గోదావరి నుంచి సబర్మతి వరకు - 8 - అచ్చంగా తెలుగు

గోదావరి నుంచి సబర్మతి వరకు - 8

Share This

గోదావరి నుంచి సబర్మతి వరకు - 8

 -అవని


(జరిగిన కధ : ఖమ్మం నుంచి  అహ్మదాబాద్ కు వెళ్ళే నవజీవన్ ఎక్ష్ప్రెస్ లో ప్రయాణిస్తూ గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది ప్రణవి. కాకతీయ యూనివర్సిటీ లో గణిత శాస్త్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటుంది ఆమె. ఆహ్మేదాబాద్ లో జరగనున్న జాతీయ శాస్త్ర, సాంకేతిక సదస్సులో పాల్గొనేందుకు ఆమె అక్కడకు వెళ్తూ ఉంటుంది. భారతదేశంలోని ప్రముఖ గణిత శాస్త్రవేత్తల్లో ఒకడు కృష్ణమోహన్. వాళ్ళ ఇంటికే ప్రణవి వెళ్తుంది. కృష్ణమోహన్ భార్య గాయత్రి, తల్లి వేదవతి. వేదవతి గారు అడగ్గా, తన గురించి చెప్తూ ఉంటుంది ప్రణవి. ఆమెకు పెళ్లై ఒక బాబు ఉంటాడు. కాని, భర్త మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కృష్ణ ను ఎలా కలిసానో ఆమె గుర్తుచేసుకుంటుంది. వారిద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది.)
ఇంతలో ప్రణవి ఫోన్‌ మోగడం..తనలో తెలియని ఒక ఆదుర్దాని గమనించాడు కృష్ణ.
"' సరే..కృష్ణా..నేను మళ్ళీ వీలు చూసుకొని కలుస్తాను.ప్రస్తుతానికి అర్జంటుగా హైదరాబాద్‌ వెళ్ళాలి.ఈ రోజుతో సెమినార్‌ కూడా ఐపోయింది కదా..ఇక కారణాలు చెప్పడానికి వెతకాలి.." అంది గాభరాగా.
" నువ్వు వెళతానంటే నా హృదయం ద్రవించినట్టు వుంటుంది..కాని నేను నిన్ను ఆపను,ఆపలేను..జరిగేదంతా చూడడమే జీవితం..మనమేదో చేస్తున్నాం అనుకోవడం అజ్నానం.మనం నిమిత్తమాత్రులం ..ఓ గడిలో అలా ప్రయాణించవలసిందే..కానీ ఎప్పుడు టచ్‌ లో వుండు..ఎప్పుడూ చెప్పేదే ఐనా ..మరోమారు.." అన్నాడు.
" నాకు కూడా నిన్ను ఇలా వదిలి వెళ్ళాలని లేదు..పరిస్తితులు..అర్ధం చేసుకుంటావని తెలుసు.." అంది.
సరే..
మరో రెండు రోజులు గడిచాయి.పరిస్తితులు అన్నీ గందరగోళంగా తయారయ్యాయి కృష్ణకి.
ప్రణవి వెళ్ళిపోవడంతో నిస్తేజంలా అనిపించింది.
ఆసుపత్రిలో వేదవతి పరిస్తితి విషమంలా వుంది.
గాయత్రిని అత్యవసరంగా వాళ్ళ నాన్నగారు రమ్మని పిలవడం..మరో ఆలోచన,మాట లేకుండా గాయత్రి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి.
ఒక్కసారి పెను ఉప్పెన ఏదో వచ్చినట్టు వుంది అతని జీవితంలో.
తను నిత్యం చెప్పే వేదాంతం,జీవనసారం అన్నీ కళ్ళముందు కదలాడుతున్నట్టున్నాయి.
అగ మ్య గోచరంలోనే మనిషి గ మ్యాన్ని వెతుక్కోవాలి.కష్టంలోనే మనిషి నిబ్బరంగా వుండాలి.తను చెప్పిన వాక్యాలు తనకి గుర్తొచ్చాయి.
అనుకున్నట్టే అనుకోని విషాదం జరిగిపోయింది..వేదవతి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.తను చివరలో ఏమి చెప్పాలనుకుంది.ఎవరితో ఏమి మాట్లాడాలనుకుంది..ఏమీ తెలియదు.
అంతా తెలియని ఓ నిర్వేదం..కృష్ణ చుట్టూ..
ప్రణవి వెళ్ళాక జాడ లేదు..పోన్‌ లేదు..తన నెంబరు పని చేయడం లేదు.
గాయత్రి గాని ఆమె కుటుంబ సభ్యులు కాని ఎవరూ వేదవతి కార్యక్రమాలకి రాలేదు.
ఊహించని విదంగా గాయత్రినుంచి ఓ నోటీసు వచ్చింది కృష్ణకి..
తనకి ఇక అక్కడ వుండాలని లేదని..తనకి జరగాల్సిన న్యాయం చేయమని అర్ధం వచ్చేలా వుందందులో..
ఇదో..షాక్‌..వరసబెట్టి తగులుతున్న దెబ్బలకి మానసికంగా హూణం ఐనట్టుంది కృష్ణ పరిస్తితి.
ఇలాంటి పరిస్తితుల్లో వున్న ఆ వేద పాఠశాల కూడా మూత పడేలా వుంది.
భార్యా వియోగంతో శర్మ గారు అచేతనంగా తయారయ్యారు.
న స్త్రీ యేవ సృష్టే నాస్తి..అని తను చెప్పిన మాటలు తనకి గుర్తు వస్తున్నాయి.
ఈ ప్రపంచంలో స్త్రీ ని పక్కనపెడితే ఎలాంటి పని జరగదని తెలుస్తోంది.
స్త్రీ సాహచర్యం లేకపోతే పురుషుడు ఎందుకూ కొరగాడన్న నగ్న సత్యం కనబడుతోంది.
అలాగే ఇది విధి ఆడే వింత ఆట..జరిగేది చూడడం తప్ప..చేయగలిగేది ఏముంది.
వీలయినంత త్వరగా ఈ ప్రపంచంలోంచి బయటికి రావాలి..లేదా అంధకారంలోకి కూరుకుపోతాం.అనుకున్నాడు కృష్ణ.
మనిషి బలహీనుడిగా వున్నప్పుడే యుద్ధం చెయ్యాలి.అది నీతి కాకపోవచ్చు.కాని నీతి బతికున్న దగ్గర వేదం మాటాడగలదు.లేని దగ్గర అదర్మం రాజ్యమేలుతుంది.
గాయత్రి దగ్గరకు బయలుదేరాడు కృష్ణ..ఎప్పటికైనా విషయం తెలుసుకోవాలి కదా అని.
 సూటిగా అడిగాడు.." నీకు ఏం తక్కువ చేసాం..ఏం అ న్యాయం చేసాం..చెప్పు..ఇలా చేస్తున్నావు.." అడిగాడు.
" చూడు కృష్ణా..అ న్యాయం,న్యాయం అనేవి మనం చూసే కళ్ళని బట్టి,వివిద రకాల పరిస్తుతులను బట్టి,ఆయా వ్యక్తులని బట్టి ఆధారపడి వుంటాయి.అంతేకాని అవి అన్ని సందర్భాల్లోను,అన్ని పరిస్తుతుల్లోను ఒకే రకంగా వుండవు.." చెప్పింది గాయత్రి.
" గాయత్రి ఎవరి విషయమో వద్దు..మన విషయం చెప్పు..నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు.అనుష్టానం చేయవలసిన బాధ్యత నీకు లేదా,ఇలా వస్తే అర్ధం ఏమిటి.."అడిగాడు.
"సాంప్రదాయాలు,కట్టుబాట్లు,పద్దతులు అనేవి సంస్కృతిని కాపాడడానికి,నిలబెట్టడానికి మాత్రమే కాని..వాటి పేరుతో మనిషి చితికిపోవడానికి కాదు.." చెప్పింది.
" వ్యవస్త అంటే ఒక నమ్మకం..ఆచారం అంటే ఓ విశ్వాసం,పద్దతి అంటే ఓ ప్రమాణం..వాటికి కొన్ని విలువలు వున్నాయి.మనిషి అనే జీవనాన్ని మొదలెట్టాక మనవి అనే కొన్ని పద్దతులు పాటించాలి.వాటి వల్ల ఎదుటివారికి ఎలాంటి ఇబ్బందిలేనంతకాలం వచ్చే నష్టమేముంది.అందులో నీకు వచ్చిన నష్టమేముంది.."అడిగాడు.
" నాకు నచ్చలేదు..రాలేదు..వాటి మీద నాకు విశ్వాసం లేదు.." ఘాటుగా చెప్పింది.
" సరే..ఈ సమాధానం నచ్చింది..సూటిగా వుంది.." అన్నాడు.
మళ్ళీ మాట్లాడలేదు గాయత్రి.
తనే మళ్ళీ అడిగాడు కృష్ణ.
" మరయితే ఇప్పుడు ఏమి చేద్దామనుకుంటున్నావు..?"  అడిగాడు.
"ఇక్కడే నా శేష జీవితాన్ని ఇలాగే గడిపేద్దామనుకుంటున్నాను." చెప్పింది.
" నువ్వు ఎంత బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నావో తెలుసా.." అడిగాడు.
' బాధ్యతల గురించి నువ్వు మాట్లాడకు కృష్ణా.."కోపంగా అంది.
" సరే..నువ్వు ఎం చెప్పినా వినే స్తితిలో లేవని అర్ధమయింది..నీ ప్రశ్నలకి,నీ మానసిక స్తితికి సమాధానం ఆ కాలమే చెబుతుంది.అంతవరకు కాస్త సహనంతో ఓపిక పట్టు.నువ్వు తీసుకొనే అనాలోచితమైన నిర్ణయాలవల్ల,మూడు,నాలుగు జీవితాల పరిస్తితి ప్రశ్నార్ధక మవుతుంది.ఆలోచించు.."చెప్పాడు.
గాయత్రినించి ఎలాంటి సమాధానం లేదు.
గాయత్రి మొండితనం,మూర్ఖత్వం తనకి తెలియంది కాదు.
అనాలోచిత నిర్ణయాలతో తన జీవితాన్నే కాదు,అందరి జీవితాల్ని తలకిందులు చేయగలదు అనుకున్నాడు కృష్ణ.
ప్రణవి జాడ తెలియలేదు..
ఈలోగా తన యూనివర్సిటీ ఉప కులపతి నుంచి పిలుపొచ్చింది కృష్ణకి.
వెంటనే వెళ్ళి కలిసాడు.
" కృష్ణా..నువ్వు అర్జంటుగా లండన్‌ వెళ్ళాల్సి వుండొచ్చు..తయారుగా వుండు.అక్కడ కొన్నాళ్ళు వుండవలసి రావొచ్చు.నీ మేధమెటికల్‌ థియరీస్‌ వినడానికి అక్కడ విశ్వవిద్యాలయాలు ఎదురు చూస్తున్నాయి." చెప్పాడు ఉప కులపతి.
" ప్రస్తుతానికి నేనున్న పరిస్తితుల్లో నాకు ఎక్కడికీ వెళ్ళాలని లేదు..నాకే అంతా గందరగోళంగా వుంది..నాకు కొన్నాల్లు సెలవు కావాలి..ప్రశాంతత కావాలి."అన్నాడు కృష్ణ.
" కృష్ణా..ఇ నో ఎవిరీ థింగ్‌..కాని ఇది నీకు మంచి అవకాశం,వదులుకోకు..ఆలోచించుకో" చెప్పాడు.
" సరే..మళ్ళీ..కలుస్తాను.."చెప్పి వెళ్ళిపోయాడు.
***
ఈ రోజు మీకు కర్మయోగం గురించి చెబుతాను.. కర్మయోగ ఆవశ్యకత..దాని గురించి తెలుసుకోవలసిన అవసరం మీకు ఎంతైనా వుంది.ఎందుకంటే మీరు చాలా భవిష్యత్‌ వున్న వాళ్ళు.మీకు దర్మా,ధర్మ విచక్షణా జ్నానం చాలా అవసరం. ఎందుకు అంటే భవిష్యత్లో ఇంక నేను ఈ పాఠశాలను కొనసాగించలేకపోవచ్చు.ప్రస్తుత పరిస్తితుల్లో నా ఆరోగ్యం అంతంతమాత్రంగానే వుంది.
ఓ పక్క విద్యార్దుల ఆందోళనను కూడా గమనించాడు.
" మీరు అనవసరంగా ఆందోళన చెందకండి..మీకు తగిన ప్రత్యా మ్న్యాయాలు చేస్తాను.మరో మంచి పాఠశాలలో మీ భవిష్యత్‌ మరింత బాగుండేలా తీర్చిదిద్దే దానిలో మీకు ప్రవేశాలు కల్పిస్తాను.." చెప్పారు నమ్మకంగా.
కర్మయోగమంటే మీ పనిని మీరు చేసుకుంటూపోవడం.ఫలితాన్ని ఆ భగవంతుడిమీద విడిచిపెట్టడం.మనం నిమిత్తమాత్రులం ఇక్కడ.నీ చే చేయబడే ప్రతిపనికి ఆధారభూతుడు ఆ భగవంతుడే..నువ్వు ఇక్కడికి అంటే ఈ లోకానికి ఓ కర్తవ్యాన్ని నిర్వహించడానికి వచ్చావు అంటే ఆ పని నిర్వహించడమే నీ పని అని అర్ధం.
పూర్వ జ న్మయందు చేయబడిన శుభా,శుభ కర్మలయొక్క పరిణామము స్వయంగా కర్తను అనుభవింపచేయను అన్నదే దీని సిద్దాంతం. " చెబుతున్నారు విష్ణుశర్మ తన విద్యార్దులతో.
" కర్మ పాలన అంటే కర్తవ్య పాలన..అంటే సమత్వ బుద్దితో కర్మలు చేయడమే అని అర్ధం.
మీకు అప్పగించిన ధర్మాన్ని,మీకు నియోగించిన పనిని నీవు చేసుకుపోవడమే కర్మ.
క్లుప్తంగా చెప్పాలంటే-ఏ పని యందు నియోగింపబడినా కర్తవ్య పాలనే ముఖ్యము.కర్తవ్యాభిముఖంగా కర్మలు చేయడమే ముక్తికి ఉపాయం.కర్తవ్య పాలనతో చేసిన కర్మలతో పాప పు న్యాలంటవు.జ్నాని ఐన వ్యక్తి కర్మను స్వఫలాపేక్షతో కాకుండా లోక హితార్ధమే చేస్తాడు.కనుక అందులో పాప,పుణ్యాల ఆలోచనే వుండదు.లోకహితమే కర్మశీలము.కర్తవ్య పాలనలో కష్ట,సుఖాలుండొచ్చు.ఐనా సరే ఈ వికారాలను లెక్కపెట్టని స్తితియే యోగము.సమత్వ బుద్ధితో కర్మలు చేయుచూ కర్తవ్యమును గుర్తించితే అదే కర్మయోగము.
చెప్పుకుంటూ పోతున్నారు శర్మ..
(సశేషం...)

No comments:

Post a Comment

Pages