ప్రేమతో నీ ఋషి – 17

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే ఋషితో చెప్తుంది. మహేంద్రను కలిసిన ఋషి, అతని వ్యాపార ప్రతిపాదనకు అంగీకరించి, స్నిగ్దను, అప్సరను ఆఫీస్ లో కలుస్తాడు. అప్సర, ఋషి మధ్య చనువు స్నిగ్ధకు ఆందోళన కలిగిస్తుంది.విశ్వామిత్ర పెయింటింగ్ ను ఇటలీలో కొన్నట్లు, అది అప్సర ఇంట్లో ఉన్నట్లు స్నిగ్ధకు చెప్తాడు మృణాల్.  పెయింటింగ్ తన వద్ద  ఉన్నట్లు, అది చూడాలంటే వెంటనే రమ్మన్నట్లు అప్సర ఋషికి ఫోన్ చెయ్యగానే  వెంటనే బయలుదేరతాడు ఋషి. ఇక చదవండి...)
“హాయ్, స్వాగతం ఋషి, “ అంటూ నవ్వుతూ ఋషిని లోపలకు ఆహ్వానించింది అప్సర.
“హాయ్ అప్సర, ఆ పెయింటింగ్ నీకు దక్కిందని తెలుసుకుని, నేను ఆనందించాను. నేను దాదాపుగా పరిగెత్తుకు వచ్చాను తెలుసా ?” ఋషి తన ఉత్సాహాన్ని గురించి చెప్పాడు.
“పెయింటింగ్ ను చూసే ముందు ఈ డ్రింక్ తాగు,” అంటూ అప్సర అతనికి డ్రింక్ ను అందించింది.
డ్రింక్ తాగుతూ ఉండగా, అప్సర తనకు ఫోన్ లో చెప్పిన విధంగా కాక, అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గుర్తించాడు ఋషి. ఆ రోజుకు ఋషి ఒక్కడే ఆమె అతిధిలాగా కనిపిస్తున్నాడు.
ఎందుకో ఒక్కసారిగా స్నిగ్ధ గురించిన ఆలోచన, ఆమె భయాలు అతని మనసులో మెదిలాయి. కాని, అతను త్వరగా మనసు మళ్లించుకుని, అప్సరను చూడసాగాడు.
ఆమె ఒక ఎర్రటి కాశ్మీరీ సిల్క్ చీర, డిసైనర్ బ్లౌస్ వేసుకుని ఉంది. ఆ బ్లౌస్ ను ఎంత అందంగా డిజైన్ చేసారంటే, సరిగ్గా ఆమె భుజం మీద ఒక కట్ ఉంది, దాన్నుంచి ఆమె అందమైన భుజపు నునుపులు కనిపిస్తున్నాయి.
“మరికాస్త  కావాలా ?” భుజాలు రాసుకునేలా డ్రింక్ అందిస్తూ అంది అప్సర. అతను దాదాపుగా మైకంలో ఉన్నట్లు తలాడించాడు.
మామూలుగా స్త్రీలకు ఉండే ఇతర శరీర భాగాలతో పోలిస్తే భుజానికి ఉండే ప్రాముఖ్యత తక్కువ. అది స్త్రీలోని అమాయకత్వాన్ని వెలిబుచ్చుతుంది. బాల్ రూమ్ పోటీలలో, మామూలుగా చాలా కాస్ట్యూమ్ లను స్త్రీల భుజం/భుజాలు కనిపించేలా డిజైన్ చేసి, ఆ వైపునే వారు నాట్యం చేసేలా చూస్తారు. మెడకి, భుజానికి మధ్యన ఉండే సున్నితమైన ఎముకలు కనిపించేలా కాస్ట్యూమ్ డిసైనర్లు బట్టలు రూపొందిస్తారు.
ఆమె ఋషికి డ్రింక్ ఇచ్చి, తిరిగి సోఫాలో కూర్చుంది. అతను త్రాగుతూ ఆమెను ఉద్దేశాన్ని స్పష్టంగా గమనించసాగాడు. ‘ఆమె శరీర కదలికల్లో ఏదో సందేశం స్పష్టంగా కనిపిస్తోంది,’ అనుకున్నాడు అతను. ఒక స్థితిలో, ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాడు. కేవలం ఒక్క సెకనుకే అయినా, అతనికి షాక్ కొట్టినట్లు అయ్యింది.
ఒక స్త్రీ, ఒక పురుషుడి వైపు చూసే చూపు కన్నా, గాఢమైనది ఏదీ ఉండదు. పెయింటింగ్ మాత్రమే కాకుండా తనవద్ద అతనికి ఇచ్చేందుకు ఎంతో ఉందన్న సందేశాన్ని ఇవ్వడానికి అదే అత్యుత్తమమైన మార్గమని, ఆమెకు బాగా తెలుసు.
“అయితే, నీకు ఆ విశ్వామిత్ర పెయింటింగ్ ను చూడాలని ఉందా?” మత్తుగా అంటూ, “అన్నట్లు, ఆ పెయింటింగ్ అంటే నీకు ఎందుకంత ఇష్టం, సమ్మోహనంగా కనిపించే మేనక పోసు కోసమేనా ?” బిగ్గరగా నవ్వుతూ అంది అప్సర.
ఋషి ఏమీ బదులివ్వలేదు; మౌనంగా తల ఊపాడు. పెయింటింగ్ ను చూడాలని అతని మనసంతా నిండి ఉన్న భావన, అప్సర వల్ల స్పష్టంగా చెదిరిపోతోంది. ఆ చంచలత్వాన్ని నిరోధించేందుకు అతను శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.
అతను త్రాగడం ముగించగానే, ఆమె తన ఇంట్లోకి దారి తీసింది. అతను మౌనంగా ఆమెను అనుసరించాడు. ఆమె నడక, ఆమె ‘ఇష్టమైన ఆహ్వానాన్ని’ తెలుపుతోంది.
సెక్సీ గా దుస్తులు ధరించే స్త్రీల పట్ల చాలామంది పురుషులు తేలిగ్గా ఆకర్షితులు అవుతారు. అందుకు శరీరం అంతా బైటికి కనిపించనక్కర్లేదు. కాని, ఋషిపై అప్సర ప్రయోగించిన అస్త్రాల్లో నిజమైన కిటుకు, ఆ కాస్త భుజాన్ని బైటికి చూపడం అయ్యింది.
ఆకర్షణీయంగా ఉన్నా, ఆమె దుస్తులు నిండుగా కూడా ఉన్నాయి. తన దేహంలోని మరీ ఎక్కువ భాగం బైటికి కనిపించకుండా  చేసి, ఆమె తనలోని స్త్రీత్వానికి విలువనిచ్చే మనిషినన్న భావన కలిగిస్తోంది.
ఆమె ప్రవర్తన మధ్య వివేకమైన ప్రవర్తనకి, లైగింక వాంఛకు మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా చూపుతోంది. తమ నైపుణ్యాల మీద స్పష్టమైన నమ్మకం లేని స్త్రీలు అతిగా దేహాన్ని ప్రదర్శిస్తారు. వారి దుస్తులు, మేక్ అప్ వారి విచ్చలవిడితనాన్ని  బహిర్గతం చేస్తాయి.
కాని అప్సర ఆమె పరిజ్ఞానానికి ప్రతిరూపంలా కనిపిస్తోంది. ఆమె దేహం ఆమె ఉద్దేశాన్ని చెబుతోంది; ఆమె పెదవులు, నాలుక ముద్దు పెట్టడంలో ఆమె సామర్ధ్యాన్ని చెబుతున్నాయి. మలచినట్లున్న ఆమె వెళ్ళు ఆమె సృజనకు భావగీతాల్లా ఉన్నాయి. ఆమె హావభావాలు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాయి. ఆమె తనను తాను సున్నితంగా తాకిన విధానం, ఆమెకున్న అనుభవాన్ని తెలియచేస్తోంది. క్లుప్తంగా ఆమె – అందం, తెగువ, సత్తా, స్పందనతో కూడిన   సవాలు విసిరే స్త్రీలా ప్రవర్తిస్తోంది.
ఆమె అతన్ని బెడ్ రూమ్ లోకి ఆహ్వానించింది. హఠాత్తుగా వచ్చిన ఈ ఆహ్వానానికి ఋషి ఆశ్చర్యపోయాడు.
“కానీ పెయింటింగ్...” గొణిగాడు ఋషి.
సుతారంగా అతని బుగ్గపై ముద్దు పెట్టి, “నువ్వు చాలా మంచివాడివి, నాకు చాలామంచి స్నేహితుడివి. నేను నీతో అబద్ధం ఆడట్లేదు. పెయింటింగ్ ఇక్కడే ఉంది. హాయిగా కూర్చో. పెయింటింగ్ కంటే జీవం ఉట్టిపడేదాన్ని నీకు చూపాలని, నాకు అనిపించింది,” అందామె.
ఆమె మరులు గొల్పేలా ముందుకు వంగి, అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, “నీ వాచ్ బాగుంది, నేను చూడచ్చా ?” అంది. వాచ్ చూస్తున్నట్లుగా అతని చెయ్యి పట్టుకుని, సుతారంగా నొక్కుతూ, అతని చర్మంపై తన వెళ్ళు నెమ్మదిగా, ఒక నైపుణ్యంతో జారేలా చేసింది. అది ఋషిలో ఏదో విద్యుత్ శక్తిని ప్రవహింపచేసింది.
“చూడు, ఇది నా వాచ్, నాకు వార్టన్ యూనివర్సిటీలో పి.హెచ్.డి అడ్మిషన్ వచ్చినప్పుడు మా నాన్నగారు గిఫ్ట్ ఇచ్చారు.” అంటూ అప్సర అతనికి తన వాచ్ చూపించింది.
“పి.హెచ్.డి? ఋషికి వెంటనే ఇదివరకు తాను చదివింది గుర్తుకు వచ్చింది. కేవలం డిగ్రీ చదివిన అమ్మాయిలతో పోలిస్తే, పి.హెచ్.డి చేసిన అమ్మాయిలు పురుషులతో ఒక రాత్రి గడిపేందుకు ఇష్టపడతారట.
“కానీ నేను పి.హెచ్.డి లో చేరలేదు. నాకు వ్యాపారం చెయ్యడంలో ఆసక్తి ఉంది,” ఆమె వెంటనే ఋషికి స్పష్టం చేసింది.
తర్వాత ఆమె తన చేతిని అతని గడ్డంపై ఉంచి, “ పురుషుల గడ్డం వేగంగా పెరుగుతుంది అంటే, అది వారిలోని సంభోగాసక్తిని తెలియచేస్తుందట. నిజమేనా?” కొద్దిగా పెరిగి, గరుకుగా ఉన్న అతని గడ్డాన్ని నిమురుతూ, అల్లరిగా నవ్వుతూ అందామె.
జరుగుతున్నది అంత సౌకర్యంగా లేనట్లు ఋషి ఇబ్బందిగా కదిలాడు. గదిలో ఎ.సి ఆన్ లోనే ఉన్నా, అతనికి చెమటలు పడుతున్నాయి.
అతని కళ్ళలో ఇబ్బందిని, అతని నుదుటిపై చెమటను గమనించిన అప్సర లేచి నిల్చుని, “ఆహ్, నీకు చాలా చెమటలు పడుతున్నాయి. నీకొక ఐస్ క్రీం తీసుకొస్తాను.” అంది.
నిమ్న స్వరంలో అతను “దయుంచి నన్ను పెయింటింగ్ చూడనివ్వు. నాకు లేట్ అవుతోంది, “ అన్నాడు.
అప్సర నవ్వేసి, “నీదే ఛాయస్. నేను గత పదేళ్లుగా ఆర్ట్ బిజినెస్ లో ఉన్నాను. కాని, ఆ కృత్రిమమైన పెయింటింగ్ ను సొంతం చేసుకుని, జనాలు ఏమి పొందుతారో తెలుసుకోలేకపోయాను. కొన్నిసార్లు, వాళ్ళు తమ కళ్ళముందు సజీవంగా ఉన్న అందాన్ని కూడా పట్టించుకోరు,” అంటూ అతని ముందు ఆమె మోహకరంగా నిల్చుంది.
“కాని, ఈ ప్రపంచంలో ఆర్ట్ పిచ్చి వాళ్ళు ఉన్నంతవరకు, అదే నా వ్యాపారం కనుక క్లైంట్ ల అవసరాల్ని నేను తీరుస్తూ ఉంటాను. ఏమైనా, పెయింటింగ్ ప్రక్కన గదిలో ఉంది. ప్రక్కగదిలో ఉన్న పోర్ట్రైట్ తో సరిపెట్టుకుంటావో, ఈ గదిలోనే నీ కళ్ళముందే ఉన్న సిసలైన సౌందర్యాన్ని సొంతం చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు మేధావివి, మంచి నిర్ణయం తీసుకుంటావు కదూ,” అంది ఆమె.
అలా అంటూ ఆమె తన శరీరాకృతి మరింత స్పష్టమయ్యేలా నడుస్తూ ఆమె ఐస్ క్రీం తెచ్చేందుకు వెళ్ళింది. ఆమె నుంచి దృష్టి మళ్ళించుకోవడం ఋషికి చాలా కష్టమయ్యింది. కాని ఋషి త్వరగా తేరుకుని, పోర్ట్రైట్ ను చూసేందుకు ప్రక్క గదిలోకి పరుగెత్తాడు.
ఈలోగా డోర్ బెల్ మ్రోగింది. అది విన్న అప్సర చెదిరిన తన దుస్తుల్ని సరి చేసుకోవాలన్న స్పృహ కూడా లేకుండా డోర్ తీసేందుకు వెళ్ళింది. ఋషి డోర్ వంక చూడసాగాడు.
డోర్ తెరుచుకోగానే, కొద్ది సెకండ్ లలోనే బయటి నుంచి ఒక కేక వినవచ్చింది. అది స్నిగ్ధ ది. ఆమె ఋషి ముఖం పూర్తిగా చెమటతో నిండి ఉండడాన్ని, చెదిరిన కురులు, చీరతో ఉన్న అప్సరను చూసి, “ ఎంతటి జాణవు ? నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను. ఋషి, ఐ హేట్ యు”, అంటూ అరిచి బయటకు వెళ్ళిపోయింది.
అప్సర తాను చూసింది నమ్మలేక అవాక్కయ్యింది. స్నిగ్ధ ఆ సమయంలో అక్కడకు వస్తుందని, ఆమె కలలో కూడా ఊహించలేదు. ఋషి పరిస్థితి కూడా అంతే. అతను పూర్తిగా దిగ్బ్రమకు గురై కూలిపోయాడు.
(సశేషం...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top