అమ్మాయి ఆదిపరాశక్తి - అచ్చంగా తెలుగు

అమ్మాయి ఆదిపరాశక్తి

Share This

అమ్మాయి ఆదిపరాశక్తి

భండారు శ్రావ్య 


నిన్న మార్కట్లో కూరగాయలు కొంటుంటే అలా నా చెవిలో ఓ మాట వచ్చి పడింది — 'అబ్బా! ఆ అమ్మాయి భలే అందంగా ఉంది కదరా' అంటూ ఒక అబ్బాయి నన్ను చూస్తూ తన పక్కన వాడితో చెబుతున్నాడు. ఆ మాటలు విన్న ఏ అమ్మాయికిన కాస్త కోపం వచ్చినా మనసులో మాత్రం గాల్లో తెలిపోతూ, ఎక్కడికో వళ్ళిపోతుంటుంది. కోపం ఎందుకు? ఎవడో తెలియని వాడు తనగురించి మాట్లాడుతున్నందుకు కోపం వచ్చినా మనసులో కాస్త సంతోషంగానే ఉంటుందండోయ్! ఎంతైనా అది పొగడ్త కదా!
 కాని ఈ మాట నన్ను ఒక ఆలోచనకు గురి చేసింది. మదిలో ఓ పెద్ద యుద్ధమే అనుకోండి. అసలు అందమైన అమ్మాయేంటి? అమ్మాయే అందం. నాకు తెలిసి దేవుడి సృష్టిలో ఓ అపూరపమైన మాయ స్త్రీ అలాంటి ఆమెను ఆడ' (అక్కడ) ఉండాల్సిన పిల్ల అంటూ దూరం పెట్టేస్తుంటారుఎందుకు?
కాటుక కళ్ళు, ముక్కుపుడకతో మురిపించే ముక్కు,పెదవులపై ముసిముసి నవ్వులూ, విశాలమైన నుదురూ, అబ్బా, ఎంత చెప్పినా తక్కువే. ఆడపిల్ల అంటే భారం అంటుంటారు. అందరి భారంమోసే ఆ తల్లి భూదేవి కూడా ఆడదేగా. ఆ విషయం గుర్తేరాదు ఎవరికీ? ఎందుకలా?
నిజానికి చెప్పాలంటే, స్త్రీ కోసమే పుట్టిన ఆభరణాలకే మాటలు వస్తే అవి ఎంత మురిసిపోయేవో?
కాని ఏం లాభం? మాటలొచ్చిన ఈ ప్రపంచానికి మాత్రం స్త్రీ అంటే ఎప్పటికీ చులకనే!
 ఆమె ఆపాదమస్తకాన్నీ అలంకరించడానికినెయిల్ పాలిష్ లూ , గోరింటాకులూ, మెడలోకి గొలుసులూ, చేతికి గాజలూ, కాళ్ళకి పట్టీలూ, నడుముకి వడ్డానమూ, చెవులకి ఝుంకాలు, పాపిడి బిళ్ళా ఇలా ఒకటేంటి, అన్నీ ఆమె  కోసమే పుట్టాయి. వీటిని బతికిస్తున్నారే కాని ఆమెను ఎక్కడైనైబ్రతక నిస్తున్నారా?
పాపం! ఆ చిట్టి తల్లి, ఇంటికోసం ఎంత కష్టపడుతుంది. ఇంటికి పనిమనిషిలా, పిల్లలకు అమ్మలా, భర్తకు సుఖాన్నిచ్చే భార్యలా, ఒక కోడలిగా కూతురిగా ఎన్ని పాత్రలు పోషిస్తుంది. అవేవీగుర్తుపపెట్టుకోకుండా పురిటిలోనే చంపేస్తున్నారెందుకు?
నాకు ఎప్పడూ ఓ అనుమానం ఉంటుంది. అదేంటంటే భర్త కోసం దేవుడి దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని ఎన్నో స్కీములపేరుతో ఉపవాసాలు ఉంటుంది. అదేనండి! నోములూ వ్రతాలని ఎన్నోచేస్తుంటారుగా మరి ఈ స్కీములన్నీ ఆడవారికే ఎందుకు? మగవారికి వర్తించవా?
అమ్మగారింటి నుండి అత్తగారింటికి పంపిచేటప్పడు ఇక నీ భర్తె నీకు దేవుడు' అని చెప్పడమే వింటాం కానీ అబ్బాయికీ ఏ ఒక్కరైనా " నీ భార్య నీకు దేవతతో సమానం. ఆమెను మంచిగా చూసుకొ అనే ఓ చిన్న మాటకూడా అతడి చెవున పడేయరెందుకు?
ఇంత బంగారు తల్లిని అమ్మ బొజ్జలో ఉన్నప్పడే చంపేస్తుంటారు ఎందుకు? కానీ... అలా చంపేయడమే ఓ కందుకు మంచిదేమో! ఎందుకనుకుంటుంన్నారా పెరుగుతున్న ఆమ వయసు మీద కన్నేసి ఆమెను మరీక్రూరంగా అత్యాచారం చేసి చంపేస్తున్నారు . ఇంత హింస పెట్టి చంపే బదులు అమ్మ నన్ను నీ కడుపులోనే ' చంపేసి-బతికించు' అని ఆ చిన్నారి తల్లి ఏడ్చేస్థాయికివచ్చేలా ఉందీ లోకం.
' అన్నయ్యా! అని పిలిచిన ఆమెకు రక్షణ ఇవ్వటం మాని ఆ అన్నే తనపై అఘాయిత్యం చేస్తున్నరోజులివి. చదువుచెప్పే మాస్టారే చప్పడు చేయకుండా విద్యార్థిని చంపేస్తున్న కాలమిది. ఇలావాడు-వీడు అనే తేడానే లేదు. ప్రతీ ఒక్కరికీ 'స్త్రీ శరీరం మీదే కన్ను.
కానీ ఒక్క మాట మాత్రం నిజం – ఆమె ఓపికను పరీక్షిస్తున్న ఈ లోకాన్ని అంతు చూడటానికిఎప్పటికైనా ఆది-పరాశక్తి రానే వస్తుంది. ఆ రోజ పండు వెన్నలలో నిప్పల వర్షం కురవడంమాత్రం తధ్యం.
నా తొలి ప్రేమ లేఖ
ఇదిగో ఈ క్షణం కేవలం నీకోసం మాత్రమే ఆలోచించాలనిపిస్తుంది. తెలియని ఆనందం. అది ఈ వేళ నా తొలి ప్రేమ లేఖగా మారింది. నా తొలి ప్రేమలేఖే కాదు, నా చివరి ప్రేమ లేఖ కుడా నీకేనేమో ! ఎందుకంటే నువ్వు నన్నూ – నేను నిన్ను ప్రేమించుకునంతగా ఎవరు ఎవరిని ప్రేమించలేరేమో. ప్రేమించినా కూడా అది మన ప్రేమ అంత గొప్పది కాలేదేమో. అది గొప్పది అన్నాకూడా నేను ఊరుకోనుగా ! నీతో గొడవ పడినట్టే వాళ్ళతోనూ గొడవ పెట్టేసుకుంటా.
 అవును, అసలు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాను ? నీ బాహ్య సౌందర్యానికా ? లేక నీ మేదస్సుకా? రెండింటికినేమో ! ఎందుకంటే నేను అన్నీ నీ దగ్గర నుండే నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. మరిరెండింటినీ పొగడాలి కదా.
 అందమైన మోము, హాయినయిన చిరునవ్వు, స్వచ్ఛమైన మనసు, ఇవి చాలదా నీ గురించి చెప్పడానికి. ఇక నీ మేధస్సు ? ఆహ ! చెప్పనక్కర్లేదు. నా ప్రశ్నలన్నిటికి నువ్వే సమాధానం. నా కొచ్చే ఆపదలను నన్ను నేనుగా తీర్చుకునేల చేసేది నువ్వే కదా ! నన్ను ఆనందంగా భరిస్తావు. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటావు. ఇవి చాలదా నిన్ను ప్రేమించడానికి. అవును, ఇవే నా ప్రేమకి అర్హతలు. నేనే కాదు -నువ్వు కుడా నన్ను చూసిన మొదటి క్షణం నుండి నాలాగేప్రేమిస్తునావు. నాకంటే ఎక్కువే ప్రేమిస్తునావు అనుకో.
 నాకింకా గుర్తుంది. నా ఏడుపుతోనే మన ప్రేమ మొదలెంది. నా కన్నీరే మన ప్రేమకు శ్రీకారంచుట్టింది. ఆ ఒక్క రోజే నేను ఏడ్చాను. నా ఏడుపు చూసి నువ్వు ఆనందించావు.
నేను ఎప్పడయినా ఎలాగనై నీతో ఉండొచ్చు. ఏ క్షణమనై నిన్ను విసిగించే యోచ్చు. ఎందుకంటే మన ప్రేమకి ఏ హద్దులు లేవుగా !
నా సుఖాలనే కాదు నా కష్టాలను కుడా స్వీకరిస్తావు. రోజకోసారి i love you లు చెప్పకోకపోయినా మన ఇద్దరి మనసులో ఉండే మాటే అది. రోజ షికారులకి వెళ్ళము. గిఫ్టులు ఇచ్చుకోము. అలా ప్రేమిస్తేనే ప్రేమంటార? అయితే అది నా దృష్టిలో నకిలీ ప్రేమే ! అలా అనుకోవడం కూడా నేరమే. రోజ ప్రత్యేకంగా కలుసుకోము. కలుసుకోవడమేంటి? అసలు దూరంగా ఉంటేనేగాకలుసుకునేది.
 ఇదిగో ఎవ్వరు మన ప్రేమకి దిష్టి పెట్టనంటే నిన్ను నా ప్రపంచానికి పరిచయం చేసేస్తా. అది ఎవరోకాదు మా ' అమ్కేనని."
అవును ! నా ఈ ప్రేమలేఖ మా అమ్మకే. ఈ ప్రేమలేఖలోని ప్రతి మాట నిజమే. కావాలంటే మళ్లీ చదవండి.
 అమ్మ . . .
నీకు వంద కౌగిలింతలే ఇవ్వనా? వెయ్యి పాదాభి వందనాలే చెప్పనా?
మన ప్రేమ ఇలాగే శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటూ . .
నీ ప్రియమయిన,
రాక్షసి.......!
నేను బద్దకించిన ఆ ఉదయం
ఎవరూ లేని ఎడారిలో ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపించింది. కాని ఉన్నారు! చుట్టూరా అరుపులు."కావు - కావు’ మంటూ ఓ పక్కన నా ఫోన్ అరుస్తుంది. అయినా తీయబుద్దికాలేదు. అసలు ఏం పట్టనట్టే పడుకున్నాను. ప్రపంచం మొత్తం అప్పడే పుట్టిన పసిపాప పాల బుగ్గలా అనిపించింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనుకుంటాంగా అలా " నేను" మంచం దిగితే ఎక్కడ ఈ చల్లని వాతావరణం "మిస్" అవుతానేమో అనిపించీ అలానే పడుకున్నాను. నాకు చాలా ఇష్టమన్ల చల్లటి ఐస్ క్రీమ్ లాంటి గాలి, వేడి-వేడి మిర్చీబజ్జి లాంటి దుప్పటి కప్పకుని తెలియయకుండానే పెదాలప్పి వచ్చిన చిరునవ్వుతో ఆ వాతావరణాన్నీ ఎంజాయ చేసిన ఘనత నాకే దక్కుతుందేమో. పిచ్చుకల అరుపులు నా కోసం పాడుతున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా అనిపించింది. తెలియకుండానే నా గుండెలో గజ్జెల చప్పడు నా కాళ్ళని కదిలించేశాయి. అలా పడుకునే కాళ్ళతో డ్యాన్స్ కూడాచేసేస్తున్నాను.
 అదీ నా రాకుమారుడి కోసం ఎదురు చూస్తూ చేసినట్టే అనిపించింది!
ఆమె కడుపు కోతకు "ఆరేళ్ళు"
అదేంటా, ఆమె జీవితంలో అన్ని అడ్డంలకులే. పుట్టడమే అనుమానంతో పుట్టిందట. అమ్మ బొజ్జలో ఏడు నెలలు చప్పడు చేయకుండా కనీసం వారికి అనుమానం కలిగించేలా కూడా ఆమె కదలలేదంట! అమ్మ కడుపులో ఉండి డాక్టర్లతో దాగుడుమూతలు ఆడిన ఘనత నా స్నేహితురాలికే దక్కుతుందేమో. మొత్తానికి ఏడో నేలలో డాక్టర్లు దాన్ని పట్టేసుకుని ఆమె తల్లిదండ్రులకు తన గురించి చెప్పారు. ఇక అది ఈ లోకానికి రావాల్సిన సమయం వచ్చేసింది. నేను రావాలా? వద్దా? అని ఒక రాత్రంతా ఆలోచించి డాక్టర్లను బాగా సతాయించి దాని పుట్టినరోజన బయటకొచ్చేసింది. ఇక వచ్చిన దగ్గర నుండి అన్నీ అనుమానాలే. ప్రతీ విషయంలోవాళ్ళ అమ్మ బుర్రను తినేస్తుంటుంది. వాళ్ళ ఇంట్లో దానికి " క్వశ్చన్ బ్యాంక్" అనీ బయటేమో"చాటర్ బాక్స్" (Chatter box) అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇంట్లో దానకి ఇంకో పేరుకూడా వుంది "అల్లరి" అని. జరిగిన ప్రతీ విషయం వాళ్ళ అమ్మతో చ్ప్పేస్తుంది. కొన్నిసార్లు అబ్బాయిలు దానికి చేసిన ప్రపోసల్స్, (love proposals), కామెంట్స్ (comments),కాంప్లివంట్స్ (Compliments) కూడా అమ్మ చెవిలో వేసేస్తుంది.
 వాళ్ళ అమ్మతో అది ఎంత సన్నిహితంగా ఉంటుందంటే వాళ్ళు ఓ రోజ ఓ  పెళ్ళికి వళ్ళారు. వాళ్ళ చుట్టాల అబ్బాయి ఓ చైనా అమ్మాయిని ప్రేమించి ఏళ్ళిచేసుకున్నాడు . ఆ పెళ్ళికి వాళ్ళేముందే ఈ " అమ్మకూచి" ఏచైనా అబ్బాయో నచ్చితే చేసేసుకుంటాను అమ్మా అని అల్లరిగా చెప్పేసింది . ఇంతస్నేహంగా ఎవరుంటారు చప్పండి!
 ఇంకోసారి ఓ ఐస్క్రీం పార్లర్ ముందు నుంచి వెళుతూ, "అమ్మా, నాకో ఐస్క్రీం ఫ్యాక్టరీ ఉన్న వాడిని చూసిపెట్టు" అని ఆటపట్టించింది. ఓసారి ఏకంగా " వంట నేర్చుకోవే – ఫ్యూచర్ (future) లో ఒక రోజ కాకపోయిన ఇంకో రోజ చెయ్యాలి కదా!" అని వాళ్ళ అమ్మ అన్నపాపానికి ఓ వింతసమాధానమే ఇచ్చింది. అదేంటంటే "ఫర్వాలేదు అమ్మా, నేను 5 స్టార్ హోటల్ చెఫ్ (hotel chef) ని పెళ్ళి చేసుకుంటాను" అని ఇలా దాని అల్లరికి అంతూపంతూ లేదు. ఇంత దగ్గరగా ఉండే ఆ
అమ్మా-కూతురు మధ్య ఒకరికి తెలియకుండా ఒకరు ఒక విషయాన్ని దాచేసుకున్నారు.
 అదీ ఫిబ్రవరీ 02, 2010, ఆ పిల్ల రాక్షస జీవితానికి 'Black Day" అనే చెప్పకోవాలి. ఆ రోజ దానికి భరించలేని కడుపు నొప్పి, కాని అమ్మ మొహంలో సంతోషం. అందరు అమ్మల్ల ఆ తల్లి కూడా " మొగ్గ పువ్వుగా మారుతుందేమో" అని అనుకుంది. కాని కాదు. ఆ పువ్వుకి ఉన్న ముళ్ళు దాన్ని పొడిచేస్తున్నాయని ఆ తల్లికి త్లియదు. వారం అయినా కడుపులో అదే నొప్పి. భరించలేనంత నొప్పి. ఆ నొప్పి వచ్చినప్పడు ఎడమ కాలు కూడా కదల్చలేనంత నొప్పి. ఇంక ఇలా కాదని అమ్మ స్వయంగా ఆ చిట్టి తల్లిని నరకంలోకి అదే హాస్పటల్లోకి తీసుకిళ్ళింది. వళ్ళగానే ఏముంది "స్కానింగ్" అన్నారు . అన్నట్టే స్కానింగ్ అయిపోయింది. ఆ రిపోర్ట్స్ చూసిన డాక్టరే ఆశ్చర్యపోయింది. ఏం అర్థం కాక ఇంకోసారి స్కానింగ్ చేయించాలన్నారు. మళ్ళీ అదేరిజల్డ్ అమ్మను పిలిచి " మీ పాపకి పుట్టకతోనే గర్భసంచి లేదు" అని డాక్టర్ చెప్పగానే ఆ తల్లికుప్పకూలిపోయింది. అరిచింది. డాక్టర్ అని కూడా లెక్క చేయకుండా తిట్టింది.
 కాసేపయ్యాక ప్రశాంతంగా మళ్ళీ డాక్టర్తో మాట్లాడి ఇందులో ఎంతవరకూ నిజమో అడిగింది.దీనికి ఏ వైద్యం లేదా? మందుల వల్లప్రయత్నించవచ్చా? ఎంతైనా తల్లి మనసుకదా! ఆఖరికి తన అమ్మతనాన్ని ఆ చిట్టి తల్లికి ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. ఏ ఆపరేషన్కైనా సిద్ధమని చెప్పింది. కాని ఆ పిచ్చి తల్లికి తెలియదుగా. ఇది సాధ్యంకాదనీ పెద్ద హాస్పటల్స్ కు తిరిగింది. ఎంతోమందిడాక్టర్లని కలిసింది. కాని ఎక్కడా దీనికి మందులు కాని వైద్యం కాని దొరకలేదు.
ఇటు పిల్లని చూస్తే రోజ రోజకీ నొప్పి, స్కూల్, చదువు, స్నేహితులూ ఉండే తన లోకంలోకి ఒక్కసారిగా హాస్పటల్స్, మందులూ, డాక్టర్స్ వచ్చేసారు. తనకు ఏమైందో తెలియని స్థితిలో ఏ మందు ఇస్తే అది, ఏ టెస్ట్ అంటే దానికి తలూపేసేది. అస్సలు విషయం చెప్పినాఅర్థం చేసుకోలేనివయసు. కొన్ని రోజలకి శరీరం కూడా మందులకు స్పందించడం మానేసింది.
 మరీ లోకం కాకులుగా కూస్తుంది. ఒకరేమో ఎవరి కర్మ వారే అనుభవించాలి అన్నారు. ఇంకొకరు తల్లిదండ్రులు చేసిన పాపమే పిల్లలకి తాకుతుంది అన్నారు. కొందరు ఏ జన్మలో చేసుకున్నపాపమో ఈ జన్మలో ఇలా తాకి అనుభవిస్తుందన్నారు.
 అలా రెండేళ్ళు గడిచిపోయాక ఆమె ధైర్యం చేసి తన రిపోర్ట్స్ని తనే చదువుకుంది.తెలిసిన స్నేహితుల చుట్టాలలో డాక్టర్లను కలిసి అసలు విషయం తెలుసుకుంది . అమ్మ తనకు ఇన్ని రోజలూ ఈ విషయం చెప్పనందుకు కోపం వచ్చీ అమ్మను అడిగేద్దామనుకుంది. కాని ఆ రోజ రాత్రి తనకుతెలియకుండా వాళ్ళ అమ్మ ఏడవడం చూసింది. అలా ఏడవటం ఆ ఒక్క రోజే కాదు. ప్రతీ రాత్రులూ జరుగుతుంది. ఆమె కళ్ళలోనే సముద్రం మొత్తం ప్రవహించే అంత ఏడ్చేది. ఆమ మనసు నిండా చెప్పలేనంత బాధ. అలాంటి ఆమె, ఒక్క విషయంలో మాత్రమే హాయిగా వుంది. తన కూతురికి దీని గురించి తెలియదన్న ఒకే విషయం. అలాంటి అమ్మ మనసులోఅలజడి రేపడం ఇష్టం లేక, ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చేది నా స్నేహితురాలు.
ఎవరికి చెప్పి ఏడవాలి? కనీసం అమ్మను ఓదార్చటానికి నాన్న ఉన్నారు. మరి తనకి? " ఎవరికి
చెప్పాలి?" అన్న ప్రశ్న ప్రశ్నలాగే ఉండిపోయింది.
 ఎలాగోలా హోమియోపతికి మారి పోయింది."గుడ్డికంటే మెల్ల నయం" అన్నట్టు ఆ హోమియోపతి వల్ల కాస్త నొప్పి తగ్గింది. ఆరు నెలలకోసారి స్కానింగ్. ఒక్కోసారి ఓక్కో రిసల్డ్ . ఓ సారి గర్భసంచి కాస్త కనిపిస్తుంది అని. ఇంకోసారి అసలు ఏం కనిపించటం లేదు. ముందు లానే ఉందని. ఒక్కోసారి అసలు ఇది డవలప్ అవడం జరగని పనీ అని కూడా వచ్చేసేది. ఇంతకంటే ఇంకో నరకం వుంటుందా?
భరించలేక ఆ రోజ వాళ్ళ అమ్మ వడిలో పడుకుని బాధ మొత్తం కక్కేసింది. అమ్మ ఓదార్చింది.నచ్చచెప్పింది. ఎందుకంటే "తల్లి" మనసు కదా! తన బాధ మింగేసి కూతుర్ని ఓదార్చింది.
 అన్నీ ఆశలూ వదిలేసుకుని బతకడం మొదలు పట్టింది. ఏదో అమ్మ తృప్తి కోసం మందులు వాడటం అప్పడప్పడూ ఆ నరకంలోకి వెళ్ళి వచ్చేది. తన కోసం అమ్మ ఎంత డబ్బు ఖర్చుచేసిందో తనకీ, అమ్మకీ మాత్రమేతెలుసు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ రోజా వారితో హాస్పటల్వెళ్ళలేదు కదా!
వాళ్ళ అమ్మ ప్రేమ, దేవుళ్ళ వరకు వెళ్ళిపోయింది. ఎన్నో పూజలు, వ్రతాలు. ఈ తల్లి పిచ్చి ప్రేమను భరించలేక తన చీకటి ప్రపంచం నుండి బయటకు రావాలనుకుని కాస్త కష్టమయినా నవ్వడంనవ్వించడం మొదలు పట్టింది. అమ్మ ప్రపంచాన్నే మార్చేసింది. తన ప్రపంచాన్ని పువ్వులా మార్చినాదానికున్న ముళ్ళు తనని ఎప్పడూ గుచ్చుకుంటూనే వుంటాయి కదా! అలా ఈ రంగుల ప్రపంచం లోని అన్ని రోజలతో పాటు తన 'Black Day" అదే ఫిబ్రవరి 2 కి "ఆరేళ్ళు"పూర్తిచేసుకుంది. పాపం ఎంత కష్టమొచ్చిందే నీకు!
ఇంతకీ దాని పేరు చెప్పలేదు కదా! తన పేరు "O. అమ్మాయి". ఆ అమ్మాయి జీవితంలోని ఈకష్టాన్ని ఏదో ఒకరోజు దేవుడు చూసి ఆలోచిస్తాడనే చిన్న ఆశతో
ఇంకో " అమ్మాయి" !
***

No comments:

Post a Comment

Pages