చిత్రకళా శిఖరం - ఆర్టిస్ట్ కొలుసు సుబ్రహ్మణ్యం 

భావరాజు పద్మిని 


చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో రోడ్డు మీద సైన్ బోర్డులు వేస్తున్న ఆర్టిస్ట్ లను నిలబడి ఆరాధనగా చూడడం దగ్గరనుంచి, తానే ఎన్నో ఆర్ట్ క్యాంపులు నిర్వహిస్తూ, తనలాగే మరికొందరు తనను ఆరాధనగా చూస్తూ, చిత్రకళ లోని మెళకువలు నేర్చుకునేదాకా, స్వయంకృషితో ఎదిగారు ఆ చిత్రకారులు. పలు ఆర్ట్ ఎక్సిబిషన్ లు, గ్రూప్ షోస్, ఆర్ట్ క్యాంప్స్ నిర్వహిస్తూ, దేశ విదేశాల్లో తన చిత్రాల ప్రదర్శనతో ఎంతోమంది ప్రశంసలను, ఎన్నో అవార్డులను గెల్చుకున్న చిత్రకళా శిఖరం - ఆర్టిస్ట్ కొలుసు సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక పరిచయం ఈ నెల మీ కోసం... 
నమస్కారమండి. మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
మాది రైతు కుటుంబం. అమ్మ హొమ్ మకెర్(house wife) నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు తమ్ముళ్ళు. బాల్యం అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిచింది.
మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?
మా కుటుంబంలో ఎవరూ లేరు. మా కుటుంబంలో తాతయ్యలు గాని, అంతకు ముందు గాని ఎవరూ లేరు అని అమ్మ, నాన్న చెప్పేవారు. వారు ఇది నాకు పూర్తిగా దైవానుగ్రహమని(God's gift) భావించేవారు .
చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది
?
చిన్నప్పటి నుంచి చిత్రాలు వేసేవాడిని....నాకు ఊహ వచ్చినప్పటినుంచి, అంటే 3వలేక 4వతరగతి నుండి బొమ్మలు వేసి, మా వీధిలో ఉన్న వాళ్లాందరికి ఇంటింటీకి వెళ్లి చూపిస్తూ ఆనంద పడే వాడిని. హైస్కుల్ కి వచ్చాకా అక్కడ కూడా తరగతిలో అందరికంటే ఎక్కువ చదివే వాళ్లకంటే, నాకే ఎక్కువ గుర్తింపు ఉండేది. టీచర్స్ మరియు తోటి విద్యార్దులు ఎంకరేజిమెంట్ చాలా బాగా ఉండేది.
ఒకసారి 7వ తరగతిలో మా తరగతి టీచర్ గారు పిల్లలందరీని "పెద్దయ్యాకా
ఎమి అవుతారు?" అని అడీగితే చాలా మంది విద్యార్దులు డాక్టర్స్, ఇంజినీర్స్ ఆలాగే రక రకాల ఉద్యోగాల పేర్లు చెప్తున్నారు. తర్వాత నన్ను ఆడిగారు. నేను చాలా గర్వంగా 'పెద్ద ఆర్టిస్ట్ అవుతాను' అని తలెత్తుకుని చెప్పాను. వయస్సు పెరేగేకొద్దీ చిత్రకళ మీద మరింత మక్కువ పెరిగింది. స్కూల్ సమయం తర్వత వెళ్లి లొకల్ ఆర్టిస్ట్ ల వర్క్స్ అన్నీ షాపుల దగ్గరకు వెళ్లీ గమనిస్తూండేవాడిని .
ఒక రోజు .... ఆ రోజు నాకు బాగా గుర్తుంది. 9వ తరగతిలో ఉన్నప్పుడు లోకల్
ఆర్టిస్ట్ లు ఒక టైలర్ షాప్ కి సైన్ బోర్ద్ వెయ్యడానికి సిద్దం అవుతున్నారు ఆ
రోజు స్కూల్ కి వెళ్లకుండా అక్కడే కొంచెం దూరంగా నిల్చుని చూస్తున్నాను ....2వ రోజు , 3వ రోజు మరి కొంచెం దగ్గరకు వచ్చి చూస్తూంటే....ఒక ఆర్టిస్ట్ చూసి, 'ఏంటి రోజూ ఇక్కడే ఉంటున్నావ్ రా, స్కూల్ కు వెళ్ళకుండా?" అని ఈల వేసి, "దగ్గరకు రా ....ఆ రంగు డబ్బా ఇటు ఇవ్వమని" అన్న వెంటనే నా ఆనందానికి హద్దులు లేవు (ప్రపంచంలో నేనే పెద్ద ఆర్టిస్ట్ అనుకుని గర్వపడ్డాను).అంతే ఆ రోజు నుండి 7 రోజులు అక్కడే గడిపాను .తర్వాత నేను స్కూల్ కి రావటం లేదు అని సార్ చెప్పటం, నాన్న కోప్పడటం జరిగింది.
ఇంటర్ లో ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుంది అని మా తల్లిదండ్రులు
చూస్తూంటే నేను మాత్రం ఎక్కడ మంచి ఆర్టిస్ట్ లు ఉంటారు, వెళ్లి రొజూ వర్క్స్ చూడవచ్చు, అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ విధంగా తిరుగుతూ కలర్ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నాను. ప్రతిరోజూ వర్క్స్ ఎక్కడ చేస్తూంటారు అని ముందే తెలుసుకుని, అక్కడకు వెళ్లి గమనించి, ఇంటికి వచ్చి కసరత్తు చేసేవాడిని. ఆ విధంగా డిగ్రీ కి వచ్చేసరికి మంచి పేరు తెచ్చుకున్నాను.  అక్కడ  ప్రొఫెషనల్ అర్తిస్ట్ లు కూడా అసూయపడే విధంగా అప్పటికే అన్ని రకాల వర్క్స్ చేసే శక్తి సంపాదిచాను.(చిన్న బానర్స్ , సైన్ బొర్ద్ వర్క్స్ ) .
ఆర్ట్ అంటే నాకు ప్రాణాం. ఉదాహరణకు నేను 9వ తరగతి లో ఉన్నప్పుడు పేపర్ లో పాలకొల్లులో సినీ హీరో కృష్ణం రాజు గారి వేడుక జరగనుందని పెద్ద
సిని బానర్ పడింది. అది చూసి నేను పాలకొల్లు వెళ్లి వాళ్ళను కలవాలని
వెతికే సమయంలో  చీకటి పడింది. అప్పట్లో ఫోన్లు లేవు కదా ! అక్కడి వాళ్ళను పక్కన వాళ్ళను అడిగితే, వాళ్లూ ఇక ఈ రోజు రారు అని చెప్పారు. ఆ రోజు అక్కడే బస్ స్టాండ్ లో రాత్రి గడిపి ప్రొద్దున్న కలసి, ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర చాలా హడవిడి , చుట్టాలు, ఇరుగు & పొరుగు వాళ్లు అందరూ ఉన్నారు.  ...అలాగే ఈ మధ్య కేరళ వెళ్లి ఒక ఆర్తిస్ట్ ని కలసి వచ్చాను.
తర్వత B.com, MBA..కంప్లిట్ చేసిన సమయంలో ఇంటర్నెట్, youtube లను ఉపయోగించి మరింత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నాను. అలాగే ఫైన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ లో  MFA చేసి మరింత మంచి ఆర్టిస్ట్  గా ఎదిగే అవకాశం
కలిగింది.
మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
నాకు ప్రత్యేకంగా గురువులు ఎవరు లేరు. ఎంతొ మంది అద్భుతమైన ప్రతిభ ఉన్న చిత్రకళకారులు ఉన్నారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క అర్తిస్ట్ ని నేను అభిమానిస్తాను. కాని, ప్రత్యేకంగా చెప్పాలంటే
1.ఎస్.ఎం.పండిట్ గారు
2.రమా సురేష్ గారు, చెన్నై.
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
నా చిత్రకళ ప్రస్థానం తెలిసీ తెలియని వయస్సునుండి , తెలియకుండానే మొదలైంది. ఎందుకంటే fore  fathers ఎవ్వరు లేరు కదా ! నాది 100% God gift గా భావిస్తున్నాను.
ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను
 ఎదుర్కున్నారు ?
ఈ రంగాన్ని ఎంచుకున్న తర్వత ఫైనాన్సియల్ విషయం ప్రక్కన పెడితే. ప్రతిరొజూ నూతన అనందాన్ని రుచి చూసే రంగం ఇదని... అది ఒక్క కళకారుడికే సొంతం అని అభిప్రాయం.
కోట్లు సంపాదించే బిజినెస్స్ మాన్స్ , ఐ.ఎ.ఎస్ లు, ఐ.ఫై.ఎఫ్. లు అలాగే ఎంతో గొప్పవారు కూడా  చిత్రకారుడి  కాళ్లకు నమస్కారం చేసి,
గౌరవించే సంస్కారం ఉన్న రంగం ఇది. 
ఈ రంగం ఎంచుకున్న తర్వాత మనీ దాచుకోవటానికి పాంట్స్ , షట్స్ పాకేట్స్ సరిపోతున్నాయి. కాని సంతోషం, అనందం, గుర్తింపు & ప్రశంసలు దాయటానికి బ్యాంకు లాకర్లు ,ఇళ్ళు & పాకేట్స్ సరిపోవటం లేదు. అందుకే ఈ రంగంలో జీవించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
ఆకలితో అవ్వ

ఓ…….. అవ్వ ఆకలితో ఎదురుచుస్తూన్న ఈ Painting all most south lo Best artist గా, Mega Award Winner గా  First,Secound Prizes సొంతం చేసికుంది.
లంబోదరుడు

ఈ ..Painting,Guntur art camp లో వేయటం జరిగింది. ఒక మనిషి శివ లింగానికి రెండు చెతులతో పూజ చేసే అవకాశం ఉన్నది. అదే ఒక లంబోదరుడు చేయాలంటే ఎలా?
నేను (ఆర్టిస్ట్ గా) అదే ఉద్దేశంతో ఒక తొండం పాలాభిషేకం, మరో తొండం పూలతో  పూజ, ఇంకొక తొండం నమస్కారం చేస్తూ ఉన్న ఈ వర్క్ చేసి పలు ప్రసంశలు పొందాను.
Holy Amaravathi attracted Buddha
అమరవతి ఆర్ట్ కాంప్ లో అమరవతి హెరిటెజ్ అనే టాపిక్ తో చెసిన వర్క్ ఇది.

మహత్మ

పెన్ తో చేసిన వర్క్... … కొన్ని లక్షల చుక్కలతో రూపుదిద్దుకుంది.
Great person

నేను Sri.Adbul Kalam గారికి నివాళులు అర్పిస్తూ.....చేసిన వర్క్.. నాకు చాలా గొప్ప పేరు సంపాదించి పెట్టింది.
Mother.
మంచి గుర్తింపు వచ్చిన మరో painting ఇది.
Denice.


ఈమే పేరు డేనీస్, ఊరు మెక్షికో(Mexico) …. ….facebook లో నా వర్క్ చూసి తన painting order ఇచ్చింది .
Portrait.
మంచి పేరు తెచ్చిన వర్క్స్ లో ఇది ఒకటి .
Rotary club founder
మంచి పేరు తెచ్చిన వర్క్స్ లో ఇది ఒకటి .
మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.


నేను ఎన్నో అవార్డ్స్ & ఆనర్స్ పొందాను. అందులో అతి ముఖ్యమైన ప్రసంశ Dr. Sri.A.P.J .Abdul kalam గారి నుంచి లభించటం చాలా ఆనందకరం.
మన మాజీ రాష్ట్రపతి Dr.. శ్రీ. A.P.J. ఆబ్దుల్కలాం  గారికి వారి Portrait చిత్రించి బహుమతిగా ఇచ్చే  అరుదైన అవకాశం నాకు దక్కింది .ఆ సందర్బంగా కలాం గారు చిత్రం గురించి తెలుసుకొని, చిత్రాన్ని & చిత్రకారుడి నైన నన్ను మెచ్చుకుంటూ 5 నిమిషాలు పాటు మట్లాడి, గొప్పగా ప్రసంశించి తన పాకెట్లో ఉన్న ఒక Pen ను తీసి, ఇది నా small gift అని చెప్పి నాకు అందిచారు.
చిత్రం గురించి: ఈ చిత్రంలో కలాం గారి మేధాశక్తి ...నీరై .....ఏరులా ....ప్రవహిస్తూ యవతరాన్ని ఉత్తేజపరిచే విధంగా చిత్రించాను. నా (ఆర్టిస్ట్) యొక్క భావాన్ని గ్రహించి Sri..కలాం గారు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచినారు .
ఈ అరుదైన అవకాశం నా జీవితంలో మరవలేని సంఘటన అని సంతోషంగా తెలియజేస్తున్నాను.
మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నా అభిరుచులకు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు  భార్య విషయంలోనూ  నేను చాలా అదృష్టవంతుడిని, ఎందుకంటే నేను ఆర్ట్ విషయంలో ఏమి చేసినా, ఎందుకు, ఏంటి అలాంటి నెగటివ్ వర్ద్స్(Negative words) ఉండవ్. తన support చాలా కీలకమైనది .
భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
"గౌరవించటం"
"గౌరవించటం అనే సంప్రదాయాన్ని కాపాడుకుందాము" .... ఈర్ష ,,,జలసీ లకు స్థానం లేకుండా చేద్దాం.
స్వయంకృషితో సమున్నత స్థానానికి ఎదిగిన ఈ చిత్రకళా శిఖరం 'ఆర్టిస్ట్ కొలుసు సుబ్రహ్మణ్యం' గారికి మరిన్ని విజయాలు సొంతం కావాలని మనసారా ఆకాంక్షిస్తోంది 'అచ్చంగా తెలుగు' కుటుంబం.
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top