నిశిరాత్రి కలయిక

మంథా భానుమతి.


నీలి సంద్రము నల్లని ఆకాశం కలిసే చోట
నెలరాజు అలలకి అందేంత దూరంలో ఉంటే
నివ్వెరపోయిన తరంగాలు ఉరకలు వేస్తూ
నేనంటే నేనని నెమ్మదిగా పడి లేస్తూ
ఒడ్డుని ముద్దిడుతున్నాయి.
నిదురరాని నేను ఇసుకలో తడబడుతూ
నింగినుండి నేల వాలిన నక్షత్రకాంతిలో
నీకోసం అటు ఇటు కను రెప్పలు అల్లలాడిస్తూ
నడుస్తుంటే నీ కన్నులలోని కాంతి
నన్ను నీ దరికి చేర్చింది.
నీవు నేను కలిసి జివ్వున లాగే
చల్లని నీటిలో పాదాలనుంచి చేతులు పట్టి
ఊసులాడుతుంటే, ఆ గుసగుసలు వినాలని
అల ఒకటి లేచి మనల ముద్దాడి వెనుతిరిగి
మనిద్దరినీ కలిపింది.
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top