వైఖానస జయంతి

టేకుమళ్ళ వెంకటప్పయ్య 


శ్రావణ పౌర్ణమిరోజున జంధ్యాల పండగ, రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నాముఇదే రోజు "వైఖానస జయంతి" కూడా జరుపుకుంటాము. వైఖానసులకు పరమ పవిత్రమైన రోజు ఇది. తిరుమలలో జరిగే నిత్యపూజలు, సేవలు, ఉత్సవాలు, దేవాలయ నిర్మాణం దగ్గరనుంచి, విగ్రహం తయారీ, ప్రతిష్ట, అర్చన మొదలైన విధివిధానాలన్నీ వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతాయి. శాస్త్రాన్ని అందించిన వాడు శ్రీ విఖనస మహర్షి.   వైఖాన మహర్షి జన్మ దినమే  వైఖానస జయంతి. 
వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా మనుధర్మశాస్త్రంలో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం కాలానికే ఉందని తెలుస్తోందినారాయణీయంలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోందివైఖానసులు పూజారులే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం  కొంత తగ్గినప్పటికీ...రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసినా... వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు. 
ఒకానొక కథనం ప్రకారం భగవంతుని ఆదేశం మేరకు వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. ఆలయఒలో  పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తూ ఉంటారు. అంతలోనే అందరు వైఖానసులు ఎవరో గుర్తు తెలియని విధంగా నరికివేయబడతారు. అది చోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా పోవడంతో రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమై చర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనే పూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగి తేలగానే బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారి వైభవం తెలుసుకున్న  రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో ఇప్పటికీ  వైఖానస- శ్రీవైష్ణవ వైరం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంతుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై చాలా వివాదాలున్నాయి. రామానుజుల వారు వైఖానసాన్ని పక్కన బెట్టి శ్రీవైష్ణవాన్ని ముందుకు తేవాలని యత్నించినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివశరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే అన్నది గమనించదగ్గ విశేషం.
  శాఖకు మూలపురుషుడైన వైఖాన మహర్షి విష్ణుమూర్తి అంశతో నాలుగు భుజములు, శంఖు చక్రాలతో నైమిశారణ్యంలో అవతరించారుఅలా ఆవిర్భవించిన విఖనసునితో శ్రీ మహావిష్ణువు...   శ్లోకం:మయా నియుక్తో విఖనా మదారాధన కృద్భవ - మామారాధ్య మునిశ్రేష్ఠ ముల్లోకే నివసిష్యసి - సూత్రమ్ కురు మహాభాగా త్వనామ్నా యాజుషీ శ్రుతౌవైఖానస మిదం ప్రోక్తం లోకే ఖ్యాతిం గమిష్యతి అనగా ( విఖనస బ్రహ్మ నాయొక్క విగ్రహారాధనకు నా చే సృష్టించ బడిన నువ్వు. నా విగ్రహారాధన కొరకు ఒక సూత్రమును యజుర్వేదానుసారంగా రచించు అది నీ పేరు మీద లోకంలో ఖ్యాతి గడిస్తుంది) అప్పుడు విఖనస మహర్షి " స్వామి నీ యొక్క ఆరాధనకు మరియు శాస్త్ర రచనకు నాకు అనువైన ఒక ప్రదేశం సూచించమని ప్రార్ధిస్తాడు . అప్పుడు మహా విష్ణువు తన చక్రాయుధాన్ని వదిలి ఇది ప్రదేశమును సూచించునొ అదియే నీకు నివాస యోగమని శెల్లవిస్తాడు. చక్రాయుధము అన్ని లోకములు తిరిగి చివరకు భూ లోకమున ఒక సుందర ప్రదేశం తాకి అదృశ్యమౌతుంది . చక్రము యొక్క "నిమి " (ఇరుసు) తగిలిన ప్రదేశము కనుక దానిని "నైమిశారణ్యం "అన్నారు. అది మహర్షులకు పుట్టినిల్లు. మనం పురాణం విన్నా.. పవిత్రమైన నైమిశారణ్యం ప్రస్తావన లేకుండా వుండదుకొంతకాలం తపస్సు చేసిన పిమ్మట  విఖనసుడు విష్ణువు యొక్క ఆదేశానుసారం శాస్త్ర రచనకు ఉపక్రమించాడు. యజుశాఖకు అనుసంధానంగా వేద ప్రమాణ పూరితంగా వేదాంగాలలో ఒకటైన "కల్పసుత్రం " రచించాడు. కల్పసూత్రమందు శ్రౌత, దైవిక శారీరక కర్మల గురించి వివరంగా తెలుపబడింది. ఇదియే "వైఖానసాగమానికి "మూల గ్రంధం. దీని యందు చెప్పబడిన "గృహదేవతార్చన"ని  ప్రమాణం గా తీసుకొని భృగు, మరీచి, అత్రి, కశ్యపులు, ఆలయ నిర్మాణము నుండి మొదలు నిత్య నైమితిక ,కామ్య ఉత్సవాల వరకు చేయ వలసిన దైవిక కర్మల గురించి అనేక గ్రంధాలు రచించారు. వీరే కాక  బోధయనాది మహర్షులు కూడా కల్పసుత్రానే ప్రమాణంగా చేసుకొని వారి యొక్క శాస్త్రాని రచించారు ఆగమం గురించి పురాణాలలో వేదాలలో గొప్పగా చెప్పబడిందిశ్రౌతంలో చెప్పిన యగాలను  ఇప్పటికి పలువురు శాస్త్రానుసారంగా నే ఆచరిస్తున్నారుఅందరూ అందుకే వైఖానసాన్నిఅంత గొప్పగా కీర్తిస్తున్నారు.
తర్వాత కొంతకాలానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశం మేరకు ఆయనని పూజించేందుకు విఖనస మహర్షి తిరుమలకు చేరుకుంటాడు. అక్కడే ఆయనకి 'రంగదాసుడు' అనే భక్తుడితో పరిచయం ఏర్పడుతుంది. రంగదాసుడి భక్తి శ్రద్ధలు ... వినయ విధేయతలు చూసి మహర్షి ఎంతగానో సంతోషిస్తాడు. స్వామివారి సేవకు తగిన భక్తుడు లభించాడని ఆనందంతో పొంగిపోతాడు. ఇక రంగదాసుడు కూడా స్వామివారి సేవకుగాను తనకి సరైన మార్గం చూపించే వ్యక్తి దొరికినందుకు ఆనందిస్తాడుస్వామివారికి మహర్షి నిత్యపూజలు నిర్వహిస్తూ ఉండగా, అందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను రంగదాసు సమకూరుస్తూ ఉండేవాడుఒకరోజున పూజా ద్రవ్యాల కోసం వెళ్లిన రంగదాసుడు, స్వామి పుష్కరిణిలో గంధర్వ దంపతులు జలకాలడుతూ ఉండటాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోతాడు. పూజకి వేళ మించిపోయిన తరువాత విషయం గుర్తుకు వచ్చి తిరిగివస్తాడు. స్వామివారి పాదాలపై పడి తన వలన జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. అయినా ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకున్న స్వామివారు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తాడు.
జన్మను చాలించి మరుజన్మలో తన భక్తుడిగా తన ఆలయ నిర్మాణ బాధ్యతను చేపట్టవలసిందిగా ఆదేశిస్తాడు. అందుకు రంగదాసుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. తరువాత'తొండమానుడు'గా జన్మించి స్వామివారికి మహాభక్తుడై ఆయనకి ఆలయాన్ని నిర్మించి సంతోషంగా సమర్పిస్తాడు. 
" నఖాః తే వైఖానసాః వాలాః తే వాలఖిల్యాః " అన్న వేద వాక్యాను సారంగా ఎవరైతే అనఖా: అనగా పాపరహితులో వారే వైఖానసులు అని అర్ధం. శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వచ్చింది కాబట్టి వైఖానసం అయింది. మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమలవేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం. 
"శ్రీ లక్ష్మీవల్లభారంభాం విఖనోముని మధ్యమాం - అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం" అన్న వైఖానస మహర్షి ప్రార్ధనా శ్లోకం పఠించి..ఘనమైన అంజలి ఘటిద్దాం. 
-0o0-


3 comments:

  1. ఉపయోగకరసమాచారము

    ReplyDelete
  2. ఉపయోగకరసమాచారము

    ReplyDelete
  3. ఉపయోగకరమైన సమాచారం

    ReplyDelete

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top