ఇలా ఎందరున్నారు ?- 19 - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు ?- 19

Share This

ఇలా ఎందరున్నారు ?- 19     

అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. అనంత్ తో సంకేత  ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని.  సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. అనంత్ తనతో తిరిగింది కేవలం కాలక్షేపానికే అని తెలిసిన సంకేత మనసు ముక్కలవుతుంది. అతన్ని నిలదీసేందుకు వెళ్ళిన సంకేత, ప్రస్తుతం అతను మరో అమ్మాయితో ఇదే ఆట మొదలు పెట్టాడని తెలుసుకుంటుంది. అనంత్  కు  ఆక్సిడెంట్  అవుతుంది. అతనికి సేవలు చేస్తుంటుంది  సంకేత. నీలిమను పెళ్లిచేసుకోవాలన్న తన నిర్ణయాన్ని  వెల్లడిస్తాడు శ్రీహర్ష. అతని  తల్లి  కాంచనమాలకు సుతారమూ ఇష్టం లేదు.  ఇక చదవండి... )
“మరి అది ఎవరికి పుట్టిందో తెలియదు కదరా!” అంది అసహనంగా, తల్లి అలా మాట్లాడటం శ్రీహర్షకి నచ్చలేదు.
 "ఎవరైనా తల్లిదండ్రులకే పుడతారు మమ్మీ! అదికూడా ఒక ఆడా ఒక మగకి..! వాళ్లను కూడా బ్రహ్మదేవుడే సృష్టిస్తాడు. చిత్రకారుదు సృష్టించడు...." అన్నాడు. అతని మాటల్లో ప్రశాంతత తగ్గి కొద్దికొద్దిగా పెళుసుతనం చోటుచేసుకోవటం శివరామకృష్ణ గ్రహించాడు.
“నీకోసం ఎంతమంది సాఫ్ట్ వేర్ అమ్మాయిలు క్యూ కట్టి వున్నాతెలుసా!”
వాళ్లతో నేను సుఖపడలేను
            “నీ సుఖమే తప్ప నా మాట వినవా?"
మాట అనేది మనిషి జీవితాన్ని చిందరవందర చేసే శిలాశాసనంకాకూడదు మమ్మీ! జీవితాన్ని ప్రేమించే వాళ్లు కొన్ని మాటలకు కట్టుపడలేరు... నేను నీలిమను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కితీసుకోలేను. నువ్వుంకేం చెప్పొద్దూ... నువ్వ్వంటే గౌరవం ఉంది దాన్ని నిలుపుకో!” అన్నాడు.
          “ఇక లాభం లేదు నానమ్మా! మమ్మీ ఒప్పుకోడు. నేను నీలిమను తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాను” అన్నాడు శ్రీహర్ష.
          నీలిమ నెమ్మదిగా వంటగదిలోకి వచ్చి వాళ్ళ మాటలు వింటోంది. నేలిమకు ముందే తెలుసు ఈ పెళ్ళికి కాంచనమాల ఒప్పుకోదని.
          రాత్రి శ్రీహర్ష తనని ఒంటరిగా మేడమీదకి తీసికెళ్లి ‘నిన్ను పెళ్ళిచేసుకోవాలని ఉంది. నీ అభిప్రాయం చెప్పు’ అన్నాడు తను ముందు నమ్మలేదు. జోకనుకుంది. ఆ తర్వాత అతని ముఖం చూసి దిగ్ర్భామ చెందింది. ఆటను చాలా స్థిరంగా చోస్తున్నాడు తన వైపు... అతనలా చూస్తుంటే నేనేంటి ఈ వరమేంటి అన్పించింది. వెంటనే కాంచనమాల గుర్తొచ్చి భయం వేసింది. అందుకే అంది ‘నన్ను చేసుకుంటే మీకేమీ రాదు’ అని...
          “నాకు తెలుసు నీవల్ల నాకేమి వస్తుందో! ఏమిరాడో! చూడు నీలిమా! ఒక గృహిణిగా ఉండటానికి కావలసిన మంచి లక్షణాలన్నీ నీలో వున్నాయి. ఇంటిని చక్కదిద్దుకోవటానికి సరిపోయేంత చదువు, అంతకు మించిన సంస్కారం, దేనికీ భయపడని వ్యక్తిత్వం నీలో వున్నాయి. ఇవన్నీ నీలో ఉన్నట్లు కొంతకాలంగా నిన్ను గణించడం వల్లనే గ్రహించాను. నిన్ను నేను పనిమనిషివన్న కోణంలో కాకుండా నా భార్య ఐతే ఈ అమ్మాయి ఎలా వుంటుంది? అన్న దృష్టిలో చూసాను కాబట్టి నాకు నువ్వు అన్ని విధాలా సరిపోతావనిపించింది.
          అదీగాక ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు భవిష్యత్తు ఎలా వుంటుందో ఏమో! పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. పెళ్ళయాక వాళ్ళ టాలెంట్ ని కంపెనీల డెవలప్మెంట్ కి ఉపయోగపడేలా చేస్తూ కంప్యూటర్ల ముందు కూర్చుని ఇంటికొస్తున్నారు. ఇంటికొచ్చాక రెస్టు పేరుతొ తలనొప్పి అని పడుకుంటున్నారు. అలాంటి అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటే నేను ఆఫీసు నుండి వచ్చి తలనొప్పి అని పడుకుంటే తన తలనొప్పి ప్రక్కనపెట్టి నాకోసం తన టైం ని కేటాయిస్తుందా? నువ్వు అయితే నా మనస్తత్వానికి సరిపోతావు. ఏ ఆనందం లేనిదే ఎవరూ దేన్నీ కావాలనుకోరు. ఒక్కొక్కరి ఆనందం ఒక్కోదానితో ముడిపడి వుంటుంది. ఎవరి అభిప్రాయం వాళ్లది. నాకు కట్నం వల్ల వచ్చే డబ్బు ఇష్టం లేదు. నేను కాని, నా భార్య, పిల్లలుకాని నా సంపాదనతోనే బ్రతకాలి. అదేనాకు గొప్పగా, ఆనందంగా ఉంటుంది. ఇది నీకు నచ్చేతేనే నా జేవితంలోకిరా!” అన్నాడు.
          అతని మాటలు వినటానికి బాగున్నాయి. ఆచరణలో అంత బాగుందవేమో! అందుకే ఒప్పుకోలేదు నీలిమ. “మీతో సమానమైన చదువులు చదివిన సంకేత, పల్లవి,శివాని మీకు బాగా సరిపోతారు. లేదా మీ బంధువుల్లో ఎవరిని చేసుకున్నా మీ జీవితం బావుంటుంది. నన్ను బలవంతంగా చేసుకున్నా కూడా నేను మీ పక్కన ధైర్యంగా నిలబడలేను” అంది.
          దానికి శ్రీహర్ష “నువ్వేకాదు. చాలామంది భార్యలు తమ భర్తల పక్కన నిలబడాలంటే ముందు భయపడతారు. తర్వాత మామూలైపోతారు. నువ్వు కూడా అంటే! అంత కంగార్ పడాల్సిందేమీ లేదు. అదీగాక మన పెళ్ళయ్యాక నా పఒక భార్యగా నీ ధర్మాలను నువ్వు చెయ్యగలవన్న నమ్మకం నాకుంది. నేను కూడా నీకు నా పక్కన భార్య స్థానాన్ని ఇచ్చి ప్రేమగా, గౌరవంగా చూసుకోగాలనన్న విశ్వాసం వుంది. ఇంతకన్నా అదనంగా కావాలనిగాని, వద్దనిగాని వుందా! వుంటే చెప్పు!” అన్నాడు ఆమె ఇంకేమీ చెప్పలేదు ఒప్పుకుంది.
          కాంచనమాల మాట్లాడలేదు. అలసిపోయిన దానిలా, ఓడిపోయినా దానిలా ఆమె గుండె బావురుమంటోంది.
          ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించారు. అంతే! ఆ తర్వాత పర్యవసానం ఎలా వుంటుంది అన్నది వాళ్లలో ఒక్కరు కూడా ఆలోచించలేదు...
***
సంకేత ఒకరోజు కాలేజీకి వెళ్ళినా, నాలుగురోజులు అనంత్ దగ్గర హాస్పిటల్లోనే వుంటోంది. దేవరాయుడు కూడా సంకేతను గౌరవంగా ఇంటి మనిషిలా చూసుకుంటున్నాడు.
అనంత్ తల్లిదండ్రులు ఎప్పుడో తప్ప ఎక్కువగా చిన్నకొడుకు దగ్గరే ఉంటున్నారు. అదేం అంటే మాకు వాడిని ఆ స్థితిలో చూస్తుంటే గుండెదడ వస్తోంది. ఒళ్లు వణుకుతోంది. పైగా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసుకదా అంటున్నారు.... దేవరాయుడు అర్ధం చేసుకొని ‘మేమున్నాం కదా! మీరు రెస్ట్ తీసుకోండి! అనంత్ కి ఏం కాదు’ అని భరోసా ఇచ్చాడు.
దేవరాయుడు భార్య సావిత్రమ్మ హాస్పిటల్ కి వచ్చినా మోకాళ్ళ నొప్పుల వల్ల ఎక్కువ సేపు కూర్చోలేకపోతోంది. సంకేతకి ఆ వాతావరణం అర్ధమై అనంత్ ను బాధ్యతగా చూసుకంది. ఆటను పూర్తిగా కోలుక్న్నాడు. కాకపొతే కాలుకి మాత్రం ఫిజియోతెరఫీ చేయించాలని సర్జన్ చెప్పాడు.
ఇంటికి తీసికేల్లమని డాక్టర్లు చెప్పటంతో అప్పుడు వచ్చాడు నిశ్చల్ హాస్పిటల్ కొచ్చి బిల్లు కట్టి అనంత్ ని దేవరాయుడు ఇంట్లో వుంచి వెళ్ళిపోయాడు.
*****
జీవితం ముందుకు సాగుతూనే వుంటుంది కానీ అది ఎటువైపు వేలుతున్నదీ మనమే తెలుసుకోలేం... సంకేత పరిస్థితి అలాగే వుంది.
హిందూ ఫోన్ చేసి “ఏం చేస్తున్నావు? కాలేజీకి వస్తున్నావా?” అని అడిగింది.
“రావటంలేదు. ఇక్కడ అనంత్ కి ఫిజియోతెరఫీ చేసే అమ్మాయి రాలేదని నేను చేయిస్తున్నాను....టైం పడుతుంది వీలుకాదు” అంది.
“అసలు అక్కడికి నువ్వు ఎందుకు వేల్లావే! హాస్పిటల్ లోనే కాక ఇంట్లో కూడా మకాం పెట్టావా?” అంది హిందూ.
“దేవరాయుడు అంకుల్ కాల్ చేసి రిక్వెట్టు చేశాడే! ఏం చెయ్యను చెప్పు! వదిలేస్తే అనంత్ పనికిరాదు...” అంది
”ఎవరికీ పనికిరాదు? చంపేస్తా నిన్న ముందు కాలేజీకి రా!” అంది కేకలేస్తూ హిందూ.
”నేను రాన్ ప్లీజ్! నువ్వు పెట్టేయ్యవే ఫోన్! అంది సంకేత.
“మరి ఇప్పుడెం చెయ్యదలుచుకున్నావు?”
“ఆంటీ నా చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది హిందూ! అనంత్ ని నేను అయితే గాజుబొమ్మలా పగలకోత్తకుండా చూసుకుంటానట... ఏ అమ్మాయికైనా అదే గొప్ప అర్హతట... కానీ ఇప్పటి అమ్మాయిలు కొందరిలో అది కన్పించటం లేదట. నేను అనంత్ ని ప్రేమించటం వాళ్ళ అదృష్టం అట....ఇది నీకు చెప్పాలనుకునే లోపలే నువ్వు కాల్ చేసి తిడుతున్నావు....”అంది సంకేత.బరువుగా న్త్తోర్చడం తప్ప హిందూ నుండి ఎలాంటి సమాధానం రాలేదు .
కాల్ కట్ అయింది.
***
          శ్రీహర్ష వరమ్మ చెప్పినట్లే నీలిమతో రిజిస్టర్ మ్యారేజి అయింది... సంకేతకి అనంత్ తో శాస్త్రోక్తంగా పెళ్లి జరిగింది. హిందూ, పల్లవి, శివాని, బి.టెక్ ఫైనల్ ఇయర్లోకి వచ్చారు.
*****
కాలం వేగంగా పరిగెడుతుంది. టివి చూసుకుంటూ ఎటూకదలకుండా ఫోన్ దగ్గరే కూర్చుని వుండే సావిత్రమ్మను చూస్తుంటే హాస్టల్ వార్డెన్ లా అన్పిస్తుంది.
హిందూ, శివాని పల్లవి ఎవరు ఫోన్ చేసినా కూడా సంకేతకి ఇవ్వట్లేదు సావిత్రమ్మ. “చదువుకునే పిల్లలతో ఏంటి మాటలు హాయిగా శ్రీహర్ష భార్య నీలిమతో మాట్లాడుకో . నీకు ఏమైనా సందేహాలు వున్నా అడిగి తెలుసుకోవచ్చు. ఇదిగో ఈ కార్డ్ లెస్ ఫోన్ తీసుకెళ్ళి నీ గదిలో కూర్చుని మాట్లాడుకో! అంటూ నీలిమ ఎపుడు ఫోన్ చేసినా సంకేత ఎంతపనిలో ఉన్న పిలిచి మరీ ఇస్తుంది.
అనంత్ మాత్రం సాకేత నీలిమతో మాట్లాడుతున్నప్పుడు చూస్తే కోప్పడతాడు.”పెద్దమ్మా సంకేతకి నీలిమ ఫోన్ ఇవ్వకు, నీలిమతో మాట్లాడుతూ నన్ను పట్టించుకోవటం లేదు అంటాడు. మరీ కోపం వస్తే ఫోన్ లాక్కుని విసిరికొడతాడు. ఆమె అనంత్ మాటలు లెక్కచెయ్యదు. సరదాగా ఒక నవ్వు నవ్వి – నీలిమ ఎప్పుడు ఫోన్ చేసినా ఇస్తుంది. ఆమె కూడా అప్పడప్పుడు నీలిమతో మాట్లాడి కాంచనమాల, శివరామకృష్ణ, వరమ్మ శ్రీహర్ష గురించి పేరు పేరున అడిగి తెలుసుకుంటుంది. ఒకటి రెండుసార్లు నీలిమ,శ్రీహర్షతో వచ్చి వెళ్లింది. నీలిమ సావిత్రమ్మకి బాగా నచ్చింది. అమెకేందుకో వల్ల కుటుంబం పట్ల పూర్తిస్థాయిలో గౌరవం ఏర్పడింది.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages