నీకు నేనున్నా - అచ్చంగా తెలుగు

నీకు నేనున్నా

అంగులూరి అంజనీదేవి

anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com



సాయంత్రం నాలుగు గంటలకి పది నిముషాలు మాత్రమే తక్కువ. మనోహర్ ఇంకా రెడీ కాలేదు. జాగు చేస్తుంటే ఒకసారి వాళ్ళ నాన్నగారొచ్చి మందలించి, పనిమీద బయటకెళ్లారు. మనోహర్ మాత్రం బస్ కి టైం అవుతున్నా ఇంకా రెడీ కాలేదు.
"ఏమిట్రా మనోహర్ ఇంతాలస్యం. ఇంకా రెడీ కాలేదు. సర్డుకోలేదు. మీ నాన్నగారు బస్ కి టైం అయిందని తొందరచేసి బయటకెళ్లారు. మళ్ళీ వచ్చే సరికి నువ్విలాగే వుంటే ఏమంటారో ఏమో త్వరగా కానివ్వరా" అంటూ తొందర చేసింది మనోహర్ తల్లి తులశమ్మ.
"చూడమ్మా! నీ మనుమరాలు పద్మ ఏం చేసిందో, దానికి ఈ మధ్యన పొగరు ఎక్కువైంది. నేను ఈ రోజ హైదరాబాదు వెళ్తున్నాను కదా! కాస్త నా బట్టలు సర్దివ్వకూడదూ అవసరం లేనప్పుడు వచ్చి అవీ ఇవీ సర్దుతుంది. ఇప్పడేమో కన్పించదు. అదీకాక ఈ మధ్యన అహం కూడా ఎక్కువైందిలే" అంటూ చిన్న పిల్లాడిలా అటూ ఇటూ తిరగసాగాడు.
"ఇంతకీ ఏమిట్రా నీ ఏడువు?దానిమీద కొప్పడుతావు దేనికి? చూడు!మనోహర్! ఇంత వాడివయ్యావనే కాని జాగ్రత అనేది బొత్తిగా లేదురా నీకు.ఉదయం నుండి ఏం చేశావు? కాస్త సర్దిపెటుకొని వంటే ఇప్పుడు మీ నాన్నగారు  కోప్పడేవారు కారు కదా. ఇక ఆయనకు కోపం వస్తే తగ్గటం కష్టం. అప్పటికే కాలేజీలు తెరిచి నాలు రోజలు అయిందని కోపంగా ఉన్నారు. అంటూ మనోహర్ కి సహాయం చెయ్యబోయింది తులశమ్మ
"అమ్మా ఇక్కడ నువ్వు హెల్స్ చెయ్యటం మొదలు పెట్టావంటే ఆ బస్ కాస్త మిస్ అయి ఈరోజు కూడా వుండిపోవలసి వస్తుంది.పద్మను పిలువు త్వరగా సర్దేస్తుంది. అదీకాక ఇంతకముందే ఇక్కడికి వచ్చి నేను వెళ్తాననేమో నా సూటికేస్ తాళాలు కొట్టేసింది. ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్! అందుకే త్వరగా పిలువమ్మా!" అంటూ బ్రతిమాలాడు మనోహర్
"నేను పిలవనురా! అది నీ దగ్గరకు రావటానికి వీల్లేదు"
ఎందుకు లేదు?" మనోహర్అడిగాడు.
“నీ భార్యనుకున్నావా? లేక ఇంతకు ముందున్న చిన్నపిల్లనుకున్నావా?" తెచ్చిపెట్టుకొన్న కోపం కన్పించింది తులశమ్మ ముఖంలో
"అవేమీ అనుకోవట్లేదు. పద్మనా అక్కయ్య కూతురు నిరభ్యంతరంగా ఇక్కడకు రావొచ్చు. పోవచ్చు" అన్నాడు మనోహర్
"రావొచ్చు పోవచ్చురా దానికి నేను కాదనలేదు. పద్మ నీ అక్కయ కూతురే కాదు. నీ కాబోయే భార్యకూడా కానీ మీ బావ కరుణాకర్ ఇప్పడే బ్యాంకు నుండి వచ్చి ఇంట్లో వున్నాడు. అది ఇప్పడెలావస్తుంది" అంది చిన్నస్వరంతో తులశమ్మ.
మనోహర్ కి బావంటే భయం గౌరవం. అక్కయ్యంటే అభిమానం. అక్కయ్య కూతురు పద్మంటే చనువు.
అలాగైతే నేనే వెళ్తాను" అన్నాడు మొండిగా .
“బావ ఇప్పుడు ఇంట్లో వున్నట్లు అక్కయ్య చెప్పింది. ఒకేసారి వెళ్ళేటప్పుడు చెప్పి వెల్దుగాన్లే”
“అమ్మమ్మా! మామయ్య ఎక్కడ? అరె వెళ్లిపోయారా!సూట్ కేస్ తాళాలు నా దగ్గరే ఉన్నాయి అప్పుడెలా ?" అంటూ కంగారుపడ్తూ వచ్చింది పద్మ.
అంతవరకు తల్లితో మాట్లాడుతున్న మనోహర్ చనువుగా పద్మ దగ్గరకెళ్లి తాళాలు లాక్కున్నాడు.
పద్మ ఎవరో కాదు. మనోహర్ కి  స్వయానా అక్కయ్యకూతురు.పుట్టినప్పుడే ఆ ఇద్దర్ని భార్యా భర్తలుగా నిర్ణయించారు పెద్దవాళ్లు కానీ ఆ ఇద్దరు కలసి మెలసి తిరుగుతుంటే ఎవరన్నా చూస్తే బావుండదని పెద్దవాళ్ల ఆలోచన. అందుకే వాళ్లకి త్వరగా పెళ్లి చెయ్యాలని పెద్దవాళ్ల ఆరాటం. కానీ మనోహర్ చదువింకా పూర్తి కాలేదు.
పద్మ నాన్న కరుణాకర్ స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్. అదే ఊరిలోఇల్లుకట్టుకొని స్థిరపడిపోయారు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు రవి, బి.ఏ. చదువుతున్నాడు. పద్మను ఏడవ తరగతి చదివించి సరిపెట్టారు. తర్వాత రాణి ఆఖరమ్మాయి. ఎనిమిదవ తరగతి చదువుతోంది.
పద్మ గురించి కరుణాకర్, పార్వతి ఆలోచించరు. ఆ అమ్మాయి బరువు. బాధ్యతలు వాళ్ల తాతయ్య మాధవయ్యకే వదిలేశారు. పద్మ కూడా ఎక్కువగా వాళ్ల తాతయ్య గారింట్లోనే గడుపుతుంది. మాధవయ్య గారింట్లో కళకళ లాడుతూ తిరిగేది తన కూతురు పార్వతి పిల్లలే. ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్లు చేశారు మాధవయ్య. వాళ్లు ఉద్యోగరీత్యా చెరొక వూరువెళ్లిపోయారు. ఇక మిగిలింది మనోహర్ ఆ అబ్బాయి సెలవులకి మాత్రమే ఇంట్లో వుంటాడు. కాలేజీ వున్న టైంలో హైదరాబాదులో వుంటాడు.
పద్మ, రాణి రావడంతో క్షణాల మీద రెడీ అయ్యాడు మనోహర్. ఈ లోపల తను హైదరాబాదు వెళ్తున్నట్లు అక్కయ్య, బావలతో చెప్పివచ్చాడు.
"మావయ్యా! మీరు బాగా చదవాలి" అంది రాణి.
"మీ అక్కయ్య కంటే నువ్వే నయం రాణి చదువుపై శ్రద్ధ చూపుతావు. మీ అక్కయ్య నేను వెళ్తానని తెలిస్తే చాలు, అవసరమైనవి దాచి నన్ను ఇబ్బంది పెడ్తుంది" అంటూ పక్కనే వున్న పద్మవైపు చూశాడు మనోహర్.
మనోహర్ వైపు చిలిపిగా చూస్తూ మల్లెపువ్వులా నవ్వింది పద్మ. పద్మ అందం విరిసీవిరియని పద్మం. పెద్ద కళ్ళు, కోటేరులాంటి ముక్క విశాలమైన నుదురు, ఆ నుదురుపై స్ప్రింగులాగ పడిలేచే నల్లటి ముంగరులు నిగ నిగ లాడే మేని రంగు అందంలో తక్కువేం కాదు పద్మ. కాకపోతే మనిషి కాస్త పొట్టిగా ఉంటుంది. ఆ పొట్టి పెద్ద లోపంగా కనిపించదు. ఏ పార్డుకాపార్డు పరిశీలిస్తే పద్మ అందగత్తెనే చెప్పాలి. ఈ మధ్యన –ఆ అమ్మాయిలో వయసుతో బాటు ఒక విధమైన చైతన్యం వచ్చింది. కానీ వయసుకి తగినంతగా మనసు ఎదగలేదు. ఎప్పుడు చూసినా లేడిపిల్లలా గంతులేస్తుంటుంది. మనోహర్ తో  మాట్లాడటం కన్నా పోట్లాడటమే ఎక్కువగా చేస్తుంటుంది పద్మ
"అమ్మా వెళ్లాస్తాను" అంటూ తల్లితో చెప్పాడు మనోహర్.
వెళ్లొస్తాను  పద్మా!" అంటూ బయటకు నడిచాడు.
అంతలోపలే బయటకెల్లినమాదవయ్యవచ్చాడు. ఇద్దరు కలిసి బస్ స్టాండ్ కి వెళ్ళారు.
బస్  వచ్చింది. చాలామంది ఎక్కుతున్నారు. మనోహర్ కూడా ఎక్కాడు.
“జాగ్రత్త బాబు బజార్ల వెంట తిరక్కుండా, సినిమాలు ఎక్కువగా చూడకుండా, కడుపలో భయం పెట్టుకొని చదువు" అంటూ చిన్నపిల్లాడికి చెప్పినట్లు జాగ్రతలు చెప్పాడు మాదవయ్య.
"నా గురించేమీ బాధపడకండి నాన్నా! నేను జాగ్రత్తగా చదువుకుంటాను" అంటూ లోపలకెళ్ళి కూర్చున్నాడు మనోహర్.
"ఏం మాధవయ్యా అబ్బాయిని చదువుకు పంపుతున్నావా?" అంటూ పెద్దమనిషి మాధవయ్యా కి దగ్గరగా నిలబడ్డాడు.
"ఆ..ఆ..అబ్బాయిని ఐస్ ఎక్కించి వెళ్దామని  వచ్చాను. ఇంతకీ మీ తూర్పు మాగాణిలో వరి నాటినట్లున్నారు. కాస్త ముళ్ళకంచె వేయించండి లేకుంటే పశువుల బెడద ఎక్కువ. ఇదిగో నా మాటవిని మీ మెట్టపొలంలో పొగాకు పెంచవయ్యా దిగుబడి బాగుంటుంది" అంటూవచ్చిన వ్యకికి సలహా ఇచ్చాడు మాధవయ్యా.
"నా కమతం దెబ్బ తినిందిమాధవయ్యా. ఖర్చులు భరించలేకపోతున్నాను. ఆర్థికలోటు ఎక్కువైంది. పొలమున్న సాగు చేయించే శక్తి ఉండాలిగా. ఇప్పుడు చూడు, ఎరువులు, మందులు లేక వారి పైరు చీడ పట్టింది.ఇంక పొలం చుట్టూ కంచే పెట్టించాలంటే మాటలా! నేనిచ్చే కూలికి పనివాళ్ళు దొరకటం లేదు. ఆ రోడ్డు పక్క పొలాన్ని ఎందుకు కొన్నానా అని బాధపడుతున్నాను.నీకేం అన్ని వసతులు ఉన్నాయి. చేతినిండా డబ్బుంది. నీలాగ పైరుని పెంచాలంటే మావల్లకాదు" అంటున్న అవతల వ్యక్తి ఒకప్పుడు ఆ ఊరిలో పెద్ద రైతుగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మాత్రం బాధల్లో వున్నాడు. జాలిగా చూశాడు మాధవయ్యా.
మాధవయ్యా. మాత్రం జీతగాండ్లను పెట్టి, అందరికన్నా పైచేయిగా తన పొలాన్ని పండిస్తున్నాడు.
మనోహర్ ఎక్కిన బస్ కదిలింది. కన్పించినంత వరకు బస్ వైపు చూస్తూ ఇంటివైపు కదిలాడు మాధవయ్యా.
*****
హైదరాబాదులో బస్ దిగి తనరూంకెళ్లాడు మనోహర్, కృష్ణతో కలిసి, రూమ్ లో కూర్చుని చదువుకుంటున్న హరిని చూడగానే మనోహర్ కనుబొమలు ముడిపడ్డాయి. హరిది హైదరాబాదే ఇంట్లో వీలుకాదని ఫ్రెండ్స్ రూముల్లో వుండిచదువుకుంటుంటాడు. కృష్ణా, మనోహర్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలాకాలంగా ఒకే రూంలో వుండి చదువుకుంటున్నారు. వాళ్లంతా ఏ.జి.బి.యస్.సి. రెండవ సంవత్సరం చదువుతున్నారు.
"కృష్ణా! హరి మన రూంలో వుంటే మనకి ఇబ్బంది అవుతుందిరా! ఇప్పటికేఈ ఒక్కరూంలో ఇరుగ్గా వుంది మన ఇద్దరికి. ఫ్రీగా తిరగలేకపోతున్నాం. ఇందులో మూడో వ్యక్తి కూడా వుంటే ఇక మనం చదువుకోలేం" అంటూ కృష్ణను పక్కకు పిలిచి చెప్పాడు మనోహర్. –
వేరే ఇల్లు చూశాను మనోహర్! ఇల్లు చాలా పెద్దగా వుంది. మనతో బాటు ఇంకో ఇద్దరు వుండైనా చదువుకోవచ్చు. అద్దె కూడా తక్కువగానే ఉంది.
"ఇప్పడు మనం ఈ రూం మారటం అవసరం అంటావా?"
"హరి కోసం తప్పదు మరి"
"హరికి రామకృష్ణ రూంలో బాగానే వుంది కదా!
"రామకృష్ణ ఫ్రెండ్ కి ,హరికి గొడవ అయిందట. అందుకే హరి ఇకపైవాళ్ల దగ్గర వుండనంటున్నాడు. ఎంతయినా హరి మన క్లాస్మేట్ కదా! మనం * మాత్రం ఆదుకోలేకపోతే ఎలాచెప్పు.
"సరే నీ ఇష్టం" అన్నాడు మనోహర్.
వెంటనే వేరే ఇంటికి మారారు మనోహర్, కృష్ణ, హరి. ఆ ఇల్లు వాళ్లకి బాగా నచ్చింది. సూడెంట్స్ వుండి చదువుకోవటానికి ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు వున్నాయి. అద్దెకూడా ముగ్గురు కలిసి ఇస్తారు, కాబట్టి తక్కువగానే అన్పించింది. ముఖ్యంగా ఆ ఇంటి వాతావరణం డీసెంట్ గా వుంది మనోహర్ కి.
డబ్బు విషయంలో దిగులు పడనవసరం లేదు మనోహర్. ఆలోచించిఖర్చు పెట్టుకోవలసిన అవసరం అంతకన్నాలేదు. ఎందుకంటే వాళ్ళఅన్నయ్యలకి మనోహరంటే వల్లమాలిన అభిమానం. తండ్రి పంపే డబ్బుకాక అన్నయ్యలు కూడా పంపుతుంటారు. అందుకే మనోహర్కి ఎలాంటి బాధలు లేవు. శ్రద్ధగా చదువుకొని, మంచి మార్కులతో పాసవ్వటమే ఆ అబ్బాయి ప్రస్తుత కర్తవ్యం .
ఉదయాన్నే స్నానం చేసి, శ్రీ ఆంజనేయస్వామి దండకం చదవటంపూర్తి కాగానే, డ్రెస్ వేసుకుంటుండగా వాళ్లఫ్రెండ్  హరి వచ్చాడు.
"ఒరే మనోహర్ మన పక్క ఇంట్లో ఎవరో కాపురం వుంటున్నారు రా.మంచి, మంచి అమ్మాయిలు కన్పిస్తున్నారు" అంటూ లోపల కొచ్చాడుహరి. ఎప్పడైనా హరి అమ్మాయిలంటే పడిచస్తాడు. అమ్మాయి లెక్కడ కన్పించినా ముఖం వాచిన వాడిలా వాళ్లనే చూస్తూ నిలబడతాడు.
ఆ ఇల్లు చూడటానికి వచ్చిన రోజు హరి రాలేదు. అందుకే ఇల్లు గల వాళ్ల తమ పక్కనే వుంటున్నారన్న విషయం హరికి తెలియదు. మనోహర్ కి తెలుసు. కానీ ఆ ఇంట్లో వున్న వాళ్లందరిని మనోహర్చూడలేదు.
"ఉదయాన్నే బలే జోక్ మోనుకొచ్చావు హరీ! కావురాలుండక..కాకరకాయలుంటాయా?" అంటూ తను వేసుకున్న డ్రెస్ ని ఒకసారి సరిచేసుకుంటూ అద్దం ముందు నిలబడి వున్న మనోహర్ కి వెనగ్గా నిలబడి కల్లార్పకుండా మనోహర్ నే చూస్తున్నాడు హరి.మనోహర్ ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్ కి ఓ ప్రత్యేకత వస్తుంది. అదే డ్రెస్ తను వేసుకుంటే ఏం బాగా లేదనిపిస్తుంది. అదే బాధగా వుంది హరికి.
కాలేజీలో కూడా అమ్మాయిలంతా మనోహర్ నే చూస్తుంటారు. మనోహర్ వాళ్ళవైపు చూడకపోయినా – ఎప్పుడో ఒకప్పుడు తమవైపు చూడకపోతారా  అన్నట్లుగా మనోహర్ని దొంగ చూపులు చూసే అమ్మాయిలే ఎక్కువగా వున్నారు. హరిని ఒక్క అమ్మాయి కూడా చూడదు. హరికి వాళ్లను చూసి, చూసి కాళ్ల నొప్పలే మిగులుతున్నాయి. అదే కడుపుమంటగా వుంది హరికి. నలుగురిలో వున్నప్పుడు కూడా కులాసాగా కబుర్లు చెబుతూ సరదాగా నవ్వుతూ, నవ్వించే మనోహర్ని చూస్తుంటే హరి మనసు యింకా ఎక్కువగా వుడికిపోతూ వుంటుంది. ఎంతమందిలో నిలబడినా మనోహరే ప్రత్యేకంగా కన్పించటం హరికి ఇబ్బందిగా వుంది. ఆ ప్రత్యేకతేమిటో తెలిసికోవాలని అలాగే మనోహర్ని చూస్తూ మనోహర్ వెనకాలే నిలబడ్డాడు హరి.
తనవైపే చూస్తూ, తన వెనకాల నిలబడ్డ హరిని అద్దంలోంచి గమనించి తిరిగి చూశాడు మనోహర్. అప్పడే ఏదో గుర్తుకి వచ్చిన వాడిలా అక్కడ నుండి వెళ్లిపోయాడు హరి.
రెడీ అయ్యాడు మనోహర్ బయటకెళ్లాలని వాకిట్లోకి రాగానే ఎప్పడూ కన్పించని తేజస్పేదో కన్పించినట్టైంది మనోహర్కి. అది కలలో కూడా మనోహర్ వూహించని తేజస్సు. ఆ తేజస్స్ - ఉదయభానుని లేతకిరణంలా తళుక్కున మెరిసి మనోహర్ గుండెలోని అతి సున్నితమైన భాగాలను నులివెచ్చగా తాకింది. ఆ నులివెచ్చని లేతకిరణం పేరు మధురిమ.
మధురిమ గుమ్మం ముందు అందంగా ముగ్గులను తీర్చిదిద్దుతూ కన్పించింది. ఆ అమ్మాయి ఒంగి ముగ్గు వేస్తుంటే మనోహర్ చూసింది ఒక్కసారే అయినా చాలా పరిశీలనగా చూశాడు. ఒక అమ్మాయిని అలా పరిశీలనగా చూడటం మనోహర్ కి ఇదే మొదటిసారి.
చీరతో ఆ అమ్మాయి నడుం చుట్టబడిందే కాని అసలు నడుం వుందో లేదోనన్న అనుమానం కల్గింది. పలుచనైన ఆ చీరలో అక్కడక్కడ మధురిమ పచ్చని మేనిఛ్చాయ స్పష్టంగా కన్పిస్తోంది. బిగించిన పవిట కొంగును జాగ్రత్తను వ్యక్తం చేసిందే కాని అందాలను దాచలేకపోయింది. ముగ్గుపై చక్కగా తిరిగే ఆ సుతిమెత్తని చేయిని అలాగే చూడాలనిపించింది మనోహర్  కి. అలాచూస్తున్నప్పడు అప్రయత్నంగానే మనోహర్ గుండె సూటిగా స్పందించింది. ఎప్పడూ కలగని ఆ అనుభూతికి చిత్రంగా లోనయ్యాడు మనోహర్.
అక్కడి నంది కదిలి హోటల్ కెళ్ళాడు మనోహర్. టిఫిన్ తిని, నేరుగా బుక్ స్టాల్ కెళ్ళి బుక్స్ కొన్నాడు. ఫస్ట్ అవర్ లేకపోవటంతో నెమ్మదిగా కాలేజీకి వెళ్ళొచ్చు అనట్లుగా మెల్లగా ఇంటి ముఖం పట్టాడు
ఆశ్చర్యం... ఆ ముగ్గు వేసిన మధురిమ బాబు నెట్టుకుని తను వేసిన ముగ్గువైపు చూసి నవ్వుకుంటూ నిలబడి వుంది. ఆ నవ్వు ముగ్గువైపు చూసి వచ్చిన దైనప్పటికి, మనోహర్ కి మాత్రం తనని చూసి నవ్వినట్లే అన్పించింది. ఆ నవ్వు జీవితాంతం తన గుండెలో నిలబదిపోఎలా అన్పించింది.
కానీ... మధురిమ దగ్గర బాబు వుండటం చూడగానే మధురిమకు పెండ్లి అయిపోయిందేమో అన్న సందేహం వచ్చింది మనోహర్ కి. ఆ సందేహం వచ్చిన వెంటనే బాధగా అన్పించింది. ఆ భాదేన్డుకో తెలియలేదు మనోహర్ కి.
"అమ్మా బాబును తీసికో కాలేజీకి టైం అవుతోంది. నేను వెళ్ళాలి" అంటూ లోపలకెళ్ళింది.అంతవరకు గుమ్మంలో నిలబడి వన్న మధురిమ.
 మధురిమ మాటలు స్పష్టంగా విస్తున్నాయి. పక్కింట్లో ఉన్న మనోహర్ కి. ఆ గొంతు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది.
ఉండవే మధూ ఎక్కడ పని అక్కడే వుంది. ఇంకా వంటపని పూర్తి కాలేదు." అంటూ మధురిమ మాటను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్న తల్లివైపు అసహనంగా చూసింది మధురిమ.
"అమ్మా బాబుని తీసుకుంటావా లేదా?నీకే చెప్పేది. నాకు కాలేజీకి బ్రెం అవుతోంది. వీడిని నేను క్రింద వదిలేస్తున్నా అంటూ బాబును క్రింద వదిలింది మధురిమ,
బాబు ఏడుపు మొదలుపెట్టాడు-బాబు ఏడుస్తుంటే మధురిమకు బాధనిపించింది. బాబంటే మధురిమకు ప్రాణం. ఇంట్లో వున్నంత సేపు ఎత్తుకునే తిప్పతుంది. ఆడిస్తుంది. మదు, ముద్దు మాటలు నేర్పుతుంది. ఆకలేస్తే తినిపిస్తుంది. తినకుండా మారాం చేస్తే చందమామను చూపించి గోరుమద్దలు పెడుతుంది. బాబు పుట్టినప్పటి నుండి ఎక్కువ టైం బాబుతోనే గడచిపోతుంది.
మధురిమకు, బాబు ఇప్పడిప్పడే నడక నేర్చుకుంటున్నాడు. క్రింద వదలాలంటేభయంగా వుంది. రోడ్డుమీద వెళ్తాడని భయం. దొరికిన వస్తువుల్ని క్రింద పడేస్తాడని భయం.
“వాడ్నలా క్రింద వదిలి ఎందుకే ఏడిపిస్తావ్? వస్తున్నాను కదా! ఓపిక పట్టలేవా! ఏం మునిగిపోతుందని అంత తొందర?”
“తొందరే మరి. కాలేజీకి వెళ్లాలి”
“నువ్వొక్కదానివే కాలేజీకి వెళ్తున్నావ్? కాలేజీలకి వెళ్ళేవాళ్ళు ఇంట్లో పనులు చెయ్యరు. పిల్లల్ని ఎత్తుకోరు” అంది వెటకారంగా.
“ఇదో వెటకారమా మళ్లా! అర్ధం చేసుకోవూ” అంటూ సణిగింది మధురిమ.
“ఇంతే అర్ధం చేసుకునేది? ప్రొద్దుట నుండి ఆ ముగ్గు దగ్గరే గడిపేశావ్! ఇప్పుడేమో వాడ్నలా ఏడిపిస్తున్నావ్! నీకు బాగా పొగరు ఎక్కువైంది. నీ పొగరు అణిచెవాడొస్తే కాని నువ్వు మాట వినవు”
“అమ్మా! నువ్వు ఇంక ఆపుతావా!” బుక్స్ సర్దుకుంటూ అంది మధురిమ.
వసంతమ్మ మాట్లాడలేదు. ఏడుస్తున్న బాబును ఎత్తుకొంది. బాబు వెంటనే ఏడుపు మానేశాడు.
“చూడవే! ఏడుపు ఎలా అపెశాడో” అంది బాబును ముద్దు పెట్టుకుంటూ వసంతమ్మ.
“నువ్వలా ఎత్తుకుని కూర్చున్నా నిన్ను అడిగేవాళ్లు లేరు. నేను కాలేజీకి లేటుగా వెళ్తే నన్నక్కడ ఏమంటారో నీకు తెలియదు” అంది మధురిమ.
“ఏమిటే తెలిసేది నీ ముఖం! ఇంట్లో బాబు ఎదుస్తున్నాడని చెబితే ఏం కొడతారా, చంపుతారా?”
“కొట్టారు...చంపరు..కామెంట్స్ చేస్తారు. అదీ వెధవ కామెంట్స్”
“ఇంతా కామెంట్స్? చెప్పవే!” అంటూ తొందర చేసింది వసంతమ్మ,ఆమెకు ఆ కామెంట్స్ ఏమిటో తెలుసుకోవాలని వుంది. కూతురు మీద గవాలినా తట్టుకోలేదు వనంతమ్మ. తల్లితో చెబితే బాధ వుందని మధురిమకు తెలును. --చెప్పకపోతే కాలేజీలో తన పడే ఇబ్బందు లేమిటో తల్లికి అర్థం కాదు.
బాబు ఏడుస్తుంటే పాలిచ్చి రాకూడయా?" అంటారు గొంతు మార్చివెనుక వెంచి వాళ్ళు. ఒకరోజు లేటుగాలేటుగా వెళ్తే ఏమన్నారో తెలుసా? "దారిలో ఏ హీరో తగిలాడో" అంటూ వెటకారంగా నవ్వారు" అంటూ కాలేజీలో తన్ను కొన్ని కామెంట్స్ ని తల్లితో చెప్పింది మధురిమ.
"నా తల్లే... నాతల్లే... ఇన్ని మాటలబే నీకు?వాళ్ల నోళ్లు పడిపోనూ. ఆ వెధవల కూడా బాధలొస్తాయిలేవే చూస్తూ వుండు.మనల్ని అన్నవాడెవడూ బాగుపడరు. నువ్వేం బాధపడకు. ఏదో మన ఖర్మ బాగులేక నీ అక్కయ్య పోబట్టి మనకీ కష్టాలొచ్చాయి. లేకుంటే బాబు కూడా వాళ్లమ్మ దగ్గరే అల్లారు ముద్దుగా పెరుగుతూ వుండేవాడు. మనపాటికి మనం వుండేవాళ్ళం. నీ చడువేదే నువ్వు  చదువుకుంటూ మారాణిలా వుండేదానివి. అన్ని కష్టాలు మనకే వచ్చాయి” అని బాధపడ్తూ స్నానం చేయించాలని బాబుకి డ్రస్ విప్పతోంది వసంతమ్మ.
"సరేలేమ్మా! నువ్వ బాధపడకు" అంది మధురిమ. తల్లి బాధపడ్తుంటే మధురిమచూడలేదు. తండ్రి లేని లోటు మధురిమకు తెలియకుండా పెంచింది వసంతమ్మ. మధురిమకు ఏ చిన్న బాధ కలిగినా తట్టుకోలేదు వసంతమ్మ. అందుకే తల్లిని బాధపెట్టడం మధురిమకు ఇష్టం ఉండదు.
"నువ్వేం భయపడకు మధూ! ఆ వెదవలకి భయపడితే చదువుకోలేవు చదువు కుంటేనే  జీవితంలో ఏదైనా దక్కుతుంది. అది మనసులో పెట్టుకొని చదువకో ముందు నువ్వా డిగ్రీ సంపాదించావంటే నాకింకే దిగులు వుండదు" అంది మధురిమకు ధైర్యం చెబుతూ.
"అలాగే లేమ్మా!" అంటూ ఋక్స్ పట్టుకొని కాలేజీకి వెళ్లింది. పక్కింట్లో వున్న మనోహర్కి తల్లీ, కూతుళ్ల సంభాషణ స్పష్టంగా వినిపించింది. వాళ్ళ  మాటల్ని వినాలని లేకపోయినా, మధురిమ గొంతు వినాలన్న క్యూరియాసిటీతో మొత్తం విన్నాడు. వాళ్ల మాటలు ఆగిపోయాక బుక్ పట్టుకొనిచదువుకుంటూ కూర్చున్నాడు మనోహర్.
******
“పోస్ట్” అంటూ పోస్ట్ మాన్ కేక వినగానే బయటకి వచ్చాడు మనోహర్. మనోహర్ కి వుత్తరం వచ్చింది. విప్పి చూశాడు. వాళ్ల అన్నయ్య రాసిన వుత్తరం అది.
ప్రియమైన తమ్ముడికి, మీ అన్నయ్య దీవించి వ్రాయునది. నీవు బాగా-చదువుతున్నావనుకుంటాను. నేను ఈ నెల నీకు డబ్బు పంపటం లేదు. కారణం నేను, మీ వదిన అక్కడికి వస్తున్నాం. పదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకల్లా స్టేషన్ దగ్గర వచ్చి ఉండు. నేను నెల రోజులు లీవు పెట్టి వస్తున్నాను. బహుళా నీకు హాలిడేస్వుంటాయనుకుంటా. అందరం కలిసి ఒకేసారి మన ఊరు వెళ్దాము.
  ఇట్లు
మీ అన్నయ్య.
ఆ లెటర్ చదువుతున్న మనోహర్కి అన్నయ్య వచ్చినంత సంతోషం కలిగింది. ఇల్లంతా శుభ్రం చేయించాడు. ఆనందం పట్టలేక అప్పుడే తన ఫ్రెండ్స్  కూడా చెప్పాడు.
"అలాగైతే మేం వేరే రూంకి వెళతాము లేరా!" అంటూ హరి, కృష్ణ ఇద్దరు ఒకేసారి అన్నారు.
"ఎక్కడకు వెళతారు?మీరుంటే ఏమవుతుంది? ఓ... మా వదిన వస్తుందనా ఆమె ఏమీ అనుకోదు. ఆమె చాలా మంచిది" అన్నాడు మనోహర్.
 అది కాదురా! ఫ్యామిలీతో వస్తున్నారు కదా! ఇంత మందికి ఈ ఇల్లు ఇరుకవుతుంది మూడు రోజులేకదా! రామకృష్ణ రూమ్ లో వుంటాము" అన్నారు.
“వద్దురా! మీరు లేకుంటే నాకేం తోచదు. పైగా ఇవూడు ఎగ్జామ్స్ కదా! అనవసరంగా మీరు డిస్టర్స్ అవతారు. ఇక్కడే ఉండండి" అన్నాడు మనోహర్.
మూడు రోజులేగాఎంతలో వస్తాయి. రామకృష రూం కూడా విశాలంగానే వుంటుంది. మాకేం ఇబ్బందివుండదు. తర్వాత ఎలాగూ సెలవులు వస్తున్నాయి. అప్పుడు అందరం కలిసి ఎవరి ఊళ్ళకి వాళ్ళం చెక్కేద్దాం" అంటూ నవ్వేశాడు కృష్ణ.
"సరే!" అన్నాడు మనోహర్. వాల్లెలాగూ ఉండరని అర్ధమైంది మనోహర్ కి.
మనోహర్ మనసంతా అన్నయ్యవస్తున్నాడన్న ఉత్సాహంతో నిండి వుంది. పెద్దన్నయ్య అపుడప్పుడు వస్తుంటాడు. రెండో అన్నయ్య ఎపుడూరాడు. కారణం ఆయనకు సెలవలు తక్కువ. ఎపుడో మెరుపులా తళుక్కున కన్పించి అప్పుడే వెళ్ళిపోతాడు. ఇప్పుడు వస్తున్నది రెండో అన్నయ అందుకే వట్టరాని సంతోషం మనోహర్ కి.
******
మధ్యాహ్నం రెండు గంటలయింది.
ఆరోజే మనోహర్ అన్నయ్య, వదిన వస్తానన్నది. వెంటనే స్టేషన్ కెళ్లాడు మనోహర్.వాళ్ళ రాకను తలచుకుంటూ సంతోషంగా ట్రైన్ ని సమీపించాడు. అందరూ దిగుతున్నారు, కానీ మనోహర్ ఎదురుచూసే వాళ్ల రెండో అన్నయ్య వదిన మాత్రం రాలేదు. తిరిగి ఇంటికెళ్లలేదు మనోహర్.అక్కడే ఓ గంట వెయిట్  చేశాడు. తర్వాత ట్రైన్ కూడా వచ్చింది. అందులో కూడా రాలేదు. టైం చూసుకున్నాడు. ఐదు గంటలయింది. రేపోస్తారన్న ఆశతో ఇంటికెళ్లిపోయాడు మనోహర్.
*****
తూర్పు తెల్లబడింది.
ఉదయభానుడు ఎర్రగా మారాడు.
వెలుగురేఖలు ప్రపంచాన్నంతా వ్యాపించాయి.
అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తున్నాడు మనోహర్ ఎదురు చూపులకి ఫలితంగా టెలిగ్రాం వచ్చింది. రావటానికి వీలుకావటం లేదు అన్న ఆ టెలిగ్రాం చూడగానే నిరుత్సాహం ఆవరించింది మనోహర్ లో.
 బెడ్ పై పడుకొని బుక్ పట్టుకున్నాడు. చదవబుద్ది కాలేదు. ఆలోచిస్తూ పడుకున్నాడు. కృష్ణ, హరి లేకపోవటం వల్ల ఒంటరిగా అన్పిస్తోంది.
“అమ్మాయ్! మధూ! ఇవాళ నీకు సెలవేగా!” అంటూ అడిగింది మధురిమను వసంతమ్మ.
“అవునమ్మా!” సమాధానం చెప్పింది మధురిమ.
“మన పక్కింటి యశోదమ్మ గుడికి వెల్తోందట. వాళమ్మాయి కూడా వస్తోంది  గుడికి.ఒక్కర్తివే ఉండకపోతే మాతో రాకూడదూ!” అంటూ గుడికి వెళ్ళే ప్రయత్నం మీదనే రెడీ అవుతోంది వసంతమ్మ.
“మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నేను చదువుకోవాలి. నువ్వెళ్ళి రామ్మా! బాబును నేను చూసుకుంటాను” అంది మధురిమ.
“సరే! నీ ఇష్టం. అలాగే చదువుకో. బాబు జాగ్రత్త మరి.వాడసలే ఒక నిలవట్లేదు.నడకవచ్చినప్పటి నుండి..."
“అలాగే....” అంది మధురిమ,
"స్టా మీద పాలున్నాయి. కాస్త చూడు. పిల్లి తాగిపోతుంది. రాత్రికి బాబు త్రాగటానికి పాలు కావాలి" అంది వసంతమ్మ.
"అబ్బబ్బా. అదంతా నాకు తెలుసు. ఇక నువ్వెల్లమ్మా!" అంది మధురిమ. ఆ ఆదివారం కాబట్టి చిందరవందరగా పడివున్న బుక్స్ ని సరిచేస్తోంది.
వసంతమ్మ గుడికి వెళ్లింది.
అవీ ఇవీ సర్దేటప్పటికి ఓ గంట గడిచింది మధురిమకి. పనిమీదనే లీనమై వేరే విషయాలు పట్టించుకోకుండా ఇల్లంతా సర్దేసింది. ఇల్లంతా నీట్ గా ఉంటేనే చదువుకోవాలనిపిస్తుంది మధురిమకు.
బాబు గుర్తొచ్చాడు. అటూ-ఇటూ చూసింది.
బాబు కన్పించలేదు.
ఆశ్చర్యపోతూ ఇల్లంతా వెతికింది. బాబు లేడు. ఆడుకుంటూ కూర్చుంటాడని కొన్ని బొమ్మలు ముందేసి పనిలో మునిగిపోయింది మధురిమ. ఆడుకుంటూ, ఆడుకుంటూ ఎటువెళ్లాడో, ఏమో? వెంటనే పక్కకెళ్లి చూసింది. ఆ రెండు ఇళ్ళకి తాళాలు వేసి గుడికి వెళ్లారు. ఇక మిగిలింది నూడెంట్స్ ఉండే గది ఒక్కటే. ఆ నాలుగు వాటాలకి ఒకే వరండా వుండేలాగ కట్టించారు మధురిమ నాన్నగారు. బాబు రోడ్డు మీదకెళ్లే ఛాన్స్ లేదన్నట్లుగా గేటు వేసి వుంది. ఆశగా చుట్టూ చూసింది. బాబు జాడలేదు.
మధురిమలో క్షణక్షణానికి భయం ఎక్కువవుతోంది. కాళ్ల క్రింద భూమి కదులుతున్నట్లు అదిరిపోతుంది. ఏం చేయాలోఅర్ధం కాక గుండెలు దడదడ  కొట్టుకుంటున్నాయి. ఏడుపొచ్చేలా వుంది.
అంతలో... వచ్చీ, రాణి బాబు మాటలు – స్టూడెంట్స్ వుండే ఇంటిలోంచి విన్పించాయి. ప్రాణం వచ్చినట్లు అయిందిమధురిమకి. గబుక్కున ఒక్క అంగలో పరిగెత్తుతున్న దానిలా పక్కవాటాలోకి వెళ్లింది.
మనోహర్ ఒక్కడేవున్నాడు.
బెడ్ పై పడుకొని ఉన్న మనోహర్ గుండెలపై కూర్చుని వున్నాడు బాబు. తన బుల్లి బుల్లి  చేతులతో మనోహర్ చెంపల్ని తాకుతూ ముద్దు,ముద్దుగా వచ్చీ రాని మాటలు మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం ఒంటరిగా వున్న మనోహర్ కి బాబు మాటలు ఆనందాన్ని కల్గిస్తున్నాయి.
బాబుని చూడగానే తేలిగ్గా వూపిరి పీల్చుకుంది మధురిమ, బాబు మాటల్లో పడి తన గదిలోకి వచ్చిన మధురిమను గమనించలేదు మనోహర్.
"బాబెలా వచ్చాడు మీ దగ్గరికి?" అంటూ బాబును తీసుకోబోయింది మధురిమ. అప్పుడు చూశాడు మధురిమను మనోహర్. అంత దగ్గరగా మధురిమను చూసానని కలలో కూడా అనుకోలేదు మనోహర్, అలా చూడటం మధురంగా ఉంది మనోహర్ కి.
బాబు మధురిమ దగ్గరకి రానందుకు ఆశ్చర్యపోయింది మధురిమ.
 బాబును అలాగే ఎత్తుకొని, లేచి కూర్చున్నాడు మనోహర్.
మర్యాదపూర్వకంగా మధురిమవైపు చూస్తూ "కూర్చోండి" అన్నాడు.
“నేను కూర్చోటానికి రాలేదు. బాబునివ్వండి!" అంది మధురిమ. పిన్ని తనని తీసికెళ్తుందని బాబు గ్రహించాడు.
పిన్ని దగ్గరకు రావటం ఇష్టం లేనివాడిలా, మనోహర్ మెడచుట్టూ రెండు చేతులూ వేసి, ముఖాన్ని మనోహర్ గుండెలకి చేర్చి గట్టిగా హత్తుకున్నాడు బాబు. బాబు అలా హత్తుకోవటం గమ్మత్తుగా ఉంది మనోహర్ కి. బాబు తలపి చేయివేసి  ప్రేమగా విమరుతూ మెల్లగా నవ్వాడు మనోహర్. ఆ నవ్వు మనోహరంగా వుంది. ఆ నవ్వు చూడగానే... తామరాకుపై నీటిబిందువు కదిలినట్లు మధురిమలో ఏదో కదలిక.
మధురిమ వైపు చూశాడు మనోహర్. మధురిమ పోలికలు బాబు ముఖంలో స్పష్టంగా  కన్పిస్తిన్నాయి.
“బాబు చాలా బావున్నాడండి! మాటలింకా ముద్దొస్తున్నాయ్!బాబుతో గడుపుతుంటే టైం తెలియట్లేదు. ఈ బాబు మీకేమవుతాడు?”అడిగాడు మనోహర్.
“కొడుకవుతాడు” అంది మధురిమ.
"మీ కొడుకు కాడుకదా!" అన్నాడు మనోహర్. ఆ బాబు మధురిమ కొడుకు కాదని తెలుసు. కానీ ఏదో ఒక నెపంతో  మధురిమతో మాట్లాడాలని వుంది మనోహర్ కి
బాబుని ఇవ్వండి నేను వెళ్లాలి అంది మధురిమ.
"మీకు భయం ఎక్కువలా ఉంది" నవ్వాపుకుంటూ మధురిమ కళ్లలోకిసూటిగా చూస్తూఅన్నాడు.
"మీకెలా తెలుసు" అన్నట్లుగా మనోహర్ వైపు చూసింది.
"చూస్తేనే తెలుస్తోంది. పైగా రోజూ నాకు మీ మాటలు విన్పిస్తుంటాయి. మీరు భయపడడం... మీ అమ్మగా మీకు ధైర్యం చెప్పటం” అన్నాడు మనోహర్. ఎంతో కాలంగా పరిచయమున్న వ్యక్తిలా అన్పిస్తున్నాడు మనోహర్.
"... మరచిపోయాను మీ పేరు తెలుసుకోవచ్చా?"
నా పేరు నిజంగానే మీకు తెలియదా?"
తెలుసు. అందుకేగా మరచిపోయానని చెప్పాను. మీ నోటితో ఒక్కసారి చెప్పారనుకోండి! ఇక జన్మలో మరచిపోను"
"మధురిమ"
వెరీగుడ్! మీ పేరుకూడా మీ బాబులాగే అందంగా వుంది"
"బాబుమా అక్కయ్య కొడుకు" చాలాప్రశాంతంగా చెప్పింది. మనోహర్ని చూస్తుంటే మధురిమకు కూడా మాట్లాడాలనిపిస్తోంది.
"అది నాకెప్పుడో తెలుసు. అయినా మిమ్మల్ని చూస్తుంటే ఇంత పెద్ద కొడుకు వున్నాడని ఎలా అనుకుంటాను చెప్పండి?" అన్నాడు మనోహర్.
నవ్వింది మధురిమ, మధురిమ నవ్వింది మనోహర్ మాటలకి కాదు.బాబు తన దగ్గరకి రాకపోవటం చూసి.
అదే క్షణంలో హరి, కృష్ణ లోపలకొచ్చారు.
మనోహర్ అన్నయ్య వదిన వచ్చినంటారని, పలకరించి వెళ్దామని  వచ్చారు. గదిలోకి రాగానే మనోహర్ తో  మాట్లాడుతున్న మధురిమని చూసి . షాకయ్యారు మనోహర్ స్నేహితులు.
మనోహర్ స్నేహితుల్ని చూడగానే, మనోహర్ దగ్గరున్న బాబును లాక్కొని వెంటనే అక్కడ నుండి వెళ్ళి పోయింది మధురిమ.
అలా వెళ్తున్న మధురిమను చూడగానే అదోలా అయ్యారు హరి, కృష్ణ. వాళ్ళు లేని టైంలో ఒంటరిగా వున్న మనోహర్ దగ్గరకి మధురిమ రావటం ఏదోగా, అన్పించింది వాళ్లకి. పక్క ఇళ్లకి తాళాలు వేసి వుండటం చూసి మరోలా అనుకున్నారు. అన్నయ్య వదినల రాకపోవటం చూసి వాళ్ల ఆలోచనలు ఇంకోలా మారాయి.
మనోహర్దగ్గర కొద్దిసేపుకూడా కూర్చోకుండా ఏదోపని వన్న ఐయటకెళారు కృష్ణ, హరి.
"మాడరా కృష్ణా మనోహర్ ఎంత కన్నింగో దొంగ లెటరు సృష్టించి మన పక్కదారి పట్టించాడు. మనం వాడి మాటలు నిజమని నమ్మి రామకృష్ణ రూమ్ వెళ్ళాము. ఆ అమ్మాయి కోసం వాడు మనల్ని వెర్రి వెదవల్ని చేశాడుకదరా !”అన్నాడు హరి. మనోహరం కోపంగా వుంది హరికి.
"నువ్వు తొందరపడ్తున్నావు హరీ! ఆరోజు మనం వెళ్తామంటే వాడు వద్దన్నాడు. మనమే బలవంతంగా వెళ్ళాము. వాడు మనల్ని పంపలేదు” అన్నాడు కృష్ణ. కృష్ణకు మనోహర్ మనసు బాగా తెలుసు. అల్లరి చిల్లరి వాడు కాదని కూడా తెలుసు. కానీ ఇలగల్లఅమ్మాయి ఒంటరిగా వున్న మనోహర్దగ్గర ఎందుకుందో కృష్ణకు కూడా అర్థం కాలేదు.
“ చూడు కృష్ణా పక్కింటి అమ్మాయితో ఎంజాయ్ చేస్తాను, మీరుఫ్రెండ్ రూమ్ కి వెళ్ళండి అనీ డైరెక్టుగా ఎవరూ  చెప్పరురా! మనమే అర్థం చేసుకోవాలి, ఇప్పుడు అర్ధమైంది కదా. ఇక మన బ్రతుకంతా రామక్రుషణ్ రూమే ష్యూర్!” అన్నాడు హరి.
"మరీ అంత చోద్యంగా మాట్లాడకురా! నువ్వెంత చెప్పినా మనోహర్ ఆ అమ్మాయిని ప్రేమించాడంటే నేను నమ్మను. ఎందుకంటే వాడికి వాళ్ళ అక్కయ్య కూతురు పద్మ వుంది. వాడు పెళ్ళి చేసుకునేది పద్మనే. ఇంకెవరినీ చేసుకోడు. నువ్వు ఆలోచించేదంతా రాంగ్!” అన్నాడు కృష్ణ.
“ఓహో! నువ్వు ఆ రూట్ లో వస్తున్నావా! ప్రేమించేటి అంతా సీన్ లేదమ్మా అక్కడ! జస్ట్ టైం పాస్! అంటే. ఇలాంటి కేసులు నా ఎయిట్ క్లాసు నుండే నా కళ్లలో పడ్తున్నాయి నాకు అనుభవం ఎక్కువ. ఇలాంటి క్యారెక్టర్లకి ప్రేమలూ-విరహాలు వుండవు. ఎప్పుడు దొరికితే అప్పడు, ఎవరికీ కావలసింది వాళ్ళు దోచుకోవటమే” అంటూ జీవిత సత్యం చెపుతున్న వాడిలా కృష్ణ ముఖంలోకి చూశాడు హరి.
హరి మాటలు కృష్ణకు నచ్చలేదు.
“మరీ అంత చీప్ తీసేయకురా మనోహర్ని.  వాడు చాలా డీసెంట్ సెవెంత్ క్లాస్ నుండి మనోహర్ (ఫెండ్ని నేను" అన్నాడు కృష్ణ.
 "అందుకే నువ్వు నీ కళ్లతో చూసినా చూడనట్టే నట్టిస్తున్నావ్నేనలా కాదు. ఇలాంటి విషయాలను కళ్లతో చూడకపోయినా వాసన చూసి పసిగట్టగలను. నన్నెప్పుడూ తక్కువగా అంచనా వెయ్యకు" అన్నాడు హరి. హరికి నచ్చచెప్పటం సాధ్యం కాదు అనుకున్నాడు కృష్ణ.
“ఇక పోనివ్వరా హరీ! మనకెందుకు వాదన? ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. జడ్జి మెంట్ చెప్పటానికి మనమెవరం చెప్ప!" అంటూ-మనోహర్ పై  అభిమానంతో హరి అనుమానించినంత తేలిగ్గా కృష్ణ అనుమానించలేక హరికి నచ్చచెప్పాడు. కృష్ణకి అంతా అయోమయంగా వుంది.
ఇద్దరూ కలిసి రామకృష్ణ రూంకి వెళ్లారు.
- - -
గుడికి వెళ్ళి అప్పుడే ఇంటికొచ్చిన వసంతమ్మ ఇంటిముందు ఆటో దిగుతున్నఅల్లుడిగార్ని చూసి
“మధూ! మీ బావగారు వస్తున్నారు" అంటూ రంగారావుకి గుమ్మంలోనే ఎదురుపడి లోపలికి ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు వేస్తూ కుర్చీ చూపింది. కూర్చోమన్నట్లు. రంగారావు. మంచినీళ్ళు ఇమ్మని మధురిమ చెప్పింది.
 (సశేషం)

No comments:

Post a Comment

Pages