తెలుగు భాష

 - ప్రతాప వెంకట సుబ్బారాయుడు


అందమైన భాష
కమ్మనైన భాష
శైశవానికి
జోలపాడే తల్లిభాష
కథలు చెప్పే
మనోవికాస భాష
కౌమారాన్ని తీర్చిదిద్దే
గురువుభాష
యవ్వనపు ఊసులకి
రూపమిచ్చే ఇంద్రజాలభాష
వృద్ధాప్యానికి
ఊతమయ్యే భాష
కవుల భాష
కళాకారుల భాష
ఆకలేసినపుడు
కడుపునింపే భాష
గాయాలకు
లేపనమయ్యే భాష
సైనికులని కదం
తొక్కించే భాష
శాంతి కాముకులని
ఏకం చేసే భాష
గుండ్రని అక్షరాల
కుదురైన భాష
భాషలన్నిటియందు
లెస్స నా భాష
భాష నా శ్వాస!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top