“ఏకత్వం”

సుజాత తిమ్మనశివ తత్వం, విష్ణు తత్వం ఏకమై...
ఏకత్వ స్తాణువై..పూజలందుకొను మాసం.. ఈ కార్తీకం..
విశేష ఫల ప్రదమైన ..పవిత్రమైన..
ఉపాసన కాలమయిన దక్షిణాయానంలో వచ్చే మాసం.. ఈ కార్తీకం..
నెల వంక అయిన చంద్రుడు ..కృత్తికా నక్షత్రంతో కూడిన రోజే.
నెలారంబమని..ఆ పేరుమీదే...నిలిచిన మాసం..ఈ కార్తీకం..
ఈశ్వర స్వరూపమే దీపం...ఆ ఈశ్వర దర్శన బాగ్యంకొరకే..
ఉదయం...సాయంసంద్యలలోనూ.. దీపం పెట్టుకొను మాసం ..ఈ కార్తీకం..
ప్రతి దేవాలయంలోను..అర్చనారాధనలతో పాటూ ..ధ్వజస్తంబంపైన ..
ఆకాశదీపం వెలుగులు రువ్వుతూ కనిపించే మాసం..ఈ కార్తీకం..
ఆశ్వీయుజమాసంలో ..చంద్రుని వెన్నెలను త్రాగిన నదీజలాలు..
ఔషధీయిక్తమై ..నదీ స్నానానికి ప్రాశస్త్యమిచ్చే మాసం..ఈ కార్తీకం...
విష్ణు తల్పమైన ఆదిశేషుని ..శివుని కంఠాభరణమైన ..నాగుని ..
పూజిస్తూ....భక్తితో ..పాలుపోయు నాగుల చవితి వచ్చు మాసం..ఈ  కార్తీకం..
ఒకటిగా కలిసి...బేదాలను విడిచి ..అందరూ కలిసి..వనబోజనార్దమై..
పరమాత్మ స్వరూపమైన చెట్ల నీడలకేగు మాసం..ఈ  కార్తీకం..
ఆలయాల్లో..యమద్వారమును తలపించు .. జ్వాలా తోరణం
శైవ..విష్ణు లోకాలకు  దారిని చూపిస్తుందని నమ్మే  మాసం..ఈ కార్తీకం.....!!
**********     ***************            ********** 

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top