రెండు నిశ్శబ్దాలు - అచ్చంగా తెలుగు

రెండు నిశ్శబ్దాలు

Share This

రెండు నిశ్శబ్దాలు

సుపర్ణ మహి

 

వెలుగు కురవడం క్రమంగా తగ్గుముఖం పట్టాక,
పడమటి వీధి చివర నుండి చీకటి,
ఒంటరిగా ఊర్లోకి కమ్ముకురావడం తెలుస్తోంది...
దాగిపోయున్న తారల మీదకి చీకటి చూపు సారించాక,
ఉనికి కోసం దాచుకున్న దివ్వెల్ని ,
వూరు ఒక్కోటిగా వెలిగించుకోవడం మొదలుపెట్టింది...
పగలంతా ఎండలో నీడల మీద నిలబడ్డ చెట్లు
చీకటికి అందకుండా
వెన్నెల్ని కొమ్మలను మోస్తున్నాయ్,
మబ్బు కొంగు తాకగానే మురిసిపోతున్న
తారల చిలిపితనం
దూరంగా మెరుస్తుండడం కనబడుతుంది...
అప్పుడప్పుడూ ఓ పిట్టని కారణంగా వినిపిస్తూ
ఊరు రెండు నిశ్శభ్డాల మధ్య మాయమౌతుంటే
'నాలో నేను జీవిస్తున్నాననే' అసలు నిజం
ఏదో ఇప్పుడిప్పుడే స్పష్టంగా తెలుస్తుంది...
*********

No comments:

Post a Comment

Pages