Wednesday, September 23, 2015

thumbnail

ధౌమ్య హితోక్తులు- 3

ధౌమ్య హితోక్తులు- 3 

- చెరుకు రామమోహనరావు


ఇక ధౌమ్యుని హితోక్తులకొస్తాము.
ద్రౌపది తో సహా పాండవులు తాము ఏ ఏ వేష ధారణలు చేయవలేని నిశ్చయించుకొంటారు.నేను, ఆ వేషములేవి వారి పనులేవి అన్న విషయమును దాటవేస్తున్నాను. చదివి కొందరైతే నర్తనశాల సినిమా చూసిఅయినా 
చాలామంది పాండవుల ప్రచ్చన్న వేషముల గూర్చి వారి పనుల గూర్చి తెలుసుకోనియే వుంటారు.అప్పుడు ధౌమ్యుడు వారితో ఏమంటాడో తిక్కన గారి మాటలలోనే వినండి.
"మీకు నప్రమాదార్థంబుగా నానేర్చినవిధంబున నుపదేశం బవశ్య కర్తవ్యంబు రాజులం గొలిచి యెమ్మెయి నయినను బ్రదుకుజనంబులు గీడునుం బొరయ కుండునట్టి సాధారణనీతి సంక్షేపరూపంబున నెఱింగించెద సావధానులరయి వినుండు." చూడండి పురోహితుడు అనేవాడు ఎంత స్వార్థ నిరపెక్షితుడై ఉంటాడో!
తగఁ జొచ్చి తనకు నర్హం, బగునెడఁ గూర్చుండి రూప - మవికృతవేషం
బుగ సమయ మెఱిఁగి కొలిచిన, జగతీవల్లభునకతఁడు-సమ్మాన్యుఁడగున్‌.
మన్నన కుబ్బక యవమతి, ద న్నొందిన స్రుక్కఁబడక ధరణీశుకడన్‌ము న్నున్నయట్ల మెలఁగిన, యన్నరునకు శుభము లొదవు - నాపద లడఁగున్‌.
ఇవి మచ్చునకు తిక్కన మాటలలో ధౌమ్యుడు చెప్పిన రెండు మాటలు.
ఆ అన్ని మాటలను కలిపి నేను ఒకటి రెండు మూడు వరుసలో వ్రాయ ప్రయత్నించినాను . ఇవి తిక్కన గారు 
చెప్పిన వరుసక్రమములో లేక పోవచ్చు.
1. రాజును కలువవలసి వచ్చినపుడు ముందుగా నాతని ద్వారపాలకుని అనుమతి తీసుకోనవలసియుంటుంది.
అంటె ద్వాపర యుగము లొనే  రాజ దర్శనమునకు వాకిటికాపు వద్ద అనుమతి పొందే సాంప్రదాయముండేదని గ్రహింప గలరు. విదెశీయుల ఏలుబడి కలిగిన 800 ల సంవత్సరములలొ నెర్చుకొన్నధి కాదు. అసలు ఈ విషయములొ రాయల వద్దకు పొతూ వాకటి కాపును పెద్దన తిమ్మన భట్టుమూర్తి తెనాలి రామకృష్ణుడు ఎంత చాతుర్యముతో పలకరించినారొ గమనించండి, అనుమతి తీసుకొనె అవసరముళెకున్నా ఎప్పుదు ఏపని అతనితో పడుతుందోనని.
వాకిటి కావలి తిమ్మా
ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా
నీకిదె పద్దెము కొమ్మా
నాకీ పచ్చడమె చాలు నయముగనిమ్మా
పలుకరించినట్లూవుంది పచ్చదము అంతే శాలువా తీసుకొన్నట్లూ వుంది. పలకరింపులొ కూడా లాభము పొందడము రామకృష్ణుని చాతుర్యము .
 2. రాజులను మనస్పూర్తిగా నమ్మ కూడదు
దొరల చిత్తము మాకులనీడ ఎప్పుడెత్ల వుంతుందో చెప్ప వీలు కాదట అన్నది పెద్దల మాట. అంటె యుగయుగాలనుండినే మన పూర్వులు మనకొరకు ఎంత మంచి బోధించుతూ వచ్చినారో చూదండి. అనుభవముతో  అమితమైన పరిశీలనా పటిమతో చెట్టునీడ  ఏ సమయయములొ ఎటువైపుకు మారుతుందో తెలుసుకొన వచ్చును. అప్పుడు తదనుకూలముగా మనమూ మారవచ్చును. రాజువిషయములో కూదా అంతే .
 3. ఇతరులకు నియమింపబడని స్థానములోనే కూర్చొనవలెను. రాజునకు ఎదురుగా కూర్చొనరాదు
రాజుకు ఎదురుగా కూర్చుంటే అన్నింటికీ కష్టమే. అవసరమునకు మించి ఏ రసమునకు స్పందించినా మనకు మిగిలెది నీరసమే. రాయల సీమలొ ముఖ్యంగా కడప జిల్లాలో ఒక సామెత వుంది, 'రెడ్డి గారి పిల్లోనితో గోలిగుళ్ళు ఆడినట్లూ అని. రెడ్డి గ్రామాధికారి. గ్రామమునకు అతడు రాజే ఆయన కొడుకు యువరాజే. మరి యువరాజు తో గోలీలాదితే గెలిచినా తప్పే ఓద్డినా తప్పె కదా. రాజుకు ఎదురుగా కూర్చొని నవరసములలో దేనికైనా అవసరానికి మించిన స్పందన మనము చూపినపుదు రాజు కంతబదితే ముప్పే. ఆయన తలచితే అది తప్పే!
 4. రాణివాసముతో అనుబంధము ఏర్పరచుకోగూడదు
రాణివాసముతో అనుబంధము అరటియాకు ముల్లు వంతిది. మనము కదళీ పత్రమే రాణివాసము కంటకమే.ఆ రెండింటి లొ ఏది దేనిమీద పడినా చిరిగేది అరటియాకే. ఈ విషయము పై ఇంతకన్నా విశ్లేషణ  అవసరము లెదని నా అభిప్రాయము. ఈ మాట కూడా నేటికీ సత్యమే కదా!
5. తమతమ కారణాలకు రాజాన్తఃపురమునకు వచ్చిపోయే వారలతోనూ,రాజుకు ఇష్టము లేని వారితోనూ,రాజుకు త్రుత్వము వున్న వారితోనూ మైత్రి ఘటించరాదు
నెటి కాల పరిస్థితులకు అనుకూలముగా ఒక కార్యాలయమును వూహించుకొండి. ప్రధానాధికారికి ప్రత్యెక వాతానుకూల గది వుంతుంది. దాని చుట్టూ బయట కలుపు మొక్కల్లా పెద్ద చీన్న వుద్యోగులకు వుచిత స్థానాలు అమర్చబది వుంతాయి. అధికారి తో కలిసే వారితో అనవసరముగానూ అతిగానూ కలిస్తే చుట్టూ వున్నవారికి చెవులు కొరుక్కునే అవకాశమిచ్చినత్లే. అదేవిధంగా ఆయనకు సరిపొని వారితో సహవాసము చెయుట  అధికారి కంటబడినా మనమాయన ఆగ్రహానికి పాత్రులమైనట్లే! కాబట్టి రెండు విధాలా మనపని శ్రీమతే రామానుజాయన్నమః అయినట్లే! తస్మాత్ జాగ్రత

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information