కూచిపూడి నాట్యమయూరి - రేఖా సతీష్ 

భావరాజు పద్మిని 


కన్నడ దేశంలో పుట్టి, తమిళనాట వెంపటి చినసత్యం గారి శిక్షణలో నాట్యంలో దిట్టగా తనను తాను మలచుకుని, నేటి పేరొందిన కూచిపూడి నాట్యకారిణులలో అగ్రశ్రేణిలో ఉన్నారు – బెంగుళూరులో నివసిస్తున్న రేఖా సతీష్ గారు. ఆమెతో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల విశేషించి మీకోసం.
మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నారా ?
నాకు ఐదేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. మాది
 సంగీత కుటుంబం. తాతగారు సంగీత విద్వాంసులు, చెన్నైలో ఉండేవారు, తర్వాత బెంగుళూరు షిఫ్ట్ అయ్యారు.  అమ్మ సంగీత విద్వాంసురాలు. కాని, వాళ్లకి డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండడంతో నాకు నాట్యం నేర్పించారు. ముందు ఐదేళ్ళు, అంటే నాకు పదేళ్ళు వచ్చేదాకా నేను భరతనాట్యం నేర్చుకున్నాను, పద్మిని రావు గారని, కమలా పాండే గారని, వీరివద్ద అభ్యసించాను. తర్వాత ఒక మాష్టారు గారి డాన్స్ బాలే చూసి, ప్రభావితురాల్ని అయ్యి, అక్కడకు వెళ్లి, చేరాను.
మీరు భారత నాట్యం నేర్చుకున్నారు...కూచిపూడి నేర్చుకున్నారు. ఈ రెండింటి మధ్యలో ముఖ్యమైన తేడా ఏంటండి ?
భరతనాట్యం, కూచిపూడి లలో వుండే ఒక మేజర్ డిఫరెన్సు ఏంటంటే భరతనాట్యంలో డాన్సర్ ఒక క్యారెక్టర్ గురించి వర్ణిస్తుంది. ‘ఒక కృష్ణుడు లేక విష్ణువు....’ ఇలా వుండేవారు అని డాన్సర్ వివరిస్తుంది. అంతే కానీ, తనే క్యారెక్టర్ కాదు. కూచిపూడిలో డాన్సర్ తనే ఆ పాత్ర అయిపోతుంది. ఇందులో స్టెప్స్ (మూవ్మెంట్స్), భరతనాట్యంతో పోల్చితే  చాల    ఫాస్ట్ గా, గ్రేస్ ఫుల్  గా వుంటాయి.
ఇంకో అడ్వాoటేజ్ ఏంటంటే మాస్టర్ గారు ( వెంపటి చిన సత్యం ), నాట్యశాస్త్రం లో ఒక్క బిట్ వదలకుండా అన్నీ చెప్పేసారు. మాస్టారి గారి శైలి లో 70 స్టెప్స్ వున్నాయి. తరువాత  5 జతీస్... ఫస్ట్ హాఫ్ జతీస్... సెకండ్ హాఫ్ జతీస్... ఇవన్నీ ఏ ఇండియన్ మ్యూజికల్ స్టైల్ లో నేను చూడలేదు. అది ఒక బ్యూటీ మాస్టర్ గారిది.
మీ మొట్ట మొదటి ప్రోగ్రాం ఎప్పుడిచ్చారు ?
నేను 5 years వున్నప్పుడు, నాన్న గారు LIC ముంబై లో వర్క్ చేసేవారు. వాళ్ళ యానువల్ డే సెలెబ్రేషన్స్ అప్పుడు నా మొదటి ప్రోగ్రాం ఇచ్చాను. తరువాత గురువు గారి భరత నాట్యం, డాన్స్ డ్రామాలు, సోలోలు... అలా కంటిన్యూ అయిపోయింది.
మరి కూచిపూడి నేర్చుకున్నాక మీ జర్నీ ఎలా సాగింది ?
నేను మా అక్క దగ్గరకి వెళ్ళిన తరువాత “....నువ్వేం నేర్చుకున్నావో అన్నీ మర్చిపోవాలి. A B C D ల నుంచి ఎలా నేర్చుకున్నావో అలా నేర్చుకోవాలి అని చెప్పారు...”. వెంపటి చిన సత్యo మాస్టారు గారి శైలి లో అన్నీ నేర్చుకోవాలని అన్నారు.
మరి మీరు వుండేది బెంగుళూరు కదా... మరి వెంపటి చిన సత్యం గారి స్కూల్ చెన్నై లో వుంది కదా ... మరి మీరు వారి దగ్గరకి ఎప్పుడు వెళ్లారు ?
నేను 14 ఇయర్స్ అప్పుడు వెళ్ళాను. నాకు ఒక వారం కాలేజీకి సెలవు
దొరికినప్పుడో, లేక ఒక నెల సెలవులు వచ్చినప్పుడో వెళ్లి అక్కడ హాస్టల్ లో వుండేదాన్ని. అలా 4 నుంచి 5 సంవత్సరాలు అలా చేశాను. తరువాత నాన్న గారికి హార్ట్ ఎటాక్ రావడంతో ఇబ్బంది వచ్చింది. తరువాత నేను బెంగుళూరు లో మంజు భార్గవి గారి దగ్గర కంటిన్యూ చేశాను. వాళ్ళ దగ్గర డాన్స్ ప్రోగ్రాంలు, కొరియోగ్రఫీ ఇలా 10 ఇయర్స్ చేశాను. ఇప్పుడు 4, 5 సంవత్సరాల నుంచి నా సొంత కొరియోగ్రఫీలో చేస్తున్నాను.
ఇప్పుడు మీరేమేమి వైవిధ్యాన్ని ఇందులో (కూచిపూడి) క్రియేట్ చేసారు ?
ముందు మాస్టారి గారి దగ్గర ఒక పద్దతిలో నేర్చుకున్నాం మేము. దాన్ని ఈ ట్రెండ్ కు నచ్చేలా తీర్చిదిద్దాము. మాకు సొంతంగా ‘కూచిపూడి పరంపర ఫౌండేషన్’ అనే  ప్రొడక్షన్ వుంది. నేను, నా ఫ్రెండ్స్ కలిసి ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటాము.‘ పంచ నాయిక ’ అని ఫైవ్ విమెన్ క్యారక్టర్స్  సీత, ద్రౌపది, లక్ష్మి, రుక్మిణి, సత్యభామ తీసుకుని, వీళ్ళెంత శక్తిమంతులు అండ్ ఎంత సాక్రిఫైస్ చేసారు అనేది చెప్పాము. కన్నడ లిటరేచర్ తీసుకుని , దాస సంప్రదాయం మీద, ఇలా కొత్త స్క్రిప్ట్స్ చెయ్యాలని చూస్తున్నాము. ఎవరూ చేయలేరు అనే ఇంటెన్షన్ తో మేము స్క్రిప్ట్స్ తీసుకుని కొత్త కొరియోగ్రఫీస్ చేస్తుంటాము.
చాలా బావుందండి.. ఇప్పుడు మీరు చేసిన డాన్స్ బాలేస్ లో బాగా పాపులర్ అయిందేంటి ?
‘ పంచ నాయిక ’ బాగా పాపులర్ అయింది. ఈ బాలేని సెంటర్ అఫ్ మినిస్ట్రీ వాళ్ళు అబ్రాడ్ ఫెస్టివల్ కి స్పాన్సర్ చేసారు. అది ఒక పెద్ద అచీవ్మెంట్.
మీరు బాలేస్ జెనరల్ గా ఎక్కడ రాయిస్తారండి ?
మా అమ్మ గారు మాకు బాగా హెల్ప్ చేస్తారు. లిరిక్స్. మ్యూజిక్ సపోర్ట్ అంతా అమ్మ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మేము చేస్తాము.
మీరు పొందిన అవార్డులు గాని, మర్చిపోలేని ప్రసంశలు గాని ... వాటి గురించి చెప్పండి.
నేను16 సంవత్సరాలు వున్నపుడు, కన్నడ కల్చరల్ డిపార్టుమెంటు ప్రతి
సంవత్సరం దసరాకి ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళు ‘హలేబీడు’ ఫెస్టివల్ అని పెద్ద ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసారు. ఆ ప్లేస్ లో ఒక రెండు సంవత్సరాలు గా వర్షాలు లేవు. నేను శివతాండవం చేసినప్పుడు ... ఐ జస్ట్ బిగిన్ మై ప్రోగ్రాం.... అప్పుడు ఆల్మోస్ట్ వర్షం అలానే కురిసింది. మొత్తం 2500 మంది ప్రేక్షకులు, నేను అందరం పూర్తిగా తడిచి పోయాము. ఒక్కరు కూడా లేవకుండా అలానే కూర్చుండి పోయారు.
ఆ ఐటెం అయిన వెంటనే ఒక ఇద్దరు, ముగ్గురు (... వాళ్ళ ఏజ్ 60 నుంచి 65 సంవత్సరాలు వుంటాయి ) వచ్చి అలానే స్టేజి మీద నా కాళ్ళ మీద పడి పోయారు. “ ... మాకు రెండు రెండు సంవత్సరాల నుంచి వర్షాల్లేవు. నువ్వు చేసిన శివతాండవం తో వర్షాన్ని సృష్టించావు. నువ్వు దేవతవి “. ఇది నా జీవితంలో ఒక మర్చి పోలేని సంఘటన మరియు అవార్డు కూడా . ఆ తరువాత, చాలా అవార్డ్స్ వచ్చాయి. అయితే ఆ సంఘటన మాత్రం ఎప్పటికి నాతో ఉండిపోతుంది.
నిజమేనండి చాలా అరుదైన సంఘటన. చాలా అరుదుగా దక్కే గౌరవం. బావుందండి... మీ దృష్టిలో నాట్యం అంటే ఏమిటి ? ఎలా వుండాలని మీ భావన ?
ఇంగ్లీష్ లో చెప్పాలంటే, “Any Dance is Meditation. It’s a Form of  expression of oneself for seeking  Salvation to God.”  ఎందుకంటే ఇప్పుడు దాన్ని అందరు కమర్షియల్ గా చూస్తారు లేదా ఒక కెరీర్ గా లేదా ఒక పబ్లిసిటి గా చూస్తారు. ఇప్పుడు యంగ్ జెనరేషన్ దృక్పధం ఇలా వుంది.
కానీ నేను నేర్చుకున్నది అలా నేర్చుకోలేదు. మాకు డాన్స్ అనేది ఒక డివినిటీ. ఒక ఎక్స్ప్రెషన్ మైండ్ లోనుంచి వస్తేనే ఆ ఆడియన్స్ కి మనం కనెక్ట్
అయిపోతాం లేక పోతే వి కాంట్ కనెక్ట్.
మనం డాన్స్ ను ఒక కమర్షియల్ యాస్పెక్ట్ లో చూస్తే, దాని విలువ తగ్గి పోతుంది. అది నా ఫీలింగ్. నేనెప్పుడు డాన్స్ చేసినా, 200% నిబద్దతతో చేశాను. అలా చేస్తే మనం వేరే లెవెల్ కి వెళ్లి పోతాము.
నేను 5 ఇయర్స్ , 6 ఇయర్స్ లో డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు, నాకే సంతోషంగా అనిపించేది. నా చేతులు కాళ్ళు ఇలా మూవ్ చేస్తున్నాను. ఇదొక ఎక్సర్సైజ్ నాకు. ఇది చేయడం నాకు చాలా ఇష్టం... ఇలాంటి ఫీలింగ్ తో నేను డాన్స్ చేసేదాన్ని.
నాకు 15, 16 ఇయర్స్ వున్నప్పుడు స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పుడు, ఒక పది పదిహేను మంది వచ్చి నువ్వు చాల బాగా చేసావు...అని ఈ ఐటెం ఇలా వున్నది అని ఒక్కొక్క దాని గురించి వివరించి చెప్తుంటే ఆ ఫీలింగే వేరు. అప్పుడు నాకు “ ఐ యాం డూయింగ్ సంథింగ్ నైస్ ” అనే అచీవ్మెంట్ ఫీలింగ్ వుండేది.
తరువాత 25, 30, 35 ఇయర్స్ అప్పుడు ... నేను నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దాన్ని ఇంకో లెవెల్ కి తీసుకు వెడుతున్నాను  అని ఫీల్ అయ్యాను.
నేనా మూడు స్టేజ్ లలో నన్ను నేను ఎంతో మలచుకున్నాను. ఇప్పుడు నేను నాట్యాన్ని మరో దృక్పధంతో  చూస్తున్నాను.
ప్రతి డాన్సర్ కానీ, ఆర్టిస్ట్ కానీ ఆ ఫీలింగ్స్ అనుభవిస్తేనే, వాళ్ళలో వుండే ఆర్ట్ కి పరిపూర్ణత అనేది వస్తుంది లేకపోతే దానిలో వుండే సౌందర్యాన్ని వాళ్ళు ఆస్వాదించలేరు.
బావుందండి... ప్రస్తుత తరానికి డాన్స్ ఎంతవరకు అవసరం అంటారు ?
నేను డాన్స్ మాత్రమే కాకుండా HR గా టాప్ MNC కంపెనీ ల్లో లైక్ HCL వర్క్ చేశాను. నా ఫీల్డ్ లో కూడా నేను బాడీ లాంగ్వేజ్ అండ్ కాన్ఫిడెన్సు మెయింటైన్ చేసేందుకు డాన్స్ చాలా వుపయోగపడింది. అంతే కాకుండా నన్నొక విభిన్న వ్యక్తి గా నిలబెట్టింది. ఎవ్వరైనా చదువుతోపాటు కళలు కూడా అభ్యసిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఎక్కడైనా ధైర్యంగా నిలబడగలమని నా భావన.
చాలా చక్కగా చెప్పారు అండ్ ఇన్స్పైరింగ్ గా కూడా వుంది.... ధన్యవాదాలండి.... రేఖ గారికి మరిన్ని విజయాలు సొంతం కావాలని మనసారా ఆకాంక్షిద్దాము.
వారి నాట్యాన్ని క్రింది లింక్ లో చూడండి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top