మంగళమనరే 

- ఆనందవర్ధన్ 

మంగళ మని మంగళ మని మంగళమనరే అఖీలలోక జననీకి నిఖిలలోకనాయకికీ
భామలారా ప్రేమమీర మంగళమనరే కోమలాంగి మాతంగి శ్యామలాంబకీ 

ఇంతులార వంతపాడి మంగళమనరే చారుమతి పూజించిన వరలక్ష్మికీ
మంగళ మని మంగళ మని మంగళమనరే అఖీలలోక జననీకి నిఖిలలోకనాయకికీ
లలన లారా మనసుమీర మంగళమనరే కనక శైల వాసినీ కామాక్షికీ 

సుదతులార శుభముకోర మంగళమనరే హేమలతకు శైలసుతకు శివకామినికీ
మంగళ మని మంగళ మని మంగళమనరే అఖీలలోక జననీకి నిఖిలలోకనాయకికీ
ముదితలార ముదముతోటి మంగళమనరే మాతంగముఖ శ్రీగురుగుహ మాతకీ 

పడతులార సుగతి కోర మంగళమనరే పరమశివునిరాణికీ పార్వతీ దేవికీ 
మంగళ మని మంగళ మని మంగళమనరే అఖీలలోక జననీకి నిఖిలలోకనాయకికీ

0 comments:

Post a Comment

అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top