శ్రీధరమాధురి – 33

(గురువు గొప్పతనం గురించి పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )శిష్యుడు – ‘గురువర్యా, ఈ విశాల జగతిలో నాకంటూ ఒక ఉనికి లేని ఉన్నత స్థితికి నేను చేరుకున్నాను. నా దేహాన్ని, బుద్ధిని అధిగమించాను. నేనిప్పుడు కేవలం ఒక ఆత్మని, నాకేదీ కోపం తెప్పించలేదు. ‘
తక్షణం గురువు శిష్యుడిని లెంపకాయ కొట్టారు, అతని ముఖం కోపంగా మారిపోయింది.
ఇప్పుడు గురువు ఇలా అడిగారు – ‘నీ దేహం, బుద్ధి నశించాయి కనుక, ఒకవేళ నీకేదీ కోపం తెప్పించలేకపొతే, మరిప్పుడు నాకు కోపంగా ముఖం చూపినది ఎవరు?’
*******
 ఒకవేళ మీరు నిజంగా గురువు చెప్పినవి పాటించినట్లయితే, జీవితం పట్ల మీ దృక్పధం ఇతరుల కంటే విభిన్నంగా ఉంటుంది.
ఒకవేళ మీరు గురువుతో ఉన్నా, కేవలం మీ జీవిత సమస్యల గురించి షికాయతు చేస్తూ ఉంటే, మీరు కేవలం ఒక ఉత్సుక సందర్శకులు మాత్రమే ! గురువుతో మీరు అనేక సంవత్సరాలు నివసిస్తే, మీరు శిష్యరికం చేసినట్లు కాదు.
ఒక శిష్యుడు గురువు నడిచిన దారిలో నడుస్తాడు.
గురువుతో నివసించడం చాలా కష్టం, ఎందుకంటే శిష్యుడు ఉన్నత స్థాయి క్రమశిక్షణను పాటించాలి. ‘శిక్షణ’ అనే పదం నుంచి ‘శిష్యుడు/ శైక్షుడు’ అన్న పదం వచ్చింది.
ఒక గురువు ముందు నోరు తెరిచి మన అజ్ఞానాన్ని వెల్లడి చెయ్యకపోవడమే మంచిది.
*****
  ఈ ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఇంకా మీకు గురువుతో ఉండాలన్న కోరిక ఉందా ?
 ఒకవేళ ప్రపంచం ఆకర్షణీయంగా లేకపోతే, గురువు మీకు ఆకర్షణీయంగా కనిపిస్తే, అది మెరుగైన సాహచర్యం కోసం బుద్ధి చేసే పోలిక. ఒకవేళ ప్రపంచం ఆకర్షణీయంగా ఉండి, గురువు కూడా మిమ్మల్ని ఆకర్షిస్తుంటే, అది హృదయ భావన. మీరు గురువుతో మెలుగుతున్న కొద్దీ, మీ మనసు గురువుతో ముడిపడి ఉంది కనుక, నెమ్మదిగా ప్రపంచం పట్ల విముఖులు అవుతారు.
 మీరు పోలికలు వదిలేస్తే, ప్రపంచం మీకు గురు స్వరూపంగా, గురువే మీకు ప్రపంచంగా అనిపిస్తుంది.
 హృదయంతరాళంలో ప్రపంచం అంటే గురువే అని తెలిసినవారు,  గురువుతో ఉండాలంటే  ప్రపంచాన్ని త్యజించనక్కర్లేదు. గురువుని, బాహ్య ప్రపంచాన్ని వేరుగా చూసినప్పుడే సమస్య తలెత్తుతుంది.
****
 మీరు గురువుతో ఉంటే, బుద్ధిని మర్చిపోవాలి.
మీరు బుద్ధితో ఉంటే గురువును మర్చిపోవాలి.
 ****
సంబంధం లేని ప్రశ్నలు అడిగి, గురువు మీ తెలివితక్కువతనాన్ని ప్రదర్శించకండి. ఆయనకు అన్నీ ముందే తెలుసు.
 ****
మీరు జ్ఞానులని మీరు భావిస్తే, గురువు వద్దకు వెళ్ళకండి. మీరు ఇప్పటికే గురువుతో ఉంటే, వారితో ఇక కొనసాగకండి.
****
ఒకవేళ మీరు గురువు ముందు ఆలోచనలనే తెరను తొడుక్కుంటే, ఆయన అది తీసివెయ్యడానికి ప్రయత్నిస్తారు. మీరు గురువు ముందు దిగంబరులై ఉంటే, ఆయన విశ్వరూపాన్ని చూడగలరు.
****
 పైపై మెరుగుల ప్రాపంచిక జగతితో మీ ప్రయాణం ముగిసినప్పుడు,  గురువుతో మీ అలౌకిక విశ్వ ప్రయాణం మొదలౌతుంది.
 *****
ఒక గురువుగా, నేను మీకు పాలను ఇవ్వగలను. దాన్ని తోడుపెట్టి, పెరుగు తయారుచెయ్యండి. చిలికి వెన్న తియ్యండి. కరగబెట్టి నెయ్యి తయారుచెయ్యండి. అందుకని, గురువును మీకన్నీ నోటికి అందించమని అడక్కండి. ఒకవేళ మీకు అర్ధం కాకపొతే, ఓర్పు వహించండి. దాని గురించి విచారించండి. ఆ మౌన ధ్యానంలో, అంతరంగ మధనంలో, నేనేమి చెప్తున్నానో మీకు అర్ధమౌతుంది. ఇతరుల్ని అడక్కండి. వారు నేను చెప్పిన వివరణకు   వారి సొంత అభిప్రాయాన్ని దానికి అర్ధంగా చెబుతారు. లోనుంచి అవ లోకించండి.
 ****
గురువుతో ఎల్లప్పుడూ హృదయభాషే మాట్లాడాలి. మీ సందేహాస్పదమైన, ఉత్సుకమైన మనసుతో గురువును ప్రశ్నించకండి. అప్పుడు మీరు ‘శిష్యుడు’ అనే హోదా నుంచి ‘సందర్శకుడు’ గా మారిపోతారు. గురువు మీకు వ్యక్తిగతమైనవారు. అది హృదయ బంధం. బుద్ధి అనేది వ్యక్తిగతం కానిది. ఒక దివ్యమైన వ్యక్తిగత భావనలోకి వ్యక్తిగతం కాని అంశాన్ని తీసుకురాకండి.
 *****
గురువు ప్రవహించే నదివంటివారు. ఆయన చాలా మృదువుగా ఉంటారు, కానీ ఆయన్ను కత్తితో కోసేందుకు సాధ్యపడదు.
*****
మీరు మనసు చెప్పేది వింటే, మీ గురువు స్వరాన్ని వింటారు. మీరు బుద్ధి చెప్పేది వింటే, దెయ్యం స్వరాన్ని వింటారు.
****
గురువు, దెయ్యం ఇరువురూ మీలోనే ఉంటారు. గురువు మీ మనసు/హృదయంలో ఉంటే, దెయ్యం మీ బుద్ధిలో నివశిస్తుంది.
*****
వ్యక్తిగతమైన అంశాల్లోనైనా కనీసం గురువు చెప్పేది వినండి.
*****
ఒక నిజమైన గురువు, నిజమైన అనుభూతి చెందుతారు కనుక, క్రొవ్వొత్తిలా కరిగిపోతారు.
*****
ఒక గురువు తన శిష్యుడు/దాసుడితో వ్యవహరించేటప్పుడు ఎటువంటి చతురత, సున్నితత్వం చూపరు. ఒకవేళ మీతో అలా నడుచుకున్నట్లయితే, మీరొక మామూలు సందర్శకులని అర్ధం.
*****
ప్రశ్నించడం అనే ప్రక్రియ ద్వారా  మనకి అన్నీ అర్ధమవుతాయో లేదో కాని, గురువు పట్ల  బెషరతైన శరణాగతి , విశ్వాసం ద్వారా మనకు అన్నీ అర్ధమవుతాయని నా నమ్మకం. ఇదే నేను నా గురువుల వద్ద నేర్చుకున్నది.
****
మీకొక సమస్యకు పరిష్కారం దొరకగానే, మరొక సమస్య తలెత్తుతుంది. ఇది దైనందిన జీవనంలో చాలా సాధారణం. కాబట్టి, ఒకరు అడ్డంకులను దాటడం ఎలాగో నేర్చుకునే వరకు, శాంతి దొరకదు. మీరు గురువును, గురు బోధలను అనుసరించినప్పుడు, ఆయన మిమ్మల్ని అడ్డంకులను అధిగమించేలా చేసి, శాంతికి చేరువగా తీసుకువెళ్తారు.
******
మీరు మంచినీరంత స్వచ్చంగా ఉండాలి. చక్కర నీటిలో పూర్తిగా కరిగినప్పుడు అది ఎటువంటి అవశేషాన్ని వదలదు. చక్కర గురువు. మీరు మంచినీరు.  నీరు స్వచ్చంగా ఉన్నప్పుడు చక్కర దానిలో పూర్తిగా కరిగిపోతుంది. నీటి స్వచ్చతే చక్కర పూర్తిగా కరిగేలా చేస్తుంది. అందుకే గురువును స్వీకరించేందుకు పూర్ణ మనసుతో, స్వచ్చంగా ఉండండి.
 *****
‘నీ జీవితం ముఖ్యం’ అని నేను అతనికి చెప్పాను. నేను – ఇప్పుడు చెప్పు, ఏది ముఖ్యం ?
అతను – నా జీవితం ముఖ్యం.
నేను – గురూజీ, మీకేది ముఖ్యం ?
నేను – నా జీవితం ముఖ్యం.
అతను – ఏంటి గురూజీ, మీరింకా మంచి సమాధానం చెప్తారని ఆశించాను.
నేను – నిజమే, నేను అర్ధం చేసుకోగలను. కాని, నీవు చెప్పినది, నేను చెప్పినది పూర్తిగా విభిన్నమైనవి.
అతను – ఎలా గురూజీ? నేను చెప్పినదే మీరూ చెప్పారు కదా.
నేను – నిజమే, చెప్పింది ఒకటే, కాని దాని అర్ధం వేరు. నువ్వు  ‘నా జీవితం ముఖ్యం’ అన్నప్పుడు కేవలం నీ జీవితాన్నే ఉద్దేశించి మాట్లాడావు, కదూ !
అతను – నిజాయితీగా చెప్పాలంటే అంతే గురూజీ.
నేను – ఇక్కడే తేడా ఉంది. నేను ‘నా జీవితం ముఖ్యం’ అన్నమాట మాట్లాడినప్పుడు, నా జీవితం కేవలం నీవే కనుక, అది నాకు ముఖ్యమని చెప్పాను. నీవు కాక నాకు వేరే జీవితం లేదు. ఎందుకంటే గురువు ‘నా జీవితం(ప్రాణం)’ అన్నప్పుడు ఆయన ‘తన అనుచరులు/ శిష్యులు/దాసుల జీవితం’ అన్న భావంలో అంటారు. ఎందుకంటే ఈ అనుచరులు/ శిష్యులు/దాసులే ఆయనకు ప్రాణంతో సమానం కనుక. అంతా దైవానుగ్రహం.
******

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top