Monday, January 23, 2017

thumbnail

రాజ రాజేశ్వరీమాత శరణు శరణు

రాజ రాజేశ్వరీమాత శరణు శరణు

రావి కిరణ్ కుమార్ క్రీగంట కామేశ్వరుని కాంచిన  కామేశ్వరి మనః స్పందనగా 
విఘ్నములు బాప విఘ్నేశ్వరుడివై  మనస్సులు రంజింప 
సుముఖుడవై  చెంత నిలచిన గణపతి మాపై  కరుణ తోడ 
సిద్ది బుద్దులొసగవె   వందనమిదియే  మీకు సిద్ది వినాయకా. 
మనోవాణి మనోజ్ఞముగా పరుగులెత్తించ నీ పాదద్వయము నా 
హృది ని నిలిపితి వాణీ పరవళ్లు తొక్కు క్రిష్ణ వేణి తరంగాల వోలే
భావాల మాలికలు నా మదిలోన పలికించవే మృదు మధుర 
మంజుల  శార్వాణి మీకిదే మా వందనం తల్లి భారతీ
ఇతరుల తప్పు లెన్నఁబోయిన వేళ వారి చేష్టితముల ప్రేరణ గా 
నిన్ను గాంచి విష్ణుమాయా విలాసిని నీ పాదముల నాశ్రయించితి 
సహన భూషణము నాకాభరణము  చేసి శాంతత నొసగవే మదికి 
కిరణేశ్వరి ప్రియతనూజా  రాజ రాజేశ్వరీమాత శరణు శరణు 
ప్రతినింద  చేయ వాడి పదములు వాడ మనసు మూలిగే ఉదయ
సంధ్యలో తల్లీ నిన్ను స్తుతించ పేర్చిన అక్షరములనే కూర్పు మార్చి
పలుకుటెంచి శుద్ధ వాక్కు నొసగవే లంబీజమోంకారిణి ఎల్ల  వేళలా 
కిరణేశ్వరి ప్రియతనూజా  రాజ రాజేశ్వరీమాత శరణు శరణు 
పరుల తృప్తే మన ప్రశాంతత కు కారణంబగు ఇతరుల సంతసంబే 
మన మానసంబునకు శాంతి నొసగునన్న సత్యంబు నెరిగితి తల్లీ 
అత్రి హృదయమే నా హృదయము చేసి లోక క్షేమంబు కోరనెంచవే  
కిరణేశ్వరి ప్రియతనూజా  రాజ రాజేశ్వరీమాత శరణు శరణు 
హృదయ పూదోటలో పూచు భావాల మాలిక మూలం నీవు ఆ
మాలిక నీదు నామాల పరిమళముల తప్ప వేరు వాసనలు వెదజల్ల
నివ్వని భారము నీదే తనువెల్ల తేజోమయమై వెలుగ తనుమధ్యా 
కిరణేశ్వరి ప్రియతనూజా  రాజ రాజేశ్వరీమాత శరణు శరణు 
చెట్టుకు కట్టె  నొకరు ప్రకృతిఏ తానైనఁ పరంజ్యోతి ని రాతికి కట్టెనొకరు
జగములనెల్ల దాల్చిన దామోదరుని మా కాయంబుల నిలచిన నిను 
మనంబులతో పట్టు నేర్పు నొసగు భారము నీదే మూలాధారైక నిలయా 
కిరణేశ్వరి ప్రియతనూజా  రాజ రాజేశ్వరీమాత శరణు శరణు 
అనుమాన రక్కసి నా వివేకమణచి సహజ ప్రేమను
చిదుముతున్నవేళ సమయానికి తగు ఆలోచనల
ఊతమిచ్చి చేదుకొనవే ప్రియంకరీ బంధములు నిలుప   
కిరణేశ్వరి ప్రియతనూజా  రాజ రాజేశ్వరీమాత శరణు శరణు 
***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information