తూర్పు గోదావరిలో సినీ రంగ ప్రముఖులు - అచ్చంగా తెలుగు

తూర్పు గోదావరిలో సినీ రంగ ప్రముఖులు

Share This

తూర్పు గోదావరిలో సినీ రంగ ప్రముఖులు 

- పోడూరి శ్రీనివాస రావు  


ఈ సంవత్సరం జరుగనున్న గోదావరి పుష్కరాలు 144 సంవత్సరాల కొకసారి జరిగే మహా పూర్ణ కుంభాభిషేకం లాంటి మత్తరమైనవీ పుష్కరాలని, అందుకే అటు ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు , భారీ ఎత్తున చేస్తున్నారని తెలుస్తోంది.
ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్న గోదావరి పుష్కరాల నేపద్యం లో మన 'అచ్చంగా తెలుగు' గోదావరి ప్రత్యేక సంచికను  వేలువరించాలనుకోవటం - ఎంతో ముదావహం.
చిన్న పిల్లల నుంచి, పెద్ద వాళ్ళ వరకు గూడ సినిమా అంటే సాధారణంగా చెప్పలేని ఆసక్తి వుంటుంది . సినిమాలు చూడమన్న, వాటికి సంబందించిన  వార్తలు - విశేషాలు - చదవాలన్నా, తెలుసుకోవాలన్నా . .. . అనాలోచితంగా  ఆసక్తి ఏర్పడుతుంది.
అందుకే . . ..ఈ సంచికలో .. .. గోదావరి అంటే గుర్తుకు వచ్చే రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి - సినీ రంగానికి వెళ్లి, అక్కడ ఒక వెలుగు వెలిగి, ఆంధ్ర ప్రేక్షకుల  గుండెల్లో స్థానం సంపాదించుకుని, వారి అభిమానాన్ని చూరగొన్న కొందరు సినీ ప్రముఖుల జీవిత విశేషాలను అవలోకిద్దాం.

1) శ్రీమతి శంకర మంచి జానకి (షావుకారు జానకి ) 

తన మొదటి చిత్రమైన ' షావుకారు' ను తన ఇంటిపేరు గా ముద్ర వేసుకున్న శంకరమంచి జానకి 12.12.1931 న రాజమండ్రి లో జన్మించింది . ఆమె తల్లి దండ్రుల  శ్రీ టి. వెంకోజి రావు - శ్రీమతి సచ్చిదెవి. ఆమె సోదరి కృష్ణ కుమారి . ఆమెకూడా ప్రముఖ చినెతార. శ్రీమతి జానకి భర్త శంకరమంచి శ్రీనివాస రావు. వీరికి ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు.
శ్రీమతి జానకి బాల్యం లోనే రేడియో ప్రోగ్రాములు, స్టేజి పై ప్రదర్శనలు ఇస్తూ వుండేది.  స్టేజి పై సుమారు 300 పైగా ప్రదర్శనలు ఇచ్చింది.
విద్యార్హతల విషయానికి వస్తే జానకి గౌహతి యూనివర్సిటీ నుంచి మెట్రిక్యు లేషన్  పాసయింది.
మొదటి సినిమా విజయ వారి 'షావుకారు'. అప్పటి నుంచి ఆమె పేరు షావుకారు జానకి గానే స్తిరపడి పొయిన్ది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ బాషలలో సుమారు 385 కు పైగా సినిమాల్లో శ్రీమతి జానకి అభినయించింది .
ఆమె నటించిన చిత్రాల్లో ముఖ్యమైనవి: షావుకారు, బాటసారి, డా .. చక్రవర్తి , మంచి మనసులు, మంచి కుటుంబం, రోజులు మారాయి, అక్క చెల్లెలు, కన్యాశుల్కం , గీతాంజలి, తాయారమ్మ - బంగారయ్య, సంసారం ఒక చదరంగా, హే రామ్, ప్రేమ గీత మొదలైనవి. వీటిల్లో ముక్యంగా , గురజాడ అప్పారావు  గారి నాటకం - కన్యాశుల్కం ఆధారంగా తీసిన కన్యాశుల్కం  సినిమా లో బుచేమ్మ (యంగ్ విడో - గిరీశం బాషలో ) గాను, మంచి మనసులు సినిమా లో గుడ్డి భార్య గాను, డా. చక్రవర్తి సినిమా లో అసూయ మూర్తీభవించిన భార్య గాను శ్రీమతి జానకి నటన అద్వితీయం. ఈమెకు యూనివర్సిటీ అఫ్ ఆరిజోన వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చెసారు.  ఈమెకు ఉత్తమ సహాయ నటి గా నంది అవార్డు , 1984 లో ఫైల్మ్ఫారే జీవన సాఫల్య పురస్కారం (దక్షిణ దేశమునకు గాను), తమిళ నాడు ప్రభుత్వం వారి కలైమామణి పురస్కారం, 2012వ సంవత్సరమునకు సిమ్ల జీవన సాఫల్య పురస్కారం లభించాయి.
జాతీయ భారత సినిమా అవార్డు కమిటి కి జ్యూరి సభ్యురాలిగా , రాష్ట్ర తెలుగుసినిమా అవార్డు కమిటి కి అధ్యక్షురాలిగా శ్రీమతి జానకి తన సేవలనందించారు.

2) రేలంగి వెంకట్రామయ్య : 

'రేలంగోడు' అని ప్రజల నోళ్ళలో ఆప్యాయంగా పిలవబడే శ్రీ రేలంగి వెంకట్రామయ్య 09.08.1910లో తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం లో జన్మించారు .
        వీరు హరికధ చెప్పడం లో సిద్ద హస్తులు. అలగీ హార్మోనియం వాయించడం లో గూడ మంచి నైపుణ్యత కలవారు.
కాకినాడ లో పెరిగిన రేలంగి విద్యాభ్యాసం మీద శ్రద్ధ చూపేవారు కాదు. ఎంతసేపు నటనే తన ద్యేయమనుకునేవారు.
హాస్య నటుడిగా వేషాలు వేస్తున్న, హీరో హీరోయిన్ల తో సమాన హోదా, సమాన పారితోషకం శ్రీ రేలంగి కి ఆ రోజుల్లో ఇవ్వబడుతు వుండేది.  తొలిసారిగా 1935 లో ' శ్రీకృష్ణ తులాభారం ' సినిమా లో విదూషకుడిగా నటించారు. దానికి దర్శకులు శ్రీ సి . పుల్లయ్య గారు . ఆ పరిచయం తో కొన్నాళ్ళు శ్రీ పుల్లయ్య గారి వద్ద ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచెసారు. తరువాత 1947లో 'గొల్లభామ' చిత్రం లో పూర్తీ నిడివి గల పాత్ర ధరించారు . అనంతరం ' వింధ్యారాణి'  లో హాస్య పాత్ర పోషించిన శ్రీ రేలంగి ఇక తరువాత వెనక్కు తిరిగి చూసుకోలేదు.
శ్రీ రేలంగి నటించిన చిత్రాల్లో ముక్యమైనవి : గురు సుందరి కధ, మిస్సమ్మ, మాయాబజార్, నర్తనశాల , దొంగరాముడు, ఇద్దరు మిత్రులు , లవకుశ , చదువుకున్న అమ్మాయిలు, అప్పుచేసి పప్పుకూడు , వెలుగు నేదలు, విపర నారాయణ , కులగోత్రాలు , ప్రేమించి చూడు, భలే తమ్ముడు, మాంగల్య బలం, సువర్ణ సుందరి, సారంగధర , తోడికోడళ్ళు, కలిసివుంటే కలదు సుఖం లో నెగటివ్ షేడ్ తో ప్రతినాయక పాత్ర (విలన్ ) పోషించారు.
శ్రీ రేలంగి నటుడిగానే కాదు - గాయకుడి గా కూడా 1949 లో విడుదలైన 'గుణ సుందరి కధ' లోను, 1951 లోని ' పాతాళ భైరవి 'లోను, 1952లో 'ధర్మ దేవత' లోను , 1954లో 'విపర నారాయణ లోను, 1955లో 'మిస్సమ్మ లోనూ పాటలు పాడారు.
  శ్రీ రేలంగి 1960 లో 'సమాజం' అనే సినిమా నిర్మాత గా కూడా వ్యవహరించారు .
శ్రీ రేలంగి కి భారత ప్రభుత్వం 1970 లో 'పద్మశ్రీ ' పురస్కారం లభించింది .
26.11.1975న తాడేపల్లి గూడెం లో తుది శ్వాస విడిచారు .

3) సూర్యకాంతం : 

ఆంధ్రుల అత్తగారిగా , గయ్యాళి అత్తగారిగా నభూతో న భవిష్యత్ అని పేరు గాంచిన 'సూరే కాంతం' 28.10.1924 న కాకినాడ సమీపంలోని 'వెంకట కృష్ణ రాయ పురం ' అనే కుగ్రామం లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించరు. వారి తల్లి దండ్రులకు ఆమె 14వ సంతానం గా జన్మించరు.
ఆమె భర్త శ్రీ పెద్దిభోట్ల చలపతి రావు గారు హైకోర్ట్ జడ్జి గా పనిచెసెవారు.
శ్రీమతి సూర్య కాంతం  ఆమె సినీ రంగ ప్రవేశం 'డాన్సర్' గా జరింగింది. ' చంద్రలేఖ ' సినిమా ద్వారా డాన్సర్ గా ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది . ఆ తరువాత ' నారద నారది' సినిమాలో కారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు . ' గృహప్రవేశం ' 'సంసారం ' సినిమాల్లో ఆమె పోషించిన ' గయ్యాళి అత్తగారు ' పాత్ర తో శ్రీమతి సూర్య కాంతం వెలుగు లోనికి వచ్చింది .
ఆమె నటించిన ముఖ్యమైన సినిమాలు . పెళ్లి చేసి చూడు , చక్రపాణి , దొంగ రాముడు , చరణ దాసీ , చిరంజీవులు, ఇలవేలుపు, చంద్రహారం , దొంగల్లో డోరా, మాయ బజార్ ,తోడికోడళ్ళు , అప్పు చేసి పప్పు కూడు, మాంగళ్య బలం , గుండమ్మ కధ, జయభేరి , శాంతి నివాసం , భార్య భర్తలు , ఇద్దరు మిత్రులు , కలసి వుంటే కలదు సుఖం , కుల గోత్రాలు , రక్త సంబంధం , మంచి మనసులు, భీష్మ , వాగ్ధానం , రాముడు - భీముడు , వెలుగు నీడలు, నిన్నే పెళ్ళాడుతా, జమిందారు, నవరాత్రి, దసరా బుల్లోడు, సెక్రటరీ , పూజ, ముత్యాల ముగ్గు, ఇద్దరు అమ్మాయిలు , యమగోల , గోవిందా గోవింద యముడికి మొగుడు , కార్తీక దీపం,  ఎస్ పి. పరశురాం , అమెరికా అల్లుడు , హై హై నాయక , శ్రీ రాజేశ్వరి విలాస్ క్లబ్ , గోరంత దీపం, విచిత్ర బంధం, శ్రీమంతుడు , ఆత్మీయులు .... ఇలా చెప్పుకుంటే పెద్ద గ్రంధమే అవుతుంది .
శ్రీ నాగిరెడ్డి - చక్రపాణి లు శ్రీమతి సూర్యకాంతం లేకుండా ఏ సినిమా తీసేవాళ్ళు కాదని చెప్పుకునే వారు .
శ్రీమతి సూర్య కాంతం గారికి గయ్యాళి అత్త సహజ నట కళా శిరోమణి , హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ , రంగస్థల శిరోమణి , అరుంగలైమామణి, (తమిళ్ ) అనే బిరుదులున్నాయి .
శ్రీమతి  సూర్య కాంతం గారికి మహానటి సావిత్రి మెమోరియల్ అవార్డు , తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.  ఈమె 18.12.1994 లో హైదరాబాద్ లో మరణించారు. ఆంద్ర దేశం లో - అత్తా కోడళ్ళ సంస్కృతి ఉన్నంత కాలం - గయ్యాళి అత్తగా శ్రీమతి సూర్య కాంతం పేరు చిరస్థాయిగా నిలిచి పోతుంది .

4) అంజలి దేవి : 

తెలుగు ప్రజలకు సీత మహా సాద్వ్వి  అంటే అజలి దేవే స్మ్రుతి పధం లో మొదలవుతుంది.
అంజనమ్మ 24.08.1927 న తూర్పు గోదావరి జిల్లా లోని పెద్ద పురం లో జన్మించింది . ఆమె తండ్రి పేరు నూకయ్య .
బాల్యం నుంచి అంజనమ్మ కు నాట్యం అంటే ప్రాణం . నాటకాల్లో పాత్ర దారిగా స్టేజి భయం లేకుండా పెరిగింది.
1936 లో 'రాజా హరిశంద్ర ' సినిమా లో బాల్యం లోనే 9 సంవత్సరాల వయసులోనే లోహితస్యుడిగా నటించింది . తరువాత 1940లో 'కష్ట జీవి ' అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. కాని కొన్ని కారణాల వల్ల  మూడు రీళ్ల అనంతరం ఆ సినిమా ఆగి పోయింది .
ఆ సంవత్సరమే 'గొల్ల భామ'  సినిమా లో మోహిని పాత్ర పోషించింది అంజనీ కుమారి . అంజనమ్మ పేరు అంజనీ కుమారి గా మార్చబడింది . ఆ తరువాత అంజని కుమారి పేరు అంజలీదేవి గా మార్చబడింది . గొల్లభామ చిత్రం లో మోహిని పాత్ర తో రాత్రికి రాత్రే గొప్ప స్టార్ అయిపాయింది అంజలి దేవి.
శ్రీ ఆదినారాయణ రావు గారిని వివాహం చేసుకున్న అంజలి దేవి కి ఇద్దరు కుమారులు. శ్రీ ఆది నారాయణ రావు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా , నిర్మాత గా పేరు గడించారు. శ్రీ ఆది నారాయణ రావు గారు అంజలి పిక్చర్స్ బ్యానర్ పై 27 చిత్రాలు నిర్మించారు.
శ్రీమతి అంజలి దేవి నటించిన సినిమాల్లో ముఖ్యమైనవి : బాలరాజు , గొల్లభామ , కీలుగుఱ్ఱం , మాయల మారి, స్త్రీ సాహసం , రేచుక్క , సంఘం , జయసింహ , పాండురంగ మహత్యం , భట్టి విక్రమార్క , భీష్మ, రంగుల రాట్నం , రహస్యం, భక్త ప్రహ్లాద , బడి పంతులు, భాల బరాటం, టాటా మనవడు, సువర్ణ సుందరి, అనార్కలి, బృందావనం, అన్న వదిన , చెంచు లక్ష్మి , జయభేరి , పోలీసు అల్లుడు , మహా కవి క్షేత్రయ్య , లవకుశ, కురుక్షేత్రం , శృతి లయలు  మొదలైనవి .
1963 లో నిర్మించిన తోలి రంగుల సినిమా లవకుశ లో సీతగా ఆమె ప్రదర్శించిన నటన సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పత్రికలూ కూడా ఆమె నటనా  వైదుష్యాన్ని విపరీతం గా కొనియాడాయి . కాస్త వయస్సు పైబద్డాక  శ్రీమతి అంజలి దేవి , భగవాన్ శ్రీ సత్య సాయిబాబా భక్తురాలిగా మారిపోయి , ఆద్యాత్మిక సేవలో జీవనం గడప సాగారు.
అంజలి పిక్చర్స్ పతాకం పై అనార్కలి, సువర్ణ సుందరి, పరదేశి, భక్త తుకారం , చండీప్రియ , సతీ సక్కుబాయి  ఆదిగా 27 విజయవంతమైన చిత్రాలు నిర్మించారు .
ఫిలిం ఫేర్  యొక్క ఉత్తమ నటి పురస్కారం 1955లో అనార్కలి చిత్రానికి , 1957లో సువర్ణ సుందరి చిత్రానికి , 1958లో చెంచులక్ష్మి చిత్రానికి, 1959లో జయభేరి చిత్రానికి శ్రీమతి అంజలి దేవిని వరించింది . నాగార్జున విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేటును పొందారు . 1994 లో  రఘుపతి వెంకయ్య అవార్డ్ , 2008  లో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం శ్రీమతి అంజలి  స్వీకరించారు . 13 . 01. 2014  తేదీన తన 81  వ   చెన్నై లో గుండె పోటుతో  స్వర్గస్తులైనారు .

5) రావు గోపాలరావు :

14. 01. 1937   తేదీన  గోదావరి  కాకినాడ సమీపం లో  గంగన పల్లి  గ్రామం లో రావు గోపాల రావు జన్మించారు .
    రావు గోపాల రావు గారికి నాటకాలంటే ప్రాణం . ' అసోసియేటెడ్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ '  అనే సొంత  డ్రామా కంపెనీ  స్తాపించి ,  అనేక నాటకాలు ప్రదర్శించారు . శ్రీ యస్వీ రంగారావు  వీరి నాటకాలను చూసి , ప్రసిద్ధ దర్శకుడు శ్రీ గుత్తా రామినీడు గారికి  పరిచయం చేశారు .
శ్రీ  రావు గోపాల రావు   అసిస్టెంట్ డైరెక్టర్  పోతన ,  బంగారు సంకెళ్ళు ,  ప్రేమ  మొదలైన  సినిమా  లకు పనిచేసారు .
 శ్రీమతి రావు కమల కమల కుమారి వీరి సతీమణి  . దంపతులకు ఇద్దరు కుమారులు  ,
 కుమార్తె  . ఇద్దరు కుమారుల్లో ఒకరైన రావు రమేష్ ప్రముఖకారక్టర్  ఆర్టిస్టు . కుమార్తె శ్రీమతి క్రాంతి .
శ్రీ  రావు గోపాల రావు   నటించిన చిత్రం  '  జగత్ కిలాడీలు '  .  కాని ఇందులో ఆయన వాచకం ,  గొంతు సరిగ్గా లేవని వీరికి డబ్బింగ్ చెప్పించారు .
తరువాత ప్రసిద్ధ చిత్రకారుడు , దర్శకుడు శ్రీ  బాపు దర్శకత్వం వహించిన ' ముత్యాల   లో కాంట్రాక్టర్ పాత్ర వీరికి ఎనలేని కీర్తి సంపాదించి పెట్టింది .  అందులో ఆయన సంభాషణలు పలికిన తీరు ఆంధ్ర దేశాన్ని ఒక  . నటుడి కైతే   ఆయన గొంతు సినిమా పనికిరాదని ,  డబ్బింగు చెప్పించారో ,  అదే నటుడి గొంతు ఒక వింత వింత  ఒరవడి  సృష్టించి , సిని సంభాషణలకు ఒక ప్రత్యేకతను చూపింది . సిని నటుడి డైలాగులు ప్రత్యేకంగా ఒక  ఆడియో కాసెట్ రావడం ,బహుశా ముత్యాల  లో  రావు గోపాలరావు డైలాగులతోనే ప్రారంభమై వుంటుంది .
శ్రీ రావు గోపాలరావు నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలు  :  జగత్ కిలాడీలు , ముత్యాల  , భక్త కన్నప్ప , గోరంత  , మనవూరి పాండవులు ,కలియుగ రావణాసురుడు , త్యాగయ్య , అభిలాష ,  చాలెం,  ఒక్కటి అడక్కు, దొంగ , ఖైది , జాకి , అడవిదొంగ , అగ్నిపర్వతం , బుల్లెట్ అత్తకు ముడు అమ్మాయికి  ,  బొబ్బిలి బ్రహ్మన్న , చాణక్య శపధం , బొబ్బిలి  , దొంగమొగుడు ,, ఈనాడు , గడసరి అత్త సొగసరి కోడలు ,   ఘరానా  , గోపాలరావుగారి అమ్మాయి , ఒకరాధ ఇద్దరు కృష్ణులు , ముందడుగు ,జస్టిస్ చౌదరి , కురుక్షేత్రం , కొండవీటి దొంగ , కొండవీటి రాజా , కొండవీటి ,  మగధీరుడు , మావూళ్లో మహాశివుడు , పట్నం వచ్చిన పతివ్రతలు , రుద్రనేత్ర , రాజా విక్రమార్క , కాలం మారింది , చట్టంతో పోరాటం , రాక్షసుడు   ......... మొదలైనవి
 నిర్మాతగా స్టేషన్  మాస్టర్ ,  లారీ  , భార్ఘవ రాముడు ,  విన్తదొంగలు మొదలగు చిత్రాలు నిర్మించారు
రాజకీయ ప్రవేశం చేసి 1982  లో శ్రీ యన్ టి  రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు  1984, 85  లో గా,  ఏప్రిల్ 1986 నుండి 1992 ఏప్రిల్ వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు.
1987  లో నాగయ్య అవార్డును , నటవిరాట్ బిరుదును , 1990   లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళాప్రపూర్ణ బిరుదును పొందారు.
13 08 1994  వ తేదీన తన 58 వ యేట స్వర్గస్తులైనారు.
 తను దివికేగినా , తన కాంట్రా క్టర్ పాత్రతో , రొయ్యల అప్పలనాయడు పాత్రతో ఎప్పుడూ మనమనస్సులోనే మెదులుతూ వుండేచిరంజీవి  శ్రీ రావుగోపాలరావు.

6)  రాజబాబు :

20 10 1937 వ తేదీన శ్రీపుణ్య మూర్తుల ఉమామహేశ్వరరావు , శ్రీమతి రమణమ్మ దంపతుల కడుపు నుండి  ఒక హాస్యభాన్దాగారం నేలపై పడింది   ఆభాన్దాగారమే పుణ్యముర్తుల అప్పలరాజు , సినిమాల్లో అతడే నవ్వులరాజు రాజబాబు
 శ్రిరాజబాబు ఇంటర్మీ డి  పూర్తయ్యాక ,  టీచర్ ట్రైనింగు పూర్తిచేసి కొన్నాళ్ళు  తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసారు పనిచేశారు
 సహజంగా నాటకాల  మీదవున్న అభిమానంతో  కుక్కపిల్ల దొరికింది , నాలుగిళ్ళ చావిడి , అల్లూరిసీతారామ రాజు మొదలైన నాటకాలు ప్రదర్శిస్తూ వుండేవాళ్ళు  నాటకాల్లో శ్రిరాజబాబు నటనా కౌశల్యం చూసిన ప్రసిద్ద దర్శకుడు , నిర్మాత గరికపాటి రాజారావు గారు ఈతనిని సినిపరిశ్రమకి ఆహ్వానించారు . ఆవిధంగా శ్రిరాజబాబు 1960  లో మద్రాసు చేరారు . కాని అవకాశాలు లేకకొన్నాళ్ళు   tution లు  చెప్పుకుంటూ బ్రతికారు . 1960 లో ' సమాజం ' చిత్రంతో రాజబాబు నటజీవితం ప్రారంభమైంది .
శ్రిరాజబాబు నటించిన సినిమాల్లో కొన్ని ముఖ్యమైనవి :
 సమాజం , భీష్మ , చిట్టితమ్ముడు , పరువుప్రతిస్త , నవరాత్రి , పరమానందయ్య సిష్యులకధ ,   సాక్షి , గూధాచారి 116, బంగారుపిచిక , ఏకవీర , కధానాయకుడు , కోడలు దిద్దిన కాపురం , ప్రేమనగర్ , శ్రీమంతుడు , బడిపంతులు , విచిత్రబంధం , తాతామనవడు , ఇద్దరుఅమ్మాయిలు , అందాలరాముడు , శారద శారద , అల్లురిసీతారామరాజు , అందరూ దొంగలే , జీవనజ్యోతి , సోగ్గాడు , జమిందారు గారి అమ్మాయి , కార్తీకదీపం , అడవిరాముడు  ఇలాచెప్పుకుంటూ   పోతే ఎన్నొఎన్నెన్నొ ..... ఎందుకంటే 20 సంవత్సరాల నటజీవితంలో 589 సినిమాల్లో  నటించాడు మరిమన రాజబాబు .
ప్రత్యేకమైన వాచకంతో , చూడగానే నవ్వుపుట్టించే రాజబాబు ఎక్కువసినిమాలు శ్రీమతి రమాప్రభ తోచేశారు . రాజబాబు , రమాప్రభల హాస్య జంతుంటే ఆసినిమా తప్పక హిట్టయ్యేది .
హాస్యనతచక్రవర్తి గానేకాకుండా  హీరోగా .... తాతామనవడు , పిచ్చోడిపెల్లి , తిరపతి , ఎవరికివారే యమునాతీరే , మనిషి రోడ్డున పడ్డాడు  చిత్రాలు నిర్మించారు .
ఇక అవార్డుల విషయానికి వస్తే ఉత్తమ హాస్య నటుడిగా 8 నంది అవార్డులు , ఉత్తమ హాస్య నటనకు 16 ఫిల్మ్ ఫేర్ అవార్డులు.... సౌత్ , స్వంతం చేసుకున్నట్టి
అత్యంత ప్రతిభాశాలి శ్రిరాజబాబు . ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న శ్రిరాజబాబు , ప్రేమికుల రోజున , 14. 02. 1983 వతేదీన తన 46 వయేట , అనారోగ్యంతో , హైదరాబాద్లో తనవారందరినీ , సినీ కళామతల్లిని , ఈలోకాన్ని విడిచి కన్నుమూశారు .

7) శ్రీమతి జయప్రద :

03. 04. 1962 వతేదీన శ్రీ కృష్ణారావు , శ్రీమతి నీలవేణి రావు ఇంట్లో రాజమండ్రిలో ఒకతార ఉదయించింది . ఆ తారకు లలితారాణి అనిపేరు పెట్టుకుని పెంచుకున్నారు ఆదంపతులు . ఆతారే , ఆరాణే ... భవిష్యత్తులో అనేకమంది యువకుల హృదయాలకు రాణి అవుతుందనిగాని , సినీ సామ్రాజ్యాన్ని ఏలుతుందని గాని వారికి తెలియదు పాపం . ఆమే అందాలరాణి జయప్రద .
బాల్యంనుండి లలితా రాణికి నాట్యమంటే ప్రాణం . 14 సం వయస్సులో స్కూల్ ఫంక్షన్ లో డాన్సు చేసింది కుమారి లలితారాణి . ఆ ప్రోగ్రాం చూసిన ఒక సినీ డైరెక్టరు లలితారాణికి భూమికోసం సినిమాలో 3 నిమిషాల డాన్సు కు అనుమతి ఇచ్చారు . ఆవిధంగా సినితెరపై లలితారాణి ముఖం కనిపించింది . భూమికోసం సినిమాలో తొలిసారిగా ఆమె 14 సంవత్సరాల వయస్సులో 1976 లో ప్రసిద్ద తమిళ దర్శకుడు  శ్రికె బాలచందర్ తన ' అంతులేని కధ ' చిత్రంద్వారా ,  పూర్తినిడివి గలపాత్రతో , పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షక జనానికి ఈ  అందాల తారని జయప్రద  పేరుతోపరిచయం చేశారు  అదోగోప్ప విజయం సాధించడంతో జయప్రద వెనుదిరిగి చూసుకోలేదు  తరువాత వచ్చిన వచ్చిన శ్రీబాపుగారి 'సీతాకల్యాణం ' లో సీతగా ఆమె ముగ్దత్వం , ఆఅందాలను బాపుగారు చిత్రీకరించిన తీరు అద్భుతం . అలాగే కళాతపస్వి శ్రీ కె విశ్వనాద్ గారు జయప్రదను తన ' సిరిసిరిమువ్వ ' , సాగర సంగమం ' , వగైరా చిత్రాలతో జయప్రదలోని నాట్య కౌశలాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు . శ్రీ  కె రాఘవేంద్రరావు గారి అడవిరాముడు చిత్రంతో ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత నివాసం ఏర్పరచుకుంది జయప్రద .
జయప్రద నటించిన కొన్నిముఖ్యమైన సినిమాలు :
అంతులేని  కధ , సీతాకల్యాణం , సిరిసిరిమువ్వ , శ్రిరాజేస్వరి విలాస్ కాఫీ క్లబ్ , అడవిరాముడు ,కురుక్షేత్రం , యమగోల , సరగమ్ (హిందీ ) , అందమైన అనుభవం , లోక్ పరలోక్ (హిందీ ), 47  రోజులు , సాగరసంగమం , ఖయామత్ (హిందీ ), మేఘసందేశం , ముందడుగు , తోఫా (హిందీ ), షరాబీ (హిందీ )
, సంజోగ్ (హిందీ ), తాండ్ర పాపారాయుడు , సింహాసనం , ప్రజారాజ్యం , ఆఖరీ రాస్తా (హిందీ ) మొదలైనవి .
ఈమె గతముప్పై సంవత్సరాలుగా 7 భాషల్లో షుమారు 300 సినిమాల్లో నటించింది . ప్రపంచ ప్రఖ్యాత సిని డైరెక్టరు శ్రీ సత్యజిత రే జయప్రదను " భారత సినితెరపై వెలుగొందుతున్న అత్యంత సుందరమైన ముఖం  గలయువతిగా , ప్రపంచములోని అత్యంత అందమైన యువతుల్లో ఒకరిగా " అభివర్ణించారు . అంతకన్నా గొప్పకితాబు ఇంకేముంటుంది ? జయప్రద అందుకున్న పురస్కారాలు కూడా లెక్కలేనన్ని . అవి అంతులేనికధ చిత్రానికి గాను 1976 లో స్పెషల్ జూరి నంది అవార్డు , ఉత్తమ కధా నాయకగా 1979 లో సరగమ్ చిత్రానికి , 1984 లో ' షరాబీ ' చిత్రానికి , 1985 లో 'సంజోగ్ ' చిత్రానికి ... ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది . కాని జయప్రదకు హిందీ రాని కారణంగా అవార్డు అందలేదు . ఆఫ్ కోర్స్ ... తరువాత హిందీ బాగా నేర్చుకుని ఉత్తర భారత దేశంలో రాజకీయాలను కూడా ఏలారు జయప్రద .
ఇవే గాక ఉత్తమ కధా నాయికగా 1983 లో ఫిల్మ్ ఫేర్ అవార్డు , సౌత్ లో తెలుగువిభాగంలో సాగరసంగమం సినిమాకు గాను, అదే విధంగా 2007 వ సంవత్సరానికిగాను ఫిల్మ్ ఫేర్ అవార్డు ... సౌత్ లో జీవన సాఫల్య పురస్కారం లభించింది . 2012 వ సంవత్సరానికి ఉత్తమ సహాయనటి పురస్కారం కు నామినేట్ చేయబడింది .
ఇంకా కళాశ్రీ , కళాసరస్వతి , కిన్నెర సావిత్రి , రాజీవ్ గాంధి , నర్గీస్ దత్ గోల్డ్ మెడల్ , శకుంతలా కళారత్నం , వుత్తమ్ కుమార్ , అక్కినేని నాగేశ్వరరావు అచీవ్మెంట్ అవార్డు, వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు ఫ్రం. , అవార్డు , నానా ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ఎక్ట్రేస్స్ , ఉజాలా ఆసియా ఫిల్మ్ అవార్డు 2012, అమృత ఫిల్మ్ అవార్డు 2012, మాతృభూమి .. కళ్యాణ్ సిల్క్స్ ఫిల్మ్ అవార్డు , స్పెషల్ జ్యూరి అవార్డు ఫ్రం కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ , సూర్య ఫిల్మ్ అవార్డు 2012, అవార్డు 2011 , మొదలైన అవార్డులెన్నో అందాల జయప్రదను వరించాయి . 1986 లో నిర్మాత , దర్శకుడు సుందర్లాల్ నహతా కుమారుడైన శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకుంది 1994 లో తెలుగుదేశం పార్టిలో చేరింది . 1996 లో రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ చేయబడింది . తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమించబడింది . అనంతరం తెలుగుదేశం పార్టిని వదిలిపెట్టి సమాజ్ వాద్ పార్టిలో చేరింది . 2004 లో మధ్య ప్రదేశ్ లోని రాంపూర్ నుంచి ఎన్నికైంది . తిరిగి 2009 లో మరోసారి పార్ల మెంటు సభ్యురాలిగా ఎన్నుకోబడింది . 02.02. 2010 వ తేదీన పార్టి వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడు తుందని సమాజవాది పార్టి నుంచి భాహిష్క్రుతురాలైంది . 2011 లో జయప్రద , అమర్సింగ్తో కలసి రాష్ట్రీయ లోక్మంచ్ పార్టీ నిపెట్టారు . అనంతరం 10. 03. 2014 లో జయప్రద రాష్ట్రీయ లోక్దళ్ పార్టిలో చేరింది 2014 లో జరిగిన ఎన్నికల్లో జయప్రద పరాజయం పాలైంది . జయప్రదకు చెన్నైలో జయప్రద దియేటర్ వుంది .

8) భానుప్రియ :

మంగభామ రాజమండ్రి సమీపానగల రంగంపేటలో 15. 01. 1966 నాడు జన్మించారు .ఈ మంగభామే భవిష్యత్తులో అందాలతార, కళ్ళతోనే భావాలు పలికించగల అభినేత్రి భానుప్రియ అవుతుందని ఎవరు ఊహించి వుండరు . భానుప్రియకు శాంతిప్రియ అనే సోదరి , గోపాలక్రిష్ణన్ అనే సోదరుడు వున్నారు . రంగంపేట లో పుట్టిన భానుప్రియ తరువాత తన మకాం మద్రాసుకు మార్చింది . భానుప్రియ వయసు 17 సంవత్సరాలుండగా తొలిసారిగా వెండితెరపై మెరిసింది . ఆమె మొదటిసినిమా 1983 లో విడుదలైన ' మెల్ల పేసుంగల్ ' అనే తమిళ సినిమా . తెలుగులో 1983 లో విడుదలైన ' సితార ' భానుప్రియకు తొలితెలుగు సినిమా . భానుప్రియ సుమారు 150 సినిమాల్లో నటించింది . ఇందులో సుమారు 80 తెలుగు , 40 తమిళం , 12 మలయాళం , 5 కన్నడం , 15 హిందీ సినిమాలున్నాయి .
భానుప్రియను మొదటిసారిగా తెలుగుతెరకు పరిచయం చేసిన దర్శకుడు శ్రీ వంశీ. భానుప్రియ కళ్ళతో భావాలను పలికించగలదని గ్రహించిన వంశి , దాదాపు తన సినిమాలన్నిటిలోనూ సినిమా లన్నిటిలోనూ ప్రారంభంలో భానుప్రియనే నటింప చేసేవారు . సితార , అన్వేషణ సినిమాల్లో హీరోయిన్ భానుప్రియే . భానుప్రియ నటించిన ముఖ్యమైన సినిమాలు : మెల్లపేసుంగల్ ( తమిళం ), సితార , పల్నాటి పులి, ఇల్లాలే దేవత , మొగుడుపెళ్ళాలు , ముసుగుదొంగ , ప్రేమించు .. పెళ్ళాడు , బంగారుచిలక , జ్వాల , ఇల్లాలికో పరీక్ష , అమెరికా అల్లుడు , అన్వేషణ , విజేత , శ్రావణ మేఘాలు , కాష్మోరా , దోస్తీ .. దుష్మని ( హిందీ ) , ఆలాపన , అపుర్వసహోదరులు , శ్రీనివాస కల్యాణం , శంఖారావం , కార్తీక పౌర్ణమి , దొంగమొగుడు , జేబుదొంగ , ఖైది ... 786, త్రినేత్రుడు , కమలం , స్టేట్ రౌడి , శ్రీ ఏడుకొండలస్వామి , రాముడుకాదు రాక్షసుడు , రాజసిల్పి ( మలయాళం ) , పెదరాయుడు , అన్నమయ్య , జయంమనదేరా , లాహిరిలాహిరిలాహిరిలో , శ్రావణమాసం , ఛత్రపతి , అయోధ్యరామయ్య మొదలైనవి . అదేవిధంగా మాద్యమం లో కూడా విశ్వామిత్ర , పెణ్ , శక్తి మొదలైన 8 తమిళ సీరియల్స్ లో కూడా నటించింది . అవార్డుల విషయానికి వస్తే ఉత్తమ కళాకారిణిగా 1988 లో స్వర్ణకమలం సినిమాకు నంది అవార్డు , ఫిలిం అవార్డు , 1989 లో తమిళం లో ఆరారో అయిరారో చిత్రానికి తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు స్పెషల్ ప్రైజ్ , 1991 లో అళగన్ సినిమాకు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు స్పెషల్ ప్రైజ్ , 1996 లో పెదరాయుడు సినిమాకు సినిమా ఎక్స్ ప్రెస్ అవార్డు , టెలివిజన్ సీరియల్ శక్తి కి స్క్రీన్ వీడియోకాన్ అవార్డు , 2002 లో లాహిరిలహిరిలాహిరిలో చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు , 2005 లో ఛత్రపతి చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు , ఇవిమాత్రమే గాక జస్ట్ ఫర్ విమెన్ పత్రిక వారిచే భానుప్రియ దక్షిణ భారత సినీరంగానికి చేసిన సేవలకుగాను JFW దివస్ ఓ అఫ్ ది సౌత్ అవార్డు గెలుచుకుంది ప్రసిద్ధ నర్తకి సుమతి కౌదల్ కుమారుడైన ఆదర్ష కౌశల్ నువివాహంచేసుకున్న భానుప్రియ తరువాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతని నుండి విడాకులు పొందింది వారికి అభినయ అనే ఒక పాప కలిగింది . తన అభినయ కౌశలంతో , అందమైన కళ్ళతో ప్రేక్షకుల హృదయాలనే కాదు సిని ప్రముఖుల మనసులను కొల్లగొట్టింది .
ఇలా చెప్పుకుంటూ పొతే, ఇంకా ఎంతోమందే ఉన్నారు. అందుకే ఇక ఈ వ్యాసాన్ని ఇంతటితో ముగిస్తూ... ఈ గడ్డపై జన్మించిన మహనీయులైన అందరినీ స్మరిస్తూ వందనాలు తెలియచేస్తున్నాను. ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు.

No comments:

Post a Comment

Pages