Sunday, August 23, 2015

thumbnail

మంచి అమ్మాయి - నర్తకి జయంతి నారాయణ

మంచి అమ్మాయి - నర్తకి జయంతి నారాయణ

- బ్నిం  


నేను బద్దకస్తుణ్ణి కాను - ఖాళీ గా ఉండను - కానీ - అందర్నీ అని వేళలా అనుకున్న తైముకి చెప్పిన పని పూర్తి చేసి సంతృప్తి పరచలేను కదా - కొందర్ని చూసినప్పుడు పర్లేదు మన వాళ్ళే కాస్త లేటైనా పరవాలేదు క్షమిస్తార్లే అని మహా ధైర్యంగా ఉంటాను. అలాంటి వాళ్ళలో అచ్చంగా తెలుగు
సంపాదకురాలు కూడా ఉన్నారు. అలాంటి వారి జాబితా లో చి . సౌ . జయంతి గారు ఒకరు.
ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడినపుడు 'మేడం' అంటాను, ఎదురు కుర్చీలో కూర్చున్నపుడు 'అమ్మాయీ ' అనేస్తాను. కారణం ఎంటంటే - నేను పెద్దోణ్ణని తెలియాలని - మంచి అమ్మాయి (గారే)
వినాయక చరితం నృత్య రూపకం రాసిపెట్టమని వచ్చారు. డా. జొన్నలగడ్డ అనురాధ గారు (సెంట్రల్ యూనివర్సిటి) నా పేరు చెప్పి పంపారుట. నేనెంత చార్జి చేస్తానో, ఎన్నాళ్ళకి ఇస్తానో.. ఆ పిచ్చి తల్లికి తెలీద ...నా షెడ్యూల్స్ (కమిట్మెంట్స్ ) గురించీ తెలీదు.
సరే అలాగే అమ్మలూ అనేశాను...4 పాటలు కూడా మెయిల్ చేసాను. తాను అర్ధాలు, అంతరార్ధాలూ తెల్సుకొని బావుందని మెచ్చుకున్నారు కూడా !!
ఈ రోజు శింజారవానికి ఆవిడని పరిచయం చేద్దామని... ఏవండేవండీ....మీ
ప్రొఫయిలు పంపించరా..ఫలానా పని అనగానే..ఓ కే అనేసి పంపేసారు గానీ... నా బేలే సంగతి ఏంటని అడగని పిచ్చి తల్లి.
ఉష్ష్...ఆవిడ ఏమీ చిన్నపిల్ల కాదు ...బాగా గొప్పావిడ.
మంచి తనం లోనే కాదు...(అయ్ మీన్...నన్ను తిట్టకపోవడం వలన ఆపాదించబడలేదు ఆ మంచితనం..) నిజంగా గొప్పావిడే ..
నీరజా దేవి గారివద్ద ఆరంభమైన విద్యాభ్యాసం వెంపటి చినసత్యం మాస్టారితో పరిపక్వమై డా. అనురాధ మేడం తో పరిఢవిల్లింది. యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ లో కూచిపూడి డ్యాన్స్ లో ఎం. పి . ఏ చేయడం తో గురుస్థానాధిష్టురాలయింది.
ఆమె కోరియోగ్రఫీ చేసిన నృత్యరూపకం 'చంద్రికా పరిణయం' , జయంతి నారాయణ కి ఎంతో ఖ్యాతి తెచ్చింది...న్యూ ఢిల్లీ డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ ఆ రూపకాన్ని స్పాన్సర్ చేసింది.
అలా కోరియోగ్రఫీ లో ఆమె చేస్తున్నప్రయోగాల్లో ఎన్నో వైవిధ్యాలు కనపడ్తాయి.
నృత్య దర్శకత్వం (డ్యాన్స్ కంపోజింగ్) చేయడానికి చతుర్విధాభినయాల్లో ప్రావిణ్యం ఒకటే చాలదు నిజానికి ...వాళ్ళకి యోగాలు,కరణాలూ, ముద్రలూ క్షుణ్ణం గా తెల్సుకొని ..భావార్ధాలు రసస్పూర్తి తో ఆవిష్కరించడానికి కావలసిన వ్యుత్పత్తి కూడా  ఉండాలికదా. మనోధర్మం (అంటే ఇంప్రూవైజేషన్ + క్రియేటివిటి) నిస్సంకోచంగా సాధికారికంగా వాడకలగాలి కదా. అలాంటి ప్రజ్ఞా పాటవాలు ఉండడం వల్లే గురుస్థానం పొందగలుగుతారు -  ఎవరిలా అంటే మన జయంతి నారాయణ గారిలా -
దూరదర్శన్ వాళ్ళు 'ఏ గ్రేడ్ ఆర్టిస్టువి సుమా' అని పట్టా ఇచ్చిన శ్రీమతి జయంతి నారాయణ గారు ఎన్నో సోలో ఐటంస్ కంపోజ్ చేసారు. గురువుగారు అనురాధ గారితో కల్సి విదేశాల్లో నృత్య రూపకాలు ప్రదర్శించారు.
కూచిపూడి నృత్యోత్సవాల్లోనూ, తిరుమల లో నాద నీరాజనం లోనూ తమ కళాప్రదర్శనల్తో అలరించారు.
అన్నట్టీ అమ్మాయి నేను డా. అనురాధ గారికి రాసిన 'ప్రబుధ మణిమేఖలీయం ' (మణిమేఖల) లో 'మాధవి ' పాత్ర పోషించిందట. నేను చూసానేమో గానీ, ఈవిడని ఇప్పుడు తెలిసింది (అఫ్ కోర్స్ నేను రాసానని ఇప్పటికీ ఈవిడకి తెలియక పోవచ్చు)
అలాగే 'కృష్ణ కేళీ విలాసం' లో రాధగా, శ్రీనివాస కళ్యాణం లో పద్మిని గా 'గిరిజా కళ్యాణం' లో పార్వతిగా, 'వినాయక విజయం' లో లక్ష్మి గా..అన్నీ గ్లామరస్ హీరోయిన్ పాత్రలే వేశారు.
ఇంకా చాలా ప్రదర్శనలు ప్రముఖ ప్రదేశాల్లో ఇచ్చారు ఈ యంగ్, ఎనెర్జెటిక్, డిసిప్లిండ్,కమిటెడ్ జయంతి గారు.
ఆవిడ 'వినాయక చరితం 'పూర్తి చేశాకా మరి కొన్ని విశేషాలు చెపుతానే....అందాకా శింజారవం చదివేవాళ్ళూ....ఆవిడ తరపున జల్దీ రాయమని పోట్లాడండి నాతో!!

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information