ఇది ఉషస్సు పాడిన గీతం
 

పెయ్యేటి రంగారావుప.   ఇది ఉషస్సు పాడిన గీతం 

మరి తమస్సు రాదని భావం ||


అ.ప.   చల్లని సిరివెన్నెల మనసంతా నిండింది 

ఆరెడు చిరుదివ్వెకు ఊపిరిగా నిలిచింది ||

చ.1    మోడై మిగిలిన మదిలో ఆమని మరి ఇక పోనని 

బాసట లిడుకొని నవ్వుల తొలకరి చిలికింది వలపుల విరివని వేసింది | ఇది |


చ.2.     వాడిన విరులకు తావుల నొసగి ముసిరిన ఇరులను 

తొలగగ చెలగి హరివిల్లు వలె వెలిగింది సరిజోడయి తా మెలిగింది | ఇది |

**************

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top