హోలీ-వర్ణ విన్యాసం

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


రంగుల రంగరింపు శూన్యమైతే

ప్రకృతి రమణీయత లుప్తం

ఇంద్రధనుస్సు రిక్తం

సప్తవర్ణాలు నిరంతరం

కంటితో దోబూచులాడకపోతే

చూపుకర్థం..వ్యర్థం

పచ్చనిపైరు

తెల్లని మరుమల్లె

పచ్చని రాచిలుక..ఊహకు ప్రాణం

విడి విడిగా రంగులలుముకుంటే

వసంతోత్సవం

కలిసి ధవళవర్ణమైతే న్యూటన్ వర్ణచక్రం

కలనైనా..ఇలనైనా

వర్ణవిన్యాసం లేకపోతే

మన జీవితం అసంపూర్ణం!

***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top