శింజారవం

- బ్నిం 

          
శింజారవంలో ఈసారి ఓ డిఫరెంట్ ప్రెజెంటేషన్ చేద్దామనిపించింది – కారణం ఆ మువ్వలరవళికి ముందు గలగలలాడాల్సిన అక్షరసుమాలు ఏరుతూ కొన్నాళ్ళు ఇంచుమించుగా తలమునకలుగా పులకరించాను గనక – అంటే.. నేను గత రెండు మూడు నెలలుగా నృత్య రూపకాలు రాయడంలో బిజీబిజీగా గజిబిజిగా మునిగిపోయాను.
          సబ్జెక్టులు డిఫరెంట్లో కొన్ని ఉన్నాయి.
           శ్రీ పసుమర్తి రామలింగశాస్త్రిగారికి పౌరాణిక సాంఘిక జుగళం భాష కూడా తెలుగు సంస్కృత ఆంగ్లపదాల మణిప్రవాళం. ఇంక శ్రీమతి జొన్నలగడ్డ అనూరాధగారికి ఓ చిత్రమైన నాయిక ‘ఛాయ’ సూర్యపత్ని కథ. ఆమె ఎంచుకున్న వ్యక్తావ్యక్తపునాయిక. రూప రహిత అపురూప సంజ్ఞా – ఛాయలనే ఇద్దరు భార్యలు సూర్యునకు ఎలా సంక్రమించారు. ఛాయ సూర్యాగ్రహపరిత్యక్త అయినా.. ‘నిను వీడని నీడను నేనే’ అని ఎలా… అంది… ఈ నాయిక జన్మకరణము… వగైరాల విశేషాల సమాహారం శ్రీ డి.ఎస్.వి.శాస్త్రిగారు స్వరం చేస్తుండటం నేను నా పనుల మధ్యలో ఒకటి అరా పాట పంపడం. ఇలా జరిగింది. చాలామంచి పేరొచ్చిందట. ఆ ప్రదర్శనకి –
          కర్ణాటకలో కూచిపూడి నృత్యకళాకారిణిగా ప్రఖ్యాతురాలైన శ్రీమతి వైజయంతీ కాశీ గత నాలుగైదునెలలుగా పరిచయం అయిన ఈమె ఎలాగో నా పేరు సంపాదించి మా నేచర్‍క్యూర్ ఆశ్రమానికి వచ్చారు. ఆమెకి తెలుగు కొంచెం కన్నా రాదు. నాకు ఇంగ్లీషు కొంచెం కూడా రాదు. ఏదన్నా బేబేలే చెప్పాలి. ఆమె కూతురు కుమారి ప్రతీక్ష వేయాలి.
          అంతకు ముందు ఆమె తన కూతురుతో ‘కుబ్బాకృష్ణ’ లాంటివి వేశారట! అలా రెండు పాత్రలున్న పౌరాణిక సంఘటన కానీ పాత్రలు కానీ చెప్పమని అడిగినప్పుడు… ఆమెకి ‘కైక-మంధర’ రాస్తానన్నాను. ఎప్పుడో విశ్వనాధ అచ్యుతరాయలుగారు రాసిన కైక నవల మదిలో నిలచే ఉంది. – అదీగాక… ఆ మధ్య 15యేళ్ళ క్రితం కాబోలు.. జమునగారు కైక సమగ్ర టెలీఫిలిం చేయాలన్నప్పుడు చిన్నప్పుడు చదివిన ‘కైక’ మదిలో నిలచింది. – ఇప్పుడు ఆ జ్ఞాపకాలు తెరచి… కైక నృత్యరూపకం రాసిచ్చాను- ఈ కన్నడమేడమ్‍తో ఓ అవస్థ ఆవిడకి తెలుసు అస్సలు రాదు. కూచిపూడి డ్యాన్స్‍ని ఇంగ్లీషులో నేర్చుకుని టాపర్ అయిపోయారు(?) ఎలా అంటే.. ఆమె ఆ ప్రదర్శనా పద్ధతీ, సంప్రదాయం క్షుణ్ణంగా అభ్యసించారు. అధ్యయనం చేశారు- పటాల్తోబాటు పట్టు సాధించారు. ఆమెకి పాట రాసి “శ్రీ రామవసన…” “SRI RAMA VASANA…” ఇలా రాసి పంపాలి. ఆవిడ ‘రామ’ అని – పలుకుతుంది-
          ఆ తిప్పలు పడలేక ఆడియో రికార్డింగు ఫైళ్ళు – మెయిళ్ళు గంటల వ్యవధిపోను సంభాషణలు – బెంగళూరు సంగీతదర్శకులకి నృత్యసంప్రదాయ సంగీతం కన్నా, కచ్చేరీ పాటలా నా సాహిత్యభావాన్ని స్వరపరచి పాడుతుంటే… వింతగా అన్పించడంతోబాటు దీన్ని డ్యాన్సు ఎలా చేస్తారా అని పరేషాన్ అయ్యాను.
          అదయ్యాక ‘RED’ (అరుణము – రక్తవర్ణము) అనే దాని మీద క్లాసికల్ బేలేరియాలన్నారు. నవరసాల్లో ‘రెడ్’ కలర్ ఎలా ప్రస్ఫుటం చేయాలి? మళ్ళీ దానికీ చర్చలూ ట్రాన్సిలేషన్సూ… ఆడియో ప్రనౌన్సేషన్లూ- సంగీత విద్వాంసులకు పదచ్చేద ప్రమాదాలు చెప్పడాలు- అదో యజ్ఞం. ‘యతోమనస్తతోభావః-యతోభావః స్తతో రసః’ మరి భావార్థములు తెలియక అభినయమూ ముద్రలూ ఎలాగబ్బా…! అందుకే గంటపనికి 4గంటలు రైటరు ప్రమేయం నిన్నటివరకూ నెల్లాళ్ళుపైనే ఆ రచనా- వ్యాసంగము- అలసిపోయా!     ఆమధ్యలో… అమెరికాఅమ్మాయి చిన్నామే స్లిమ్‍గా కూడా ఉంది. ఆమెకి రావణాసురుడు క్యారెక్టర్ చెయ్యాలని జీవితాశయం – ఆమెపేరు జ్యోతిగారు- తిరుపతి మంగలిగా ఆవిడకో రెండు పాటలు పంపాను – ఇది జరిగి ఓనెల దాటింది.
          ఇంకోటి… ఆమెగారిదీ USA. శొంఠి పద్మగారు అష్టలక్ష్మీ చరితం చాలా పెద్ద ప్రాజెక్టే… ఏడాదిన్నరనుంచి నలుగుతోంది. ఓబుక్ పంపారు – మిస్సయింది నా అరణ్యంలో. మళ్ళీ స్కేన్ చేసి పంపారు- చదవాలి-
          ఇలా ఉండగా స్వామీ చిన్మయానంద మీద నృత్యరూపకం రెండు ఉద్గ్రంధాలు వారిచ్చారు. రెండు నేను కొన్నాను- ఓపాట ‘కృష్ణమీనన్’ పుట్టుక రాశాను. ఇదీ తిమం బాపతే రాయాలి –
          చూసారా… ఈ ఆర్టికల్ శింజారావానికి సూటబుల్లే కదా!
          డ్యాన్సాభిమానులకి… కొన్ని సాధకబాధకాలు చెప్పాను. మొదటిబాధ రైటర్ పెట్టేది అని… ‘రైటర్ పడేది’ అని కాదండోయ్ - బ్నిం

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top