పెసరపప్పు పాయసం - అచ్చంగా తెలుగు

పెసరపప్పు పాయసం

Share This

పెసరపప్పు పాయసం

- లీలా సౌజన్య 


ఇంట్లో ఉండే కొన్ని మామూలు పదార్ధాలతో సులభంగా చేయవచ్చు ఈ పాయసం..... ఇది చాలా రుచికరంగా ఉంటుంది. కావాల్సిన పదార్ధాలు: పెసరపప్పు -100 gm బెల్లం – 150gm పాలు – ½ litre నెయ్యి – 100gm జీడిపప్పు – 50gm ఎండుద్రాక్ష – 25gm యాలకులు  2 లేక 3 కొబ్బరి తురుము – 2 చెంచాలు (కావాలనుకుంటే) మూకుడులో ఒక చెంచా నెయ్యి వేసి పెసరపప్పు గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ప్రెషర్ కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. బెల్లం బాగా దంపి పొడి చేసి, బెల్లం తడిచెంత నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టి కరిగించాలి. ఉడికిన పెసరపప్పులో పాలు, బెల్లం పాకం, దంచిన యాలకుల పొడి వేసి ఉడకపెట్టాక, నేతిలో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి పొయ్యి మీద నుండి దింపాలి. వేడిగా తింటే రుచిగా ఉంటుంది.  

No comments:

Post a Comment

Pages