Saturday, July 23, 2016

thumbnail

ఆంధ్ర అన్నపూర్ణ గతవైభవ పునరావృతం

ఆంధ్ర అన్నపూర్ణ గతవైభవ పునరావృతం 

పెమ్మరాజు అశ్విని 

 
 
 భారత దేశం లో వున్న ముఖ్యమైన నదుల్లో కృష్ణా నది ఒకటి ,ఈ నది పుట్టింది మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ లోనే అయినా కూడా ఈ నది మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా ఆంధ్ర రాష్ట్రం లో కి ప్రవేశించి మన  కృష్ణా జిల్లా విజయవాడ సమీపం లో ని హంసల దీవి దగ్గర సముద్రం (బంగాళా ఖాతం) లో కలిసిపోతుంది.
       కృష్ణా నది అవ్వడానికి జీవనదిగా నిత్యం ప్రవహించేది ,1832-33 సంవత్సరం లో ఆంధ్ర రాష్ట్రం లో తీవ్రమైన కరువు వచ్చింది, దీనినే డొక్కల కరువు,నందన కరువు,గుంటూరు కరువు అని రకరకాల పేరు తో పిలుస్తారు ,ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది  అంతే గాక ఈ కరువు పుణ్యమా అని బ్రిటిష్ ప్రభుత్వానికి దాదాపు గా రూ . 2. 27కోట్లు నష్ట పోయింది అయితే అంత కరువు లో ను కృష్ణా నది ఎండి పోలేదు,అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆ నది నీటిని మిగతా ప్రాంతాలకు ఉపోయోగ పడేలా నది మీద ఆనకట్ట నిర్మించాలని ప్రతిపాధించింది ,అయితే ఆ ప్రతిపాదన కార్య రూపం దాల్చడానికి 1852 వరకు సమయం పట్టింది,1852 వ సంవత్సరం శ్రీ అర్థుర్ కాటన్ దొర గారి అద్వర్యం లో ఆనకట్ట పనులు ప్రారంభమై 1855 నాటికి పూర్తి అయింది.అయితే అప్పట్లో వున్న సాంకేతిక పరిజ్ఞానం తో మూడు సంవత్సరాలలో నాలుగు మీటర్ల ఎత్తుతో ఆనకట్ట మీదుగా వరద నీరు ప్రవహించేలా నిర్మిచడమే కాక 10 ప్రాధాన కాలువల ద్వారా సాగునీటిని సరఫరా చేయడం మొదలు పెట్టారంటే,కాటన్ దొరగారి పారదర్శకత ఎంతైనా శ్లాఘనీయమైంది అని చెప్పవచ్చు.
     పాత ఆనకట్ట  సుమారు గా రూ. 2 కోట్లు వ్యయం తో నిర్మించారు అపర భగీరధుడుగా ఆంధ్రులు కొలిచే అర్థుర్ కాటన్ దొరగారు. ఆ ఆనకట్ట కృష్ణా ,పశ్చిమ గోదావరి,గుంటూరు,ప్రకాశం జిల్లాలోని మొత్తం 5. లక్షల ఎకరాల పుడమి తల్లి దాహాన్ని తీర్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తోడ్పడ్డారు కాటన్ దొర.   ఇంతేకాకుండా ఇది పూర్తి అయినా తర్వాత ఇది కనీసం వంద సంవత్సరాలు ప్రజాప్రయోజనకరం గా నిలుస్తుందని ఆయన  అంచనా వేశారు ,ఆయన అంచనాలకు తగిన్నట్టే 1952 వ సంవత్సరం దాకా ఆ ఆనకట్ట చక్కగా నిల్చింది,
      అయితే 1952 లో వచ్చిన వరదలకు ఆనకట్ట పాడయిపోయింది .దానితో అప్పుడే కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దీని పునర్నిర్మాణానికి నడుం కట్టింది.దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న "ప్రకాశం బ్యారేజి ",దీని పూర్తి నిర్మాణం 1977 నాటికి పూర్తయింది,దీనికి మన తెలుగు రాష్ట్ర మొదటి  ముఖ్యమంత్రి అయినా స్వర్గీయ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ప్రకాశం బ్యారేజి అని నామకరణం చేసి జాతి కి పునరంకితం గావించారు ప్రభుత్వం వారు.
      సుమారు 1233. మీటర్ల పొడవున్న ఈ ఆనకట్ట నిర్మాణానికి ఇంచుమించు గా రూ. 2. కోట్లు ఖర్చయింది . 76 స్తంభాల తో నిర్మించిన ఈ ఆనకట్ట కృష్ణ  గుంటూరు జిల్లాల మధ్య వారధి నిలవడమే కాక చుట్టుపక్కల 4 జిల్లాలకి ఇంచుమించు 1308049 ఎకరాలికి సాగునీటిని అందిస్తోంది.ఈ పంటపొల్లాలో ఇంచుమించు ఒక్క కృష్ణా జిల్లాలోనే   6,79,498 ఎకరాలకి 8 కాలువల ద్వారా సాగు నీటిని అందిస్తోంది,ఇంతే గుంటూరు జిల్లాలో 4,99,231 ఎకరాలకు 7 కాలువల ద్వారా నీటిని అందించి ఆయా జిల్లాలోని నీటి ఎద్దడి లేకుండా కాపాడింది ఈ ఆనకట్ట.
       ప్రకాశం బ్యారీజీ 76 స్తంబాలలో 70 స్థంబాలు గుంటూరు జిల్లాలో ఉంటే ,6 స్థంబాలు కృష్ణా జిల్లాలో ఉంటాయి,ఇంతేకాక ఈ ఆనకట్ట కి సంబంధించి 3 కాలువలు మన విజయవాడ నగరం గుండా ప్రవహించి మన ఇంద్రకీలాద్రి ప్రాంతానికి రోమ్ రాజధాని వెనిస్ లాంటి సొగసులద్దింది.ఇంతటి  చారిత్రాత్మకమైన  సుందర నగరమే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం సరికొత్త రాజధాని అమరావతి గా రూపుదిద్దుకుంటోంది.
      కృష్ణా ,గోదావరి లాంటి రెండు జీవ నదులు ,మరెన్నో ఉపనదులు మన రాష్ట్రం లో ప్రవహిస్తున్నా కూడా మన రాష్ట్రం లో గత సంవత్సరం 13 జిల్లాలో 196 మండలాల్లో కరువు ప్రాంతం క్రింద ప్రకటించారు ప్రభుత్వం  వారు. మన ప్రభుత్వం వారు తీసుకొన్న ఒక వినూత్న ప్రయత్నం అది గోదావరి కృష్ణ నదుల అనుసంధానం .ఈ సంవత్సరం ప్రకాశం బ్యారేజి  వద్ద పోలవరం కుడి కాలువ దగ్గర ఈ అనుసంధాన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వం వారు.దీని ద్వారా కృష్ణా డెల్టా కే కాదు కొత్త రాజధాని అమరావతికి కూడా నీటి కరువు ఉండదని నదీ జలాల్ని వృధాగా సముద్రం లో కి పూర్తిగా వదలకుండా రాష్ట్రాన్ని తిరిగి అన్నపూర్ణ గా నిలబెడ్తారని ఆశ.
 ***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information