కాషైన చెక్కు

ఆదూరి హైమావతి


“అమ్మాయ్! భానూ ! ఈ రోజు సాయంకాలం కాస్త త్వరగారా! పెళ్ళివాళ్ళొస్తారుట ! నిన్నుచూసుకోను. ఈరోజు చాలా బావుందని ఫోన్  చేశారు.” బీ.కాం .చదివిబ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న భానుతో వాళ్ళనాన్న నాగేశం చెప్పాడు.
“నాక్కుదరదు నాన్నా! ఈ రోజు సోమవారం , బోల్డుమందిచెక్కులతోనూ, క్యాష్డిపాజిట్చేయనూవస్తుంటారు. పైగా ఇన్స్ పెక్షన్ ఉంది. సాయంకాలం ఆరవుతుంది. పోనీ ఓపని చేయండి వాళ్ళని మాబ్యాంక్  పక్కనేఉన్న  ‘శాంతిధాం ‘హోటల్ కురమ్మనండి,  అందరం అక్కడే  కాఫీత్రాగుతూ మాట్లాడుకుందాం."అంది భాను, తండ్రిని సముదాయిస్తున్నట్లు.
"నీదిమరీనే ! హోటల్లో పెళ్ళిచూపులేంటే!" కోపంగా అరిచింది తల్లి తాయారు.
"ఏవమ్మాఐతే ! రైల్ పెట్టెల్లోనూ,  విమానాల్లోనూ, బస్టాండుల్లోనూ కూడా ఈకాలంలో పెళ్ళిచూపులు జరుగుతున్నై జరూరని. హోటల్లో  ఐతే ఏమీఫరవాలేదు. రమ్మనండి, నాకుమాత్రం తీరదు ముందుగారాను.”
"ఈచదువుకున్నపిల్లలు మాట వినరు కదా!భగవంతుడా!" అరిచింది తాయారు.                                  "ఏందుకేఅలా అరుస్తావ్! అమ్మాయన్నదాంట్లో కూడా అర్ధంలేకపోలేదు.ముందుగారాను తీరదన్నదికానీ అసలు చూపులవద్దనలేదుగా !అక్కడైతే నీకు కారాలు చేయనూ , నాకు స్వీట్లు తేనూ పనితప్పుతుంది. అలాగేలేభానూ ! ఆరుకల్లావచ్చేయి, బావుండదులేకపోతే."
"మీ అలుసుచూసుకుని  అదిట్లా ఉరిమురిమిపడుతోంది."తల్లిమాటలు వినినవ్వుకుంటూ తండ్రికి చేయి ఊపివెళ్ళింది భాను.భానుమతి - నాగేశం,తాయార్లకు ఒక్కగానొక్క బిడ్డ, గారాబం చేసినాతీర్చిదిద్దారు చక్కగా , భాను అందంతో పాటుగా అణకువగల  అమ్మాయి. కట్నంఅడిగే వాళ్ళనుచేసుకోనని బిడాయించి కూర్చుంది భాను. స్టేట్ బ్యాంకలోఆఫీసర్ గాచేస్తున్నది.మంచి ఉద్యోగనేపేరుకూడా సంపాదించింది,జీతంతోపాటుగా. అంతా భాను అంటేఅభిమానిస్తారు.
పనిచూసుకుని అలసిపోయిన ముఖంతో ఆరింటికల్లా అనుకున్నచోటుకువచ్చింది భాను తల్లిదండ్రులమాట నిలపను. భాను వచ్చాక పావుగంటకు పెళ్ళికొడుకు ,తల్లి తండ్రి, చెల్లెలూ వచ్చారు. పెళ్ళి కొడుకు భానును  విష్ చేసి"నా పేరు పవన్,  మిమ్మల్ని బ్యాంక్లో ఒకరోజు పనిమీద వచ్చిచూశాను."అన్నాడు.
"ఓహో! మీరు కారుమీదా, స్కూటర్ మీదాకాక పనిమీద వస్తారన్నమాట "అంది సీరియస్ గా ముఖం పెట్టి. పవన్ తో పాటుగా అంతా నవ్వేశారు. వాతావరణం తేలికైంది.
"బావుంది.పనిచేసి అలసిపోయి వస్తారనుకుంటే , హాస్యంగానే ఉన్నారు."అన్నాడు పవన్.
 "ఏంతీసుకుంటారు?"అడిగాడు నాగేశం.
"ఇస్తే మీ అమ్మాయిని తీసుకుంటా నా అర్ధాంగిగా "అన్నాడు పవన్.
"ఇవ్వనూ తీసుకోనూ నేనేం  వస్తువునుకాను.లేదా చెక్ ఇస్తే ఇవ్వనుకాషూనూకాను."అంది భాను.
"అదేంటమ్మా! మీబ్యాంక్లో చెక్కివ్వగానే డబ్బిచ్చేస్తారని విన్నాం."అన్నాడు పవన్తండ్రి.
" మీ అకౌంట్లో  డబ్బుంటే ఇస్తామండీ, చెక్ చేసి."
"మీనాన్నగారి అకౌంట్లో  ఉన్నదే మేమూ అడుగుతున్నామమ్మా!"అంది పవన్తల్లి ఆమెకూడా లెక్చరర్.
"చెక్ లో సంతకం ట్యాలీ చేశాక క్యాష్ ఇస్తామండీ!"అంది భాను.
"అన్నీ సరీగానే ఉన్నాయివదిన గారూ! కావాలంటే చెక్ చేసుకో! క్యాస్ త్వరగాకావాలంటున్నామని కావాల్ని ఆలీస్యం చేయకు. మాఅన్నయ్యాఉండలేడు."అంది పవన్ చెల్లి, ఆ అమ్మాయి కూడా బీటెక్ చదువుతోంది.
" ఎవరైనాగానీ టోకెన్ తీసుకుని క్యూలో ఉండకతప్పదు."అంది భాను.
"బ్యాంక్ మేనేజర్ రెకమెండేషన్ ఉంటేనో!"పవన్ నవ్వుతూ అన్నాడు.
"అప్పుడు ఆయనదగ్గరకే వెళ్ళి క్యాష్ తీసుకోవాల్సి ఉంటుంది." అంది భాను.
"అమ్మాయ్! ఏంటామాటలు అలా మాట్లడవచ్చా! సీమటపాకాయల్లామాట్లాడుతున్నావుతప్పుకదూ!! "మెల్లిగా మందలించింది  భానును తాయారు.
“ఎల్లండే దీపావళికదండీ! ముందుగానే టపాసులు మోగుతాయోలేదో చెక్చేసుకోడం మంచిదేగా!”అన్నాడు పవన్ తండ్రి.
 "ఫరవాలేదు అత్తయ్యగారూ! నేనూ, మా వాళ్ళూకూడా ఏమీఅనుకోము.బ్యాంక్ అన్నాక వారి ఫార్మాలిటీస్ వారికుంటాయికదండీ! డబ్బుకుసంబంధించిన విషయం వారు అన్నీ చెక్ చేసుకున్నాకే ఏదైనా చేయడంవిధాయకంకదా!”
ఇంతలో నాగేశం గారు ఆర్డరిచ్చిన  మైసూరుపాకూ, పకోడీ వచ్చాయి.
"బావుంది మైసూర్పాక్ !"అంటూ నోట్లోపెట్టుకుని కొరికాడు పవన్.
"బావుందని ఎక్కువగాతింటే  స్వీట్కదా! ఆరోగ్యం జాగ్రత్త "అంది భాను.
"వదినా ! నీకు పకోడీ ఇష్టంటకదా!అదీ ఎక్కువగాతింటే కడుపునొప్పివస్తుంది."
"బ్యాంక్ వాళ్ళకు మెడికల్ బిల్స్ ఫ్రీ లేవే లావణ్యా!" నవ్వుతూ అన్నాడు పవన్.
"నాతోపాటుగా నాకుటుంబానికీ ఇస్తారు  మరి." అంది భాను
"ఇంకేం అందరం బాగా తిందాం కానివ్వండి, అందరికీ భానుబ్యాంక్ మెడికల్బిల్స్ ఇస్తుందిలే. ఓకేనా భానుగారూ! "అన్నాడుపవన్
"మా చెక్ సరిగా ఉన్నట్లేనామ్మాయ్?"అంది పవన్ అమ్మ.
"క్యాష్ ఇచ్చేస్తారనుకుంటా మాబ్యాంక్ అకౌన్ట్, సంతకం ట్యాలీ ఐనట్లేనాఅమ్మాయ్!!"అన్నాడు పవన్ తండ్రి.
"కాషిస్తే తీసేసుకుని వెళ్తాం."అన్నాడు పవన్.
"ఇదేంటర్రా! పెళ్ళిచూపులని వచ్చి చెక్కూ, క్యాషూ,సంతకాలూ, అకౌంటూఅంటూ మాట్లాడుకుంటారూ?ఊరూ, పేరూ , చదువూ  కట్నకానుకలూ గట్రాకాదూ మాట్లాడుతా!" తాయారమ్మ కు  అర్ధంకాక వెర్రిగా అడిగింది, ఆమెపల్లెటూరి పడుచు.
"వదినగారూ !ఇహ పప్పన్నానికి ముహూర్తం పెట్టించీయండి.చెక్కుకాషైనట్లుంది.అంతాసరిపోయింది." అంది పవన్ తల్లి.
"కందిపప్పన్నమ్మాత్రం అడక్కండి"అన్నాడు నాగేశం.
అంతా నవ్వుకుంటూ కాఫీతాగసాగారు. పవన్, భానూ చూపుల బాణాలుపరస్పరం విసుకుటుండగా.ఎక్కడో టపాసులు పేలినశబ్దమైంది.
       &&&&&&&&&&&&&&&&&&&&&&&&

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top