శ్రీధరమాధురి – 32

(గురువు గొప్పతనం గురించి పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )

 

గురువు మిమ్మల్ని విమర్శిస్తారు...
గురువు మిమ్మల్ని చూసి నవ్వుతారు...
గురువు మిమ్మల్ని గద్దిస్తారు
గురువు మాతో హాస్యమాడుతారు
 ఇంతకీ గురువు ఏం చేస్తున్నారు ?
 తోటమాలి లాగా, మొక్క చుట్టుపక్కల నుంచి కలుపులను తీసేసి, ఎరువు వేసి, పురుగుమందులు వేసి, మొక్కకి నీరు పోసి, అది బాగా ఎదిగి పూల పరిమళాలు వెదజల్లుతూ ఉంటే, తేనెటీగలు దాని పరిమళం, అందం చెడకుండానే దాన్నుంచి  తేనెను స్వీకరించేలా పెంచుతున్నారు. గురువు... మీ జీవన తోటమాలి.
 ****
శిష్యుడు – నాకు చాలా నిరాశగా ఉంది. నేను ఏం చెయ్యాలి గురుదేవా?
గురువు – ఇప్పుడు నువ్వు ఇతరుల్ని ప్రోత్సహించు.
 *****
 శిష్యుడు – గురువుగారు, మీకు జ్ఞానోదయం కలిగినతర్వాత, ఏం చేసారు ?
గురువు నవ్వి ఇలా అన్నారు – నేను కొన్ని బట్టల్ని ఇస్త్రీ చెయ్యాల్సి ఉంటే చేసాను.
 ******
 నిజమైన జీవన కళకు ప్రతీకగా గురువు, ఆయన పనికి – ఆటవిడుపుకి, ఆయన కష్టానికి – తీరికవేళలకి, ఆయన బుద్ధికి – దేహానికి, ఆయన సమాచారానికి – వినోదానికి, ఆయన ప్రేమకి – మతానికి, మధ్య ఏ అంతరాన్ని చూపరు. నిజానికి, ఆయనకు ఏది ఏమిటో తెలియదు. ఆయన దివ్య దృష్టిని ఆయన అనుసరిస్తారు. ఆయన ఆడుతున్నారో లేక పనిచేస్తున్నారో నిర్ణయించే అంశాన్ని ఇతరులకు విడిచిపెడతారు. ఆయన పరంగా రెండూ ఒకటే. ఆయనే సద్గురువు.
 *****
 మీరు గురువును మెప్పించాలనుకుని ఆయనవద్దకు వెళ్ళకండి. మీ గొప్పలు ప్రదర్శించేందుకు గురువు వద్దకు వెళ్ళకండి. ఆయన ముందు మీరు చూపాల్సింది ఏమీ లేదు. గురువును మెప్పించడం వీలుకాదు, ఆయనను మాయ చేసే వీలులేదు. మీరు ఆయనవద్దకు వెళ్ళినప్పుడు, సంపూర్ణ శరణాగతి వేడే భావంతో వెళ్ళండి. అత్యంత అణకువతో వెళ్ళండి. ఆ వినయంలోనే ఒక ప్రగాఢమైన గౌరవం, ప్రేమ మాత్రమె కనిపించాలి. మీరలా ఉండలేకపోతే, ఆయనవద్దకు వెళ్ళాకపోవడమే మంచిది.
****
 గురువు విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకని, ఆయన్ను చూసేందుకు వచ్చిన వ్యక్తిని వెంటనే కలిసేందుకు సమ్మతించారు.
సందర్శకుడు – గురువర్యా, నేను అత్యంత జాగృతితో మెలిగే వ్యక్తిని. నేనొక జ్ఞానోదయం పొందిన దివ్యాత్మను. మీరు నన్ను ఏమైనా అడగవచ్చు, నా జవాబు మీకు నేను జ్ఞానిని అని తెలియజేస్తుంది. ఈ ప్రాంతంలో మీరు అత్యంత జ్ఞానులని విన్నాను. అందుకే మీ మేధస్సును సవాలు చెయ్యడం సరైనదని నేను భావించాను. కాబట్టి, మీ ప్రశ్నని మొదలుపెట్టండి.
గురువు – సరే, నేను నీ సవాలును అంగీకరిస్తున్నాను. జ్ఞానం పట్ల నీకున్న ప్రేమను పరీక్షించేందుకు  నేను ప్రశ్నను అడిగే ముందు, నేను నిన్నొక మామూలు ప్రశ్నను అడగాలి. అడగమంటావా ?
సందర్శకుడు – అలాగే, అడగండి.
గురువు – నువ్వు ఈ గదిలోకి వచ్చే ముందు చెప్పుల్ని ఏవైపున విప్పావు ?
సందర్శకుడికి అది గుర్తులేదు, అందుకే అతను మౌనంగా ఉండడంతో, ‘ఎడమ ప్రక్క విప్పావు,’ అన్నారు గురువు.
సందర్శకుడు సిగ్గుపడి, వెళ్ళిపోయాడు.
ఇప్పుడు గురువు శిష్యుడిని చూసి, కన్నుగీటి, ‘నేను తలుపుకు ఉన్న కంతలోంచి చూశానని అతనికి చెప్పనా ?’ అన్నారు.
గురువు, శిష్యుడు బిగ్గరగా నవ్వసాగారు.
శిష్యుడు – గురుదేవా, మీరు ఇంత దూరంలో కూర్చుని, తలుపుకున్న రంధ్రంలోంచి ఎలా చూసారు ?
గురువు నవ్వి, ‘నేను ఆ రంధ్రం నుంచి చూసేందుకు తలుపు వద్దకు వెళ్ళటం అవసరమంటావా ?’
శిష్యుడు మాటలు రాక మూగబోయాడు.
*****
 ఒక ప్రత్యేకమైన రోజున, ప్రత్యేకమైన భంగిమలో గురువులు చనిపోయే ఆచారం ఉండేది. మరొక గురువు పరమపదించిన స్థితిలోనే వారు చనిపోరు. ప్రతి గురువు చావు, ప్రత్యేకంగా ఉంటుంది.
 ఒకగురువు చివరిదశలో ఉండగా, చనిపోయేందుకు ఏ స్థితిని తాను ఎంచుకోవాలా అని బెంగపడుతూ ఉన్నారు. (కూర్చుని, నిల్చుని, చెట్టు క్రింద నిల్చుని, రాయి మీద పడుకుని మొదలైనవి)
 ఎటువంటి భంగిమ ప్రత్యేకంగా ఉంటుందోనని అడుగుతూ ఆయన తన శిష్యులను ఇబ్బందిపెట్టసాగారు. వారు ఏదైనా చెబితే, ఆయన వారిపై అరుస్తూ, ఆ భంగిమను దగ్గరలో ఉన్న నగరంలో ఒక గురువు పాటించారని చెప్పేవారు. విషయం చెయ్యిదాటిపోతూ, అదుపు చెయ్యడం కష్టమైపోయేది. అందుకే ఒక శిష్యుడు దగ్గరలో ఉన్న ఊరిలో ఉన్న గురువుగారి పెద్దక్క వద్దకు వెళ్లి, సమస్యను వివరించారు.
 పెద్దక్కయ్య వచ్చి, తన చిన్న తమ్ముడిని చూసి, ఇలా అంది.’నీ శిష్యులను ఇబ్బంది పెట్టకు. ఇప్పటిదాకా చేసింది చాలు. ఏమైనా అది చావే కదా. నీకు అనువుగా ఉన్నట్లే చనిపో. మేము దగ్గరలో ఉన్న గ్రామాల్లోని గురువులు ఎలా చనిపోయారో కనుక్కుని, నీ దేహాన్ని ఆ భంగిమలోకి మార్చి, మళ్ళీ పాతది పునరావృతం కాకుండా చూస్తాము. కాబట్టి, నువ్వు ప్రశాంతంగా చనిపోయి, మమ్మల్నీ ప్రశాంతంగా ఉండనివ్వు.’
ఈ జోక్ ను విని, చివరిదశలో ఉన్న గురువు పగలబడి నవ్వుతూ, ప్రాణాలు వదిలేసారు. ఆయన సమాధిపై ఆయన నవ్వుతూ చనిపోయారని రాసారు. యాదృచ్చికంగా, దగ్గరలోని గ్రామాల్లో ఏ గురువూ నవ్వుతూ చనిపోలేదు.
 ******
  గురువు మీ సమస్యల్ని తీర్చేవారు మాత్రమే కాదు. ఆయనతో అనుబంధం వీటన్నిటికీ అతీతమైనది.
ఒక సందర్శకుడు ఒక గురువును దర్శించి, తన సమస్యలను చెప్పి, వాటికి పరిష్కారం అడగాలనే కోరికతో ఎదురుచూస్తున్నాడు.
శిష్యుడు అతని సమస్యను విని, మౌనంగా ఉంటాడు.
భక్తుడు/దాసుడు అతని సమస్యను చూసి నవ్వుతాడు. 
******
మీరొక గురువు వద్దకు వెళ్ళినప్పుడు అత్యంత వినయము, అణకువతో ఉండాలి. జీవితంలో మీ స్థాయి, జ్ఞానం అనబడే వాటిని వదిలెయ్యాలి. అది సంపూర్ణ శరణాగతి కావాలి. మీ సందేహాలను అక్కడే, అప్పుడే అడిగెయ్యండి.
*******

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top