నాకందించవయ్యా...!

తిమ్మన సుజాత 


అలకలన్నీ తీరి అలివేలు మంగ
అరిసేలే వండి వడ్డించె నా...
ప్రేమ పాలు పోసి పద్మావతమ్మా..
పరమాన్నమే చేసి అందించె  నా...
ఒకచేత అరిసెల పళ్ళెము..
మరొక చేత పరమాన్నపుగిన్నె...
ఏది ముందు రుచి చూస్తువో...
వారే నీ మదినేలు పట్టపు రాణి లే..
ఈ కంట ఓర చూపు..
ఆ కంట కోర చూపు..
నడుమనున్నా నామాల సామి...
ఎటు తోచకా ...నీవు
ఈశ్వరునే చూస్తివా...
తలపైన గంగమ్మనుంచి..
మరి సగ భాగము ..
పార్వతికిచ్చి ...శివుడేమో
లింగమాయెనే.....
బిక్కమొగమేసి నీవు...
ఆ బ్రహ్మనే చూపేనా...
తల రాతలు రాసి రాసి ఆ బ్రహ్మ
అలసి సోలసినాడు...
విద్యా దానము చేసి చేసి.. ఆ సరస్వతమ్మ
వీణాపాణియై...మైమరిచి మురియు చుండే...
వారిరువురు నిను గానలేదని...
గందరగోళమయ్యే బ్రతుకని...
ఎంచి నా స్వామి..
నా వంకనే చూస్తివా...
నేనేమి జేయగలను...నా మది పుష్పాల
సేవించగలను..ఎదలోన కొలువై
ఉన్నవాడవే నీవు..గోవిందుడవు...
భక్తిరసాల నిను బందించి..స్వామి
ఆత్మ నివేదన చేయగలను... నా స్వామి..!!
సానుకూలముగ చేయ సమస్యను
స్వామి..సరసాల తేలించవయ్యా...
ఇద్దరమ్మల ముద్దు ముచ్చట్ల మురిసిపోవయ్యా...
నా స్వామి...!
నీ చేతులనున్న ఆ ప్రసాదాలనే....
 నా కందించవయ్యా...!!! స్వామి....!!1
*******************

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top