“పుష్కర సంబరాలలో కృష్ణవేణీ సన్నుతి.” - అచ్చంగా తెలుగు

“పుష్కర సంబరాలలో కృష్ణవేణీ సన్నుతి.”

Share This

“పుష్కర సంబరాలలో కృష్ణవేణీ సన్నుతి.”

                                 మంథా భానుమతి.

      

ఏకాదశ కందాల మాల

1.పడమటి కనుమల నడుమను
        పుడమిని బాగుగ పొడమిన  పుణ్యనదివిగా
        నడిమిని నదుల కలుపుకుని
        కడిమిని పాయలు గమారె కలవగ కడలిన్..
    2. మహదేవుని ఆలయమున
        అహి ముఖమున నవతరించి యనయము గానే
        అహరహము సాగి పోవగ
        మహికి దిగిన యలకనంద మాన్యము మీరన్.
     3. జన్మ స్థలి సమీపమునే
         చిన్మయముగ తనను చేరె చిరు యుప నదులే
         మన్మధు జనకుని పేరున
         తన్మయి కృష్ణా నదియన ధాత్రికి యరగెన్.
     4. తుందిలుడు తపమొనర్చగ
         వందనములు చేకొనంగ వరమిచ్చెనుగా
         నంది వహనుడు ముదముననె
         కందువ నీవే జలములకధిపతి వనుచూ!
      5. కంజుడు కోరగ వెడలెను
          అంజకమెరుగని పురుషుడె యా పుష్కరుడే
          పంజన తుందిలు డతడే
          సంజుని సృష్టికిని తాను సాయపడగనున్.
        7. నలువ కడ పుష్కరు నిలువ
            సలిలరయములవె కృశించి సంకట పడగా
            వెలు గొని దేవగురువు చని
            జలముల కావుమని వేడె చతురాననునే.
        8. రాశులు ద్వాదశలందున
            కాశి బృహస్పతి ప్రవేశ కాలము నందున్
            దేశమున నదీనదములు
            ఆశను పుష్కరుని కూడ అవ్యయముగనే.
         9. మన కృష్ణకి సంబరముల
             దినములు, పుష్కర సమయమదె, బృహస్పతియున్
             తను కన్య రాశి కేగిన
             కన పన్నెండు సమముల కొకపరిన కలవన్.
        10. సురులందరు కూడి యిలకు
              అరుదెంచగ కృష్ణ మునుగ యాదట మీరన్
              హరువరమున పుష్కరుడా
              ఝరిని నిలిచి జనుల బ్రోచు చరితార్ధముగన్.
        11. బంగరు కృష్ణమ్మ దరికి
              చెంగలువల మాలికలను చెలిమిని గొనగా
              మంగళము పాడ వచ్చిరి
              అంగనలందరును కలిసి యానందమునన్.

No comments:

Post a Comment

Pages