విషబీజం - అచ్చంగా తెలుగు

విషబీజం

Share This

 విషబీజం 

అవసరాల సీతరామలక్ష్మి


వెంకట్రవ్ రాజమండ్రీలోని గవర్న్మెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు. ఉూళ్ళో మంచి పేరు, గౌరవమ్ ఉన్న మనిషి. ఆస్తులు లేకపోయినా స్వయం శఖ్తి తో ఒక చిన్న ౩ గదులు తనకంటూ కట్టుకున్నాడు. వెంకట్రవ్ , శ్రీలక్ష్మి ల ఏకైక సంతానం మధు. ఎంతో చురుకు, తెలివితేటలు కల .పిల్లాడు కావటంతో అందరూ ఎంతో ఇష్టపడే వారు. అన్నిటిలోనూ first ఉండేవాడు. తమ కొడుకు బాగా చదువుకుని అమెరికా వెళ్ళాలి అని వాళ్ల కోరిక. మధు చదువుకోసం ప్రతి పైసా దాచసాగేరు ఆ దంపతులిద్దరూ. మధు తో ఎప్పుడు ఇంటి విషయాలు గాని, డబ్బు విషయాలు గాని చెప్పేవారు కాదు వెంకట్రవ్, శ్రీలక్ష్మి. ఎప్పుడు వాడి చదువు గురించి, వాడికి ఏమీ కావాాలో, లోటు లేకుండా సమకూర్చే వారు. ప్రతి పండగ కి మధు కి తప్పకుండా కొత్త బట్టలు కోనేవారు.
మధు ఏది సాధించిన ఎప్పుడూ " బాగా చదివి అమెరికా వెళ్ళాలి" అని ధీవించేవారు. మురిసిపోయేవారు. తెలిసినవాళ్ళు, బందువులు అందరూ కూడా మధుని " సబాష్ !! నువ్వు అమెరికా వెళ్తావోయి తప్పకుండా. " అని పొగిడే వారు. ఆ మాటలు మధులో పట్టుదల పెంచాయి. ఎలాగైనా అమెరికా వెళ్ళి తీరాలి. అదే తన జీవిత లక్ష్యంగా మారింది.
అందరి దీవెనలు ఫలించి, మధు పట్టిందే బంగారం అన్నట్టు , ప్రతి పరీక్ష లో టాప్ వచ్చి MBBS లో సీట్ తేచ్చు కున్నాడు. ఆ రోజు వెంకట్రవ్ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అందరితోనూ ఎంతో గర్వంగా మధు గురించి చెప్పుకున్నారు. ఇంట్లో ఒక పండుగ వాతావరణం చోటు చేసుకుంది. తన తాహతకు మించింది అయినా వెంకట్రవ్ వెనకాడక, అప్పులు చేసి మధుని చదివించాలని గట్టిగా అనుకున్నారు. మధుకి ఈ ఆర్ధిక విషయాలేమీ చెప్పకూడదని కూడా నిర్ణయించుకున్నాడు.
కాలం ఇట్త్టే పరిగేతింది. మధు MBBS పూర్తైంది. వెంటనే అమెరికా లో M.S కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు మధు. ధానికి ౩ లక్షలు ఖర్చు అవుతాయి అన్నాడు మధు. ఆలోచన లో పడ్డాడు వెంకట్రవ్. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏవో లెక్కలు వేసుకూంటూ గడిపేశాడు. తెల్లారాక శ్రీలక్ష్మి ని పిలిచి " ఈ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటాను" అన్నాడు. శ్రీలక్ష్మి మనసుకు కష్టంగా ఉన్నా, పరిస్తితి తెలుసుకుని " సరే, మీ ఇష్టం " అంది. రెండు రోజుల్లో డబ్బు తెచ్చి మధుకి ఇచ్చాడు. అంత డబ్బు చూసి మధు " ఎక్క్డి డిధి నాన్నా? అప్పుగాని చేశారా? ఏంటి? " అని ఆశ్చర్యంగా అడిగాడు. " లేదు నాన్నా, అప్పు కాదు. నీకోసం పోస్టాఫీసు లో దాచాను కదా, అదే ఇది." అంటూ మాట దాటేశాడు వెంకట్రవ్. " అవునా!! థాంక్స్ నాన్నా" అంటూ తండ్రిని హత్తుకున్నాడు మధు ఆనందంతో.
వారంలో మధు అమెరికా flight ఎక్కాడు. వెళ్లేముందు వెంకట్రవ్, శ్రీలక్ష్మి మధుకి ఎన్నో జాగ్రత్త లు చెప్పి, " డబ్బుకి ఏ మాత్రం ఇబ్బంది పడొధ్ధు , అవసరం వస్తే ఫోన్ చెయ్యి, పంపుతాం " అని ధైర్యం చెప్పారు." అంత అవసరం ఉండదులే నాన్న " అన్నాడు మధు.
ఒక పది రోజులు ఇద్దరికి ఏ పని మీద మనసు నిల్వలేదు. ఏదో వెలితి గా అనిపించి, మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. రోజులు గడుస్తున్న కొద్ది నెమ్మదిగా మళ్లీ సర్దుకున్నారు. ౩ రోజులకీ ఒకసారి ఫోన్ చేసి మధు ఎన్నో కబుర్లు చెప్పేవాడు.
ఆ కబుర్లు విని ఇద్దరు ఎంతో ఆనందపడేవారు. ఎవరైనా "ఏంటి వెంకట్రవ్ గారు, మీ అబ్బాయి అమెరికా వెళ్లాడట కదా!! " అని పలకరిస్తే చాలు , ఎంతో ఆనందంతో ఉబ్బిపోయేవాడు.
చూస్తుండగానే ౩ క్యాలండర్ లు మారాయి. MS పూర్తి చేసుకుని జాబ్ లో చేరాడు మధు. నెమ్మదిగా ఫోన్ చెయ్యటం తగ్గించేసాడు. పని లో busy గా ఉంటాడు గా అని ఒకరికి ఒకరు సర్ధి చెప్పుకున్నారు. రాను రాను ఫోన్ రావటమే కరువైంది. మధు ఫోన్ కోసం ఎదురు చూస్తూ రోజులు దొర్లిస్తున్నారు.
రిటైర్ అయిన వెంకట్రవ్ కి ఆర్ధికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. పెన్షన్ లో అప్పులు అన్ని పోను చేతికి అందేధీ , ఈ వృద్ధాప్య౦ లో ఇంటి కర్చుకు, మంధుల కర్చుకీ సరిపొవ్డం కష్టం గా ఉంది. ఒక రోజు మధు ఫోన్ చేసి , అమెరికాలో తన ఆఫీస్ లో ఒక అమ్మాయి ని ప్రేమించి , పెళ్లి చేసుకున్నాడని, అంతా హడావిడిగా జరిగి పోయిందని చెప్పాడు.
ఏమనాలో తోచలేదు వెంకట్రవ్ కి, ఫోన్ పెట్టేశాడు. గుండెల్లో ఎవరో గుచ్చి నట్టు బాధ తన్ను కొచ్చింది. శ్రీలక్ష్మి కి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియలేదు. చేసేధి లేక తెగించి చెప్పేసాడు. కుప్ప్ప కూలీ పూయింది శ్రీలక్ష్మి. ఉలుకు, పలుకు లేకుండా ఉoడి పోయింది. ౩ రోజులు ఇద్దరు అన్న పానాలు లేకుండా అలా బొమ్మల్లా గడిపారు. మెల్లగా వెంకట్రవ్ లేచి శ్రీలక్ష్మి కి నచ్చ చెప్పాడు. ఆ నాటి నుండి శ్రీలక్మి దిగులుతో మంచం పట్టింది. మందులకు, ఆసుపత్రికి బోల్డు ఖర్చు అవ్వడంతో బాంక్ అప్ప్పు తీర్చలేక పోతున్నాడు. కొడుకుని అడగడానికి అభిమానం అడ్డు వచ్చింది. ఏమీ అడగలేదు. చూస్తుండగానే బాంక్ లోన్ , వడ్డీ తో కలిసి తడిపి మోపెడుగా మారింది. బాంక్ వాళ్ళు ఫోన్స్, లెటర్స్ పంపడం మొదలు పెట్టారు. ఎంత ప్రయత్నించినా ఏ ధారి దొరకలేదు.
ఒక రోజు, బాంకు నుంచి నోటీస్ వచ్చింది. అప్పు తీర్చ లేనందున ఇల్లు వేలం వేస్తున్నాం అని. ఆ నోటిస్ చదివి వెంకట్రవ్ విరక్తి గా తనలో తానే నవ్వుకున్నాడు. . ఇల్లు వేలం జరిగి పోయింది. కట్టు కున్న ఇల్లు కనుల ముందే చేజారి పోతుంటే ఏమీ చేయలేక చేతకాని వాడిలా వుండిపోయాడు. బాంక్ వారు ఒక నెల గడువు ఇచ్చారు ఇల్లు అప్పగించడానికి. వెంకట్రవ్, శ్రీలక్ష్మి, ఇద్దరు జీవచ్చ్వాలుగా మిగిలారు.
ఒక వారం గడిచింది. ఓ రోజు ఉదయమే లేచి రెడీ అయ్యీ వెంకట్రవ్ బయటకు వెళ్లాడు. తిన్నగా ఒక ఓల్డేజి హోమ్ కి వెళ్లాడు. అక్కడ తమ ఇద్దరి పేర్లు నమోదు చేశాడు. ఒక వారం లో ఇల్లు అప్పగించి అక్కడ చేరి పోయారు.
కన్నా కొడుకు చూడలేదు అనే తమ బాద కు, ఒంటరి తనానికి , తమ లాగే ఈ లోకం లో చాలా మంది ఉన్నారు అనే వూరడింపు మందుతో సర్ధి చెప్పుకుంటున్నారు.
కన్న తండ్రి గా గెలిచానా ?? కొడుకు కి బాద్యతలు నేర్పటం లో ఓడానా?? ఆలోచనలో పడ్డాడు వెంకట్రవ్. తాను చేసిన తప్పుకి , శిక్ష ఇలా అనుభావిస్తున్నాను. అనుకుంటూ
విష-భీజం నాటి అమృత ఫలం ఆశించే తన మూర్ఖఃత్వానికి సిగ్గుపడ్డాడు.
 *****
ఒక చిన్నమాట :ఇది కేవలం ఒక కధ మాత్రమే కాదు. ఇంతకీ వెంకట్రవ్ దంపతులు చేసిన తప్పేoటి? ఆలోచించండి !! మనం కూడా అదే తప్పు చేస్తున్నామేమో ఒకసారి చూసుకుందాం. సరి చేసుకుందాం.
ఇది ఒక సమస్య. ప్రతి ఇంటిలోనూ కనపడకుండానే అల్లుకు పోతున్న ఒక విష వలయం. మన కుటుంబ వ్యవస్థకు పునాది-రాళ్లు గా మారాల్సిన వాళ్ళచేత వృద్ధాశ్రామాలకు పునాదులు వేయిస్తున్నామా?? ఆలోచించండి ??
తల్లిదండ్రులకు ఒక చిన్న మనవి:
పిల్లలకు సప్త-సముద్రాల ఆవల ఏదో అందమైన బంగారు దీవి ఉందని ఆశ కలిగించకండి. వారి లేత మనసులలో విష భీజం నాటకండి.
వారి మీద ప్రేమతో , కుటుంబ సమస్యల కు వారిని దూరుంగా ఉం చకండి.
కుటుంబం అంటే అందరితో కలిసి, సుఖ-ధు:ఖాలు, బరువు-బాద్యతలు పంచుకోవడం . అనే విలువైన జీవిత సూత్రాన్ని పిల్లలకు నేర్పడం మరువద్ధు. అది ఈ సమాజం పట్ల, మన దేశం పట్ల మన బాద్యత.
 ****

No comments:

Post a Comment

Pages