ప్రేమంటే

పోడూరి శ్రీనివాసరావు 


నాకు వయసొచ్చిందని నిన్ను చూశాకే తెలిసింది
నా మనస్సు నా అధీనంలో లేదని నిన్ను తలిస్తేనే తెలిసింది
నా వయసు పరువాలను నీకే ఇవ్వాలని నిన్ను చూస్తే అనిపించింది.
నా కోసం నీవు-నీ కోసం నేను.... ఎదురుచూసాము ఎన్నో యుగాలు
గత కొన్ని జన్మలుగా కలుస్తూనే ఉన్నాం - ఈ జన్మలోనూ మళ్లా కలిసాం.
భగవంతుడెంత నిర్ణయుడు - కొన్ని సంవత్సరాలు ఎడబాటు కల్పిస్తాడు
యుగాల తరబడి మన మనసులను కలిపే ఉంచుతున్నాడు
మాయాజాలం మనసుల్ని కమ్మేస్తుంది
మనమిరువురం ఎదురెదురుగా ఉన్నా
ఒకళ్లనొకళ్లం గుర్తించలేని స్థితిలో ఉన్నాం
ఎందుకో తెలుసా!
నా కళ్లు, కనపడని నీ మనసుని వెతుకుతున్నాయి
నీ కళ్లు కూడా, నా మనసుని వెతుకుతున్నాయని తెలుసు
కళ్లు గుర్తించలేని నీ మనసుని - నా వయసు గుర్తించింది
అందుకే యుగయుగాలుగా మనం కలుస్తూనే ఉన్నాం
మన ప్రేమను ప్రపంచానికి పంచుతూనే ఉన్నాం
ఎక్కడ దాగున్నావో అని నిన్ను వెతికే క్షణాల్లో
తెలిసిన నిజమేమిటంటే
నీ కోసం ఈ ప్రపంచం అంతా వెతుకుతూనే ఉన్నాను
ఒక్క నా మనసులో తప్ప!!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top