పరిపూర్ణత్వం - అచ్చంగా తెలుగు
పరిపూర్ణత్వం
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


చీకట్లో విశ్రమిస్తేనే
వెలుగులో పనిచేసుకోగలం
అభివృద్ధికి బాటలు వేసుకోగలం.

బాధల్లో రాటుదేలితేనే
సుఖాలను సొంతం చేసుకోగలం
మనసు పేటికలో భద్రపరచుకోగలం.

ఏ పురాణాల్లో చదివినా
ఏ మహానుభావుడు చెప్పినా
ఇదే కదా అసలు విషయం!

జీవితమంటేనే నవరసాల పోషణం
షడ్రుచుల సమ్మేళనం
అవి అందరూ పోషించాల్సిందే
కాకపోతే నిష్పత్తులు మారతాయి.

కాలం కాస్త కలిసొస్తే
దానికి పూర్వజన్మ సుకృతమని..అదృష్టమని
పేర్లు పెట్టకూడదు
గెలుపు ఓటములే కాదు
ఏవీ మన చేతిలో లేని 
గీత- రాత అనుకున్నప్పుడు
యథాతథ జీవితాన్ని 
పరిపూర్ణంగా అనుభూతించగలం.
*****

No comments:

Post a Comment

Pages