'మంథా'ర మాల - కధల సంపుటి 

కలిదిండి రామచంద్ర రాజు


రచయిత్రి మంథా భానుమతిగారి కథల సంపుటి, " 'మంథా'ర మాల" లోని 5 కథలపై, కలిదిండి రామచంద్ర రాజుగారి విశ్లేషణ, కంద పద్యాలలో..
నేను కధలు చదవటం మానేసి రెండు దశాబ్దాలు పై చిలుకే అయ్యుంటుంది, బానుమతిఅక్కయ్య నా కధలు చదవక పోతే నీ పద్యాలు చదవనని బెదిరిస్తే ఆవిడ సరికొత్త పుస్తకంమంథార మాలపుస్తకం తీసుకున్నా. చదివినవి అచ్చంగా ఐదు కధలు, వాటిగురించిఎంతైనా రాయొచ్చు, కానీ నాకు  వచనం రాయాలంటే కొంచం భయం. అందుకే కధలసారాన్ని ఇలా కంద పద్యాల్లో కుదించా, అవి చదివితే మీరు కధలు ఎలాగూ చదువుతారు.
 శ్రీమతి మంథా భానుమతి అక్కయ్య గారితో నా పరిచయం రెండేళ్ళక్రితం హైదరాబాద్బుక్ ఫెయిర్ లో,   ఇప్పటికి బలవంతంగానైనా నాచేత కధలు చదివించారు. శైలి, భావంజమిలిగా మనల్ని కధలోకి నడిపించుకు పోతాయి, చిదాకాశంలో పాత్రలు కనపడతాయి,మనం అనిమేషులం అవుతాం.
1. “ఏ నిమిషానికి .....”
కం. మనకోసం అను నిత్యము
ఎనలేని త్యాగములను ఎన్నో జేసే
మనసేనల కష్టాలను
జనులందరు తెలిసికొనుడు జై హింద్ యనుడోయ్!
2. “సృష్టి”
కం. మూసేసిన ఏసీగది
కూసింతైనా శిశువుకు కూడదు శ్రమయే
శ్వాసకు ఘర్షణ తెలియదు
కాసులు పోగేయు చదువు ఘనమై పోయెన్!
3.“రావమ్మ కొడుకు”
కం. తప్పుడు దారిన పోతే
చెప్పుము సుద్దులు మరువక చిన్నతనాన్నే
తిప్పలు తప్పవు చివరకు
ముప్పును తెచ్చేటి బంధమొద్ధుర కొడుకా!
4. అభీ.. అభీ.
కం. కష్టాల కడలి నీదగ
ఇష్టంగా మలుచు కొనగ ఎదురే ముందోయ్
శిష్టుల మార్గాన నడువ
వేష్టము ఆనందమయము వెరుపే లేదోయ్
5.కుటీచకుడు
కం. జటిలము జీవన యానము
ఇటునటు ఊగెడి తరువది ఎరుగము భవితన్
నిటలాక్షుని నీడే గద
పటువును గల్గించు మనకు వారధి దాటన్
****

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top