ఆత్మశక్తి - అచ్చంగా తెలుగు

ఆత్మశక్తి

Share This

ఆత్మశక్తి

-రాజ కార్తీక్


“నిజంగా అక్కడ నీ బంగ్లాలో దెయ్యం ఉంది అంటావా?” అంటున్నాడు జాకీ. “చూడు నేను ఆత్మల మీద రిసెర్చి చేసేవాడిని. అక్కడ జరుగుతున్న కొన్ని మానవాతీతంగా ఉన్నాయి” అన్నాడు విల్లీ. “ఏ సంఘటన జరిగింది”అడిగాడు జాకి.
విల్లి..” చూడు జాకీ, మొన్న నేను నిదురపోయాను ఉన్నట్టుండి ఒక పెద్దగాలి వచ్చింది. ఆ గాలి నన్ను ఎవరో లేపినట్లు అనిపించి లేచాను, ఎవరూ లేరు, నీకు తెలుసు నేను అన్ని వదిలేసి,' లైఫ్ ఆఫ్టర్ డెత్' అనే అంశం మీద రిసెర్చి చేస్తున్నాను అని, నేను పెట్టిన కెమెరాలో కూడా ఎన్నో నిజమైన ఆత్మలు కనబడ్డాయి అంటూ తన రీసెర్చ్ లో కెమెరాకి చిక్కిన ఆత్మలను వీడియో ప్లే చేసి చూపాడు విల్లి. జాకీ నిర్ధంతపోయాడు. “విల్లీ, ఒకటి రెండు అంటే యాదిచ్చికం, కానీ ఇన్ని... ఆ చెప్పు తర్వాత ఏం జరిగింది.
విల్లి..“జాకీ నేను నిదురలేచాను, చుట్టూ చూశాను ఎక్కడినుండో ఆ ఆ ఆ ... అని వినబడింది. ఎంతో ధైర్యవంతుడ్ని అనుకునే నాకు భయం వేసింది. నా మెడలో ఉన్న బుద్ధుడి లాకెట్ ని పట్టుకుని ప్రార్ధించాను. ఉన్నట్లుండి అక్కడ ఉన్న పేక ముక్కలు గాలిలో లేచి పడ్డాయి. అయినా వాటిని పట్టించుకోకుండా అలానే పడుకున్నాను. మళ్ళీ ఆ ఆ ఆ అన్న అరుపులు, అపుడు నాకు అర్ధం అయ్యింది. నా రిసెర్చి ప్రకారం ఇపుడు ఆత్మలు ఏమన్నా చెప్పాలనుకుంటున్నాయా నాతో అని అనుకున్నాను.నాకు ఏ లాజిక్ అందలేదు. అక్కడ ఉన్న కత్తి ఎవరో విసిరేసినట్లు పేకల దగ్గర పడింది. అపుడు అందులో అంకెలు, సంజ్ఞలు ఉన్న కొన్ని పేకలు నావైపు తిరిగి పడ్డాయి. అలా పడిన వాటిని తీసిన ఫోటో చూపాడు విల్లి.
జాకీ ఇది జరిగినప్పటినుండి నాకు నిదురపట్టడం లేదు.. గాలిలో ఆ ఆ ఆ అని చిన్న ఏడుపులు, పేకలు అలానే పడడం జరుగుతూనే ఉంది. అందుకే నిన్ను రమ్మని పిలిచాను. నీవు ఫోన్ చేసినపుడు లండన్ లో ఉండడం వల్ల రావడం ఆలస్యం అయింది అన్నాడు జాకీ.. ఇద్దరు డిన్నర్ చేసి మళ్ళీ విల్లీ బంగ్లాకి బయలుదేరారు. రాత్రి పెద్దగా గాలి... ఆ ఆ ఆ అన్నచిన్న ఏడుపుతో హఠాత్తుగా లేచారు. విల్లీ చెప్పినట్టే జరుగుతున్న పరిణామాన్ని చూశాడు జాకీ, అక్కడ పడుతున్న పేకలను చూస్తూ, అంతకు ముందు విల్లీ తీసిన ఫోటో తో పోల్చి చూశాడు.. ఫోటోలో మాదిరిగానే ఉన్నాయి ఇప్పుడు కూడా...
అక్కడ పేకలు వరుసగా “1-2-0-3-4 ..హార్ట్స్ (ప్రేమ చిహ్నం), జోకర్, కింగ్ “ పడి ఉన్నాయి. ఎంత ఆలోచించిన ఏమి అర్ధం కాలేదు. అలా పడిన వాటి వల్ల ఏమైనా చెడు జరుగుతుందా అంటే ఏమి జరగడం లేదు. అక్కడ జరిగిన దాని గురించి తీక్షణంగా ఆలోచిస్తున్నాడు జాకి. అపుడే జాకీ ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. “జాకీ రేపు తప్పకుండా ఫైల్ కొరియర్ చెయ్యి.. నాకు మళ్ళీ నీకు ఫోన్ చేయడానికి కుదరదు నేను జర్నీలో ఉంటాను అని చెప్పడంతో ..సరే.. సరే.. అని ఫోన్ పెట్టేశాడు జాకీ..  ఫోన్ లో కొరియర్ అన్నమాటతో జాకీకి ఆలోచన వచ్చింది.. మరోసారి ఆ పేకలను పరిశీలించి.. విల్లి “ఈ అంకెలు ఒకసారి చూడు నీకు గుర్తుందా అన్నాడు” జాకి....  ఇది నీ డోర్ నెంబరు కదా విల్లీ .. నేను చెక్ ఈ అడ్రస్ కి పంపేవాడిని. ఇది నీ పాత  అడ్రస్ కదా. ఇపుడు నువ్వు కొత్త బిల్డింగ్ లోకి మారావు కదా, అక్కడి నుండి ఎందుకు వచ్చేశావు చెప్పు అన్నాడుజాకీ.
విల్లి: “ మా నాన్న ఉన్నంత కాలం అక్కడ ఉన్నా, ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఆ జ్ఞాపకాలతో ఉండలేకపోయాను, పైగా మా చిన్నాన్న ఆ బంగ్లాలో తనకు వాటా ఉందని కోర్టులో కేసు వేశాడు.. మా చిన్నాన్న తన వాటా తను తీసుకొని తప్పుడు కేసు వేశాడు.. కోర్టు తీర్పు వచ్చేవరకు అది అలానే ఖాళీగా ఉంటుంది... వాటి తాళాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి. “ముందు మీ ఇంటిని చూడాలి పద.. త్వరగా అంటూ తొందరచేశాడు”జాకీ..
జాకీ. విల్లీ ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంటి ముందు డోర్ నంబరు 1-20-3-4 అని ఉంది. లోపలికి వెళ్ళారు.. ఎవరో లేక బంగ్లా బూజుపట్టి ఉంది. “మీ నాన్న గది ఎక్కడ విల్లీఅంటూ.. అటు వైపు అడుగులు వేశారు విల్లీ జాకీ అపుడు మళ్ళీ అదే గాలి ఆ ఆ ఆ అన్న శబ్దం వినబడింది. విల్లీ వాళ్ళ నాన్న గది చూడగానే చాలా ఉద్వేగానికి గురి అయ్యాడు. ఆ గదిలో ఒక క్యాలెండరు బోర్డు ఉంది అందులో సంఖ్యలు చిన్న పలకలుగా సరి చేసుకోవాలి.. జాకీ కార్డు లో పడిన వాటిని చూస్తూ ఆలోచిస్తూ విల్లీ కోర్ట్ కేసు నీకు అనుకూలంగా ఎందుకు లేదు అని అడిగాడు. మా నాన్న రాసిన డాకుమెంట్స్ నాకు ఎక్కడ ఉన్నాయో అర్ధం కాలేదు అన్నాడు విల్లీ...
జాకీ కి అక్కడ ఒక జోకర్ బొమ్మ కనిపించింది, దానిమీద ఒక లవ్ సింబల్ ఉంది, దాన్ని ప్రెస్ చేయగానే ఒక లాకర్ ఉంది. అపుడే క్యాలెండరు పలకలు ఊడిపడ్డాయి. అక్కడ 011555999 అని నెంబరు కనబడింది. ఆ నెంబరుతో లాకర్ తెరుచుకుంది . ఆ లెటర్ తెరిచాడు.
“విల్లీ ఈ ఇల్లు పూర్తిగా నాది, ఆ వజ్రాలు తాతగారివి, మీ అమ్మ ఒక అనాథ , ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. తరవాత నువ్వు పుట్టడంతో అనాథలకు సాయం చేద్దాం అనే మీ అమ్మ మాటకు నేను విలువ ఇవ్వలేకపోయాను. మీ అమ్మ చివరి రోజుల్లో ఆమెకు మాట ఇచ్చాను కానీ నేరవేర్చలేకపోయాను. అనాథలకు సాయం చేయలేదు. నువ్వే ఇపుడు ఆ మాట నెరవేర్చాలి.. నేరవేరుస్తావు కదూ.. ఆ లెటర్ చదివి విల్లీ కన్నీటి పర్యంతం అయ్యాడు. అవును తన తండ్రి ఏదో చెపుదాము అని అనుకునే లోపు పక్షవాతం వచ్చి చనిపోయాడు. ఇపుడు గాలి చేసే చప్పుడు విల్లీగా వినబడింది.
ఇపుడు జాకీకి విల్లికి అర్ధం అయ్యింది. అది విల్లి తండ్రి ఆత్మ అని.... 'నాన్నా నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తా' అంటూ విల్లీ ఏడుస్తున్నాడు... చనిపోయిన తర్వాత కూడా ఎంతో మంది అనాథలను ఆదుకుంటున్నారు అంకుల్ అని జాకీ మాట్లాడుతున్నాడు... కొన్ని రోజుల్లోనే ఇల్లు విల్లీ పరం అయ్యింది. విల్లి తన తండ్రి మాటను నిలబెట్టాడు...
కారులో వెళ్తున్నారు జాకీ, విల్లీ...”జాకీ నీకు ఎలా వచ్చింది ఆలోచన “. నీవు ఆత్మలపైన పరిశోధన చేస్తావు, నేను మనసు మీద చేస్తాను అందుకే తెలిసిందేమో అని అన్నాడు జాకీ. విల్లీ.. “మనస్సు ఉన్నవాడికే  మనస్సు ఉంటుంది. నాకు ఆనాథలకి సాయం చేసాక మనసు అంటే ఏమిటో పూర్తిగా అర్థం అయ్యింది జాకీ ....
ఇద్దరూ మాట్లాడుతూ పడుకున్నారు విల్లీ గదిలో ... రాత్రి... మళ్ళీ అరుపులు... గాలిలో లేచి పేక ముక్కలు పడ్డాయి. విల్లీ, జాకీ ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు.
**********

No comments:

Post a Comment

Pages