నాన్న - అచ్చంగా తెలుగు

నాన్న

Share This

నాన్న

మొనంగి ప్రవీణ 


అమ్మ అనే రెండక్షరాల కమ్మని పిలుపులో అనురాగము ఉంది,

నాన్న అనే రెండక్షరాల పిలుపులో నాది అనే అధికారం ఉంది ,

అప్పటివరకు అమ్మకే పరిమితమైన నాన్న ప్రేమ ,

నేను పుట్టగానే నా సొంతమయింది.

 

తన తల్లిని ,తన కూతురి లో చూసుకొని,

మురిసిపోయే అల్ప సంతోషి నాన్న.

బంధాలను,అనుబంధాలను సమతూకముగా,

నిలబెట్టే ప్రజ్ఞాశీలుడు నాన్న.

జన్మతహ నాన్న,విజ్ఞతహ గురువు,

కౌమారతహ స్నేహితుడు ‘’నాన్న’’.

బార్య బిడ్డల కొరకు అలుపెరుగక

అహర్నిసలు శ్రమిస్తారు నాన్న.

 

తన బిడ్డలకు గొప్ప  ఆదర్శమూర్తి  నాన్న,

కూతురు నాన్న లాంటి భర్తను కోరుకునేంత,

ఉన్నత భావాలు కల వ్యక్తి నాన్న.

నాన్న అనే పిలుపు తప్ప ఏమీ ఇవ్వలేని మాకోసం,

తన జీవితన్నే ధారపోసిన మహోన్నత వ్యక్తి నాన్న.

భగవద్గీతలో గీతోపదేశం అర్జునుడికి ఎటువంటిదో,

జీవితంలో అన్ని సమయాలలో ,

అంతటి మహత్తరమైనవి నాన్న పలుకులు.

నాన్న రక్షణ,కర్ణుడి కవచకుండలాలు లాంటివి,

ఇవ్వడమే తప్ప ఏమి ఆశించని నిస్వార్దపరుడు నాన్న.

ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని ఋణం ‘’నాన్న ప్రేమ ‘’.

No comments:

Post a Comment

Pages