించాలన్న ఉద్దేశం తో మనసులో అయిష్టం గా ఉన్నా సరే ననక తప్పలేదు.విజయ,భాస్కర్ లు గుడికి కార్తీక్ పార్టీకి వెళ్ళారు.కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకొని 12.30 వారిద్దరూ ఇంట్కి వచ్చేసారు.అలసిన భాస్కర్ వెంటనే నిద్రపోయాడు.కొడుకు కోసం ఎదురు చూస్తూ విజయ టి వి చూస్తూ కూర్చుంది.ఫోన్ మోతతో ఉలిక్కిపడి టైము చూసింది.2.30 అవుతోంది.ఈ సమయం లో ఎవరా అనుకుంటూ ఫోన్ తీసింది.అవతల కార్తీక్ ఫ్రెండ్ అనిల్."ఆంటీ కార్తీక్ కి యాక్సిడెంట్ అయ్యింది.మేము కేర్ ఆసుపత్రికి తీసుకు వెళుతున్నాము.మీరు వ్వంటనే బయలు దేరి రండి."అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసాడు. "అయ్యో!దేవుడా" అంటూ కుప్ప కూలింది విజయ. ఈ హడావిడికి భాస్కర్ లేచి వచ్చి విజయను చూసి "ఏమైంది?ఆ కంగారేమిటి ?" "ఏమండీ మన కార్తీక్....."చెప్పలేక బోరుమన్నది విజయ. "ముందు విషయం చెప్పు.కార్తీక్ కు ఏమైంది?" "అనిల్ ఫోన్ చేసాడండీ.మన కార్తీక్ కు యక్సిడెంట్ అయ్యిందట.మనల్ని కేర్ ఆసుపత్రికి రమ్మని చెప్పాడు"అని బీగ్గరగా ఏడవసాగింది. భాస్కర్ కూడా ఖిన్నుడYYఆడు.ఒక్కక్షణం తేరుకొని "పద వెళ్దాము "అంటూ కారు కీసు డబ్బులు తీసుకొని బయలుదేరారు. వీళ్ళు హాస్పటల్ చేరేసరికి అప్పుడే కార్తీక్ ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ ధియేటర్ లోకి తీసుకువెళ్ళబోతున్నారు.వీళ్ళను చూడటం కోసమే అన్నట్లుగా అప్పటివరకు కళ్ళు తెరిచి చూస్తున్న కార్తీక్ "అమ్మా..."అంటూ స్ప్రుహ కోల్పోయాడు. "ఏమి జరిగింది అనిల్"అని అడీగాడు భాస్కర్.అక్కడ ఉన్న కార్తీఈక్ స్నేహితులు అతని దగ్గరకు వచ్చారు "మేమంతా పార్టీ అయినాక నాలుగు బైకుల మీద బయలుదేరాము.కార్తీక్ వద్దు అన్నకొద్దీ ఇద్దర్ని ఎక్కించుకున్నాడు.స్పీడ్ బ్రేకర్ ని చూసుకోకపోవడంతో బండి అదుపు తప్పి పక్కనున్న సిమ్మెంట్ పోల్ ని కొట్టుకుంది.కార్తీక్ విసురుగా రోడ్ మీద పడ్డాడు.వెనకాల ఉన్న ఇద్దరు ఫ్రండ్స్ కి ఒకరికి చెయ్యి విరిగింది రెండోవాడికి చిన్న దెబ్బలే తగిలాయి.ఆపరేషన్ ధియేటర్ నుండి డాక్టర్లు బయటకు రావడాం చూసి భాస్కర్ దగ్గరకు వెళ్ళాడు.. ""బాడీకి పెద్దగా దెబ్బలు తగలలేదు మైనర్ ఇంజురీసే.కాని హెల్మెట్ లేకపోవడం తో తలకి బలమైన రోడ్డు దెబ్బ తగిలింది.48 గంటలు గడిస్తే కాని ఏ సంగతీ చెప్పలేము.'అన్నారు రెండు రోజులు భాస్కర్,విజయలు నిద్రాహారాలు మాని హస్పటల్ లోనే ఉండిపోయారు.విషయం తెలిసి బంధువులు,స్నేహితులు వచ్చి పరమర్శించి వెళుతున్నారు.విజయకు బెష్ట్ ఫ్రెండ్ లత ఆమెను అంటిపెట్టుకునే ఉన్నది.చివరి క్సణంలో కార్తీక్ చూసిన దీనమైన చూపులు విజయను వెంటాడుతున్నాయి.ఆమె పరిపరి విధాల వాపోతోంది. "నేను తప్పు చేసానేమోనండీ.వాడూ ఫ్రేండ్స్ తో పార్టీ లని తిరుగుతూ ఉంటే వారించలేకపోయాను.ఈ వయసులో ఇవన్నీ కామనే కదా!వాడి సంతోషాన్ని ఎందుకు పాడుచెయ్యాలనుకున్నాను.అప్పుడే మందలించి ఉంటే ఇంత అనర్ధం జరిగేది కాదేమో.నేనే నాచేజేతులా కొడుకుని చంపుకున్న దాన్ని అయ్యాను.నాకు అమా అని పిలిపించుకునే యోగ్యత లే దేమోనని బాధపడుతుంటే పుట్టాడు.దేముడికి దయ కలిగింది అనుకున్నాను.కాని నేను దురదృష్టవంతురాల్ని.నాకు ఈ జన్మకు ఆ అదృష్టం లేకుండా చేశాడు.ఈ కడుపు కోత కంటే నన్ను తీసుకు వెళ్ళినా బాగుండేది."అని గోడు గోడున ఏడవసాగింది. "నువ్వు ఇలా ఏడుస్తుంటే భాస్కర్ గారు మరీ బెంబేలు పడిపోతారు.ఇలా జరగాలని రాసిపెట్టిఉంటే ఎవరమైనా ఏమి చేయగలం.మనం నిమిత్తమాత్రులం.ధైర్యంగా ఉండు"అంది ఓదార్పుగా పక్కన ఉన్న లత. రెండు రోజులు భారం గా గడిచాయి.మూడో రోజు డాక్టర్లు కార్తీక్ ని పరీక్షించి వెళ్ళారు.ఏమీ చెప్పలేదు.భాస్కర్ అడుగుదామని ప్రయత్నించినా వీలవలేదు.ఆ సాయంకాలం వేరే హాస్పటల్ నుంచి డాక్టర్లు వచ్చి పరీక్షించారు.వారందరూ ఐ సి యు నుండి బయటకు వస్తూ వాళ్ళళ్ళొ వాళ్ళు చర్చించుకుంటూ ఆఫీసు రూము లోకి వెళ్ళారు.కాసేపటికి నర్సు వచ్చి డాక్టరుగారు రమ్మంటున్నారని భాస్కర్ ని పిలుచుకు వెళ్ళింది.అదిరే గుండెలతో లోపల అడుగుపెట్టాడు. అక్కడ 4,5గురు డాక్టర్లు ఉన్నారు.భాస్కర్ ని చూడగానే "రండి కూఋచోండి.కార్తీక్ విషయమే మాట్లాడుతున్నాము.మేము చెయ్యాలిసింది అంతా చేశాము.కాని కార్తీక్ రెస్పాండ్ కావడం లేదు.అతని బ్రెయిన్ డే అయ్యింది.అని ఒక్క క్షణం ఆగి "ఇలా చెప్పాల్సి రావడం మాకూ బాధగానే ఉంది కాని తప్పదు.వాస్తవాన్ని అంగీకరించాలి.మీరు గుండె దిటవు చేసుకొని అంగీకరిస్తే కార్తీక్ మరణించినా మరికొందరిలో జీవించి ఉంటాడు.ఆలోచించి చెప్పండి"అన్నాౠ వాళ్ళలో పెద్ద డాక్టర్ ప్రభాకర్.మిణుకుమిణుకు మంటున ఆశ ఆరిపోగా జీవశ్చవం ల నడుస్తూ విజయకేమి చెప్పాలి అనుకుంటూ బయటకు వచ్చాడు భాస్కర్. అతన్ని చూడగానే విజయ "ఏమన్నారండీ?ఇంకా ఎన్ని రోజులు హాస్పటల్ లో ఉండాలంట?మన కన్నా నన్ను ఎప్పుడు అమ్మా అని పిలుస్తాడు"అని భాస్కర్ చేతులు పట్టుకుని ఆదుర్దాగా అడిగింది.కొంచెంసేపు మౌనంగా ఉన్న భాస్కర్ ఇక చెప్పక తప్పదన్నట్లు," నేను చెప్పేది నిదానంగా విను విజయా అంటూ"డాక్టర్లు చెప్పిన విషయం తప్పదన్నట్లుగా చెప్పాడు. వినీవినగానే హిష్టీరియా వచ్చినదానిలా ఏడుస్తూ "ఇదంతా అబద్దం.డాక్టర్లు ఆడుతున్న నాటకం.నా కొడుకు నాకు కావాలి.వాడిని ముక్కలుగా చేయడం నేను భరించలేను.వాళ్ళు అవయవాలు అమ్ముకోవడానికి వేసిన ఎత్తు" అంటూ అరవసాగింది. "అలా అపోహపడకు విజయా "అంది పక్కనే ఉన్న లత. "నీకేం తెలుసు.ఎన్ని చూడటంలేదు." "ఎక్కడో జరిగింది దీనితో పోల్చకు ."జీవన్ దాన్" ఒక ప్రత్యేక విధానం.బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలు మాత్రమే సేకరిస్తారు.అందుకు కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది." "నీకెలా తెలుసు" "మా కజిన్ డాక్టర్ తను చెప్పాడు.ముందుగా నలుగురు వైద్యుల బృందం పానల్ పరీక్షలు నిర్వహించి బ్రెయిన్ డెద్ ని నిర్ధారిస్తుందట.అందుకు 15 రకాల పరీక్షలు ఉంటాయట.వారు మొదట డిక్లరేషన్ ఇచ్చిన తరువాత మరో 6 గంటల వ్యవధి లో నలుగురు లేక ఐదుగురు వైద్యుల బృందం మరల పరీక్షలు నిర్వహిస్తుందట.వారు కూడా బ్రెయిన్ డెడ్ అని నిర్ధారిస్తే ఆవ్యక్తి నుండి ఏ అవయవాలు సేకరించవచ్చు ఎంతమందికి అమర్చవచ్చు అని పరిశీలిస్తారంట.ఇందులో ఏ విధమైన పొరపాటు జరిగినా శిక్షార్హులు అవుతారు.మనకి సరైన అవగాహన లేక పొరపాటు పడతాము."అని ఒక క్షణం ఊపిరి పీల్చుకుని "జీవనమృతుడైన వ్యక్తి గుండె,కాలేయం,కిడ్నీలు,కళ్ళు మొదలైన అవ్యవాలు సేకరిస్తే ఎనిమిది మందికి అమర్చ వచ్చునట.వారు మరణించినా పరోక్షం గా జీవించి ఉన్నట్లే!ఇప్పుడు కార్తీక్ విషయం ఆలోచించు.నువ్వు కొంచెం దఃఖం తగ్గించుకొని వివేకం తో ఆలోచించు.కార్తీక్ ఎలాగూ దక్కనప్పుడు అతనితోపాటు అన్ని అవయవాలు నశించ్డం కంటే అవి కావలిసిన వారికి అమరిస్తే వారు జీవితాంతం మీకు ఋణపడిఉంటారు."అంది. కొంచెంసేపు ఆలోచనలో పడిన విజయ నిదానంగా తలెత్తి"నిజమే నీవు చెప్పింది.వాడు ఎలాగూ నాకు దక్కడు. నన్ను చివరిసారిగా చూసిన వాడి చూపుల్ని మరిచిపోలేక పోతున్నాను.అవి రూపం కోల్పోకూడదు.ఎవరికన్నా అమరిస్తే వాళ్ళలో నన్నా చూసుకుంటాను"అంది బాధను దిగమింగుతూ. భాస్కర్ తమ అంగీకరాన్ని తెలపడం తో అవసరమైన పత్రాల మీద సంతకాలు తీసుకొని,ఎవరికి ఏ అవయవం అమర్చాలో నిర్ణయించి కార్తీక్ నుండి వాటిని సేకరించి బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు. ***** 6 నెలలు గడిచాయి.ఆ రోజు ఆదివారం కావడం.ఉదయమే భాస్కర్ విజయ కాఫీ తాగుతున్నారు.వారింకా కొడుకు పోయిన బాధ నుండి పూర్తిగా కోలుకోలేదు.గేటు తిసుకొని ఒక నడివయుసు దంపతుల ఒక 20 సంవత్సరాల అబ్బాయి వస్తున్నారు.భాస్కర్ గుమ్మం దగ్గరకు వెళ్ళి "ఎవరు కావాలండీ"అని అడిగాడు. "భాస్కర్ గారు....." "నేనే .మీరెవరు." "లోపలకు రావచ్చాండీ" "రండి" అంటూ భాస్కర్ హాల్లోకి నడిచాడు. హాల్లోకి అడుగుపెడుతూనే అక్కడున్న కార్తీక్ ఫొటో చూసి ముగ్గురూ దండం పెట్టారు.వారు సోఫాలో కూర్చొని "నమస్కారమండీ.నా పేరు మాధవ రావు .ఈమె నా భార్య రమ్య. ఇతడు మా అబ్బాయి శ్రీఈకాంత్.వీడికి 11 సంవత్సరాల వయుసులో ప్రమాద్వశాత్తు కంటి చూపు పోయింది.మీ ఇంట్లో చీకట్లు అలుముకున్నా ఔదార్యం తో మీరు తీసుకున్న నిర్ణయం మా ఇంట్లో వెలుగుల్ని పూయించింది.మీ పుత్ర శోకం ఎవరూ తీర్చలేనిది అందుకు బధపడుతున్నాను.మాకింత మేలు చేసిన మిమ్మల్ని ఒకసారి కలుసుకుని కృతఙ్ఞ్త తెలుపుకుందామని వచ్చాము"అన్నాడు పెద్దయన. అప్పుడు విజయ శ్రీకాంత్ వైపు చూసింది.ఆ కళ్ళు చూస్తుంటే నిజంగా కార్తీక్ ని చూస్తున్నట్లే అనిపించింది.ఇతనిలో కార్తీక్ జీవించే ఉన్నాడు..ఇప్పటి వరకు ఆమెలో ఉన్న తప్పు చేశానేమోనన్న ఆత్మన్యూనతా భావం తొలిగిపోయి తృప్తిగా నిట్టూర్చింది.
****

No comments:

Post a Comment

Pages