'అభినయ భారతి' కోసూరి ఉమాభారతి గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

'అభినయ భారతి' కోసూరి ఉమాభారతి గారితో ముఖాముఖి

Share This

'అభినయ భారతి' కోసూరి ఉమాభారతి గారితో ముఖాముఖి

భావరాజు పద్మిని నాలుగు దశాబ్దాలుగా నాట్యోపాసనలో తరించిన కూచిపూడి నృత్య కళాకారిణి కోసూరి ఉమాభారతి గారు. ఆంధ్రప్రదేశ్ నుండి సాంస్కృతిక రాయబారిగా ఉమాభారతి దేశావిదేశాలు పర్యటించారు. నాట్యకళ ద్వారా స్వచ్చంద సమాజసేవకి గాను వీరు అంతర్జాతీయంగా గుర్తింపు, అవార్డులు పొందారు. చలన చిత్రాల్లో నటించి, నృత్య సంబంధిత చిత్రాలని నిర్మించి, దర్శకత్వం వహించారు. నృత్య గురువుగా, నర్తకికా, చలనచిత్ర నటిగా, సంఘసేవికగా, పలు టెలీ ఫిలిమ్స్, డాక్యుమెంటరీల నిర్మాతగా, దర్శకురాలిగా, ఇలా పలు రంగాల్లో రాణిస్తున్న వీరితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...
9-image-55మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
బాల్యం అనగానే, నాట్యంపట్ల నాకున్న ఆసక్తి గుర్తొస్తుంది. వెంపటి చినసత్యం గారి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం, గొప్ప డాన్సర్ అవ్వాలన్న నా కలలు గుర్తొస్తాయి.ఇంట్లో నలుగురు పిల్లల్లో పెద్దదాన్నవడంతో అదనపుబాధ్యతలతో పాటు చదువు,క్రమశిక్షణ పాటించవలసి రావడం గుర్తొస్తుంది.
మద్రాసులోఉండగా, కొద్దిరోజులు కేవలం డాన్స్  చూడ్డానికే చినసత్యం గారి డాన్స్ క్లాసుకి వెళ్ళడం గుర్తొస్తుంది. నా ఆసక్తి గమనించిన మాస్టారు గారు చొరవ తీసుకుని నన్ను డాన్స్ క్లాసుకి పంపమని అమ్మావాళ్ళకి సూచిండడంతో మొదలైన నా నృత్యశిక్షణ గుర్తుకొస్తుంది.
Winner of All India Competitions with the trophy and Parents Mrs. Sarda & Maj. A. satyanarayanaనాన్నగారు సత్యనారాయణ గారు.ఆర్మీలో మేజర్ గా మద్రాసులో డ్యూటిలో ఉన్నప్పుడు నాకు ఐదేళ్ళు. నాకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నాన్నగారికి సంస్కృతి, కళల పట్ల ప్రత్యేక అభిమానం. బాగా పాడేవారు. మద్రాసు ప్రెసిడెన్సీకాలేజీలో చదువుకునే రోజుల్లో, శోభనాచల స్టూడియో సినిమాలకి సహదర్శకత్వంవహించి, ‘సావాసం’ చిత్రంలో నటించారు. నృత్యం పట్ల నా ఆసక్తిని ప్రోత్సహించింది మొట్టమొదటిగా మా నాన్నగారే. 

మా అమ్మ శారదకి కూడా కళల పట్ల ఆసక్తి. అన్నిటా అమ్మది మంచి అభిరుచి. చిన్నప్పటి నుండి నా ఆహార, ఆహార్య విషయాల్లో శ్రద్ధ వహించింది. విదేశీ పర్యటనల కోసం మేకప్, హెయిర్-స్టైల్ చేయడం నేర్చుకుంది.మా అమ్మగారేనా కాస్ట్యూమ్స్ చాలా ప్రత్యేకంగా ఉండేలా డిజైన్ చేసేవారు..నర్తకిగా నా అభివృద్దికి అహర్నిశలూ పాటుపడేది.. మా అమ్మమ్మ కోటేశ్వరమ్మ.. ఆవిడ తరంగాలు, భక్తి గీతాలు పాడేవారు.. బాల్యం నుండీ నా నృత్య శిక్షణలో ఆవిడ ప్రోత్సాహం కూడాఉంది.
కళారంగంలో నా ఎదుగుదలకి నా తల్లితండ్రుల సహకారమే ముఖ్య కారణం. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి నన్ను కళాకారిణిగా తీర్చిదిద్దారు వారు.
మీ ఇంట్లో నాట్యం నేర్చుకున్నవారు ఎవరైనాఉన్నారా?
మా పెద్దమ్మ కూతురు శ్యామ కౌండిన్య కూడా ఒకప్పుడు పేరున్న నృత్య కళాకారిణి,. నటరాజు రామకృష్ణగారి శిష్యురాలు. ఆమెతో కలిసి అమ్మ కూడా నాట్యం చేసేది. పొడగరి అవడంతో కృష్ణుడి వేషం వేసేదట.
మీ విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది? ఆ తర్వాత మీరు స్వీకరించిన వృత్తి ఏమిటి?
నేను ఎం.ఎ చేసాను. చదువు విషయంలో అశ్రద్ధ గాని, అతిశ్రద్ధ గాని ఉండేవి కావు.. సికందరాబాదు సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్  కాలేజీలో జునియర్ కాలేజీ, డిగ్రీ కూడా చదివాను. వైద్య వృత్తి చేపట్టాలనే ఉద్దేశంతో మొదట్లోసైన్స్ కోర్సులు తీసుకున్నాను. ఊహించని విధంగా అప్పటినా జీవితంలో ... నృత్య ప్రదర్శనలు, సినిమాలు, విదేశీ పర్యటనలతో సమయం చాలక, ఆర్ట్స్ కి మార్చుకుని చదువు సాగించవలసి వచ్చింది. కాకపోతే, మా ప్రిన్సిపాల్ - సిస్టర్ ఆనా లకు నాపై ప్రత్యేక ఇష్టం, నా కళ పట్ల అభిమానంతో నాకు కోచింగ్ ఇచ్చి పరీక్షలు రాయించేది. నాకు కాలేజీకి ఫాన్-మెయిల్ వచ్చేది. నాన్నగారిని పిలిచి నవ్వుతూ ఆ లెటర్స్ ని ఆయనకి అందించేది ఆవిడ..
bడిగ్రీ చదువు,సినిమాలు, విదేశీపర్యటనలు అయిన వెంటనే వివాహం చేసుకుని అమెరికా వచ్చాను.
వృత్తి అంటే - కళారంగమే నాకు తెలిసిన వృత్తి. నాట్యమే నా నైపుణ్యం. అందులోనే కొనసాగాను.. అమెరికాలో భారతీయ కళారంగం చాలా వ్యత్యాసంగా అనిపించినా, పట్టుదలగా ముందుకు సాగి, 'అర్చనా ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ' స్థాపించాను.. నిరంతర కృషి చేసాను..
 సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
As Satyabhamaస్వాతంత్ర్య దినోత్సవ ప్రోగ్రాములో నాడాన్స్ చూసిన టి.మాధవరవుగారు స్టేజ్ వద్దకు వచ్చి అభినందించారు. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. తాను అసిస్టెంట్డైరెక్టర్ గా పనిచేస్తున్న చక్రవర్తి ప్రొడక్షన్స్ వారి ‘సుడిగుండాలు’ ‘ సినిమాలో పిల్లల డాన్సుడ్రామా లో‘భారతమాత’ గా వేయమని అడిగారు మాధవరావు గారు. ఉత్సాహంగా వరంగల్లు నుండి వెళ్లి షూటింగులోపాల్గొన్నాను. నేను పాల్గొన్న సన్నివేశంకి ఆయనే దర్శకత్వం వహించారు.అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్ర పోషించగా, ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో సాంఘిక సమస్యలపై తీసిన గొప్ప చిత్రం ఇది.  
1968 సం.లోవిడుదలైన ఆ సినిమాకు‘నంది అవార్డ్,ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది.
 నా అసలు పేరు ఉమా మహేశ్వరి. షూటింగ్ ‘సుడిగుండాలు’ సమయంలో, ఫస్ట్ ఫిలిం ‘భారతమాత’ గా చేస్తున్నాను కాబట్టి పేరు ‘ఉమాభారతి’ గా మార్చాలని డైరెక్టర్ మాధవరావు గారు అనడం, నాన్న ఒప్పుకోడం, నా ఎదురుగానే జరిగాయి. అప్పటినుండి ఆ పేరు కళాకారిణిగా నాకు అచ్చొచ్చిందనే అనాలి.
 ఆ తరువాత కొన్నాళ్ళు కూచిపూడి నృత్యరంగంలో నాకృషి కొనసాగించి, విదేశీ పర్యటనలు చేసి, గుర్తింపు, ఆదరణ, సత్కారాలు, సన్మానాలు పొందాను.
సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజీలో చదువుతుండగా ‘కాకతీయ ప్రొడక్షన్స్’ నిర్మాతలు, రచయిత దాశరధి రంగాచార్య గారితో మాఇంటికి వచ్చారు మాధవరావు గారు. వారు నిర్మించబోయే ‘చిల్లరదేవుళ్ళు’ సినిమా లోని మంజరి పాత్ర చేయమని అడిగారు...
 కథ, మిగతా వివరాలు కనుక్కుని నాన్న చేద్దామని ఒప్పుకున్నారు.
blue dance సావిత్రి తల్లిగా, ప్రభాకర్ రెడ్డి తండ్రిగా, కాంచన మరో ముఖ్య పాత్రలో- నేను నటించిన ఆ సినిమా షూటింగ్ అనుభవాలు:
 సాహిత్య అకాడెమి అవార్డు పొందిన నవల శ్రీ దాశరధి రంగాచార్య గారి 'చిల్లర దేవుళ్ళు’.’ 1976 లో కాకతీయ పిక్చర్స్ వారు సినిమాగా రూపొందించారు....
 అందులోకథానాయకి ‘మంజరి’– దొరబిడ్డ పాత్ర పోషించాను. దొర, దొరసాని పాత్రలు సావిత్రి  గారు, ప్రభాకర్ రెడ్డి గారు పోషించారు. అయితే, సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర -కాంచనగారిది..అసలు కథ ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది....
on-location షూటింగ్ అవడంతో, నాన్న నెల రోజులు ఆఫీసుకి సెలవు పెట్టారు. అమ్మా, నాన్న నేను బయలుదేరాము. వరంగల్ ప్రాంతంలో ఓజామిందారుల‘గడీ’ లోనే ఇంచుమించు సినిమా మొత్తం చిత్రీకరించారు..
వేయి స్తంభాల గుడి ప్రాంతంలో బతుకమ్మ పాట, మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.మరికొన్ని సీన్స్ కి సావిత్రి, ప్రభాకర్ రెడ్డి గార్లతో హైదరాబాడు సారధీ స్టూడియోలో షూటింగులోపాల్గొన్నాను...
As Gopika natya ఎన్.టి.ఆర్ వంటి సీనియర్ నటులతో నటించారు కదా. ఆ అనుభూతులను మాతో పంచుకుంటారా?  
మా దక్షిణాఫ్రికా, మారిషస్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే,ఎన్.టి.ఆర్ గారితో‘యమగోల’ డాన్స్సన్నివేశంలో పాల్గొనమని నిర్మాత వెంకటరత్నం గారు అడగడంతో నాన్న ఒప్పుకున్నారు.
అమ్మానాన్నలతో ‘యమగోల’ లోనిపాట చిత్రీకరణకు మద్రాసు వెళ్లాను.. మొత్తంగా రిహార్సల్స్, షూటింగ్ కలిపి... వారం రోజులు పట్టింది,. సరదాగానే గడిచింది షూటింగ్..
ఎన్.టి.ఆర్ గారితో చేసిన డాన్స్ బిట్స్ ఎంజాయ్ చేసాను. సెట్ లో ఉండగా జరుగుతున్న క్రమంలోని అన్ని విషయాలు గురించి ఎన్.టి.ఆర్ గారు సూచనలు చేయడం గమనించాను.
నాతో, మా నాన్నతో ఫ్రెండ్లీగా మాట్లాడారు. మా నాన్న, ఆయన బి.యే లో క్లాస్మేట్స్ అట.
మంజుభార్గవి మేనకగా, లక్ష్మి రంభగా పాల్గొన్న ఆ సన్నివేశం నృత్యపరంగా చాలా చక్కగా అందంగా అనిపించింది. వారితో గడపిన సమయం కూడా.
Received L.V.R Foundation award of execellence in her chosen field of Classical Dance from Pondichery's Lt.Gov. T.P.Tewary at chennaih in '89 ఎన్టీఆర్ గారే అందించిన అవకాశం:
యమగోల షూటింగ్ అయి తిరిగి ఇల్లు చేరాక, మరెన్నో ప్రోగ్రాములు, డాన్స్ డాక్యుమెంటరీ నిర్మాణ సన్నాహంలో మునిగిపోయాము.
అదే సమయం లో ఎన్టీఆర్.గారు స్వయంగా నాన్నకి ఫోన్ చేసారు. ఆయన నిర్మించబోయే ‘’కర్ణ" సినిమాలో నటించే అవకాశం కల్పిస్తాన్నారు. నామటుకు నాకు సరదాగా అనిపించింది. ఎప్పటిలా మానాన్నగారే ఆలోచిస్తారని ఉండిపోయాను. చేద్దామా వద్దా అని కూడా అనుకోలేదు..ఆ అవకాశం నాన్న మాత్రం మరి ఎందుకు వద్దనుకున్నారో? “ఉమకి పెళ్ళి సెటిల్ అయ్యేలా ఉంది.... అన్నీ కుదిరితే, వచ్చేవారం నిశ్చితార్ధం జరిగే అవకాశం ఉంది.. మీ ఆఫర్ కి కృతజ్ఞతలు,” అని ఆయనకి సర్ది చెప్పి వద్దనేసారు.
mom dad and i అమెరికా వెళ్ళడం ఎలా సంభవించింది. అక్కడ మీకు ఎటువంటి పరిచయాలు కలుగాయి?
మా విదేశీ పర్యటనల తరువాత, యమగోలషూటింగ్, సినిమా విడుదల కూడా అయిన వెంటనే నా వివాహం డాక్టర్. మురళీ మోహన్ కోసూరి గారితో జరిగింది. మళ్ళీ రెండు నెలలకి 1980లో అమెరికా వచ్చేసాను. అమెరికా జీవితం చాలా వేరుగా అనిపించింది. సహనంతో అన్నీ నేర్చుకుని అలవాటు పడ్డాను. హ్యూస్టన్ నగరంలో కొందరు తెలుగువారిని, భారతీయులని కలిసాను. తెలుగు కుటుంబాలలో కొందరు నాతో అభిమానంగా ఆత్మీయంగా మెలిగారు. సాంస్కృతిక కార్యక్రమాల గురించి వాకబు చేసాను.ఇక్కడి మన భారతీయ కళారంగం తీరుతెన్నులు అగమ్యగోచరంగా అనిపించింది. నా నాట్యం కొనసాగించాలంటే, మా నాన్న గారు ఓ మారు అమెరికాకి రావాల్సిందే అనిపించింది.
మళ్ళీ ఏడాదికి నాన్న అమ్మా అమెరికా వచ్చారు. నాన్నగారే చొరవ తీసుకుని, ముందుగా ‘మీనాక్షి టెంపుల్’ కార్యవర్గాన్ని, ICC కార్యవర్గాన్ని కలిసి...ప్రోగ్రాములు ఏర్పాటు చేసారు.
pinkఅలా అమెరికాలో నా కళాజీవితానికి నాంది పలికారు నాన్న. తరువాత అయన సలహా మేరకు 'అర్చనా డాన్స్ అకాడెమీ' స్థాపించి, ఆలయనాదాలు సినిమా నిర్మించి ఇప్పటి వరకు కూడా నృత్యాన్నే నా జీవితంలో ముఖ్యమైన భాగంగా భావించి, కొనసాగుతున్నాను.
కళాకారులకి భారత దేశమే అనువైనది.ఇక్కడ 'పదింతల శ్రమ, ఒకింత మాత్రమే తృప్తి' అన్నది నా అభిప్రాయం. అదే నిజం కూడా....
మీరు రచనలు ఎప్పటినుంచి చేస్తున్నారు? మీ రచనలు/ప్రసంగాల ద్వారా ఎవరికైనా ప్రేరణ కలిగించారా?
కథలు, కవితలు రాయడం 2012 లో మొదలు పెట్టాను. అంతకు ముందు నృత్యానికి సంబంధించి వ్యాసాలూ, నాటికలురాసాను. ‘భరతముని భూలోక పర్యటనకి’ – TANA OUTSTANDING PERFORMANCE అవార్డు వచ్చింది..
పెళ్లి ముచ్చట, అమెరికాలో అనసూయ, గురు-వే-నమః, సంభవామి యుగే యుగే ..ఇలా మరెన్నో నృత్యనాటికలకి మంచి స్పందన వచ్చింది..
PROFILE FB1ముఖ్యంగా‘కన్య’ ‘మానస పుత్రి” ‘దేవిస్తోత్ర మాలిక’ అత్యంత ప్రజాదారణ పొందాయి.
గతమూడు సంవత్సరాల్లో - సాంఘిక నవలలు – ఎగిరే పావురమా, రాజీ పడిన బంధం కాక ఇటీవల విడుదలైన ‘వేదిక’ నవల, కథాసంపుటి – విదేశీ కోడలు పుస్తకాలుగా ‘వంగూరి ఫౌండేషన్’ వారి ప్రచురణలుగా విడుదలయ్యాయి.
నా మొట్టమొదటి కథ –‘ముళ్ళగులాబికి’ వంగూరి వారి ఉగాది ఉత్తమ కథ అవార్డు రావడం నాకు ఉత్సాహానిచ్చింది. మరో రెండు కథలు కూడా ఉగాది పురస్కారాన్ని అందుకున్నాయి.
నేనూహించనంతగా నా రచనలకి మంచి స్పందన రావడాన్ని నా అదృష్టంగా భావిస్తాను.
 మీ దృష్టిలో జీవితం అంటే ఏమిటి? జీవన విధానం ఎలా ఉండాలి?
క్రమశిక్షణ, నిరాడంబరత, ఆత్మగౌరవం మంచిజీవితానికి సూత్రాలని నా అభిప్రాయం.నాకు తెలిసిన అటువంటిజీవిత విధానమే మంచిదని భావిస్తాను.జీవితాన్ని ఒక పరిధిలో ఏర్పరుచుకోవాలని, ఆ పరిధిలోనే ఉండాలని భావిస్తాను. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని, వాటికి కట్టుబడి ఉండాలని భావిస్తాను. పిల్లల భవిష్యత్తు, కుటుంబ శ్రేయస్సు అన్నింటికన్నా ముఖ్యం అని, అందుకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలని నేను భావిస్తాను.
rajuవీటన్నిటికోసం పాటుపడుతూ, వ్యక్తిగత ఎదుగుదల, సార్ధకతకి సమయం,అవకాశం, ఏర్పరుచుకోవాలని గట్టిగా నమ్ముతాను.
అయితే జీవితం అంటే సులభ ప్రయాణం కాదని, ఒడుదొడుకుల బాట అని తెలిసినదే.
పడిలేస్తూ, ఆస్వాదిస్తూ, ఆహ్లాదిస్తూ ముందుకు సాగడం ముఖ్యం... తప్పదు...
మనలని‘దైవం’ అని మనం నమ్మే శక్తి నడిపిస్తుందని నమ్మడంలోనే శాంతి, సుఖం ఉన్నాయని అనిపిస్తుంది.
Bouncing Back ... from 'Art of Living'
----Accept..Endeavor...Suffice...Survive----
“'Living' itself means there will be a 'Tomorrow' and there is HOPE... A hope that we have a chance to bounce back from any difficulty.
“The world isn’t perfect, and some days it wears you down. You might feel cheated by the Almighty too...
You can either accept that, and face it, and be a help to yourself instead of a hindrance. - UB
 మీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన గురించి చెప్పండి.
u1మా అబ్బాయి సత్యజిత్ పుట్టినప్పుడు, అమ్మాయి శిల్ప పుట్టినప్పటి అనుభూతి మర్చిపోలేనిది...
8 వ తరగతిలో ఉండగా నన్ను కాలేజీ స్థాయి నృత్య పోటీలకి పంపారు మా ప్రిన్సిపాల్. వరంగల్లులో జరిగిన ఆ పోటీలో మొదటి స్థానం నాదే అవ్వడం మరువలేనిది. నృత్యరంగంలో ఆ నా మొట్టమొదటి అవార్డు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి చేతుల మీదుగా అందుకున్నాను. అఖిల భారత కూచిపూడి నృత్యపోటీలో కూడా 14 సంవత్సరాలప్పుడు సీనియర్ విభాగంలో మొదటి స్థానం గెలుచుకోడం కూడా మరువలేనిది ! అలాగే...
వృత్తిపరంగాచేస్తున్న కృషికి గుర్తింపు, ఆదరణ పొందడం తృప్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది..
 మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
నేను పొందిన అవార్డుల జాబితా ఇది...
Awardsin recognition of talents, dedication & propagation of Arts and Culture, include:
* Winner of All India Dance competitions ’70
*Swarna kanakanam (gold bracelet) and the title of 'Natyabharathi'
u2 conferred by Padmasri. M. Balamurali Krishna in'73
* Grand Felicitations and Honors by 30 Cultural organizations of Vizag & Rajahmundry at launch of A.P Cyclone relief Fund-raisers with titles ‘NatyaKovida’, ‘Tharanga visharada’,‘Abhinaya bharathi’ in ’74
*Prestigious L.V.R Foundation award by Pondicherry Governor T.P.Tewary of TamilNadu ’87
* ‘Mahatma Jyothi Baphule’ memorial award in ‘88
* Award of recognition from Rajyalaxmi Trust of Tamilnadu ‘89
* A.P Film Council's ‘Jawarharlal Nehru Memorial’ & ‘Utthama
Pravasandhra Nartaki’ award’ '91
*TANA (Telugu Assn of North America) award of recognition in '91
* ‘Sri VedantamJagannadhaSarma Memorial’&Vamsee International
(pravasandhra nartaki) award of recognition in'93 * ‘World Telugu Federation’ in ’96 and ‘America Bharathi’ in ‘94
u3 named her ‘A True Cultural Ambassador ‘
*‘Asian Women’ magazine Texas chapter 'Woman of the year' award ‘95
* Award of Recognition from Rasamayi, YuvaKalavahini and cultural
organizations of twin cities in '97
*TANA’s Outstanding performance award ’97 at Los Angeles
*Prestigious Vamsee-Berkley award & 'Somaparijatha' gold medal ‘00
*TANA’s Award of recognition at the regional Conf at Dallas ‘00(Teluginti velugu)
u4*TANA’s Outstanding Performance (for– Silpa’s performance) TANA Cincinnati
* TANA’s Outstanding Performance at Philadelphia 2003 (Rhythms and Melodies)
* TANA’s ‘TELUGU Luminariesin USA’from Akkineni Nageswar Rao in Dallas 2012
* ’Pravasi Bharatheeya Ratna Award’ from Delhi Telugu Academy ..in Dallas Texas 2015
 సినిమాల్లోనే కొనసాగి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?
ఎప్పుడన్నా తప్పక అనిపిస్తుంది.. కాకపోతే, సినిమాకి దర్శకురాలిగానో, లేదా కథా-స్క్రీన్ ప్లే, choreographer గా రాణించగలిగేదాన్నేమో అని ఓ తలంపుఅలా అప్పుడుపుడు కలుగుతుండేది.
u5 ప్రస్తుతం అమెరికాలో మీరు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి చెప్పండి. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
నృత్య ప్రదర్శనల ద్వారా దాదాపు 30కి పైగానే దేవుని ఆలయ నిర్మాణాలకి, స్వచ్చందంగా నిధులు సేకరించే అవకాశం నా అదృష్టంగా భావిస్తాను... అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ముప్పై సంవత్సరాలు అయింది. ‘ఆలయనాదాలు’ అనే టెలీఫిలిం నిర్మించి దర్శకత్వం వహించాను. 14 దేశాల్లో సీరియల్ గా జెమిని వారు టెలికాస్ట్ చేసారు. అమెరికా, శ్రీశైలం హైదారబాడులో చిత్రీకరించిన మొదటి టెలీఫిలిం అదే. ప్రత్యేకంగా ATA,TANA సభలకి ఏటేటా నృత్య నాటికలు రచించి ప్రదర్శించాము. వేలాది ప్రేక్షకుల నుండి మాకందిన ప్రశంసలు, ఆ స్పందన, అవార్డులు వర్ణించలేనివి. ఓ కళాకారిణిగా – ‘జన్మకి సార్ధకత’ లభించినట్టుగా అనిపిస్తుంది.
మంచి శిష్యురాళ్ళని తయారు చేయగలిగాను. ఎన్నో రంగప్రవేశాలు నిర్వహించాను.
‘భరతః ముని భూలోక పర్యటన’ అనే నృత్య ప్రదర్శనకి గుమ్మడి గారి నుండి ANR గారి నుండి, మురళీ మోహన్ గారి నుండి లభించిన ప్రశంస నాకెంతో విలువైనది. ఇలా ఎందఱో కళాకారులు, పెద్దలుప్రత్యేకంగావచ్చిప్రదర్శన తరువాత నన్ను కలిసి, తమ ప్రశంసలు, స్పందన అందించేవారు.
అలాగే చినసత్యం గారు కూడా డల్లాస్ TANA సభలో, మా అమ్మాయి శిల్ప చేసిన ‘మహిషాసుర మర్దిని’ చూసి, తప్పక నన్ను కలవాలని అడిగి పిలిపించి మమ్మల్ని ఆశీర్వదించడం మరువలేని విషయం.
ఈ మధ్యనే నాలుగేళ్లగా రచయిత్రిగా కూడా కృషి చేస్తున్నాను. నా చిన్నప్పటి నుండి రచనలు చేయాలని, నా రచనలు పత్రికల్లో ప్రచురించబడాలని చాలా కోరికగా ఉండేది. నాట్యం వల్ల ఆ కోరిక ఇన్నాళ్ళూ తీరలేదు.
u6అందుకే కొన్నాళ్ళగా నా సమయం, దృష్టి రచనల దిశగా సారించాను. నా ప్రయత్నం నేను కొనసాగిస్తున్నాను. పత్రికల నుండి పాఠకుల నుండి కూడా మంచి స్పందన, ఆదరణలభిస్తున్నాయి. అది నా అదృష్టమే...
నృత్యానికి నా అనుభావాలకి సంబంధించి రచనలు, వీలుంటే పుస్తకం రాస్తాను. వీలుంటే, ఒక టెలీ ఫిలిం కూడా తీద్దామని చేయాలని ఆలోచన.
కొత్తగా ఆనిమల్ షెల్టర్ ఆలోచన కూడా ఉంది.. మా ఇంట్లోనాలుగు కుక్కపిల్లలు ఉన్నాయి. ప్రేమగా పెంచుతున్నాము.. అవన్నీ రెస్క్యు  చేయబడ్డవే. నోరు లేని జీవాల పట్ల అందరికీమరింత అవగహన రావాలనికోరుకుంటాను. జంతుహింస నశించాలని ఆశిస్తాను.
u8మీ నాట్య ప్రస్థానానికి మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
కళారంగంలో నాప్రవేశం, ఉనికి, నా పయనం మా అమ్మానాన్నగార్ల వల్లే సాధ్యమయింది. వారికి శతకోటినమస్సులు... ఇప్పటికీ వారి జ్ఞాపకాలు కూడా నాకు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్నిఇస్తాయి.. నాపై వారుంచిన నమ్మకాన్ని నిలుపుకోడానికే ఈరంగాన కొనసాగుతున్నాను. నాకు గుర్తింపుని, గొప్ప అనుభూతిని అందించిన ఈ కళారంగానికి, కళామతల్లికి నేను రుణపడే ఉంటాను.
చొరవచేసి నాకు నాట్యం నేర్పించమని మా అమ్మానాన్నల్ని ఒప్పించిన వెంపటి చినసత్యం గారికి నమస్సులు... ఐదేళ్ళశిక్షణ తరువాత మద్రాసునుండి ఆంధ్రాకి వెళ్ళిపోతున్నప్పుడు, నేనొక గొప్పకళాకారిణి అవ్వాలని నన్ను ఆశీర్వదించిన గురువుగారి అభిమానం మరువలేను.
నా భర్త  కోసూరి మురళీ మోహన్గారి ఎనలేని ప్రోత్సాహం వెలకట్టలేనిది.
నా కుమార్తె శిల్పకి నాట్యంపట్ల ఆసక్తి, లయ - అభినయం పై ఉన్నపట్టు... ఆశ్చర్యపరుస్తుంది. మరో కొత్తకోణం ఆ కళ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించగలిగాను.. శిల్పతో చేసిన ప్రదర్శనలు, telefilm ఎంతో కీర్తిప్రతిష్టలని, ఉత్తేజాన్ని తెచ్చాయి. నృత్యపరమైన నారచనలకి, న్ర్యత్యానికి ఓ కొత్త ఒరవడి..శిల్పవల్లే సాధ్యం అయ్యాయి. TANA, ATA వారి OUTSTANDING PERFORMANCE’ అవార్డులు అందుకోవడం శిల్పవల్లే సాధ్యం అయ్యాయి... శిల్ప వైద్యవృత్తిలో కొనసాగాలని ఆశిస్తాను.
 ఎందఱో అభిమానులు, శ్రేయోభిలాషుల ఆదరణ అభిమానాలకి కోటినమస్సులు...
 *****

No comments:

Post a Comment

Pages