శ్రుతి తప్పిన సంస్కృతి - అచ్చంగా తెలుగు

శ్రుతి తప్పిన సంస్కృతి

Share This
 శ్రుతి తప్పిన సంస్కృతి

అవసరాల సీతారామలక్ష్మి


అమ్మ మమ్మీ అయ్యింది .
మన సంస్కృతి మాయమయింది .
మన నేల మనకు మురికైనది,
గరుకు గచ్చు ఘనమైనది.
వాలు జడ , ఎక్కడా లేదు జాడ ,
నుదిట బొట్టు,ఆవగింజే ఒట్టు
చీర కట్టు , డజను పిన్నులు ఒడిసి పట్టు.
పసుపు - పారాణి , దర్శనాలే కరువైన మారాణి.
బొబ్బట్టా !! అమ్మొ వద్దు, బర్గర్లే మాకు ముద్దు,
బంతి భోజనం బోర్ కొట్టింది, బఫె పై మోజు పుట్టినది,
పొరిగింటి పుల్లకూర మనసైనది,
నట్టింటి పొలిహొర నచ్చకున్నది .
అమ్మ దినం, నాన్న దినం,
బ్రతికుండగానే తద్దినం,
ప్రేమకో దినం, పగకో దినం,
దినాలకోసం బ్రతుకుతున్నాం ప్రతిదినం.
గురువులేనిది ఈ-విద్య ,
గుర్తుండదు అంతా మిద్య.
శ్రుతి తప్పింది సంస్కృతి,
లయ లేకుంది మన క్రుతి.
ఎక్కడ మార్పుకు నాంది ?
వేసామా మనం పునాది ?
ఎవరో వస్తారని , ఏదో చేస్తారని,
కూర్చున్నామా మనం నీరుగారి?
 *******************************************

No comments:

Post a Comment

Pages