వేలకన్నులు చాలవులే

- ఆనందవర్ధన్ 

     వక్రతుండుని పూజించి... ..... 
వరుడుమండపము చేరగా గారాల వధువు గౌరీని సేవించి... 
గజగమన అయిరాగా శుభ పుష్కరాంశమందు...... .. .. 
నవఅక్షతల పోసుకొనువేళ ఆ సీతా కళ్యాణ వైభోగం చూడ..... 
శిరసు శంకరాభరణమై ఊగే
వాసుదేవ అని మంగళ వాద్యములు మ్రోగ....
కల్యాణ గడియకై కల్యాణి సీతమ్మ కమనీయ రామయ్యని ....... 
కనులెత్తి చూసే
చందురు వర్ణుని శ్రీ రాఘవుడిని చూడ ...
అందాల .సీతా తొందరాయని మద్యమద్య లో మద్యమావతులు ........ 
సరదాలు సరసాలు చిలుకగా
కరమందహరిది ప్రియమొంద మదిని.... ... .. 
సుదతి పదములు సడి చేసెనే దాశరధి మోహనను దరి చేరు సమయమున ...
కన్నీరు పన్నీరు ఏకమై పోయే
జనుకుడ నగా వేదమంత్రం
"ఇయం సీతా మమ సుతా సహా ధర్మ చారి తవ"
జనకరాజ సుత మానస చోరుని కల్యాణం .......... .. 
చూడ ఇహలో పరము
అలినీలవేణిని తాను అలరించ కళ్యాణమాలతో 
వేదవేద్యుని చూడ వేలకన్నులు చాలవులే
ఇది సీతా రాముల కల్యాణ వైభోగం పది తరాలుపాడుకొనే మంగళ కావ్యం
శ్రవణం హరి స్మరణముశ్రావణము సిరి కల్యాణం
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top