ఉద్వేగము - ఉపశమనము - అచ్చంగా తెలుగు

ఉద్వేగము - ఉపశమనము

Share This

ఉద్వేగము - ఉపశమనము

- చెరుకు రామమోహనరావు 


ఉద్వేగము అంటే మన English లో Reaction అని,ఉపశమనము అంటే Restraint అని మనము తీసుకొవచ్చు. ఉద్వేగమును Emotion గా కూడా తలువవచ్చు. . ఈ ఉద్వేగము అంటే ఏమిటి. కంటి ముందు కనిపించే ప్రతి విషయానికీ మనకు హృదయస్పందన వుంటుంది.తల్లిని కౌగలించుకొన్న శిశువు హృదయములో కలిగే స్పందన భాషకు అతీతము. అదే ఎలుకను నోట కరచిన పిల్లినిచూస్తే ఏడుపుతో స్పందించుతాడు శిశువు.  స్పందన పరిమి మీరితే ఉద్వేగమౌతుంది. ఆ ఉద్వేగము ఎక్కువగా నేటికాలములో, యువకులకు, ముఖ్యముగా కళాశాల విద్యార్థులకు ఎందుకు కలుగుతూ వుంది?వయసు పెరిగేకొద్దీ వ్యక్తి ముఖ్యంగా యువత స్పందన పై తమ అమిత ఆసక్తిని చూపుతూ భావోద్వేగాన్ని లోలోపలే అణచుకొంటారు. ఎందుకంటే తాము అమితోత్సాహముతో స్పందించేవిషయాలు తమ పెద్దలతో పంచుకొనేటంత మంచివి కాదు కాబాట్టి.ఒక మంచి పాత సినిమాకు పొతే నటుల అభినయమునకు అనుగుణముగా మనము స్పందిస్తాము. పాత సినిమా పెరు ఎందుకు వాడినానంటే అందులో భరతముని చెప్పిన నవరసాలూ వుండేవి కాబట్టి. నేడు రసాలు ఆవిరియైపోయి 'నవ' మాత్రమే మిగిలింది. . ఒక విధంగా చెప్పవలసివస్తే జీవితములో కూడా స్పందన రసానుగుణముగానే వుంటుంది. అందుకే నాట్య శాస్త్ర రచయిత భరతుడు ఈ విధముగా అంటాడు:
యః తుష్టా తుష్ట ఆప్నోతి, శొకే శోకముపైతిచ
క్రోధేకృద్ధో భయో భీరః సశ్రేష్ఠః ప్రేక్షకః స్మృతః .
 ఈ మాట ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకొంటున్నారేమో! చెబుతాను. మన సినిమాలను తీసుకొందాము. గమనించితే ప్రతి సినిమాలోనూ మూడు విషయాలుంటాయి. 1. పట్టుడు 2. కొట్టుడు 3. తిట్టుడు. ఇవి భరతముని చెప్పిన నవరసములలో లేనివి.
 కథానాయికనో లేక ఒక నట్టువరాలినొ(Dancer) అవసరమున్న లేకున్నా తాకి ,కౌగలించి, పామి ఎన్నోవిధములైన జుగుప్సాకరమగు చేష్టలు చేస్తాడు నాయకుడు. విరిసీ విరియని , ఆ హీనమైన నీచమైన, జుగుప్సాకరమైన,సన్నివేశములు చూసే, వచ్చీరాని యవ్వనములో వున్న పిల్లల పరిస్థితి ఏమిటి. అదే విధంగా ప్రతినాయకునితో (Villan) తలపడుచున్నప్పుడు బంతిని కాలుతో తన్నినట్లు ప్రతినాయకుని అనుచరులను,ప్రతినాయకుని, తంతే కారుకు వాని శరీరము గుద్దుకొని కారు పప్పైపోతుంది.వాడు తిరిగీ తన్నులు తినడానికి నాయకునివద్దకు వూగుతూ తూగుతూ వస్తాడు.అప్పుడు యువకుల మనస్థితి ఏమిటి. ఆ నాయకునిగా తమనూహించుకొని వూగిపోవుటయే కాక ఒక అవకాశము వస్తే ప్రయత్నము చేయవలెననే తపన వారిలో కలుగుతుంది. ప్రయత్నించి తన్నులుతిన్నవారు లెక్కకు మిక్కుటము. ఇక హాస్యము పేరుతో పాత్రధారులు ఒకరినొకరు కించపరచుకోవడము తిట్టడ ము అతి సహజము. ఇవి చూసి యువతకు ఏవిధమైన స్పందన కలుగుతుంది. Punch Dialogues పేరుతో తమ మేధస్సు లో భద్రపరచి Theater బయటికి వచ్చిన వెంటనే వుండబట్టలేక వాడుతూ పోవడము. ఆడపిల్లలైతే ఈ 'సినీ మాయలు' చూసి వంటి పై వుండ బట్టలేక వుండటము.ఇక TV ల విషయానికి వస్తాము.సినిమా హాళ్ళలో తల్లిదండ్రులతో కూర్చుని మరీ సినిమా చూస్తూవుంటారు. సినిమాలో లీనమగుట తప్పించితే ఆ దృశ్యముల ప్రభావము తమ పిల్లలపై ఎంతగా పడుతూవుందోనని ఎప్పుడైనా ఆలోచన చేసినారా!
 ఇక TV ల విషయానికి వస్తాము. Serials, క్రికెట్టు ప్రసారములు,మధ్యంతర ప్రకటనల విషయానికి వస్తాము.
చదువుకొనే అమ్మాయిలు, కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లలు Serials ను  చూసి నేర్చుకొనేదేమిటంటే కట్టుకొనే బట్టలు, Hotel తిండ్లు లాంటివేకదా మగవానితో,మొగునితో కల సంబంధ సంపర్కాలు అన్నది. నేడు ఒకటైతే రేపు వేరొకటి. ఇక ఈ విషయముపై విశ్లేషణ ఇంతటి తో చాలించి కాస్త క్రికెట్ మరియు మద్యంతర ప్రకటనలను గూర్చి తెలుసుకొందాము.
 ఒక 45,50 సంవత్సరాలక్రితము BCCI అన్నది నాటి యువతలో తక్కువ మందికి తెలిసేది. ఇన్నివిధముల ప్రచార మాధ్యమాలు, సాధనాలు నాడు లేవు. Matches కూడా సంవత్సరములో అరుదుగా జరిగేవి. క్రికెట్ వార్తలు పత్రికా ముఖంగానే తెలుసుఒనేవారు విద్యార్థులు. పరదేశీయుల పరిపాలనా కాలములో ఈ విద్యార్థులు అన్న పేరు వచ్చింది కానీ అంతకు పూర్వము వీరిని నియతులు అనేవారు. అంటే వీరికి నియమ నిష్ఠలు ముఖ్యము. తరువాతనే చదువు.  ఒక 45,50 సంవత్సరాలక్రితము BCCI అన్నది నాటి యువతలో తక్కువ మందికి తెలిసేది. ఇన్నివిధముల ప్రచార మాధ్యమాలు, సాధనాలు నాడు లేవు. Matches కూడా సంవత్సరములో అరుదుగా జరిగేవి. క్రికెట్ వార్తలు పత్రికా ముఖంగానే తెలుసుఒనేవారు విద్యార్థులు. పరదేశీయుల పరిపాలనా కాలములో ఈ విద్యార్థులు అన్న పేరు వచ్చింది కానీ అంతకు పూర్వము వీరిని నియతులు అనేవారు. అంటే వీరికి నియమ నిష్ఠలు ముఖ్యము. తరువాతనే చదువు. కాబట్టి ఆ ఆటలు పిల్లల చదువుకు భంగకరముగా వుండేవికావు. మరి నేడో ఏదో కొన్ని పదుల కొట్ల యజమానియైన BCCI నేడు కొన్ని వేలకోట్ల యజమాని. ఎందుకంటే వారికి విద్యార్థుల గూర్చిన చింత ఏకొంత కూడా అవసరము లేదు. వారికి వారి Schedules తప్ప పిల్లల పరిక్షలు పట్టవు. ఇక పిల్లలో "ఇది చాలా ముఖ్యమైన Match పరిక్షది ఏముంది అది మళ్ళీ అయినా వస్తుంది,Match రాదుగదా అన్న ధోరణి. ఇక ఉద్వేగము ఇక్కడ మొదలౌతుంది. ఒక 20/20 Match ని వూహించుకొండి. చివరి Over 25 Runs కొట్టాలి.   ధోని Batting చేస్తున్నాడు. రెండవ ప్రక్క ఒక Tail Ender వున్నాడు. అక్కడ మొదలౌతుంది ఉద్వేగమంతా! గోళ్ళు మొత్థము 10వ్రేళ్ళవి కొరికి ముగించి ప్రక్కవాని గోళ్ళు కొరుకుతూ వుంటాడు. ఇంథ Tension అవసరమా! తన ఆరొగ్యము పై ఆ ఉద్వేగము యొక్క ప్రభావము పడుతుందనే యోచన ఆ వ్యక్తిలోనికి ఆ సమయములో వస్తుందా . అనవసరమైన ఆ క్షణికమైన ఆందోళణకు ఆరోగ్యాన్నే బలిచేయడానికి సిద్ధపడుతున్న అతని పతనమునకు కారణమెవరు? ఇవన్నీ ఒకప్రక్కయితే Betting అన్న మహమ్మారి ఇంకొకపక్క !
అంతకన్నా ఘాతుకమైనవి ప్రకటనలు. 10సెకనుల సమయము తీసుకొనే ఒక్కొక్క Advertisement Film ఎంత హీనమైన శృంగారమును జొప్పిస్తున్నారు వానిని చూసే యువతీ యువకుల ,విద్యార్థుల ఆలోచనలు ఏవిధముగా వుంటాయని, వానివల్ల దేశము ఎంత నిర్వీర్యమైపోతుందన్న ఆలోచన ఎవరికైనా వుందా!కనీసము 80 సంవత్సరాలు ఆరోగ్యముగా బ్రతుకవలసిన నేటి యువకుడు 80 ఏళ్ళకు  ఇట్లయితే వుంటాడా ! వుంటే ఆరోగ్యంగా వుంటాడా !వున్నా తన దేశానికి, గ్రామానికి, కడకు తన తల్లిదండ్రులకు, కనీసము భార్యా బిడ్డలకు పనికి వస్తాడా!
 కాబట్టి యువకులు తమ ఉద్వేగమును ఉపశమింపజేసుకోవలె. మరి ఏ విధంగా! మొదటిది విద్య . అసలు విద్యకు మంచి చెడ్డలు లేవు. ఒక వ్యక్తి నిజానికి జీవితమంతా విద్యార్థే ! ౘక్కెర ఇసుకతో కలిసి వున్నా మనసుంటే రెంటినీ వేరు చేయవచ్చు. నీటి సహాయము కావాలి అంతే! ఆ నీరే నీ సహవాసము. గుణముగల పెద్దలతో చెలిమి చేసుకొంటే వారిద్వారా పంచదార అన్న పవిత్ర భావాల అణువులనన్నిటిని సాద్ధించవచ్చు. రామాయణ భారత, భాగవతాది కథలను విధిగా చదవాలి. సులభశైలిలో వ్రాయబడిన పుస్తకములు ౘాలు. నేటికాలపు మహా పురుషులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోసె, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ , లాల్ బహదుర్ శాస్త్రి, అబ్దుల్ కలాం, లాంటి వారి జీవిత చరిత్రలు యువత తప్పక చదవాలి. ఆకళింపు చేసుకోవాలి. తల్లిదండ్రులకు కలకాలము  తగిన గౌరవమివ్వాలి. పెద్దలుకూడా చిన్నపిల్లలకు మన సంస్కృతి అందజేసిన కళ్యాణ సాహిత్యమును చిన్నవయసులోనే KG లకు పంపకుండా  చదివించితే గొప్పవారవుతారు కాబట్టి తప్పక ౘదివించాలి.. నేడు నాటిన మొక్క నాడు నీడ నివాలంటే వారిని బాధ్యత అన్న నీరు పోసి పెద్దలు పెంచాలి. మొక్క మానైన పిదప నీరు పోయుట ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆలోచిస్తే పెద్దలకు తెలియనిది కాదు.

No comments:

Post a Comment

Pages